విజయం సాధించడానికి శారీరక బలం కంటే మానసిక బలమే ముఖ్యమని . ఆ మానసిక శక్తికి వర్ణ ,వర్గ బలాలు అక్కర్లేదని నిరూపించారు ఇద్దరు చిన్నారులు . పట్టుమని 1 4 సంవత్సరాలు కూడా నిండని మాలా వత్ పూర్ణ .ఆనంద్.
పూర్ణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి . ఆమెతో పాటు పర్వతారోహణ చేసిన ఆనంద్ కూడా ఆ కోవకు చెందినవాడే . I p s ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో వీరిద్దరు అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ ఎక్కిన తెలుగు వారు కావటం తెలుగు వారికి గర్వ కారణం .
రాజమండ్రి హెల్పింగ్ హేండ్ సేవా సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ ఇద్దరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు . ఆ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ “ తన తల్లి దండ్రులు తనకి స్ఫూర్తిగా నిలిచారని ధైర్యంగా సాహస యాత్రకి ప్రోత్సహించారని చెప్పింది . వీరి కృషి వెనక కేవలం వీరి పట్టుదల మాత్రమే కాదు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు , శిక్షణ ఇచ్చిన గురువుల కృషి ఎంతో ఉంది .
ఎవరెస్ట్ ఎక్కడానికి అర్హత పొందటానికి డార్జిలింగ్ లో శిక్షణ పొందిన కాలంలోనే కాంచన గంగ , మౌంట్ అశోక శిఖరాలను అధిరోహించారు . ఆక్సిజన్ లభించని మంచు పర్వతాలపై ఏ క్షణం లో కాలు జారితే ఏ లోయలో పడిపోతామో అనే భయాల్ని మానసిక బలంతో గెలిచాం అని చెప్పింది . అంతేకాకుండా కొందరు పర్వతారోహకుల శవాల మధ్యగా నడుచుకుంటూ వెళ్లాం అని తన అనుభవాలను వివరించింది . హిమాలయాల గురించి చదువుకోవడమే తప్ప , కలలో కూడా ఎక్కగలమని ఊహించలేదని , ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత తనకి ప్రపంచం అంతా చాలా చిన్నదిగా కనిపించిందని చెప్పింది పూర్ణ .
పూర్ణతో పాటు ఈ విజయాన్ని సాధించిన ఆనంద్ , తనతో పాటు డా .బి.ఆర్ అంబేద్కర్ , ఐఏఎస్ అధికారి శంకర్ గారి ఫోటోలను కూడా తీసుకు వెళ్లారు . అంబేద్కర్ , భారత రాజ్యాంగం రాసి తన జ్ఞానాన్ని చాటుకొన్నాడు . ఇప్పుడు దళితులు కూడా ఎందులోను తీసిపోరని అన్నాడు . I p s కావడమే తమ లక్ష్యమని ఈ ఇరువురు చెప్పారు .
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటి సెక్రటరి R .S ప్రవీణ్ కుమార్ I p s వారి వెన్నంటే ఉండి కావాల్సిన సదుపాయాల్ని కల్పిస్తూ ఈ కార్యక్రమానికి సహకారం చేశారు ..
EPDCA , A D E నక్క పల్లి శామ్యూల్ , S E గంగాధర్ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఔత్సాహిక సివిల్ అభ్యర్ధులకు స్ఫూర్తి దాయక కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్య క్రమంలో సివిల్ లో ఎన్నికైన విజేతలందరూ తమ తమ అనుభవాలను తెలియజేశారు .
I A S అధికారి రవిచంద్ర , IRTS భరత్ భూషణ్ లు అభ్యర్ధులను ఉద్దేశించి స్ఫూర్తి దాయక ప్రసంగాలు చేసారు .
సివిల్స్ ప్రిపేర్ కావడానికి కఠిన మైన పరిశ్రమ చేయాల్సి ఉంటుందని అందరూ భయపడతారు , కాని I A S కావాలనే లక్ష్యం మనసులో ఉంటె దేనినైనా సాధించగలమని సివిల్స్All india 24 8 వ ర్యాంకు సాధించిన అల శశాంక చెప్పింది . మరొక మహిళా విజేత గంధపునేని రవళి ప్రియ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి చదువులో ఎవరేజ్ గానే ఉండే దానినని, కాని టాపర్ గా నిలిచిన ఎంతో మంది ని ఆదర్శంగా తీసుకుని కృషి , పట్టుదల , ఏకాగ్రతలను ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్తే అన్ని సులువుగానే అర్ధమవుతాయని 161 ర్యాంకు సాధించానని చెప్పింది . 2011 లో 11వ రాంక్ సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ హెప్సిబా ఔత్సాహికులకు స్ఫూర్తి దాయక సందేశాన్ని అందించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నక్కపల్లి సామ్యుల్ , గంగాధర్ , భరత్ భూషణ్ గారిని చైర్ పర్సన్ ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ గారిని పలువురు ప్రశంసించారు.
ఐఏఎస్ అధికారి శంకర్ గారు, ప్రవీణ్ కుమార్ లాంటి ఆఫీసర్ ప్రతి సంస్థలోను ఉంటే తెలుగు విద్యార్ధుల స్థాయి ఎవరెస్ట్ శిఖరాన నిలుస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.
హేమలత పుట్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~