గమ్యం లేని బాల్యం

 

కృష్ణ వేణి

కృష్ణ వేణి

 “బచపన్ బచావ్ ఆందోలన్”- ఉద్యమాన్ని ప్రారంభించిన కైలాష్ సత్యార్థికి నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా ఆయనని అభినందిస్తూ, ఆయన చేసిన నిరంతర కృషికి ప్రణామాలతో…….
dvgfdfgdfgdfsg
                             జాన్‌పుర్ నుంచి వచ్చిన ఎమ్పీకి భార్య అయిన డెంటిస్ట్ అయినా, వసంత్‌కుంజ్‌లో ఉన్న డాక్టర్ అయినా, మా ఇంటి కిందనున్న డాక్టర్ దంపతులు అయినా కానీ, తాము చదువుకున్నవారిమన్న జ్ఞానాన్ని పక్కకి నెట్టి, మానవత్వాన్ని కాలరాసి, హత్యలకీ అత్యాచారాలకీ పాల్పడుతుంటే, “ ఎందుకీ ఉన్నత విద్య? ఎవరిని ఉద్ధరించడానికి” అన్న ప్రశ్న మన మనస్సుల్లో తప్పక తలెత్తుతుంది. మొదటి సంఘటనలో, హత్యకి ఐపిసి- 302, హత్యాప్రయత్నానికి ఐపిసి-307, జువెనైల్ జస్టిస్ ఏక్ట్ కింద శిక్ష పడింది. వారి పట్ల జువెనైల్ జస్టిస్ ఏక్ట్, బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబోలిషన్), చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ ఏక్ట్ మరియు బుద్ధిపూర్వకంగా హాని కలిగించినందుకు సెక్షన్- 323 కింద శిక్ష అమలుపరచబడింది.
11222
                       రెండో విషయంలో- రాంచీకి చెందిన ఆదివాసురాలైన (సంతాలీ తెగ) పిల్లని పనిలో పెట్టుకుని తిట్టి, కొట్టి, వేడి పెనంతో వాతలు పెట్టి, అర్థనగ్న పరిస్థితిలో ఉంచి యూరిన్ తాగమని బలవంత పెట్టి, ఆఖరికి ఒక ఎన్జీవో సహాయంతో జైల్లో పెట్టబడిన యజమానురాలి వార్త రాజధానిలో గుప్పుమని వ్యాపించింది. ప్లేస్మెంట్ ఏజెన్సీలని రెగ్యులేట్ చేసే అవసరం ఉందని ఈ కేస్‌లో తీర్మానించబడింది. ఇక్కడ జరిగిన సంఘటన కనీసం కొన్ని ఎన్జీవోల దృష్టికీ, పోలీసుల దృష్టిలోకైనా వచ్చింది. మిగతా పిల్లలకి ఆపాటి న్యాయం కూడా సమకూరదు. అఘాయిత్యానికి పాలుపడిన స్త్రీకి ఇప్పటికీ బెయిల్ దొరకలేదు.
12334
                    ఉమ్మడి కుటుంబాలు కరువైపోయి, భార్యా భర్తా ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో, ఇంట్లో ఉండి ఇంటిని/పిల్లలనీ చూసుకోడానికీ, ఇంటి పనులకీ ఒక మనిషిని 24 గంటలూ పనిలో పెట్టుకునే అవసరం పడిన కాలం ఇది. ఈ నేపధ్యంలో తెలిసినవాళ్ళకి చెప్పి, ఎక్కడో అక్కడ ఒక పనిపిల్లని/పిల్లవాడిని సంపాదించటం, ఏ ప్లేస్‌మెంట్ ఏజెన్సీకో వాళ్ళ ఫీ వాళ్ళకి చెల్లించి, పిల్లలని పనికి కుదుర్చుకోవడం సామాన్యం అయిపోయింది. వయోపరిమితి నియమాలని ఉల్లంఘిస్తూ, చాలా ఇళ్ళల్లో కనిపించే పనమ్మాయిలు చిన్నపిల్లలే.
                     ఢిల్లీలోనూ, చుట్టుపక్కలా పని చేసే 14 ఏళ్ళ లోపల వయస్సు పిల్లలు ఇంచుమించు కనీసం 4 మిలియన్లమంది. 18 ఏళ్ళ వయస్సని అబద్ధం చెప్పి వాళ్ళని పనిలో పెట్టి, డబ్బు చేసుకునే ప్లేస్మెంట్ ఏజెన్సీలు ఎన్నో! ఈ పిల్లలు బ్రోకర్ల వల్ల కొనుక్కోబడి, జీతం భత్యం లేని బానిసల్లాగా మిగిలిపోతారు-రోజుకి కనీసం 16-18 గంటలు పని చేస్తూ, పాచిపోయినదో, మిగిలిపోయినదో భోజనం తింటూ, ఎక్కడ చోటు చూపిస్తే అక్కడే పడుక్కుంటూ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఇంటిని విడిచిపెట్టడం పనిపిల్లలకి ఇంచుమించు అసాధ్యమే- ఇంటినుంచి పారిపోతే తప్ప. అలా చేసినా కానీ వారు తప్పుడు మనుష్యుల చేతుల్లోనే చిక్కుకుంటారు. లైంగికంగా కూడా ఈ పిల్లలు ఉపయోగించుకోబడిన కేసులు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు ఇంట్లో ఆ నాలుగు గోడల మధ్యా ఉండటం తప్ప బయటి ప్రపంచం చూడరు. అప్పుడప్పుడూ చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆటలు ఆడటం కాదు కదా, మాట్లాడ్డానికి కూడా నోచుకోరు. ఏజెన్సీలయితే నెలకోసారి పనమ్మాయిలకి సెలవివ్వాలని నియమం పెడతాయి కానీ అదీ అమలు పరచబడదు. ఈ పిల్లలు వచ్చేది పేదరికం ఎక్కువగా ఉన్న బీహార్, మధ్యప్రదేష్, ఝార్ఖండ్, యూపీ రాష్ట్రాలనుంచీ, నేపాల్‌నుంచీ.

                           “మిలియన్ల బాల్యాలని హరించి మన దేశం ఎదగలేదు, ఎదగకూడదు కూడా” అంటారు భువన్ రిభు- బచ్‌పన్ బచావ్ (బాల్యాన్ని కాపాడండి) ఉద్యమం యొక్క నేషనల్ సెక్రెటరీ.
ప్రస్తుతానికి వస్తే….,

                                 ఎవరో కానీ డోర్ బెల్ మీద నొక్కిన వేలిని తీయకుండా అదేపనిగా మోగిస్తున్నారు. చూస్తే కింద డాక్టర్ దంపతుల ఇంట్లో పని చేసే 12 ఏళ్ల అమ్మాయి రేణూ వాళ్ళ సంవత్సరం వయస్సున్న పిల్లని పట్టుకుని, నీరసంగా తలుపుకి ఆనుకుని ఉంది. తెల్లని పసి చెంపలు కమిలి, కళ్ళుబ్బి చేతిలో ఉన్న పిల్లతో పాటు లోపలకి వచ్చి, కింద చతికిల పడి “మంచినీళ్ళు తాగుతావా?” అంటే వద్దంటూ తలూపింది. చెదిరిన జుట్టూ, ఊడిపోయిన పోనీటైల్ చూసి అనుమానం వేసి ఏమయిందని అడిగితే కంగారు పడుతూ, “ఆంటీ, ఒకసారి నీ ఫోన్నుంచి అమ్మకి ఫోన్ చేయవా?చేతిలో ఉన్నప్పుడెప్పుడైనా దానికి డబ్బిస్తానులే” అంది. వాళ్ళూరికి ఫోన్ చేస్తే, ఎంతసేపైనా ఎవరూ ఫోన్ ఎత్తలేదు. మొత్తానికి తేలిన విషయం ఏమిటంటే పొద్దున్నే ఈ పిల్లకి ముందు రోజు చేసిన పాచిపోయిన రొట్టెలు పెడితే వాంతి చేసుకుందట. మధ్యాహ్నం షిఫ్టని డాక్టరమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళగానే ఈ అమ్మాయి కాస్తా ఒక గుడ్డూ రెండు బ్రెడ్ ముక్కలూ తిందిట. అందుకే ఆ చెంపమీద దెబ్బలూ, కమీజ్ పైకెత్తి చూపించిన వీపుమీద గుద్దిన గుద్దులూ, జుట్టుపట్టుకుని జాడించిన సూచనలూ. డాక్టరమ్మ హాస్పిటల్కి వెళ్ళగానే రేణూ ఇటువైపు వచ్చిందన్నమాట!

                      ఆఖరికి వాళ్ళమ్మ ఫోన్ ఎత్తింది. నేను కోపం పట్టలేకపోయి” ఏవమ్మా, నువ్వు తల్లివేనా? ఇక్కడ నీ కూతురి సంగతి పట్టించుకోవా?” అన్నలాంటి మాటలేవో అన్నాను. “లేదమ్మా, పేదరికం. మా పక్క ఊళ్ళోవాళ్ళే వీరు. 20 వేలిచ్చారు సంవత్సరానికని. అందుకే మా పిల్లని పంపించేం కానీ పరిస్థితులు సరిగ్గా ఉంటే పంపించేవాళ్ళమా చెప్పమ్మా!” అని నన్ను ఎదురు ప్రశ్న వేసింది. డాక్టర్ దంపతులు రాంచీకి చెందినవారు కనుక సంగతి అర్థం అయింది. అద్దెకి ఉన్నవారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తరువాత నాకు నిస్సహాయంగా అనిపించి “సరే, ఏదవుతుందో అదే అవుతుందిలే” అనుకుంటూ నెట్లో చూసి దొరికిన మొదటి నంబర్‌ (ఒక ఎన్జీవో)కి ఫోన్ చేసేను. ఏమయిందో ఏమిటో కానీ పట్టుమని నెల తిరగకుండా, డాక్టర్ దంపతులు ఇల్లూ ఖాళీ చేసేరు, ఉద్యోగాలు కూడా( మరి ఎంత త్వరగా సంపాదించుకున్నారో కానీ) మార్చేసుకుని నోయిడాకి మారిపోయేరు. కానీ వాళ్ళింటికి పోలీసులు వచ్చేరని తరువాత చుట్టుపక్కలవాళ్ళనుంచి తెలిసింది.
బాలకార్మిక వ్యవస్థకి ఇది ఒక పక్షం మాత్రమే.

– కృష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

19 Responses to గమ్యం లేని బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో