అనంతంగా నేనే

అనంతగా నేనే పరుచుకుని అంతా నేనే కావాలని …
పరిశ్రమించే వింత శోధన నీది.
ఆ శోధన ఆ పరిశ్రమ
నీకు మాత్రమే చెందుతూ సాగుతున్న కుటిలశ్రమ.
అందుకే ఒక్కసారి కళ్ళు మూసుకొని
నువ్వులేని ప్రపంచాన్ని ఊహించుకో
కళ్ళు మూసుకుంటే నువ్వేకాదు ` అక్కడ ఏమీ ఉండదు.
కానీ నువ్వు ఉండాలి, నువ్వుంటే ఏమిటో నీకు తెలియాలి
నువ్వు నడచి వచ్చిన దారుల్ని నువ్వు తెలుసుకోవాలి
నీ కోసం నువ్వు వేసుకున్న ఆ దారుల్ని నువ్వు చూడగలగాలి
అడ్డదారుల్లో నీ వెంట వచ్చింది ఎంత?
నీ అంతట నువ్వు తెచ్చింది ఎంత?
నీకోసం నువ్వు తెచ్చుకున్నది ఎంత?
తెచ్చుకుంటే తెచ్చుకున్నావ్‌ ! భూమి దాన్ని భరిస్తుందా?
పరిసరాలు తమ పేగుమడతల్లో దాన్ని ఇముడ్చుకుంటాయా?
ఆస్వాదయోగ్యం కాని చెత్తను పెంచి అది నీ ప్రతిభ అనుకుంటున్నావ్‌ !
నీలో నువ్వు గుర్తించని జబ్బులతో భూమంతా కలుషితమైంది.
శారీరక రుగ్మతలకి చికిత్స జరిగినట్లే !
నీ మానసిక వ్యాధులకు కూడా వైద్యం అందాలి
లేకుంటే నువ్వు చేస్తున్న బీభత్సం
జంతు ధర్మాలతో విశ్వవ్యాప్తమవుతోంది.
నువ్వు మారాలి….
నకిలీ వైద్యం పై మమకారం వదలుకోవాలి
నీ పై నీవే తిరుగుబాటు చేయాలి
లేకుంటే నీ స్వేదబిందువులే నీకు శస్త్ర చికిత్స చేస్తాయి.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to అనంతంగా నేనే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో