కన్యాశుల్కం-పునఃప్రారంభం!!!

కృష్ణ వేణి

కృష్ణ వేణి

“రిష్తే హీ రిష్తే (సంబంధాలే సంబంధాలు.)” మమ్మల్ని కనీసం ఒకసారైనా కలుసుకోండి. ఫలితాలు చూడండి” అన్న ఈ మాటలు గోడలమీదా, రైల్వే పట్టాల పక్కనా రాసుండేవి నా చిన్నప్పుడు. ఈ ఆకట్టుకునే మాటల కిందనే కరోల్ బాగ్ చిరునామా ఒకటి ఉండేది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదిర్చేది (నిజాయితీగా) ఆ చిరునామాకి చెందిన ఒక పెద్దమనిషి.
ఆ తరువాత షాదీ.కామ్, భారత్ మాట్రిమొనీ.కామ్ మొదలైనవి చాలా వచ్చేయి. ఇప్పుడు ఇదిగో- తిరిగి కన్యాశుల్కం రోజులు కూడా ప్రారంభం అయినట్టున్నాయి చూస్తే.
కట్న నిషేదం 1961 లోనే అమలులోకి వచ్చింది. 1992 లో ‘ఉయ్యాల’ పధకం అమలుపరిచేరు కానీ అవి కూడా భ్రూణహత్యలని నివారించడానికి ఎక్కువగా ఉపయోగపడలేదు. 2014వ సంవత్సరపు జనాభా లెక్కలప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి 940:1,000. కనుక ఇలాంటి పరిస్థితిలో భ్రూణహత్యలకి పేరు పొందిన హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పెళ్ళి వయస్సు వచ్చిన యువకులకి వధువులు దొరకడం దుర్లభం. ప్రత్యేకంగా తమ కులానికి చెందిన అమ్మాయిలే కావాలనుకుంటే కనుక.
“కొడుకే కావాలి. కూతురు వద్దు. కొడుకైతే మన వృద్ధ్యాప్యంలో మనకి అండగా నిలుస్తాడు. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. కూతురికైతే కట్నం ఇవ్వాలి. ఎలాగూ ఇంకో ఇంటికి వెళ్ళిపోయేదే”- ఇలా ఆలోచించే తల్లితండ్రులున్న మన దేశంలో ఇప్పుడు ఆ గోడలమీద రాయబడే ప్రచార ప్రకటనలకి ఏ విలువా లేదు.
యువకుల కుటుంబాలు వధువు కులాన్ని నిర్లక్ష్యపెట్టడానికి కూడా సిద్ధపడుతున్నాయి. దాని వల్ల ఇప్పుడు తిరిగి “కన్యాశుల్కం“ మొదలయింది. అదీ దళారీల రూపంలో. 2013వ సంవత్సరంలో మధ్యప్రదేశ్లో 5726 అమ్మాయిలు మాయం అయేరు. 3117 మంది అమ్మాయిల జాడింకా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం. దీన్లో దళారీల చెయ్యి ఉందంటోంది ఒక సర్వే.
kanyaluskam 1
హిందీ కేంద్రస్థలాల్లో వక్రదారి పట్టిన లింగ నిష్పత్తి, చట్టవిరుద్ధమైన పెళ్ళి మార్కెట్టుగా పరిణమిస్తోంది. పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం కష్టం అయిన ఈ నేపథ్యంలో దళారీలు- అతి ఎక్కువ లాభదాయకంగా తయారయిన ఈ మార్కెట్ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవడానికి ఒక కిటుకు కనిపెట్టేరు- కింద వర్గాలనుంచి వచ్చిన అమ్మాయిలని ఉన్నతకులాలకి చెందినవారిగా చలామణీ చేయడం. ఎక్కువ గిరాకీ ఉన్నది బ్రాహ్మల మరియు జైన్ అమ్మాయిలకి కనుక తెచ్చిన/కొనుక్కున్న అమ్మాయిలకి ఆయా కులాల ఆచారసంప్రదాయాల్లో వారు శిక్షణ ఇస్తారు. అమ్మాయిల పేర్లు మార్చి శాస్త్రి, జోషి, శర్మ, ద్వివేది ఇత్యాది ఇంటిపేర్లు తగిలించి వాళ్ళని పెళ్ళిళ్ళ మార్కెట్లోకి విడుదల చేస్తారు.
ఆదివాసురాలైన పింకీ అన్నతో పోట్లాడి, కంచన్‌పుర్ గ్రామంనుంచి పారిపోయింది. తూర్పు మధ్య ప్రదేశ్‌లో ఈ పిల్ల అగర్వాల్, మోనికాలకి కనపడితే, తీర్థయాత్ర నెపంతో వాళ్ళిద్దరూ పింకీని మథురాకి తీసుకువెళ్ళేరు. అక్కడ వాళ్ళు పిల్లకి ఒక కొత్త పేరు పెట్టి, ఇంటిపేరు మార్చి, బ్రాహ్మణ ఆచారాలూ, వంటలూ నేర్పించి మిశ్రాల కుటుంబానికి అప్పగించేరు. మిశ్రాలకి అనుమానం వేసి మర్నాడు దళారీలు తమ ఫీ వసూలు చేసుకోవడానికి వాళ్ళింటికి రాగానే వాళ్ళ సెల్ ఫోన్లూ అవీ లాక్కుని వాళ్ళని పోలీసులకి అప్పగించేరు. పోలీసుల సహాయంతో ఆ పిల్ల తిరిగి తన ఇంటికి వెళ్ళిపోగలిగింది. ఇలాంటి కేసులని వేళ్ళమీదే మాత్రమే లెక్కపెట్టగలం.
పింకీని అమ్మిన ముఠా తాము ఉత్తర్ ప్రదేశ్‌లో, రాజస్థాన్లో ఇంకో తొమ్మండుగురు అమ్మాయిలని అమ్మేమని ఒప్పుకున్నారు. వీళ్ళే అమ్లైకి చెందిన రీనా యాదవ్‌ని 13 ఏళ్ళ కిందట లలిత్‌పుర్ జిల్లా(యుపి)లో ఉన్న ఒక కుటుంబానికి అమ్మేరు. అప్పుడు ఆ అమ్మాయికి కేవలం 16 సంవత్సరాలే. ఇప్పుడు ఆమె ముగ్గురి పిల్లలకి తల్లి. పెద్ద కొడుకు 11 సంవత్సరాల వాడు. 2012వ సంవత్సరంలో కట్నీ నివాసి అయిన సరితా యాదవ్‌ని ఈ ముఠాయే లలిత్‌పుర్ జిల్లాలో ఉన్న దూబేల కుటుంబానికి ముప్పయి వేల రూపాయలకి అమ్మింది. ఇప్పుడామె నిండు గర్భంతో ఉంది. పిల్ల కనుక యుక్తవయస్సురాలు అయి ఉండి-సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే సామాన్యంగా పోలీసులు వీటన్నిటినీ పట్టించుకోరు.

ఈ మధ్యకాలంలో ఇలాంటి ముఠాలపేర్లు బయటకి రావడం ప్రారంభించేయి. ఉదయ్‌పుర్ నుంచి కుసుమ్, బన్స్వారానుంచి తోలారామ్. ఒక ముఠా నాయకురాలు ఫర్జానా. కొన్ని ముఠాలు హర్యానాలో ఉన్న పల్లెలకి kanyaluskam 5అమ్మాయిలని సరఫరా చేస్తాయి. ఈ రాష్ట్రపు లింగ నిష్పత్తి దేశంలో ఉన్న వాటిలోకల్లా అతి అననురూపమైనది. 2011 లో జరిగిన సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకీ 879 చొప్పున స్త్రీలు ఉన్నట్టు తేలింది.
తన పార్టీ కనుక అధికారంలోకి వస్తే బీహార్‌నుంచి వధువులని తెచ్చిస్తానని జూలై నెలలో నర్వానా(హర్యానా)లో బిజెపి నాయకుడు ఓమ్ ప్రకాష్ ధన్‌కర్ ప్రకటించడంతో ఆయన మాటలు కాస్తా హెడ్‌లైన్స్‌కెక్కేయి. అంతేకాక ఫలానా మంత్రి తన స్నేహితుడు కనుక పెళ్ళిళ్ళన్నీ చక్కగా ఏర్పాటు చేయబడతాయనీ, హర్యానాలో ఉన్న ఏ పురుషుడు కానీ ఇంక బ్రహ్మచారిగా మిగిలి ఉండే అవకాశం ఉండదని కూడా ఆయన బాహాటంగా ప్రకటించేరు.

కూతుర్లున్న జైన్ల కుటుంబాల్లో వరుని నుండి ఎదురుకట్నం తీసుకునే ఆచారం కూడా అధికంగా కనిపిస్తోందీ kanyaluskam 2మధ్య. ఈ కన్యాశుల్కం విలువ ముప్పై- నలబై లక్షలనుండీ ప్రారంభం అవుతుంది.కొన్నేళ్ళ క్రితం ఉజ్జయిన్‌కి చెందిన మున్నీ బేగమ్ మధ్యప్రదేశ్‌లో ఉన్న భిల్ తెగకి చెందిన యువతులని జైనులుగా మార్చి ఎక్కువ మొత్తానికి గుజ్‌రాత్ మరియు రాజస్థాన్‌కి చెందిన ధనిక జైన్ల కుటుంబాలకి అమ్మింది.

“నన్ను కొనుక్కున్నప్పుడు నా వయస్సు 16. నాకు మహావీర్ జైన్ ఫోటో చూపించి ‘నమోకార్ మంత్రం’ నేర్పించేరు. ఆ మంత్రం నాకు బాగా నచ్చింది” అంటుంది ఆదివాసి అయిన వినితా నిహాల్. మున్నీ ఆ పిల్లకి లైటర్‌తో గాస్ స్టవ్ వెలిగించడమూ, జైన్ల వంటలూ నేర్పి కొన్నిరోజుల తరువాత ఒక జైన్ల కుటుంబానికి 50,000 రూపాయలకి అమ్మేసింది.
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఉదయ్‌పూర్లో- మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ మరియు మైసూర్లో ఉన్న శ్రవనబెలగొల నుంచి కొనుక్కు తెచ్చుకున్న ‘బ్రాహ్మణ, జైన్‘ వధువులు వందలమంది ఉన్నారు. వీళ్ళలో అధికశాతం పెళ్ళయిన తరువాత సంతోషంగానే జీవితం గడుపుతున్నారు. కోడళ్ళని బయట రాష్ట్రాలనుంచి కొనుక్కు తెచ్చుకున్నామని కుటుంబాలు నామోషీ పడి బయట చెప్పకపోయినా కానీ అది ఊళ్ళో అందరికీ తెలిసిన రహస్యమే.
రాజస్థాన్‌కి చెందిన కైలాష్ చందర్ అగర్వాల్ని పోలీసులు ఈ మధ్యే అరెస్ట్ చేసేరు. స్త్రీలైన తన సహాపరాధులని అతను వధువులుగా చలామణీ చేసి అమ్మేసేవాడు. ఆ “వధువులు” కాస్తా మెట్టింట్లో ఉన్న బంగారం, డబ్బూ చేజిక్కుంచుకుని పలాయనం చిత్తగించేవారు.
హర్యానాలో ఉన్న ఒక బంధువు కోసం ఝార్ఖండ్‌నుంచి వధువుని కొనే అవసరం పడిన ఓమ్ ప్రకాష్ జైన్, ఆ లావాదేవీలో వచ్చిన లాభం చూసిన తరువాత అలాంటి పన్నెండు పెళ్ళిళ్ళు జరిపించేడు. కాకపోతే ఇలాంటి పెళ్ళి వ్యవహారాలు కొన్నిసార్లు సవ్యంగా సాగవు. దళారీలైన సుమన్, సంజయ్ సింగ్ కలిపి రాజేంద్ర సోలంకీకి ఒక సంబంధం కుదిర్చేరు. 37,000 రూపాయలు తీసుకుని మహారాష్ట్రాకి చెందిన అమ్మాయితో అతనికి నాలుగు నెల్ల కిందట పెళ్ళి చేయించేరు. పెళ్ళి అయిన తరువాత వారమే పెళ్ళికూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకి పూనుకోవడానికి కారణం అయిన భర్తా, దళారీలూ కలిపి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.
kanyaluskam 4
పతేహ్ సింగ్ ముఠాలో మంజు, వర్మ, రాజ్ కుమారి భాగస్థులు. రింకూకి వరుడు శశివర్మతో సంబంధం కుదిర్చేరు. రింకూ తండ్రి జస్వంత్ నహాల్ తన కూతురికి మంచి సంబంధం కుదిరిందన్న సంతోషంతో వరుడి ఊర్లో పెళ్ళి జరుగుతున్నప్పుడు పెళ్ళి ఫోటోలు తీయబోతే ‘అది అశుభం’ అని వరుని(?) కుటుంబం అతన్ని ఆపివేసింది. జస్వంత్‌కి 8,000 రూపాయలు ఇచ్చి రింకూ జీవితాంతం సుఖంగా ఉంటుందన్న భరోసా కలిగించి, అతన్ని ఆ ఊళ్ళోంచి సాగనంపేరు. అది జరిగిన తరువాత ఇప్పటికీ కూతురి జాడ తెలియక ఆ తండ్రి విలవిల్లాడుతున్నాడు.
ఎన్జీవోలు వీటన్నిటినీ ఆరికట్టడానికి ప్రయత్నిస్తాయి కానీ సామాన్యంగా బాధితులు వచ్చేది కుగ్రామాలనుంచీ, అమ్మబడేది దూరప్రదేశాల్లో ఉన్న కుటుంబాలకీ కనుక ఈ ఆచారాన్ని రూపుమాపడం కష్టమైన పని అయినా ‘రెస్క్యూ ఫౌండేషన్’, ‘ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఫర్ లైఫ్ డెవెలప్మెంట్’ లాంటి ఎన్జివోలు తమవంతు సహాయం మాత్రం అందిస్తూనే ఉన్నాయి. హోమ్ మినిస్ట్రీ వీటిని నిరోధించడానికీ, అమ్మాయిల ట్రాఫికింగ్ ఆపడానికీ అనేకమైన చర్యలు తీసుకుంది. ఈ నేరాలకి శిక్షకింద ఉన్న పాత ఐపిసి 370ని కొంచం మార్చిన తరువాత, ఇప్పుడు ఆ పీనల్ కోడ్ ఇలాంటి సంఘటనలని కూడా లెక్కలోకి తీసుకుంటోంది. ఐపిసి సెక్షన్లు 359 నుంచీ 373 వరకూ ఉన్నవి కూడా ఈ విధమైన నేరాలని నిరోధించేటందుకే.
ఈ విధమైన సంఘటనలు ఈ మధ్య మరింత ఎక్కువగా వెలుగులోకి వస్తున్నా కానీ ఇలాంటి సంఘటనలు తమ దృష్టికే రాలేదని కొన్ని జిల్లాల్లో ఉన్న పోలీసులు చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కువే అవుతున్నాయి కానీ తగ్గే సూచనలు ఏ మాత్రం కనబడటం లేదు.

గమనిక- కొన్ని అంశాలు బిసినెస్ స్టాండర్డ్ నుంచి, టైమ్ పత్రిక మరియు ఇతర పత్రికల/పేపర్ల/నెట్ ‌నుంచి  సేకరించినవి.

– కృష్ణ వేణి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

6 Responses to కన్యాశుల్కం-పునఃప్రారంభం!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో