ఒక జీనీ కావాలి

Vijaya-bhanu“ఒక అల్లాఉద్దీన్ అద్భుతదీపం కావాలి
అందులోని జీనీ అచంచలమైన ఆత్మవిశ్వాసం కలిగినదై ఉండాలి.
నేను ఎంతటి పని చెప్పినా…
ఒక్క ఊపుతో పూర్తి చేసేదై ఉండాలి”
“ఇది మానవులందరికీ ఉండే కోరికేలే!”
ఒక్క మాటతో నా కోరికను జెనరలైజ్ చేసేసాడు దేవుడు!
వాడిన నా ముఖం చూసి జాలి పడ్డాడో ఏమో….
“సరేలే! ఇంతకీ ఏమంత గొప్ప పనులు చెయ్యిస్తావేం జీనీతో” అనడిగాడు
పోయిన ఉత్సాహమంతా బూమరాంగ్ లా తిరిగొచ్చేసింది!
“మా గొప్ప పనులు చేయిస్తాలే!” అంటూ కళ్ళను గుండ్రంగా తిప్పాను!
“అబ్బో కాసిన్ని గొప్ప పనులు చెప్పు చూద్దాం?” దేవుడు తన చుబుకంపై చేయి ఆన్చి ఆసక్తిగా అడిగేసరికి….
నా జాబితాను వినిపించడం మొదలు పెట్టాను!
“మొదటిగా మన నదులన్నీ శుభ్రం చేయిస్తాను”
“తర్వాత ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చేయిస్తాను.”
“కాలుష్యపు కోరలను పీకేయమంటాను”
“గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేయమంటాను”
చెప్పుకుంటూ పోతూనే ఉన్నాను….
భగవంతుడు చెయ్యెత్తి ఇక ఆపమన్నట్లు సంజ్ఞ చేసాడు!
ఏం తప్పు మాట్లాడానో ఏమో!
వెర్రి చూపులు చూసాను
“ఇవన్నీ జీనీ చేత చేయించాక మళ్ళీ మొదలవుతాయి”
“మనిషి చేతలకు అంతెక్కడిదీ?”
కాస్త కటువుగానే అడిగాడు పరాత్పరుడు
ఇనుమడించిన ఉత్సాహంతో ఈ సారి గొప్ప పరిష్కారం చెప్పాను
“మనిషి చేతలను మార్చేయమంటే సరి కదూ?!”
“హ హ హ హ”
“జోక్ ఆఫ్ ది ఎరా”
“జీనీ ఈ పని చేయలేదు!”
“మానవుడ్ని సృష్టించిన నాకే దిక్కు లేదు”
సర్వశక్తిమంతుడు ఓడిపోయినట్లు మాట్లాడ్డం నాకు నచ్చలేదు!
“మార్చగలం” నన్ను నమ్ము…
జీనీని ఇవ్వు….బ్రతిమిలాడాను!
“ఎలా మార్చడం?”
నన్నెదురుగా పెట్టుకుని….
నీ కూతురుకి క్యారియరు సర్దావు. పాలిధీన్ కవరులో పెట్టావు….
వేడి పుట్టి పోతోందని నాతో మాట్లాడుతూనే ఏసీ ఆన్ చేసావు…
కొడుక్కి ఐసు క్రీం కోసం ఫ్రిజ్ లో ఫ్రీజింగ్ కెపాసిటీ పెంచావు….
ఇంట్లోని వ్యర్థ పదార్థాలను ప్రక్కింట్లోకి విసిరావు….
గిన్నెలు కడుగుతూ కుళాయిని విప్పే వదిలేసావు…
నా ఎదురుగా ఇన్ని భూగోళ హింసాత్మక పనులు చేసిన నిన్నేమైనా చేయగలిగానా నేను?
ఇక జీనీ ఎంత?”
పరాత్పరుడు మాయమయ్యాడు…
నేను నిరుత్తరురాలిగా మిగిలాను!

– విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , Permalink

One Response to ఒక జీనీ కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో