నెలద

కథా పరిచయం :

IMG_20141130_161845నెలద అంటే అప్పుడే ఉదయించిన నెలవంక .బహుదా నది తీరంలో ఉన్న నందలూరు గ్రామం రాజంపేట తాలుకా కడప జిల్లాల్లో ఉంది . ఇక్కడ ఉన్న శ్రీ సౌమ్య నాద స్వామి ఆలయం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది . చాళుక్యుల కాలంలో నవ నందులు పరిపాలించినండు వల్లే నందలూరు అనే పేరు వచ్చిందని ఒక కథనం ఉంది . ఈ గ్రామానికి సమీపంలో ఉన్న గవి కొండపై కన్పించే బౌద్దారామ స్తూపాలు సాక్ష్యంగా నిలుస్తాయి . గవి కొండ నుంచి ఉన్న సొరంగ మార్గం చంద్రగిరి కోటలోకి ప్రవేశిస్తుందని అంటారు . ఇక్కడి విష్ణు స్వరూప సౌమ్యనాధుని చొక్కనాధునిగా కీర్తించాడు తాళ్ళపాక అన్నమయ్య . నందలూరికి అతి సమీపంలోనే ఉంటుంది తాళ్లపాక .

చొక్కనాధ ఆలయంలో నృత్యం చేసే ఒక దేవదాసీ పేరే నెలద . ముస్లిం పరిపాలకుల ఆక్రమణలు , దాడుల నుంచి తమ గ్రామాన్ని కాపాడుకోవటానికి తన సంపద అంతా వారికిచ్చి ఈ గ్రామాన్ని కొనుక్కున్న నర్తకి ఆమె . ఆ నెలద గుర్తుగా అప్పట్లో “నెలదలూరుగా” పేరొంది కాలక్రమేణ నెందలూరు , నందలూరుగా మారిందని మరో కథనం ఉంది .
ఏది ఏమైనా నాటి నుంచి నేటి వరకు సమాజంలో చిన్న చూపుచూడ బడుతున్న ఒక దేవదాసీ తమ గ్రామం , ప్రజల పై

ఎంత అభిమానం చూపించిందో , ఎంతగా పోరాడిందో అనే విషయం నన్ను చాలా ఆకర్షించింది . నాట్యం అంటే కేవలం దేవదాసీలకి చెందిందని నృత్యం చేసే వారు కుటుంబ స్త్రీలకి భిన్నమైన వారనే దురాభిప్రాయాన్ని కూడా నేను చాలా మందిలో గమనించాను . నటరాజ స్వామి ,తాండవ కృష్ణుల వర ప్రసాదమే నాట్యం . అది కులమతాలకు అతీతమైన కళ . మానవ మేధో వికాసానికి , శారీరిక దృడ సౌష్టవానికి అదొక పమమౌషది . అలాంటి కళను నమ్మి బతికిన ఓ నర్తకి గురించిన కథయే ఈ నెలద . ఇందులో పేర్లు వాస్తవం . కథనం కోసం చరిత్రకు కొంత కల్పనను జోడించాను .తొలిసారిగా అంతర్జాల సాహిత్యంలోకి ప్రవేశించిన నేను విహంగ ద్వాఎఆ మీ ముందుకు వస్తున్నాను . ఈ నవలను చదివి , మీ అభిప్రాయాలను పంచుకుంటారని , ఈ కళ ని ఆదరిస్తారని నమ్ముతున్నాను .

– మీ కోడూరి సుమన 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నెలద

కరుణ రసార్ద మగు నీ చూపు కిరణమ్ము మాకిడి
కాపాడవమ్మ ఓ కమల నేత్రీ ……
తరుణ సులక్షణ సంపన్న భరిత మౌనమూర్తి
దర్శింప జేయుమా ధవళ గాత్రీ ……
స్మరణ మాత్రమున మా మరణ వ్యధలను బాపి
ముక్తి నోసగుమమ్మ మాత గాయత్రీ ….

శ్రీ గాయిత్రీదేవి విగ్రహం ముందు అర్ధ నిమీలిత నేత్రయై కైమోడ్చి ప్రార్ధిస్తోంది నెలద . ఆర్ద భక్తి సమ్మిళితమైన ఆ సుస్వర ఝారికి ఆటంకం కల్గిస్తూ అమ్ ..మ్మా …… అంటూ వచన పిలుపు . ఆ పిలుపులో నెలద పూజకి అడ్డుతగులు తున్నాననే బాధతో పాటూ సందేహంతో పాటూ అంతులేని భయం ద్యోత మవుతోంది . తన దైవార్చనకు భంగం కల్గిందని కొంత చికాకు కల్గినా వచన గొంతుక లోని భయాన్ని పసిగట్టి చప్పున హస్తాన్ని వచన వదనంలోని భీతి గమనించి చాచి ఆమె భుజం పై వేసి ఏమైంది .. అన్నది ఆత్రుతగా నెలద ..

Andhra_Natyam_depictedఅమ్మా ఆ క్రూర ధరుడు కొందరు ఆశ్వకులతో వచ్చి అగ్రహారం మీద పడి బ్రాహ్మణులను , స్త్రీలను వేధిస్తున్నాడట అది తెలిసి హేమవర్ధనులు అతనితో తలపడేందుకు వెళ్లారు . చాలా …. కంగారుగా చెప్పింది వచన . నెలద ఆమె భుజంపై ఓదార్పుగా తడుతూ ఇంకేం హేముడున్నాడుగా భయపడకు నేను బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేయి అన్నది ధీమాగా . ఆ దుష్టుని పన్నాగం నాకు తెలుసు బుద్ధి చెప్పే సమయం తనే తెచ్చుకున్నాడు చెపుతాను “ ఖంగు “న ఆమె గొంతులోంచి వచ్చిన మాటలు అక్కడున్న ఇతర చెలికత్తెలు తిలక , నంద లకు ఆశ్చర్యం కల్గించాయి . పూజ సమయంలో అంత మార్దవంగా దేవీ స్తుతి చేసిన గళమేనా ఇది అనుకున్నారు . ఆమె వెనుదిరిగి అమ్మ వారిని సమీపించి చేతులు జోడించి తల్లీ స్త్రీ శక్తి కి నీవే ప్రతీక దుష్ట శిక్షణకు ఆ శక్తి నా కందివ్వమ్మ అని మనసారా ప్రార్ధించి హారతి ఇచ్చింది . అక్కడున్న వారు ఆ హారతి కళ్ళ కద్దుకున్నారు .

నెలద సామజ గమనంతో ధనగారంలోకి నడిచింది . తలుపులు మూసేసింది . చుట్టూ పెద్ద పెద్ద చందనపు కొయ్యలతో చేయబడిన భోషాణాల మధ్యలో అన్నింటి కన్నా పెద్దదిగా ఉన్న సందుగా తాళం తీసి తలుపు పైకి లేపింది . అందులోంచి బుస్సుంటూ పడగెత్తి లేచినదొక మిన్నాగు . కన్నతల్లి చిన్ని శిశువు చెంప నిమిరినంత ప్రేమగా దాని పడగ పై నిమిరి శేషూ నేనేరా , శాంతించు అన్నది. అది ఒక మారు ఆనందపు పలకరింపులా చిన్ని పడగనటు ఇటు ఊపి దించుకున్నది . చిరునవ్వుతో ఆ సందునందు గల ముఖమల్ సంచులను ఓ పది తీసుకున్నది . అవి బంగరు మండలతో నిండిన చిత్తులు (సంచులు ) పక్క నుంచి సందుగ తాళం వేసి తాళపు చెవిని ఆ సందుగపైనే ఉంచి సంచులతో వెలుపలికి వచ్చింది . నంద ఓ పళ్ళెంతో గుమ్మం వద్ద సిద్ధంగా ఉన్నది . చేతిలోని సంచులను ఆ పళ్లెంలో ఉంచి ధనాగారపు తలుపు తాళం పెట్టి అంతా సిద్దమేగా అన్నది నందనుద్దేశించి . ఆ అమ్మా అన్నదామె . మహిషాసుర సంహారానికి కదిలిన సింహ వాహినిలా టివీగా నడవసాగింది . నంద , చతుర , రమణ ఆమెననుసరించారు . వీధి గుమ్మం చేరగానే జోడు గుర్రాలు పూన్చిన రధంతో సంసిద్ధంగా ఉన్నది ప్రభవి . మంగిడీలమ్మా ఎక్కండి అన్నది కళ్లాలు పట్టుకుని ఇక కదలడమే తక్షణం అన్నట్లు . తానో ఉత్తుంగ తరంగంలా చివ్వున రధమెక్కి కూచుని ఊ పద అన్నది . ఆమెకు తన చేతిలోని ధన చిత్తుల పళ్లెరాన్ని అందించింది నంద . ఊ … అన్నది నెలద . అదే అనుమతిగా చేతిలోని కళ్లాలను జోడించి విదిల్చింది ప్రభవి . అశ్వాలు ఓ మారు ముందు కాళ్లను గాలిలోకి లేపి శంఖ నాదం లా సకిలించి దౌడు అందుకున్నాయి .

యుద్దావేశంలో ఉన్నప్పటికీ నెలద మస్తిష్కం పరి పరి విధాల పోతోంది . అసలేమవుతోందీ రాజ్యం . ప్రశాంతంగా కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో మనోల్లాసంతో ఆనందంగా జీవిస్తున్న ఈ ప్రజలు ఇకపై యుద్ధోన్మాదంతో దురాక్రమణ దారులై దూసుకు వస్తున్న (ఆ ముస్లిం పాలకులు ) ఆ తురుష్కుల దురాగతాలకు బలైపోతారా ? వారు పడేసే నాణెపు చిత్తుల కోసం స్వయంగా క్రూర ధనుడిలాటి తెలుగీయులే వారికి సాయం చేస్తూ స్వంత ప్రజలను హింసించేందుకు తెగ బడుతున్నారే ప్రస్తుతం క్రూర ధనుడ్ని అణిచినా ఈ సమస్య మూలాగ్రానికే మందు వేయాలి . తెలుంగులంటే కేవలం సహనం పేరున చేవచచ్చి పడి ఉండేవారనీ అక్షరాలతో ముక్కోటి దేవుళ్ల కీర్తిస్తూ అదే రాజసమని మురిసి పోయే వారని గతంలో ఓ తురుష్కుడు నిందించాడు . వాడి ఆలోచన ఎంత తప్పో తెలుంగు పౌరుషమెంత ఘనమో తెలియ జెప్పేలా ఏదైనా వ్యూహం పన్నాలి . యుగ యుగాలుగా స్వర్ణ యుగాన్ని , చోర , నేర రహిత రాజ్యాన్ని శాంతియుత పాలనను అందించిన మన తెలుంగు పాలకుల దాటి పాటిదో వాళ్లకు తెలిసేలా వారి రాజ్యాన్ని దాటి అడుగు కూడా తెలుగు నేలపై పెట్టేందుకు ధైర్యం చేయలేని విధంగా తగురీతి బుద్ధి చెప్పాలి . ఆమె మెదడు పరి పరి విధాల పద్మవ్యూహంల చిత్రీకరింపులో మునిగింది . హా హా కారాలు చెవినపడి అశ్వాలు నిలిచిన సంగతి స్ఫురించి ప్రభవీ అదిగో హేముడు క్రూర వర్ధనుని కాళ్లు చేతులు కట్టి అతని అశ్వం పైనే వేస్తున్నాడు చూడూ … అని అహ హ్హా హ్హా అని నవ్వింది ఆ హాసంలో విజయగర్వం హేముని పై నమ్మకం రెండూ తొణికిస లాడగా …. ప్రభవి సంబరంగా అదిగో మిగతా వారు కూడా నేలపై ఎలా పోల్లుతున్నారో చూడూ ….. అన్నది . వాడు కొదమ సింగం . నేనుండగా హేముడు ఉండగా మా సీమను కంట తడి పెట్టనివ్వమే అన్నది ధీమాగా ఇంతలో అగ్రహారీ కులంతా ఆమె రధం చెంతకు చేరారు .

– సుమన కోడూరి

రచయిత్రి పరిచయం :
కుటుబంలో పెద్ద కోడలిగా బాధ్యతలు … యిద్దరమ్మాయిల పెంపకం …
కళకి . కాలానికి దూరమై బాధపడుతున్న సమయంలో కడప ఆల్ ఇండియా రేడియో శ్రీ గోపి గారు ప్రోత్సహించి బంగారం అనే నా నాటికను ప్రసారం చేసారు . అప్పటి నుంచి ఆకాశవాణి ద్వారా కథలు , కథానికలు , కవితలు తరచుగా ప్రసారం కావడంతో నా పేరు , నాస్వరం ప్రజలకు బాగా దగ్గరయ్యాయి . ఈ పరిణామం నాలో నిద్రాణమై ఉన్న కళను , సాహిత్యాన్ని వెలికి తెచ్చుకునే ధైర్యాన్ని ఇచ్చింది . ఆ తరవాత పత్రికల పై దృష్టి పెట్టి రచన వ్యాసాన్ని చేస్తున్నాము . నీటి సమస్య పై నేను రాసిన వ్యాసం వార్తలో ప్రచురించబడి చదువరుల దరి చేర్చింది .

నీ పేరేంటని ఎదుటి వారిని అడిగే అంతటి మానసిక వేదనలో ఉన్న నేను నాకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని వీలైనంత వరకు సాహిత్య , నృత్య కార్యక్రమాలలో పాల్గొంటున్నాను . సిలికానాంధ్ర , కూచిపూడి నాట్య సమ్మేళనంలో పాల్గొని గిన్నీస్ రికార్డు , కలహంస , భాషా సేవా రత్న పురస్కారాలు నా రచన కొనసాగిం పుకి స్ఫూర్తిచ్చాయి .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

5 Responses to నెలద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో