ఆరు గజాల అందం
కుచ్చిళ్ళు పోసి
పైట మడచి
పడతి కట్ట వచ్చె
చూడ నీ సోయగం
అదో అబ్బురం
హృదాయలను
కవ్వించి
గిలిగింతలు పెట్టే సాథనం
గోచీపోసి పైట దోపితే ఎంకిలా …..
కఛ్చాపోసి కొంగు కప్పితే జానకిలా….
కొంగు దోపి నడుం బిగిస్తే సత్యభామల….
ఇంతి కి ఇంపై
ఇమిడి పోయి
ఒదిగిపోయి
కలసి పోతావు
పుట్టింటి నుండి వస్తే
ఆత్మీయంగా హత్తుకుంటారు
అట్టింటి నుండి వస్తే
ఆనందంతో కట్టుకుంటారు
ఏడు వర్ణాల హరివిల్లు
రూపు మారిస్తే
ఆరు గజాల చీరట !!!
అందాలను దాచి మనస్సులు దోచి
నిక్కచ్చిగా నిలబడతావు
అభిమానం తో మగువ కొంటే
మక్కువ తో మానం కాస్తావు
ఏముందో
జీన్సులలో
చూడీదార్లల లో
లేని సొంపు
చినిగిన పాత చీర లోనైనా
పట్టు చీరలో బుట్టబొమ్మలా
నేత చీరలో నాట్య మయూరి లా
సిల్కు చీరలోో చిక్కిన శిల్పంగా
మగువను మలచి మురిపిస్తావు
తరాలు మారినా
తరగని “స్తీ ధనమై” వర్ధిల్లు
ఆరు గజాల
అపురూప సౌందర్యమా

– ప్రియాంక
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to ఆరు గజాల అందం