నల్ల జాతి చరిత్ర లో నిలిచిపోయే నక్షత్రం

టి.వి.యస్ .రామానుజరావు

టి.వి.యస్ .రామానుజరావు

ఎనిమిదేళ్ళ ఆడ పిల్ల అత్యాచారానికి గురైతే,ఆమె మానసిక స్థితి ఎలా వుంటుంది?ఏమి తెలియని వయసులో తనపై ఆ దారుణం ఎందుకు జరిగిందో అర్ధం కాక తల్లడిల్లుతుంది.తల్లి దండ్రులతో సహా ఎవరికీ చెప్పుకోలేక, వొంటరితనాన్ని కోరుకుని క్రుంగి పోతుంది.అనుదినం ఆ దుర్ఘటన గుర్తు చేసుకుంటూ మానసిక సంఘర్షణకు గురవుతుంది.కొందరు పెద్ద వాళ్ళే అలాంటి సంఘటనల ప్రభావంతో తమ జీవితాలనే చీకటి మయం చేసుకుంటే, మరికొందరు వాటిని త్రోవలో ఎదురయ్యే అడ్డంకులుగా భావించి, తప్పుకుని ముందుకు సాగుతారు.మాయా ఎంజేలో ప్రసిద్ది చెందిన ఆఫ్రో అమెరికన్ రచయిత్రి. ఎనిమిదేళ్ళ వయసులోనే ఇలాంటి దారుణ అనుభవాన్ని చవి చూసింది. మాయ తనపై తాను జాలి పడడం కాని, క్రుంగి పోయి సినిక్ గా ప్రవర్తించడం కానీ చెయ్యలేదు. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొంది. “ తన మీద తాను జాలి పడడం (సెల్ఫ్ పిటీ) కొత్తల్లో ఈకల పరుపు మీద పడుకున్న అనుభూతి ఇస్తుంది. కాని అదే గట్టి పడినప్పుడు, చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.” “ సినిక్ పర్సన్ని చూడడమే దురదృష్టకరం. ఎందుకంటే, ఏమి తెలియని పరిస్థితి నుంచి అతను ఏమి నమ్మలేని పరిస్థితికి చేరుకుంటాడు” అంటూ ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు జీవితం పట్ల ఆమెకున్న పాజిటివ్ దృక్పదాన్ని తెలియజేస్థాయి.

angelouమాయ ఎంజేలో,కేవలం రచయిత్రి మాత్రమే కాదు,గాయని, పాటల రచయిత. అంతే కాదు, కవయిత్రి, నాటక , డాక్యుమెంటరి, సినిమా, టి.వి. రచయిత,దర్శకురాలు, నటి, డాన్సరు. మానవ హక్కుల కోసం నిరంతరం శ్రమించిన మనిషి. ఆమెకు మూడేళ్ళ వయసప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె తండ్రి మాయను, అన్నయ్య జూనియర్ బైలీనూ తన తల్లి పోషణలో ఉంచాడు. తిరిగి మాయను ఎనిమిదవ ఏట ఆమె తల్లి వద్దకు పంపేశాడు. అక్కడ పెరుగుతున్నప్పుడు తల్లి బాయ్ ప్రెండు ఫ్రీ మన్ వల్ల ఆమె అత్యాచారానికి గురి అయ్యింది. ఆమె కూడా ఈ విషయాన్ని చాలా రోజులు ఎవరికీ చెప్ప లేదు. చివరికి తన అన్నతో మాత్రం చెప్పింది. అతను తన కుటుంబ సభ్యులందరికీ తెలపడంతో, అది కోర్టు దాక వెళ్లి,అక్కడ ఫ్రీమన్ నేరం రుజువైంది.కానీ, ఆ నేరానికి ఒక రోజు జైలు శిక్ష మాత్రమే విధించారు. జైలు నుంచి విడుదలయిన కొద్ది రోజులలోనే అతను హత్యకు గురయ్యాడు.మాయ తాలూకు మనుషులు ఎవరో ఆ పని చేసి ఉంటారని అనుకున్నారు. తనపై జరిగిన అత్యాచారం విషయం బయటకు చెప్పకపోయివుంటే, అతన్ని చంపే వారు కాదేమో అన్న బాధతో మాయ సుమారు అయిదు సంవత్సరాలు ఎవరితో మాట్లాడకుండా, మౌనంగా ఉండిపోయింది. ఆమె సున్నితమైన మనస్తత్వానికి ఇదొక ఉదాహరణ.ఆమె జీవిత చరిత్ర రాసిన మార్షియ ఆనే జిలేప్సి చెప్పిన ప్రకారం , ఆ అయిదు సంవత్సరాల కాలం లో ఆమె తన చుట్టూ వున్న ప్రపంచాన్ని పరిశీలించడం నేర్చుకుంది. సాహిత్యం పట్ల, చదవడం పట్ల మక్కువ పెంచుకుంది. ఈ సమయంలోనే ఆమె తన జ్ఞాపక శక్తి అసాధారణంగా వృద్ది చేసుకోగలిగింది.

పదిహేను సంవత్సరాల వయసులో తల్లి అయ్యి , తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నంలో, ఆమె రకరకాల వృత్తులు చేపట్టింది.కేబుల్ కార్ కండక్టర్ గా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కుక్ గాను, ప్రాస్టిట్యూట్ గా, నైట్ క్లబ్ డాన్సర్గా, సంగీత నాటకాల్లో వేషధారిగా పనిచేసింది. ఆమె తన జీవితం గురించి ఇలా చెప్పింది “పరిస్థితులకు తల వోగ్గడం మినహావేరే అవకాశం లేనప్పుడు, ప్రవాహానికి ఎదురు ఈది పోరాడడం ఎంత గౌరప్రదమైనదో, తలవొంచి భరించడం కూడా అంతే గౌరవించ తగినది. పదిహేనేళ్ళ వయసులో జీవితం నుంచి నేను నేర్చిన పాఠం ఇది.”

“మనుషులంతా వేరువేరు అనుకుంటారు కానీ, మనమంతా ఒకటే! అందరమూ ఆ భగవంతుని చేత సృష్టించబడ్డ వారమే . ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకత అనేది వుంటుంది. నీలో వున్న సృజనాత్మకత పెంపొందించుకో” అని చెప్పిన మాయా ఎంజలో అసలు పేరు మార్గరెట్ అనీ జాన్సన్. ఈమె 1928 ఏప్రిల్ నెల 4వ తేదిన బైలీ జాన్సన్ అనే నావీ డైటిషియనుకు, వివియన్ జాన్సన్ అనే నర్సుకు సెయింట్ లూయిస్ లో రెండవ సంతానంగా జన్మించింది. ఆమె అన్నయ్య బైలీ జూనియర్ ఆమెను మాయ ( నా చెల్లెలు అనే అర్ధంలో) ముద్దు పేరుతో పిలిచే వాడు. చివరకు ఆమెకు ఆ పేరే స్థిర పడింది.

ఆమె తన 13వ ఏటనే ఉపన్యాసాలు చెయ్యడంమొదలు పెట్టింది. మాయ సివిల్ రైట్స్ ఉద్యమాలలో జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్, మాల్కం x మొదలగు వారితో కలిసి చురుకుగా పనిచేసింది. ఆమెకు అందిన గౌరవాలు, అవార్డులు లెక్కకు మించినవి. మార్టిన్ లూథర్ కింగ్ ఆహ్వానం మేరకు 1959 లో దక్షిణాది క్రిస్టియన్ దేశాల కాన్ఫరెన్స్ కు సంధానకర్తగా పని చేసింది. 1961 లో ఆమె సౌత్ ఆఫ్రికా ఫ్రీడమ్ ఫైటర్ వుసుంజి మెక్ ను కలుసుకుంది. అతనితో కైరో వెళ్ళిపోయింది. 1961-62 సంవత్సరాల మధ్య ఆమె కైరోలో ఆరబ్ ఓబ్జర్వర్ పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గాను, 1964 నుంచి 1966 వరకు ఘనాలో ఆఫ్రికన్ అబ్జర్వర్ కు ఫీచర్ ఎడిటర్ గా పనిచేసింది. ఆ తర్వాత 1974 లో ఆమె అమెరికా ప్రెసిడెంట్ జేరాల్డ్ ఫోర్డ్ ఆహ్వానాన్ని అందుకుని, అమెరికా వచ్చింది. బై సెంటినల్ కమిషనుకు పనిచేసింది. జిమ్మీ కార్టర్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు ఆమె కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ వుమన్ ఆఫ్ ది ఇయర్ కు నియమించబడింది. వేక్ ఫారెస్ట్ యునివర్సిటీ లో అధ్యాపక వృత్తి చేపట్టింది. 1982 లో అమెరికన్ స్టడీస్ సంబంధించి రేనాల్డ్స్ ప్రొఫెస్సర్ గా శాశ్వతంగా నియమింపబడిన మొదటి ప్రొఫెసర్ ఆమె.టీచింగ్ పట్ల మక్కువతో ఉపన్యాసకురాలిగా ఆమె 1990 లో తన అరవై రెండవ ఏట నుంచి ఎనభై ఏళ్ల వయసు వరకు అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు, సంవత్సరానికి 80 సార్లు ఉపన్యాసాల నిమిత్తం ప్రయాణాలు చేసేది.ఆమె హాలివుడ్ లో మొట్టమొదటి బ్లాక్ వుమన్ డైరెక్టర్. అనేక సినిమాలకు, టి,వి,,స్టేజ్ నాటకాలకు,కధలు, పాటలు, స్క్రీన్ ప్లే లు రాశారు. ట్వంటిఎత్ సెంచరీ ఫాక్స్ కంపెనీకి రైటర్ ప్రోడుసర్ గా పనిచేస్తూ అనేక టి.వి.నాటకాలకు స్క్రిప్ట్ రాశారు. వాటిలో “సిస్టర్,సిస్టర్” అనే ఫీచర్ ఫైల్ముకు విమర్శకుల అభినందనలు అందుకుంది. 1971 వ సంవత్సరంలో “జార్జియా,జార్జియా” సినిమాకు స్క్రీన్ ప్లే రాసి, మ్యూజిక్ అందించింది . “త్రీ వే చాయిస్” అనే ఒక 5 భాగాల సీరియల్ టి.వి.నాటకాన్నీ రాయడమే కాకుండా ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యుసర్ గా పని చేసింది. అనేకఅవార్డులు పొందిన డాక్యుమెంటరీలను రచించి నిర్మిచారు. వాటిలో పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్విస్ అనే చానెల్ కోసం రచించి నిర్మిచిన “ఆఫ్రొఅమెరికన్స్ ఇన్ ది ఆర్ట్స్ “ అనే నాటకానికి గోల్డెన్ యిగిల్ అవార్డు వచ్చింది. 1973 లో బ్రాడ్వే థియేటర్లో ఆమె నటించిన “లుక్ అవే” అనే నాటకంలో మొదటిసారిగా నటించినందుకు, , 1977 లో రూట్స్ అనే నాటకం లో ఆమె నటనకు “టాని అవార్డు “కు నామినేట్ చెయ్యబడింది.

ప్రేమ గురించి ఆమె “మనిషిలో అంతర్గతంగా ప్రేమ అనేది చాలా బలమైన భావన. అది నన్ను నిత్యం బతికించే గొప్ప ఆలంబన. అంతకంటే ఎక్కువగా నిరంతరం సాధించాలన్న తపనతో, దయాగుణంతో, నాదైన శైలితో నడిపిస్తోంది” అని చెప్పారు. అందుకు తగ్గట్టు గానే,1951 లో ఆమె గ్రీక్ ఎలక్ట్రీషియన్, నావికుడు, సంగీతం అంటే అభిమానం వున్న తోష్ ఎన్జేలోస్ అనే అతన్ని వివాహం చేసుకుంది. అప్పట్లో జాత్యన్తర వివాహాలకు సమాజంలో గుర్తింపు లేదు. అంతే కాదు ఈ వివాహానికి ఎంజేలో తల్లి కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆమె ఆల్విన్ ఐలెయ్, రుదర్ బేక్ఫోర్డ్ లతో కలిసి డాన్స్ టీం ఏర్పరుచుకుని శాన్ఫ్రాన్సిస్కో అంతటా డాన్స్ ప్రోగ్రాం లు ఇచ్చింది కానీ ,అవి విజయవంతం కాలేదు. ఆ తర్వాత ఆమె తన భర్త తో, పిల్లవాడితో న్యూ యార్క్ సిటీకి వెళ్ళిపోయింది. అక్కడ ఆఫ్రికన్ డాన్స్ నేర్చుకుంది. 1954 లో ఆమె వివాహ బంధం తెగిపోయాక, ఆమె ఒక్కతే డాన్స్ ప్రోగ్రాంలు ఇస్తూ వచ్చింది. నైట్ క్లబ్బు లలో కూడా డాన్స్ చేస్తూ వచ్చింది. తిరిగి ఆమె 1973లో వెల్ష్ కార్పెంటర్ పాల్ డి ఫెన్ అనే అతన్ని శాన్ఫ్రాన్సిస్కో లో వివాహం చేసుకుంది.

ఆమె స్వీయ చరిత్ర రచనలు “ మామ్ & మీ &మామ్”(20 13) , “లెటర్ టు మై డాటర్ (2008)” , “ఆల్ గాడ్స్ చిల్డ్రన్ నీడ్ ట్రావెలింగ్ షూస్(1986)”, “ది హార్ట్ ఆఫ్ ఏ వుమన్(1981 )”, “సింగింగ్ అండ్ స్వింగింగ్ అండ్ గెట్టింగ్ మెర్రి లైక్ క్రిస్మస్(1976)”, “గేదర్ టుగెదర్ ఇన్ మైనేం (1974), “ ఐ నో వై ది కేజ్డు బర్డ్ సింగ్స్ (1969 )”. ఆమె మొదటి రచన “ ఐ నో వై ది కేజ్డు బర్డ్ సింగ్స్” అనే పుస్తకం సుమారు 17 సంవత్సరాల వయసు వరకు ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు వివరించింది. తన అనుభవాలు నిర్భయంగా వెల్లడి చేసిన ఆమె ధైర్యానికి అనేక ప్రసంశలతో పాటు , గొప్ప పేరు సంపాదించింది. ఈ పుస్తకానికి నేషనల్ బుక్ అవార్డు లభించింది.

మాయ ఎంజేలో స్వీయచరిత్ర చరిత్ర పుస్తకాలు రాయక ముందు నుంచే కవిత్వం రాస్తుండేది. ఆమెను బ్లాక్ వుమన్ లారియేట్ అని పిలిచేవారు. ఆమె రాసిన కవిత్వం రచనలు “జస్ట్ గివ్ మీ ఏ కూల్ డ్రింక్ ఆఫ్ వాటర్ బిఫోర్ ఐ డై”(1971),(ఈ రచనకు ఆమె పేరు పులిట్జర్ అవార్డుకు నామినేట్ చేయబడింది) “ఓహ్, ప్రే మై వింగ్స్ ఆర్ గోయింగ్ టు ఫిట్ మీ వెల్” (1975), “అండ్ స్టిల్ ఐ రైజ్” (1976), “షేకర్ వై డోంట్ యు సింగ్”(1983), “లైఫ్ డజంట్ ఫ్రైటెన్ మీ” (1993), “సౌల్ లుక్స్ బాక్ ఇన్ వండర్”(1994), “ఐ షల్ నాట్ బి మువ్డు” (1997) ఇక ఆమెకు లభించిన అవార్డులు,రివార్డులు, గౌరవాలు లెక్కలేనన్ని. యాభై యూనివర్సిటీలకు పైగా ఆమెకు గౌరవ డిగ్రీలు ప్రదానం చేసి తమను తాము గౌరవించు కున్నాయి. పైన వివరించినవికాక,

ఆమె అందుకున్న అనేక అవార్డులలో మచ్చుకు కొన్ని చూడండి:
1971లో చిన్న పిల్లలకు, యువతీయువకుల కొరకు రచనలు చేసిన ఆఫ్రో అమెరికన్ రచయితకు ఇచ్చే కోరెట్ట స్కాట్ కింగ్ గౌరవ పురస్కారం,
1975 -76 లో అమెరికన్ రెవల్యూషన్ బై సెంటినల్ కౌన్సిల్ కు ఆమెను ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ నియమించారు.
1976 వుమన్ ఆఫ్ ధీ ఇయర్ అవార్డు ఫర్ కమ్యూనికేషన్ లేడీస్ హౌస్ జర్నల్ వారిచే ప్రదానం.
1977 లో ఇంటర్నేషనల్ వుమన్స్ ఇయర్ సందర్భంగా ప్రెసిడెన్శియల్ కమిషన్ కు ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నామినేట్ చేశారు.
1990లో అకాడెమి అఫ్ అచీవ్మెంట్ వారిచే గోల్డెన్ ప్లేట్ అవార్డు
1993లో ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ప్రారంభోత్సవ సమయంలో “ఆన్ ది పల్స్ అఫ్ ది మార్నింగ్” అనే కవిత చదివిన సందర్భంలో గ్రామీ అవార్డు ఫర్ బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బం
1993 లో ఆర్కాన్సాస్ నేటివ్స్ కు ఇచ్చే ఆర్కాన్సాస్ బ్లాక్ హాల్ ఆఫ్ ఫేం
1996 లో యునిసెఫ్ వారిచే అమెరికన్ అంబాసిడర్ గా నియామకం.
1997 సినిమా, టి.వి., సంగీత,సాహిత్య రంగాలలో చేసిన కృషికి సివిల్ రైట్స్ సంస్థ NAACP వారిచ్చే ఇమేజ్ అవార్డు
1998 లో ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ సెంటర్ మరియు మ్యూజియం వారిచే అల్ స్టన్ జోన్స్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ అవార్డు
1999లో డౌన్ ఇన్ డెల్టా అనే సినిమా డైరెక్షన్ కు గాను క్రిస్టోఫర్ అవార్డు
1999 ప్రతిభావంతురాలైన నల్లజాతియురాలికి టబ్మన్ ఆఫ్రికన్ మ్యూజియం వారు ప్రతి ఏడు ఇచ్చే షెలియ అవార్డు
2000 లో నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్
2002 వేల్స్ లో ప్రతి సంవత్సరం సాహిత్యం, కళా రంగాలలో నిర్వహించే “హె ఫెస్టివల్”లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
2008 లో ఫోర్డ్స్ థియేటర్ వారి చే లింకన్ మెడల్
2009 లో బ్లాక్ కాకస్ అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారిచే ఫిక్షన్ రచన రంగంలో అసాధారణ ప్రతిభ కల ఆఫ్రికన్ అమెరికన్లకు ఇచ్చే సాహిత్య పురస్కారం
2010 లో ప్రెసిడెంట్ ఒబామా నుండి ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు
2012 లో ఎలాన్ యూనివర్సిటీ వారిచే బ్లాక్ కల్చరల్ సొసైటీ అవార్డు
2013 లో నేషనల్ బుక్ ఫౌండేషన్ వారు ఇచ్చే లిటేరెరియన్ అవార్డు
అదే సంవత్సరంలో నార్మన్ మైలర్ సెంటర్ మరియు నార్మన్ మైలర్ రైటర్స్ కాలనీ వారు ఇచ్చే నార్మన్ మైలర్ ప్రైజ్ (లైఫ్ టైం అచివేమేంట్ అవార్డు).

ఎవరైనా కవయిత్రులు కావచ్చు. ఉపాధ్యాయులు కావచ్చు. సంగీతకారులు, డాన్సర్లు కావచ్చు.నాటక రచయితలు, నిర్మాతలు, నటులు కూడా అవ వచ్చు, జర్నలిస్టులు కావచ్చు. వెనకబడిన సామాజిక వర్గం వారి కోసం అహరహం పాటుబడే నిస్వార్ధ నేతగా పేరు పొంద వచ్చు. మానవ హక్కుల గురించి పోరాడుతూ సమాజాన్ని తట్టి లేపే అద్భుత వ్యక్తి కావచ్చు. ఏ విషయాన్నైనా పాజిటివ్ దృక్కోణం నుంచి చూడగల ఆలోచనపరులూ కావచ్చు.ఇన్ని గొప్ప లక్షణాలు ప్రోదిచేసుకోని చైతన్యం మూర్తిభవించిన మాయ ఎంజేలో సమకాలీన ప్రపంచంలోఅద్భుత వ్యక్తి. ఆమె ఈ సంవత్సరం మే నెల 28వ తారికున 86 ఏళ్ల వయసులో విన్స్టన్ సేలం , నార్త్ కరోలినలో మరణించింది.మానవ హక్కుల కోసం నిరంతరం శ్రమించిన ఆమె గొప్ప మానవతా వాది. ఉన్నది వున్నట్లు చెప్పగల ధీమంతురాలు. ఆమె గురించి ఎంత చెప్పినా ఇంకా ఎక్కడో ఏదో మిగిలిపోయిందనే భావన మిగిల్చే, ఆమె జీవితం మానవాళికి స్ఫూర్తి దాయకం.

—-  టి.వి.ఎస్. రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to నల్ల జాతి చరిత్ర లో నిలిచిపోయే నక్షత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో