నేను సెయ్యబోతున్నది గూడా గదే జెర నా ఎన్క ఉషారుగుండు ఏడా తేడా రావద్దు పో పోయి రాజుగాని పిల్సుకురా” అన్నాడు.
ఎల్లయ్య సేన్లల్లకెని అడ్డంపడిపోయి రాజుని పిల్చుకొచ్చాడు.
”ఏంది పెద్దనాయినా పిల్సినవంటా” అంటూ రాజు వస్తూనే అడిగేసరికి ”ఓరి రాజు మీ కల్లం గియ్యాలనే అయిపోయినట్లుంది” అన్నాడు.
”ఔనే గియ్యాలనే ఒడ్లన్ని యింట్ల ఏసినం ఇగ రేపటినుంచి గడ్డి కట్టుడుంటది” అన్నాడు.
”ఏం లేదురా మా కల్లంల గూడా గియ్యాలనే పనైంది నెల రోజులనుండి పనిసేసి సేసి పెయ్యంతా పులిసినట్లైందిరా గందుకని నువ్వు ఒక పన్జెయ్యాలిరా” అంటూ ఆగాడు.
”ఏమి జెయ్యమంటవే” అంటూ రాజు అర్థంకానట్లు చూసేసరికి
”మనందరి కళ్ళాలు అయి వడ్లసంచులు యిండ్లల్లకు గూడ జేరినయి గాని నీలమ్మ ఒడ్లు మోసుడు యింకా కాలేదురా పోరి ఒక్కతే పిల్లలని సూసుకుంటు ఎంతకని పోరుతది సెప్పు అయినా శాతనైన కాడికి పొద్దస్తమానం పని జేస్తనే ఉంది. ఓడ్లని యింటికి మోసుడు ఒక్క దినంల ఐతదా సెప్పు మనమంటే సంచులతోటి మోస్కపోయి యిండ్లల పోస్తిమి గాని అది ఆడది గంపల మోయవట్టే ఎంత లేదన్నా రెండు మూడు రోజులు వడ్లు మోసుడే అయితదేమో. ఆ పిల్ల సేనేమో కొనాకాయే రాత్రిపూట పంటను ఎవడన్నా దొంగిలించుకుపోతే సేసిన కష్టమంతా సెరువుల పోసినట్లయితది గందుకని నువ్వు పగలంతా మీ కల్లంల పన్జేసుకుంట రాత్రిపూట ఆ వడ్ల కుప్పకాడ కావలుండాలే” అన్నాడు.
”నువ్వు జూస్తున్నవు గదనే ఆరం రెండారాలనుంచి మా కల్లంల ఏ తీర్గపనుందో గియాలనన్నా యింటికి పోయి మస్తు పండుకుందామన్కుంటున్నా కావాలంటే రేపటి నుంచి వదినకు ఒడ్లు మోసిపెడ్త తియ్యి” అని వెనుతిరగిపోయాడు.
”అమ్మమ్మ నువ్వు దానికి వడ్లు మోసుడు ఎందుకురా ఎట్ల పంట పండించుకుందో గట్లనే మోసుకుంటది గాని పంట ఎవడి నోట్లనన్నా పడితే అది పరేషాన్ అయితదిరా గది పోనిగాని మా కోడలు కూడా కాన్పుకు పోయిందంటగా యింగ నీకు యింటికి పోను జరూరతు ఏంది సెప్పు యింట్లున్నా పొలంలోఉన్నా ఒక్కటేనాయె” అన్నాడు.
రాజు నీలమ్మ పొలం దగ్గర కాపలా ఉండటానికి ముందు తటపటాయించినా తర్వాత ఒప్పుకున్నాడు.
”గిట్లన్నవు బాగుంది ఇంగ మస్తు సీకటి పడ్డాది గాని నువ్వు నీలమ్మ వడ్లకుప్ప కాడుండు నీకు టిఫిను ఇంతజాం నేను సేస్తా” అని సత్తయ్య అనంగానే
”ఈడనే ఉండరా రాజు అమ్మకు నేను సెప్త తియ్యి” అని ఎల్లయ్య సత్తయ్యతో కల్సి ఇంటిముఖం పడ్తే రాజు కళ్లెం దిక్కు సాగిపోయాడు.
సత్తయ్య ఇంటికి పోయేసరికి నీలమ్మ వంటచేస్తోంది. పోయి కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మం దగ్గర కూర్చుంటూ ”నీలమ్మా” అని పిలిచాడు. ఆ పిలుపు విని పొయ్యి దగ్గర నుంచి గబగబా వచ్చి ”ఏంది మామా పిల్సినవు” అంది.
”ఇగో నీ కల్లాంల రాజుగాడు కావలుంటడు గాని ఆనికి ఈ రాత్రికి బువ్విచ్చిరా” అన్నాడు. సత్తయ్య తనకు సాయం చేసినందుకు అతని దిక్కు కృతజ్ఞతగా చూస్తూ ”గట్లనే మామా” అని పొయ్యి దగ్గరకు పోయి అన్నం దమ్ముకేసి పప్పుచారుచేసి టిఫిను కట్టింది. అప్పటికే పిల్లలు ఆకలితో మారాంచేస్తుంటే వేడివేడి అన్నం పప్పు గిన్నెల్లో వేసి పెడ్తూ ”కొడుకా తమ్మునికి బువ్వ తినిపించి నువ్వు తిను నేను కాకకి టిఫినిచ్చొస్తా” అని సురేందరుతో చెప్పి, చిన్న బిందెల నీళ్ళు తీసుకుని ఎడమచేతిపై పట్టుకుని కుడిచేతిలో టిఫిను పట్టుకుని పొలాల్లో అడ్డం పడిపోయింది.
మెషిను కోటిలు దగ్గర మందుకొడ్తు నీలమ్మ, రాజుకి టిఫిను తీసుకుపోవటాన్ని సత్తయ్య, ఎల్లయ్యలు గమనిస్తున్నారు.
నీలమ్మ రాజు దగ్గరకు పోయి టిఫిను నీళ్ళు ఇచ్చి వెంటనే వెనుతిరిగి రావటం పున్నమి వెన్నెల్లో స్పష్టంగా కన్పిస్తుంటే ”అరే యాది కత సురువైంది రా రేపు రాజుగాన్ని దుకానానికి తీస్కపోయి ఆని ఇష్టంవచ్చినంతా తాపియ్యి ఆడు మంచి మూడులున్నది సూసి మనం సోంచాంచిన సుద్ది సెప్పాలా ఆడ్ని మెల్లమెల్లగా దువ్వు లేకుంటే ఆడు మనకే ఆడైతడు ఆడ్ని ఎట్లయినా పుసలాయించి పని దీసుకోవాలి గీ సుద్ది మరువకు” అంటూ పచ్చనోటు చేతిలో కుక్కాడు. అది తీసుకుని జేబులో పెట్టుకుంటూ ”గట్లనే అన్నా గిట్లనే గిదంతా నా సేతిలో పని గిది మనకొక లెక్కనా ఏంది గందుల్ల రాజుగాడు నా రక్తం నా అన్నకొడుకు ఆడు నా మాటింటడే” అంటూ లేచాడు. మర్నాడు పొద్దునే రాజు నీలమ్మ యింటికి వచ్చి ఖాళీ టిఫిను బిందె ఇచ్చి వెళ్తుంటే ”ఓ రాజు జెర గియ్యాల గూడా కళ్లెం కాడుండయ్యా” అని ప్రాధేయపూర్వకంగా అంటే ”గట్లనే ఒదినా” అంటూ రాజు వెళ్లిపోయాడు. యింట్లో పనులన్ని త్వరత్వరగా ముగించుకుని సర్ది గంపనీళ్ళు తీసుకుని కొడుకులతో కల్సి పొలం దగ్గరకు పోయింది నీలమ్మ.
ఆడవాళ్ళంతా ఆ రోజు నుండి ఇండ్ల దగ్గరుండి వాకిట్లల్ల వడ్లు ఆరబోస్తుంటే మొగవాళ్ళంతా పొలాల్లో తాళ్ళు పేని గడ్డికట్టి గాడ్డాముల్లో వేస్తుంటే నీలమ్మ తన కల్లం దగ్గర నుంచి వడ్లు మోయటానికే సరిపోయింది. పొద్దుగూకుతుండగనే ఎల్లయ్య మెల్లగా రాజు దగ్గరకు వచ్చి ”ఒకసారి గట్ల దుఖ్నం కాడికి పోదాం రా బిడ్డా” అంటూ కల్లు దుకాణానికి తీసుకుపోయి ఆరు సీసాల కల్లు తెప్పించి శాకన తెప్పించేసరికి రాజు వాటిని చూసి గుటికెలు మింగుతూనే ”కాకా గిన్నెందుకే” అన్నాడు.
”ఎందుకేంది కొడుకా మనిద్దరికే పట్టు” అంటూ కల్లుసీసా చేతిలో పెట్టాడు. ఏనాడు లేంది చిన్నాయినకు అకస్మాత్తుగా తన మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థంకాలేదు. అయినా తెచ్చిండుగా తాగిందే లెక్కా అనుకుని గబగబా రెండు సీసాలు ఖాళీచేసి శాఖన నాకాడు. నిషా మెల్లమెల్లగా తలకెక్కసాగింది. అప్పటి వరకు రాజుతో ఆమాట ఈమాట మాట్లాడుతూ నాలుగు సీసాల కల్లు రాజుతో తాగించి అతని మాట తడబడుతుండటంతోనే ”కొడుకు లైనులోకొచ్చిండు” అనుకొని
”ఓరి రాత్రి నీలమ్మ సేన్ల పండుకున్నవుగా తిననీకి ఏమన్నా తెచ్చిందా” అంటూ ఏమీ ఎరగనట్లు అడిగాడు. ”తెచ్చింది కాక ఇంట్ల బువ్వుండంగనే టిఫిను గట్టుకొని పోరగాండ్లకు బువ్వేసి నా దగ్గరకి ఊర్కొంచ్చిందంట టిఫినిచ్చి ఇంటికాడ పోరలు బువ్వతింటుండ్రయ్యా అని ఎంటనే పోయింది” అన్నాడు. ”అంటే బువ్వ నువ్వు తిన్నదాకా లేదా” అన్నాడు.
”ఎట్లుంటదే పోరలు బువ్వతింటుండ్రంట అయిన అంత అవసరమేంది” రాజు ముఖంలో సందేహం ”సట్ నీయవ్వ” అంటూ ముఖం తిప్పుకున్నాడు.
”అదేంది కాకా గట్లున్నవు” అన్నాడు కానీ కాకయ్య ఆంతర్యమేమిటో అతనికి అర్థం కాలేదు. ”రేయ్ గాడిద కొడ్కా సత్తెన్న నిన్న నీలమ్మ పొలం దగ్గర వేరోళ్ళను కాపలా పెడ్తానంటే నేను నిన్నే పెట్టమన్నా నేను గట్లెందుకన్ననో నీకు సమజైందా” అనేసరికి ”ఎందుకే” అంటూ వెర్రిముఖం పెట్టాడు. ”ఎందుకేంది సిన్నతనంలోనే దానికి మొగుడు సచ్చే గంతసేను సెల్కా దానిదేనాయే గిన్ని దినాలంటే మొగిలిగాడికి పన్జెయ్య శాతగాక పొలం బీడుపెట్టిండు గాని ఇది తల్లికాడ్కేని రూపాలు దెచ్చి ఎట్ల పంట పండించిందో సూసినవుగా అదీగాక గాడు సచ్చినంక పోరగాండ్లను ఇడ్సి దీని అత్తలెక్క ఇది ఎక్కడ దెంకపీక్తదో అనుకున్నం కాని సత్తెన్న దొంగతనంగా రాయించుకున్న పొలం ఆ పొలం ఈ పొలం గల్సి ఎంత పంట పండించిందో సూస్తున్నవుగా దాని తల్లిదండ్రుల కాడ పైసుంది దీనికాడ పనిజేసే ఓనరుంది” అంటూ రాజుకళ్ళలోకి సూటిగా చూశాడు.
”అయితే ఏంది కాకా గిప్పుడు నువ్వేమంటవు” అంటూ రాజు తలగోక్కున్నాడు. ”ఓరి బడివే నీకు యింకా సమజ్‌గాలేదా” అంటూ లేచి వెళ్లి మరి రెండు కల్లుసీసాలు కోడిగుడ్లు తెస్తూ ”నేను ఎందుకు గిట్ల సెప్తున్ననో సమజ్ సేసుకో కొడ్కా అది గిప్పుడే పాలోల్ల సాయం లేకుండనే పంట పండించేటంతటిది అయింది. అంటే మన మూడుపాళ్ళు గల్పితే ఒచ్చే పంటని అది ఒక్కతే పండించింది. దానికి రెండు పుట్లు పండుతాయి, యింగ గిట్లనే పండిస్తుంటే అది పెద్దగైతది మస్తు రూపాలు సంపాయిస్తది మనల్ని యింగ లెక్క సెయ్యదు అది ముండ మోసింది యింకా కావలసినంత పైకం దాని సేతిల కొస్తుంది ఎన్నటికైనా ఎవ్వని సేతిలనో పడ్తదని నాకెర్క గిట్లాంటోళ్ళను ఎంత మందిని సూడలే. గంద్కనే అది ఎవల సేతుల పడక ముందే దాన్ని నీ సేతిల తీసుకో” అన్నడు తాపీగా.
ఆడ్ని మెల్లమెల్లగా దువ్వు లేకుంటే ఆడు మనకే ఆడైతడు ఆడ్ని ఎట్లయినా పుసలాయించి పని దీసుకోవాలి గీ సుద్ది మరువకు” అంటూ పచ్చనోటు చేతిలో కుక్కాడు. అది తీసుకుని జేబులో పెట్టుకుంటూ ”గట్లనే అన్నా గిట్లనే గిదంతా నా సేతిలో పని గిది మనకొక లెక్కనా ఏంది గందుల్ల రాజుగాడు నా రక్తం నా అన్నకొడుకు ఆడు నా మాటింటడే” అంటూ లేచాడు. మర్నాడు పొద్దునే రాజు నీలమ్మ యింటికి వచ్చి ఖాళీ టిఫిను బిందె ఇచ్చి వెళ్తుంటే ”ఓ రాజు జెర గియ్యాల గూడా కళ్లెం కాడుండయ్యా” అని ప్రాధేయపూర్వకంగా అంటే ”గట్లనే ఒదినా” అంటూ రాజు వెళ్లిపోయాడు. యింట్లో పనులన్ని త్వరత్వరగా ముగించుకుని సర్ది గంపనీళ్ళు తీసుకుని కొడుకులతో కల్సి పొలం దగ్గరకు పోయింది నీలమ్మ. ఆడవాళ్ళంతా ఆ రోజు నుండి ఇండ్ల దగ్గరుండి వాకిట్లల్ల వడ్లు ఆరబోస్తుంటే మొగవాళ్ళంతా పొలాల్లో తాళ్ళు పేని గడ్డికట్టి గాడ్డాముల్లో వేస్తుంటే నీలమ్మ తన కల్లం దగ్గర నుంచి వడ్లు మోయటానికే సరిపోయింది.
పొద్దుగూకుతుండగనే ఎల్లయ్య మెల్లగా రాజు దగ్గరకు వచ్చి ”ఒకసారి గట్ల దుఖ్నం కాడికి పోదాం రా బిడ్డా” అంటూ కల్లు దుకాణానికి తీసుకుపోయి ఆరు సీసాల కల్లు తెప్పించి శాకన తెప్పించేసరికి రాజు వాటిని చూసి గుటికెలు మింగుతూనే ”కాకా గిన్నెందుకే” అన్నాడు. ”ఎందుకేంది కొడుకా మనిద్దరికే పట్టు” అంటూ కల్లుసీసా చేతిలో పెట్టాడు. ఏనాడు లేంది చిన్నాయినకు అకస్మాత్తుగా తన మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థంకాలేదు. అయినా తెచ్చిండుగా తాగిందే లెక్కా అనుకుని గబగబా రెండు సీసాలు ఖాళీచేసి శాఖన నాకాడు.
నిషా మెల్లమెల్లగా తలకెక్కసాగింది. అప్పటి వరకు రాజుతో ఆమాట ఈమాట మాట్లాడుతూ నాలుగు సీసాల కల్లు రాజుతో తాగించి అతని మాట తడబడుతుండటంతోనే ”కొడుకు లైనులోకొచ్చిండు” అనుకొని ”ఓరి రాత్రి నీలమ్మ సేన్ల పండుకున్నవుగా తిననీకి ఏమన్నా తెచ్చిందా” అంటూ ఏమీ ఎరగనట్లు అడిగాడు. ”తెచ్చింది కాక ఇంట్ల బువ్వుండంగనే టిఫిను గట్టుకొని పోరగాండ్లకు బువ్వేసి నా దగ్గరకి ఊర్కొంచ్చిందంట టిఫినిచ్చి ఇంటికాడ పోరలు బువ్వతింటుండ్రయ్యా అని ఎంటనే పోయింది” అన్నాడు. ”అంటే బువ్వ నువ్వు తిన్నదాకా లేదా” అన్నాడు. ”ఎట్లుంటదే పోరలు బువ్వతింటుండ్రంట అయిన అంత అవసరమేంది” రాజు ముఖంలో సందేహం ”సట్ నీయవ్వ” అంటూ ముఖం తిప్పుకున్నాడు. ”అదేంది కాకా గట్లున్నవు” అన్నాడు కానీ కాకయ్య ఆంతర్యమేమిటో అతనికి అర్థం కాలేదు. ”రేయ్ గాడిద కొడ్కా సత్తెన్న నిన్న నీలమ్మ పొలం దగ్గర వేరోళ్ళను కాపలా పెడ్తానంటే నేను నిన్నే పెట్టమన్నా నేను గట్లెందుకన్ననో నీకు సమజైందా” అనేసరికి ”ఎందుకే” అంటూ వెర్రిముఖం పెట్టాడు.
”ఎందుకేంది సిన్నతనంలోనే దానికి మొగుడు సచ్చే గంతసేను సెల్కా దానిదేనాయే గిన్ని దినాలంటే మొగిలిగాడికి పన్జెయ్య శాతగాక పొలం బీడుపెట్టిండు గాని ఇది తల్లికాడ్కేని రూపాలు దెచ్చి ఎట్ల పంట పండించిందో సూసినవుగా అదీగాక గాడు సచ్చినంక పోరగాండ్లను ఇడ్సి దీని అత్తలెక్క ఇది ఎక్కడ దెంకపీక్తదో అనుకున్నం కాని సత్తెన్న దొంగతనంగా రాయించుకున్న పొలం ఆ పొలం ఈ పొలం గల్సి ఎంత పంట పండించిందో సూస్తున్నవుగా దాని తల్లిదండ్రుల కాడ పైసుంది దీనికాడ పనిజేసే ఓనరుంది” అంటూ రాజుకళ్ళలోకి సూటిగా చూశాడు. ”అయితే ఏంది కాకా గిప్పుడు నువ్వేమంటవు” అంటూ రాజు తలగోక్కున్నాడు.
”ఓరి బడివే నీకు యింకా సమజ్‌గాలేదా” అంటూ లేచి వెళ్లి మరి రెండు కల్లుసీసాలు కోడిగుడ్లు తెస్తూ ”నేను ఎందుకు గిట్ల సెప్తున్ననో సమజ్ సేసుకో కొడ్కా అది గిప్పుడే పాలోల్ల సాయం లేకుండనే పంట పండించేటంతటిది అయింది. అంటే మన మూడుపాళ్ళు గల్పితే ఒచ్చే పంటని అది ఒక్కతే పండించింది. దానికి రెండు పుట్లు పండుతాయి, యింగ గిట్లనే పండిస్తుంటే అది పెద్దగైతది మస్తు రూపాలు సంపాయిస్తది మనల్ని యింగ లెక్క సెయ్యదు అది ముండ మోసింది యింకా కావలసినంత పైకం దాని సేతిల కొస్తుంది ఎన్నటికైనా ఎవ్వని సేతిలనో పడ్తదని నాకెర్క గిట్లాంటోళ్ళను ఎంత మందిని సూడలే. గంద్కనే అది ఎవల సేతుల పడక ముందే దాన్ని నీ సేతిల తీసుకో” అన్నడు తాపీగా. రాజుకి తాగిన మత్తంతా ఒక్కసారి వదిలినట్లయి ఎల్లయ్య దిక్కు వెర్రిచూపులు చూస్తూ ”కాకయ్య నువ్వే నాయే నాకు గిట్ల సెప్తున్నవు మొగడు సచ్చింది అందుల్ల అన్న భార్య గిట్లసేస్తే పాపమే” అన్నాడు తలొంచుకుని.
”గీ దినాలల్ల పాపం లేదూ గీపం లేదురా పైసా పైసా ఈ లోకమంతా పైస తోనే నడుస్తుందిరా దాన్ని నీ సేతులలోకి తెచ్చుకుంటే పైసా ఫలం నీదై నువ్వు నిజంగనే రాజువైతవు. అటు ఒంటి సుఖము ఇటు ఇంటిసుఖము అంతా నీదేరా అందట్ల నువ్వు మంచిగుంటవు నా అన్న కొడుకువని నీకు సెప్తున్నా లేకుంటే ఎందుకు సెప్త బిడ్డా” అంటూ రాజు మనస్సులో విషపు బీజం నాటాడు. రాజు కాదుకూడదు అన్నా అతని మనస్సులో ఆలోచనలు సుడులు తిరుగు తున్నాయి. చేయాల్సిన కార్యమేదో చెప్పి దానివల్ల కలిగే లాభాలను చూడమన్నాడు ఎల్లయ్య. బాగా చీకటి పడ్డాక ఇద్దరు కల్సి ఊగుకుంటూ, తిరుగుకుంటూ ఇంటిదిక్కు సాగిపోయారు.
రాజు సరాసరి కల్లు దుకాణం నుంచి కల్లం దగ్గరకు వచ్చేసరికి తెల్లని ఎన్నెల్లోని ఇదురుగాలికి ఒనుక్కుంటూ నీలమ్మ అతని కోసం టిఫిను నీళ్ళు తీసుకొచ్చి ముందర పెట్టుకుని మునగా దీసుకుని కూర్చొని ఉండటం చూసి మెల్లగా వచ్చి ఆమెమీద చెయ్యి వెయ్యాలని చూశాడు. కానీ ధైర్యం చాలక ముందుకు చాపిన చేతికి వెనక్కు తీసుకుని మెటికలు విరుస్తుంటే ఆ చప్పుడు విని తలతిప్పి రాజుని చూస్తూ ”రాజు ఏడికి పోయినవయ్య టిఫిను దెచ్చి గంటసేపైంది” అంటుంటే
”ఏ… ఏడికి పోలే ఒదినా ఎల్లికాక దుక్నాంకు తీస్కపోయిండు” అన్నాడు ”గట్లనా సరే చెయ్యి కడుగుకో బువ్వపెడ్తా” అని చెంబుతో నీళ్ళు ఇచ్చి గిన్నెలో అన్నం వడ్డిస్తుంటే ”బిడ్డోళ్ళు తిన్నరా ఒదినా” అన్నాడు. ”అవునయ్యా గియ్యాల కొడుకులు జెల్దీ నిద్రపోయిండ్రు అత్తమ్మకు సెప్పొచ్చినా గింత జెల్దీ ఆళ్ళు లెవ్వరు తియ్యి గంద్కే నువ్వు బువ్వ తిన్నంకా పోదామని ఆగినా” అన్నది చిరునవ్వుతో.