అల్లా అఛ్ఛాకరేగా

ఆదూరి.హైమవతి

ఆదూరి.హైమవతి

” ఏమే లక్ష్మీ !ఈ రోజు పనమ్మాయి రాలేదు ఆబాత్ రూంస్ కడిగి, అన్నం తినివెళ్ళు.” ఇంటావిడ అలివేలు చెప్పింది.

“అలాగేనమ్మా!”

“ఏందుకే ఆ అమ్మాయిచేత బాత్ రూంస్ కడిగిస్తావు ? పని మనిషి ఉందిగా , జీత మిచ్చి పెట్టుకున్నావాయె ! మన పిల్లలతో పాటుగా చదువు కునే పిల్ల, తప్పే రాజ్యం. ఆ అమ్మాయిని వెళ్ళిచదువుకోనీ.”

“ఆపండి మీగోల, ఏం మూడుపూటాలా ఊరికే మెక్కట్లా? బాత్ రూంస్ కడిగితే తప్పేం? రేపు పెళ్ళయ్యాక చేసుకోవద్దాఏం?

“ఔను , నీవూ పెళ్ళైనప్పట్లుంచీ చేస్తూనే ఉన్నావుగా!మిగిలిపోయిన చద్దికూడు వారాని కొక్కరోజు పెడుతూ మెక్కు తోందిట! పాపమే పాపం.”

” ఆడవాళ్ళపని జోలికి రాకండి.. ఐనా ఇది చదివి ఉద్యోగాలు చేసి ఊళ్ళేలుతుందా?”

“ఏమో అదీనీ నిజం కావచ్చు. ఎవరి ముఖానెలావ్రాశాడో ఆబ్రహ్మ.”

“ఈయన గాంగా బ్రహ్మ వ్రాతలు చూసొచ్చినట్లు మాటలు.ఆపండిహ.” అలావారింట్లో ప్రతి సోమవారం పనమ్మాయిరాదు, బాత్ రూంస్ కడగను.

*******

“లక్ష్మీవచ్చావా! రారా నీకోసమే ఎదురుచూస్తున్నా,ఈరోజు ఏమొచ్చిందో పనిపిల్ల రాలేదు ఆ గుడ్డలు కాస్తంత ఉతికి ఆరేసి ఆప్లేట్లో టిఫిన్ పెట్టాను తినమ్మా! పాపం అకలి మీదుండుంటావ్”

“అలాగేనమ్మా!”

” నీకెన్నిమార్లు చెప్పానే నళినీ! ఆ అమ్మాయిచేత ఇంటి పనులు చేయించ వద్దనీ! బుధ్ధిలేదూ! వారానికొక్కరోజు నాల్గుమెతుకులు పడే స్తూ వారం గుడ్డలన్నీ ఉతికిస్తావా! వాషింగ్ మిషన్ ఎందుకు కొని పించావూ! బుధ్ధిలేక పోతేసరి! మనపిల్లలతో పాటుగా చదువు కుంటు న్నదే!పాపం”

“ఎవరికి పాపం? మీరు ఇంటిపని జోలికి రాకండి! ఆడపనులు మీకెందుకూ! వెళ్ళండవతలికి..”

” ఛీ పాడుబుధ్ధి … పాడుబుధ్ధని, ఒళ్ళుబధ్ధకం ,అందుకే అలాపెరిగిపోతున్నావ్! “

” మీ మాటలాపి వెళ్ళండవతలికి, వారాలుతిని చదివి ఉధ్ధరిస్తుందా ఊరిని” “

ఏమోనే ఎవరుచూడచ్చారు, నీపిల్లలకంటే మెరుగే “

” నాపిల్లలతో ఆ వారాల దాన్నిపోల్చకండి”

“నిజమే తప్పు తప్పు..”

ఈ ఇంట్లోనూ ప్రతి మంగళవారం పనమ్మాయిరాదు.

                    ***                           ***                                           ***                         ***                            

“అమ్మాయ్ లక్ష్మీ!ఈ బూట్లు కాస్తంత పాలిష్ చేసి పెట్టమ్మా! పిల్లలకు స్కూల్ టైమైంది. నాకు ఆఫీస్ టైమైంది ” అంటూ నాల్గు జతల బూట్లు చూపాడు చలపతిరావు. మౌనంగా తల ఊచింది లక్ష్మి.

“ఏమండీ మీకెన్నిమార్లుచెప్పానండీ ! ఆ అమ్మాయిచేత ఆపనులన్నీ చేయించ వద్దనీ! వెధవలు వాళ్ళ బూట్లు వాళ్ళుపాలిష్ చేసుకో లేరా! ఇంత బధ్ధకం నేర్పబట్టే చదవకుండా, తిని అడ్డంగా పెరిగిపోతున్నారు. పాపం చదువుకునే పిల్ల, ఈ పనులు చెప్పడం తప్పండీ! లక్ష్మీ నీవెళ్ళి ఆ అన్నంతిని వెళ్ళమ్మా! ఆబూట్లకు నేను పాలిష్ చేస్తాన్లే! ” లక్ష్మి చేతిలో బ్రష్ తీసుకుంది భారతి.

“వద్దమ్మా! సార్ చెప్పారుగా! నేచేస్తాను లెండమ్మా! మీరెళ్ళి వేరే పని చేసుకోండి. ” అంది లక్ష్మి.

“దానికున్నపాటి భయ భక్తులుంటే నీవెప్పుడో బాగు పడుదువు..”

“ఏం నేనిప్పుడేం చెడిపోయానూ! జీతం కంటే గీతం మూడురెట్లు సంపాదించే భర్తకు భార్యనై అన్యాయార్జితం తింటూనే ఉన్నాగా!అందుకే పిల్లలకు ముక్క చదువురాటంలా ” భర్త భావనరావు మీద విసుక్కుంది భారతి.- -” షట్ మాట్లాడకు, నా సంపాదన గురించీ, దానికీ తెలి వుండాలే తెలివి…”

” ఔను మీతెలివంతా అన్యాయార్జితానికేపరిమితం.న్యాయమైన సంపాదనైచ్చే తృప్తి , ఆనందం అక్రమసంపాదనలో ఉండవు.అదితిన్న మీబిడ్డలకు చదువబ్బి బాగుపడతారన్నమాట మరచిపొండి.”

“ఏమే కన్నబిడ్డల్నిశ్పిస్తున్నావ్!” ———— ” వాళ్ళుగాక ఈ లక్ష్మి ఉద్యోగ చేసి ఊర్ని ఉధ్ధరిస్తుందా!”

“ఏమో ఎవరుచూడచ్చారు? లక్ష్మి అదృష్టం.” ——– ” నోర్మూసుకెళ్ళు అవతలికి..”

అలా ఆఇంట్లోనూ ప్రతి బుధవారం బూట్ పాలిష్ చేసుకోను సమయ ముండదు.

గురువారం గురువారం సన్యాసి రావు ఇంట్లో పనిమనిషిరాదు ,కనుక లక్ష్మి ఇళ్ళుచిమ్మి, శుక్రవారం మరో ఇంట్లో తోటపనిచేసీ , శనివారం ఇంకో ఇంట్లో బట్టలు విస్త్రీ చేసీ , ఇంతన్నం మెతుకులు తిటుంటుంది. ఇహ ఆదివారం విషయానికొద్దాం.

“లక్ష్మీ! మేడం నీకోసం భోజనం డైనింగ్ టేబుల్ మీదపెట్టారు చూడు.తినేసి ఓమారు ఇలారా!” అన్న ఆనందరావు మాటలకు భయ భయంగా అక్కడ ప్లేట్లో ఉన్న మధ్యాహ్నం మిగిలిన అన్నం, పప్పుచారు గబగబా తాగేసి , ప్లేట్ కడిగి బోర్లించి, అడుగులో అడు గేసు కుంటూ పదకొండేళ్ళ లక్ష్మి ఆయన రూం గుమ్మం ముందునిలబడి ” సార్ ! నేను వెళ్ళిరానా!” అని అడిగింది.”వెళుదూగాన్లే రా లోప లికి” అంటూ నవ్వుతూపిలిచాడు ఆనందరావు. “సార్ !పరీక్షలు దగ్గర పడుతున్నాయి, వెళ్ళికాస్త చదువుకోవాలి.” అంది మెల్లిగా తల వంచుకుని. —–

“పెద్దయ్యాక ఏంచదువుతావు లక్ష్మీ! నీకేం చదువుకోవాలనుందీ!”

” సార్ ! నాకేం తెలుస్తుందీ! నాకేం తెలీదుసార్!”

— “నాకు తెల్సు లక్ష్మీ! నిన్నేం చదివించాలో! ఇలారా దగ్గరికి..కాస్తంత ఈకాళ్ళు నొక్కుతావా! నిన్నంతా నిల్చుని పనిచేశాను ఆఫీసు లో! నీకు తెల్సుగా మేడం ఆదివారం సాయంకాలం సాయిబాబా గుడి కెళ్తుంది కదా ! కాస్త హెల్ప్ చేయి నాకు ” అంటూ తన రెండు కాళ్ళూ మంచమ్మీద బారచాపి కుర్చీలోకూర్చున్నాడు ఆనందరావు. భయంగా దగ్గర కెళ్ళి కాళ్ళుపట్టసాగింది.”లక్ష్మీ! నీవంటే నాకు చాలా ఇష్టం . నీకేం చదువు కోవాలనుందో చెప్పు, నేను చదివిస్తాను. ఈ బట్టలేంటీ! ఇలా రంగుపోయి ఉన్నాయ్! నీకు మంచి బట్టలు కొంటాను, ఐనా నీవు మా ఇంట్లోనే ఉండిహాయిగా చదువుకోవచ్చును కదా! మీ మేడంగారికి చెప్తాను. ఇలా ఒక్కోరోజు ఒక్కోఇంట్లో తినడ మెందుకూ! నీకు పట్టెడన్నం పెట్టలేమా! పైగా మీగుడిసెలో లైట్లు కూడా ఉండవాయె ! ఎలాచదువుకుంటావు పాపం!” అంటూ ప్రేమ వొలికిస్తూ లక్ష్మి తలమీద చెయ్యేశాడు. తలమీద తేళ్ళూ జెర్రులూ పాకుతున్నట్లున్నా, ఏమీ చేయలేని అసహాయురాలు, భరించ సాగింది. మెల్లిగా తలరాస్తూ “లక్ష్మీ ! కాస్త నావీపుమీద కూడా వొత్తు తావా! నీచెయ్యి తగిలితేనే నానొప్పి మటుమాయమైపోతున్నది.” అంటూ మంచమ్మీద బోర్లగా పడుకు న్నాడు.

పాపం లక్ష్మి ఏమీ అనలేక , గడగడా వణుకుతూనే మంచానికి దూరంగా నిల్చుని వీపుపై రెండూ అరచేతులతో నొక్కసాగింది.” దగ్గరగా రాలక్ష్మీ! ఎందు కంత దూరం! అంటూదగ్గరగా లాగాడు. ఆఊపుకు అతడిమీద మంచం పై పడ బోయి పాదాలు నేలమీద నొక్కిపట్టి నిల్చుని ,భయం గానే పావడా కాళ్ళమధ్య దోపుకుని అతడికి తగలకుండా నొక్కసాగింది. ఆదివారం వస్తుందంటే లక్ష్మీకి భయం మేడం ఉండదు ,ఆనంద రావు ఏదేదో వేషాలేస్తూనే ఉంటాడు.ఓరోజు స్నానం చేస్తూ వీపు రుద్ద మంటాడు, మరోరోజు వీపుకు పౌడర్ వేయ మంటాడు. ఇదో ఈ రోజిలా … ఇంతలో ఉన్నట్లుండి వెల్లికిలా తిరిగి “లక్ష్మీ! కాస్తంత ఇక్కడా నొక్కవూ! నీవు నొక్కుతుంటే నా నొప్పి ఇట్టే మాయమై పో యింది!” అంటూ , లుంగీ తొలగించి ఆమె రెండు అరచేతులు తనతొడల పైకి పెట్టాడు .ఏమీచేయలేని ఆ అమాయకురాలు తప్పని సరై రెండు అరచేతులతో అతడి తొడలు నొక్కసాగింది. హటాత్తుగా ఆనందరావు లక్ష్మి చేతులు తన అండర్ వేర్ మీద పెట్టి , గట్టిగా నొక్కేసి పట్టుకుని,”ఇక్కడానొక్కు” అంటూ ఇకిలిస్తూ, పదకొండేళ్ళ లక్ష్మిని మంచమ్మీదికి లాక్కున్నాడు. బిత్తర పోయిన లక్ష్మి ఒక్క అరుపు అరిచి, పదునైన తన చేతి వ్రేలి గోళ్ళతో ఆనందరావును అందిన దగ్గరంతా గోకేసి , అతడి చేతుల్లోంచీ తప్పించుకుని మంచ మ్మించీ దూకి బయటికి పరుగెట్టింది.

ఎలా ఇంటి కెళ్ళిందో తెలీదు. మంచమ్మీద పక్షవాతం జబ్బుతో , పడున్నతల్లి కాళ్ళదగ్గర కూర్చుని పెద్దగా వెక్కి వెక్కి ఏడవ సాగింది. “ఏమైందే అలా ఏడుస్తున్నావ్! ఏకుక్కగానీ తరుముకుందాఏం!” అంది తల్లిమనస్సుతల్లడిల్లగా. ఔనన్నట్లు తలఊపి మరింత గట్టిగా ఏడ్వసాగింది.ఇంతలో ఖాసింభయ్యా వచ్చాడు మంచంలోని మల్లమ్మకు ఆయుర్వేద మందివ్వను. ఏడుస్తున్న లక్ష్మిని చూసి , ” ఏమ్మా! ఎందుకేడుస్తున్నావ్!” అడిగాడు.”కుక్కలు తరుము కున్నైట ఖాసింభాయ్!” అంది నీరసంగా మంచంలో మల్లమ్మ. మల్లమ్మకు గంజి తీసుకునివచ్చింది ఖాసింభాయ్ భార్య మాబూబీ.”ఎందుకు లక్ష్మీ ! అట్టా ఏడుస్తున్నవ్! ఏమాయె!” అంటూవచ్చి గంజి మల్లమ్మకు త్రాగించగా,ఖాసిం మందుపోశాడు నోట్లో. ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న లక్ష్మిని బయటికి తీసుకెళ్ళారు ఇద్దరూనూ. “కుక్కలు తరుము కున్నయ్యా!” అడిగింది మాబూబీ. ఇంకా లక్ష్మి భయంతో వణూకుతూనే అంది.”ఒకపిచ్చికుక్క కరవబోయింది మా బూబమ్మా! నేనింక ఆ యిళ్ళ కెళ్ళను. అన్నంలేకపోతే పోనీ కూలి పనికెళ్తా ,చదువుమానెస్తా.

మా అమ్మకు వైద్యం చేయిస్తా ” అంది మెల్ల మెల్లగా వెక్కు తూనే .”ఏమాయె! నీకు చదూకోడం ఇట్టమనేగా ఖాసిం భయ్యా మన కాలనీ దగ్గరి ఇళ్ళలో వారాలు కుది ర్చాడు, ఇప్పుడు మానేస్తా నంటావేమమ్మా! బాగా చదువుకుని పెద్ద డాక్టరవుతావని మేమంతా అనుకుంటన్నాం ! మనబోటోల్లకంతా మందులిస్తావుగా!”అంది మెల్లిగా లక్ష్మి తల నిమురుతూ.”ఈరోజూ ఈరోజూ “అంటూ మాబూబీ నివాటేసుకుని మళ్ళా ఘొల్లుమంది లక్ష్మి.మెల్లిగా తల నిమిరి బుజ్జగించి అంతా తెల్సుకుంది మహబూబీ .ప్రతి ఇంట్లో లక్ష్మికి మిగిలి పోయిన నాల్గు మెతుకులు పెట్టను ఆమె నెలా వాడుకుంటున్నారో , ఆనందరావు ఇంట్లో ఏం జరిగిందో అంతా విన్న మహబూబీ,లక్షిని తన గుండెలకు హత్తుకుని “ఈరోజునుంచీ నీవు మాబిడ్దవు .ఇల్లు వదలి వెళ్ళకు ఇస్కూలు కు తప్ప. ఏమయ్యో ఖాసిం ! బిడ్డల్లేనిమనకు లక్ష్మి బిడ్ద ఇయ్యా ళ్నుంచీ ! ఎదిగే బిడ్డను ఎక్కడికి అంపకూడదని నా మొద్దు బుర్రకూ తట్టలే. బయ్యం లేదులేమ్మా! లక్ష్మీ! నేనింకో నాలు గిళ్ళకాడ పంజేసి నిన్ను సదివిత్తా! నీవు నాబిడ్డవు.” అంటూ గుండెలకు హత్తుకుంది.”నేచెప్తానేఉన్నా ! ఆడపిల్లని ఇల్లమ్మంట పంపబోకని ఇన్నవా!” ఘాసింభాయ్ మీద నల్లత్రాచులాలేచింది మహబూబీ.

“పిల్లచిన్నదే అనుకున్ననే కానీ ఇంత బాధపడత దనుకోలేదు బీబీ! పోయివాడి ఒళ్ళు ఇరగ్గొట్టోస్తా ..”అంటూ కర్రందుకుంటున్న ఖాసిం భాయిని ఆపింది మహబూబీ.

“ఎందుకయ్య ఉన్నోళ్లతో తంటా, మనమిందే ఏదోక నేరమేస్తరు, బంగారం నగ దొంగిలించిందంటరు , మనమాటెవ రింటారయ్యా! పోలీ సోల్లని పిలిపిస్తారు ,ఇహెక్కడికీ లక్ష్మమ్మను పంపకుండుంటేసరి.తప్పుమనది గాదేంటీ!”

“అది కాదే బీబీ! నలుగురూ సాయపడ్తరనుకుంటినేకానీ ఇట్టవుద్దని అనుకోలేదు.” అనిఖాసిం అంటుండగానే, “చాల్చాలు . ఇగమాట్టా డాకు.పిల్లకేంకాలే అచ్చాలు, అల్లాకాపాడిండు.”అంటూ లక్ష్మిని మరోమారు గుండెలకు హత్తుకుంది మహబూబి. గుడిసె లోంచీ దబ్బు మన్నశబ్దం వచ్చింది.ముగ్గురూలోపలికి పరుగెట్టారు.అన్నీవిన్నట్లుంది,మంచం మించీ లేవబోయిన మల్లమ్మకుక్కిమంచం లోంచీ క్రింద పడింది.కదలికలేదు. అంతే ఆమె శరీరం కట్టైపోయింది.అలా లక్ష్మి ఖాశింభాయ్, మాబూబీల సొంత బిడ్డైపోయింది.వారిద్దరూ ముల్సింస్ ఐనా స్వఛ్ఛమైన తెలుగుమాట్లాడుతారు. ఎంతో సేవాభావం ఉన్నవారు.

“మేడం!ఆఫీసు వచ్చేసింది.దిగుతారా మేడం!” అంటూ డోర్ తెరిచి పట్టుకున్నాడు డ్రైవర్ రాము.కారుదిగి ఆఫీస్ లోపలికి నడిచింది కలెక్టర్ రోజా . అంతా పూలమాలలతో స్వాగతించారు.ఆమాలలన్నీ ఆఫీస్ లో ఉన్న గాంధిజీ పటానికి వేయించింది వారిచేతనే కలెక్టర్. అందరికీ తానే తన స్వంతఖర్చుతో బిస్కెట్ ,టీ ఏర్పాటుచేసింది.

“మేడం! పాత్రికేయులూ,లోకల్ టీ.వీ,ఛానల్ వాళ్ళూ వచ్చారు, మీ ఇంటర్యూకోసం.వారినిమీకు పరిచయం చేయను మీ పర్మిషన్ …” అంటూ నసిగాడు సెక్రెటరీ సన్యాసిరావు, రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్నాడు.కలెక్టర్ ను మంచి చేసుకుంటే చివరి ప్రెమోషనేమైనా వస్తుం దని అతడిఆశ, అందుకే అన్నీ స్వయంగా ఏర్పటు చేయించాడు ఘనంగా, కొత్తకలెక్టర్ వస్తుందగానే.

“అలాగే !” అంది కలెక్టర్. పాత్రికేయులు, టీవీ ఛానల్స్ వాళ్ళూ ముందు కొచ్చారు.మైకులూ , కేమెరాలూ పట్టుకుని.

“మేడం! మీరు బిటెక్, ఎంటెక్ ,ఎంబియ్యే, సీ.ఏ.వంటి చాలా పెద్దచదువులు చదివారుట!”ఒకపాత్రికేయుడు అడిగిందానికి, ‘ఔనని ‘ తలఊచింది కలెక్టర్.”మేడం! అంతపెద్ద చదువులు చదివి , అమెరికావంటి పెద్ద కంపెనీస్ లో కోటి రూపాయల జీతంతో పెద్ద ఉద్యోగాలు వచ్చినా వదులుకుని ఇలా ఒక జిల్లా కలెక్టర్ గా ఎందుకువచ్చారు మేడం ! “మైక్ నోటిముందుపెట్టి అడిగాడు టీ.వీ ఛానల్ ఉద్యోగి. నవ్విందికలెక్టర్. —

” సారీ మేడం! దయచేసి మీరు మాటల్లో చెప్తే మీనుంచీ స్పూర్తిపొంది మరికొందరు మీలాగా దేశసేవ చేయను ముందు కొస్తారేమో కదామేడం!”

” నేను దేశసేవచేయను ఇక్కడికి కలెక్టరుగా రాలేదు..” అంతానిశ్శబ్దం అలుముకుంది.అంతాఆశ్చర్యంగా చూశారు.” ఔను! స్లంస్ లోనూ, సమాజం లోనూ ఉండే పేద బాలికలను పిచ్చికుక్కల బారి నుంచీ కాపాడాలని వచ్చాను.” అంది. ఆనెలలోనే స్లంస్ లో పిచ్చి కుక్కలు నలుగురు పదేళ్ళ బాలికలను కరిచి పీక్కుతినగా వారు నలుగురూ మరణించారు , పెద్దలంతా చూస్తుండగానే , ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు, న్యూస్ పేపర్లూ,టీవీ ఛానల్స్ అన్ని 24 x 7 x 3 .రోజులపాటు ఆచిత్రాలు తిప్పుకుంటూ, జనం చెప్పేమాటలు ప్రసారం చేస్తూ, గొప్పలైవ్ ప్రసారం అందించామని గొప్పలు పోయారు.

“పిచ్చికుక్కలనుండీ బాలికలను కాపాడను కలెక్టర్గా మీరువచ్చారా! మొన్నజరిగిన సంఘటన ప్రభుత్వ దృష్టికి వెళ్ళిందిగా మేడం! ఏమునిసిపాలిటీ వారో ఆపిచ్చి కుక్కలను పట్టుకుని కరెంటు పెట్టి చంపేస్తారుగా మేడం! దానికోసం మీరు ఎంతో పెద్ద జీతాలు అందిం చను ముందు కొచ్చిన గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలు వదులుకుని కేవలం ఒకజిల్లా కలెక్టర్ గా వచ్చి ఏం చేయాలనుకుంటు న్నారు మేడం! ” మళ్ళా మధురమైన మందహాసం. “అన్నీ చెప్పేస్తే సస్పెన్స్ ఏముంటుందీ!వేచి చూడండి.” అంటూ లేచితన ఛాంబర్ లోకి నడుస్తూ ” ఇప్పుడే వచ్చాను కదా! మళ్ళీ అందరం కలుద్దాం , మిమ్మల్నెప్పుడూ మా ఆఫీసు స్వాగతిస్తుంది. సెలవు.” అంది.

ఆదూరి.హైమవతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to అల్లా అఛ్ఛాకరేగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో