THINA – an AMEZON LEGEND

Director: Rosane Svartman

Director: Rosane Svartman
Country: Brazil/Portuguese
Language: Portuguese with English sub-titles
Duration: 88minutes
Age Group: Above 5 years

ఒక ఐదేళ్ళ రెడ్ ఇండియన్ అనాధ ఆదివాసీ బాలిక  యుద్ధ వీరురాలిగా ఎదగాలనీ-తన జీవితానికి సంబంధించిన అసలైన మూలాలు తెలుసుకోవాలనీ తపన పడటమే ఈ చిత్ర కధాంశం

అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోకి బందిపోటు దొంగలు ప్రవేశించి ,ఆక్రమించుకుంటారు.అక్కడ స్థానికంగా ఉన్న “మయ”(Maya) అనే ఆదివాసీ అమ్మాయి బందిపోట్ల బారిన పడి బందీ అవుతుంది.గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె తన బిడ్డ “తైనా” ను అనాథగా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. పాపాయి ఒక పెద్ద వృక్షపు వేళ్ళ మధ్య ఆశ్రయం పొందుతుంది. “షమన్” అనే ముసలి పులి తైనా పాపను కాపాడుతుంది. ఐదు సంవత్సరాల తర్వాత తైనా తిరిగి తన వాళ్ళను చేరుకుంటుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి ప్రకృతి సంరక్షకుడిగా కొత్త నాయకుడు ఎంపికకవుతాడు. తైనా అతనితోపాటే అడవిలో ఉంటుంది. తైనా అమ్మాయి కాబట్టి బయటికి రావడానికి ఆదివాసీ సమాజం ఒప్పుకోదు. కానీ తైనా ఆదివాసీ చిట్ట చివరి యుద్ధ యోధురాలైన ఆమె తల్లి వారసత్వాన్ని నిలబెట్టాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంటుంది. అందు కోసం నగరం నుంచి తప్పిపోయి అడవిలో కొచ్చి ,అనుకోకుండా కలిసిన తెలివైన “లారీనా” (Laurinha) అనే అమ్మాయి సహాయాన్నీ, అలాగే స్థానిక ఆదివాసీ బాలుడు “గోబీ” మద్దతునూ తీసుకోవాలనుకుంటుంది. ఎలాగైనా సరే తన సొంత మూలాలకు సంబంధించిన మిస్టరీని చేదించాలనుకుంటుంది.
ఈముగ్గురు స్నేహితులూ తమ చారిత్రాత్మక ప్రయాణం ద్వారా వారిలో వారికి ఉన్న పరస్పర తేడాలు చిన్న చిన్న విభేదాల్ని మర్చిఫోయి మంచి స్నేహితులవుతారు. అన్ని రకాల దుర్మార్గాలకూ చెడుకి అవతారమెత్తినట్లున్న“జూరిపారి” అనే వ్యక్తి అడవి నాశనాన్ని కోరుకుంటూ పర్యావరణాన్ని దెబ్బతియ్యాలని పన్నాగాలు పన్నుతుంటాడు.ఈ జూరిపారి తైనా కుటుంబ పూర్వీకులకు శత్రువు ఒకే ఒకలక్ష్యంతో ముగ్గురు స్నేహితులూ జూరిపారిని ధైర్యంగా ఎదుర్కుంటారు.
కథ ఇంతే! కానీ అపురూపమైన వస్తువు – అమెజాన్ లెజెండ్ ని ఎంచుకుని స్నేహం సాహసం ప్రకృతి యొక్క అద్భుతాలను కళ్ళకు కట్టినట్లు ఈ ఫీచర్ ఫిల్మ్ ను అద్భుతంగా దృశ్యీకరించారు డైరెక్టర్రొ జానె స్వాట్మన్అంతకు ముందే అయన అమెజాన్ సాహసం- తైనా ను 2000 లోనూ, న్యూ అమెజాన్ సాహసం- తైనాను లోనూ “పెడ్రో రోవియై అనే ఒక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నిర్మాతతో కలిసి తీశారు. ఈ రెండు సినిమాలు విజయవంతమై విశేషమైన అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఈ రెండు చిత్రాలు కలిసి అంతర్జాతీయ పిల్లల చిత్రోత్సవాలలో 22 బహుమతులు గెలుచుకున్నాయి. అంతేకాదు, 41 దేశాల టివి షోలకు అమ్ముడయ్యాయి. ఇక ఈ కొత్త చిత్రం మునుపటి రెండు చిత్రాల కంటే ప్రతిష్టాత్మకంగా ఉండేలా తైనా 3 తో, 2013 లో మూడో చిత్రం తీసి “తైనా ట్రయాలజీ” ని ముగించాచాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం దర్శక – నిర్మాత లిద్దరూ 2009 నుంచి ఈ చిత్ర నటి ఏంపిక కోసం పడరాని పాట్లు పడ్డారు. ప్రధాన పాత్ర ఎంపిక కోసం రెండు సంవత్సరాల పాటు అమెజాన్ ప్రాంతం లోని 40 గ్రామాల్లో, 2200 మంది పిల్లల్ని పరీక్షించి ,300 మంది పిల్లల్ని పొటోలు తీసి, స్క్రీనింగ్ కోసం 10 మందిని ఎంపిక చేశారు. ఈ పదిమంది లో నుంచి చివరికి ఆన్ లైన్, ఎస్ ఎం ఎస్ ద్వారా ప్రజలు ఓటు వేసి “వైరానూ టెంబి (Wiranu Tembé ) అనే ఐదేళ్ళ గిరిజన పాపను ఉత్తర బ్రెజిల్ లోని టేకహో గ్రామం నుంచి సెలెక్ట్ చేశారు. రెండు,మూడు నెలల్లో,ఒక్కోసారి కొన్ని రోజుల్లోనే చిత్రాలు పూర్తి చేస్తున్న మన దర్శక – నిర్మాతలతో పోల్చుకుంటే,ఒక పాత్ర కోసం ఇంత శ్రమించిన ఈ దర్శక – నిర్మాతల్ని ఎంతైనా అభినందించవచ్చు!
ఎంపికయినప్పుడు వైరానూ టెంబి కి పోర్చుగీస్ భాష రాదు.తన గ్రామాన్ని వదిలి ఎక్కడికీ పోలేదు. చిన్నారి  టెంబి అందరి అమ్మాయిల్లాంటిది కాదు.ఆమె కత్యంత ఇష్టమైన ఆట వస్తువు విల్లూ బాణం. ఆమె అభిరుచిని కనిపెట్టిన వాళ్ళ తాతగారు చిన్నవయసులోనేవిల్లూ బాణాన్ని బహుమతిగా ఇచ్చారు.
టెంబి తైనాగా నటించలేదు. జీవించింది. ఇక తైనాకి ప్రకృతి లోని ప్రతి జీవీప్రతిచెట్టూ ప్రతిపుట్టా ఆమెకు చిరపరిచితమే!అన్నిటితోనూ మైమరపించే అద్భుతమైన స్నేహమే!  ఐదేళ్ళ గిరిజన బాలిక తైనా యుద్ధ వీరురాలిగా చూపిన తెగువా ధైర్య సాహసాలే కనురెప్ప వెయ్యకుండా ప్రేక్షకులను అలరిస్తాయి. ఆమె అడవిలో పుట్టడం  పులి పెంచడం అనేది పురాణ కథలాగా కల్పితమైనప్పటికీ  ఆమె ప్రకృతితో లీనమవడం చూస్తే ప్రేక్షకులకు నిజంగానే పుట్టినప్పటినుంచి అడవిలో పెరిగిందేమోననే భ్రమ కలుగుతుంది.ఐదేళ్ళ బాలిక వయసుకి మించి చేసిన సాహస విన్యాసాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. 
ఈ సినిమాని 100% అమెజాన్ రెయిన్ఫారెస్ట్ లోనే చిత్రీకరించారు. కాస్త పురాణ కథను నేపధ్యంగా తీసుకుని దానికి ప్రకృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే నేటి ఆధునిక పరిస్థితుల్ని జోడించి సృజనాత్మకంగా రూపొందించారు. అడవి లోని మనోహరమైన దృశ్యాలు ఆదివాసీ ప్రజలను అతి సహజంగా వాళ్ళున్న నిజ వాతావరణ పరిస్థితుల్ని వాస్తవికంగా చూపించారు. స్థిరమైన అభివృద్ధి జరగాలన్నా మానవ మనుగడ ప్రశాంతంగా ఉండాలన్నా మొత్తం ప్రకృతితో మానవులు ఎంత సామరస్యంగా ఉండాలో చూపిస్తుందీ సినిమా ప్రకృతిలోని అన్ని వృక్షాలను జంతువులను నీటినీ మానవాళి ఎలా కాపాడుకోవాలనేది ప్రకృతి పట్ల  పర్యావరణం పట్ల ఎంత నిబద్ధతతో ఉండాలనేది మొత్తం ప్రపంచానికి తెలియజెప్తుందీ సినిమా!
అమెజాన్ లెజెండ్ వినోదం తో పాటు విజ్ఞానాన్నీ అందిస్తుంది అడవి అందులో నివసించే ప్రజలు వన్యప్రాణులు పర్యావరణ సంరక్షణ గురించిన సమాచారం తెలుపుతుంది
అమెజాన్ అడవి గురించిన పర్యావరణం గురించి వన్యప్రాణుల సంరక్షణ గురించి గిరిజనప్రజలు చూపే శ్రద్దలో ఒక కవితా దార్శనికత గోచరిస్తుంది.
నిజ వాతావరణంలో గిరిజన ప్రజలు,జంతువులు బలమైన స్ఫూర్తినిచ్చేఅందమైన చిత్రాలతో వాస్తవికంగా ఉన్నందువలన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ , ప్రేగ్ ఆర్కెస్ట్రా(రియో) లు కూడా ప్రేరణ పొంది ప్రధాన థీమ్ గానం వీనుల విందు చేస్తుంది.
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని నదులూ సెలయేళ్ళూ పఛ్ఛని చెట్లూ రంగురంగుల పుష్పాలూ అంతులేని వివిధ జాతుల చిట్టి చిట్టి ప్రాణుల నుంచి పెద్ద పెద్ద పులుల వరకూ సాటిలేని ఆ అడవి సంపద అందంగా ఆకర్షణీయంగా ఉండి ఆసక్తి కలిగిస్తుంది. ఈ మనోహర దృశ్యాలన్నీ ప్రతి ఒక్కరూ తమ కళ్ళతో చూడాల్సిందే తప్ప దానిగురించి ఎంత రాసినా తక్కువే
ఈ చిత్రం ప్రారంభంలో ఐదేళ్ళు పైబడిన పిల్లలకు మాత్రమే ఉద్దేశించబడింది కానీ ఇందులోని అమెజాన్ ఆదివాసీ ప్రపంచాలు విశ్వ జనీనమైన గొప్ప సత్యాన్ని ఆవిష్కరించాయి గనుక ఇది ప్రపంచంలోని అందరికీ అవసరం ఆకట్టుకుంటుంది కూడా. పిల్లలూ పెద్దలూ కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా

Festivals & Awards
Best Foreign language children’s Film, in Mill Valley Film Festival, California
CINE PE – Pernambuco, Brazil – 2013
CINE OP – Minas Gerais, Brazil – 2013
Agenda Brasil – Milan, Italy – 2013
7e Festival de Film Bresilien de Montreal – Canada – 2013
7e Brazil Film Fest – Toranto, Canada – 2013
Festival du Cinema Brésilien de Paris – 2013

Premiere Brasil Lisboa, no Festival de Lisboa – 2013|

– శివ లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సినిమా సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో