బహురూపం

పద్మజ వాణి

పద్మజ వాణి

అక్షరం … బహురూపం

అప్పుడే పుట్టిన శిశువు గొంతులోంచి

‘వూ ‘ అంటూ వురికే  అక్షరం

ఎప్పుడూ  ఒంటరిదే

వూ .. కాస్తా వుంగాగా మారాక …

నెమ్మది నెమ్మదిగా నవ్వుల

హరివిల్లుల్లోకి జారాకే ..

మాటల కెరటాల్లో అంతర్ధానమైన

అక్షరం …

వాక్యాలుగా అక్షయమౌతుంది .

ఒక్క సిరాచుక్క కొసన పురుడు పోసుకున్న

అక్షర ప్రస్థానం  యెంత  గొప్పదీ …

అది లక్షల మెదళ్ల ను కదిలిస్తుంది ..

తన అక్షేహిణిలోకి పదాల  పదాతి దళాలను

సమకూర్చుకుని ..

చరిత్ర సారాంశాల నిస్వాసాల్లోంచి గతాన్ని

పుటలు పుటలుగా తవ్వి తెచ్చి

మన కళ్ళ ముందు పరుస్తుంది …

వాగా డంబరాల్ని  కట్టుకుని ..

శిష్టా చారాల మేనాల్లో …

గజారోహణంగావించి .. గండ పెండేరం తోడిగించుకున్నాగానీ

జన పదాల్ని  చేరని అక్షరం

అంతస్తత్వాన్ని  కోల్పోవలసిందే ..

అల్లంత దూరాన్ని నిలవాల్సిందే ..

అక్షరం అస్థిత్వం  యెంత చిక్కనిదీ ..

విశుభ్ర నీలాకాశం క్రిందనించి వెలిగే

నక్షత్రాల గుంపుని చూసినా    

ఒక్క చినుకు స్పర్శ కే  పులకించి

పరుగులు తీసే

పసి పాదాల సవ్వడి విన్నా

పాటగా పల్లవించి .. ప్రవహించి

తేనె వాకగా దుమికే  కవిత్వాన్ని

ఆవాహనం చేసుకునేందుకు …

తన జిహ్వాగ్రాన్న  బీజాక్షరం

మోసిన వాడే   కవి …

‘ ఓ ‘ అక్షరం ఒంటరిదైనా

శూన్యాన్ని పక్కన పెట్టుకుని

విశ్వమంతా ప్రతి ధ్వని స్తుంది .

లెమ్మని హుకరించి ఉద్యమమై

వురికించినా ..

‘రా ‘ అని ఆహ్వానం పలికి  ఆలింగనం చేసుకుంటుంది ..

తిరగేసి పలికినా మోక్షమిస్తుంది ..

అక్షరం యెంత  అమృత తుల్య మైనదీ ..

రాత్రి కలలో .. నా మనసు పొలం నిండా

గుప్పెడు అక్షరాల విత్తులు చల్లుకున్నాను ..

తెల్లారి చూద్దును కదా ..

నా గది నిండా మాటల మూతలు

పరిమళిస్తూ ..

ఓ కొత్త కవితగా వుజ్వలించే

కవి సమయం ఆసన్న మైనట్టుంది …

 

 – పసుమర్తి పద్మజవాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to బహురూపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో