చేరాగాలు

 

ఎండ్లూరి సుధాకర్

చావంటే ఏమిటో

చెప్పాడోయ్ చేరా

నలుగురితో కలిసిపోతే

కలకాలం మంచేరా !

***        ***          ***

తెలుగుపాల కడలి మీద

భాషా పర శేష భోగి

తెలంగాణ మట్టి మీద

పుట్టినట్టి యోగి

***        ***          ***

చేరాతలు తలరాతలు

మార్చేశాయ్ కవులకు

కుండలాలు వెలిశాయి

కొత్త తరం చెవులకు

***        ***          ***

ఆ తర్కం అపురూపం

అది శర్కర పాకం

తన వాదన తన శోధన

తనదే ఒక రస లోకం

***        ***          ***

మృతి చెందిన మిత్రులకు

అంకితమే ‘స్మృతి కిణాంకం ‘

ఆయనపై పెరుగుతోంది

అభిమానుల గణాంకం

***        ***          ***

తెలుగు భాష పలక మీద

చెరిగిపోని సంతకం

మహనీయుడు మన చేరా

మరుపు రాని జ్ఞాపకం

–   ఎండ్లూరి సుధాకర్

9246650771

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

కవితలు, , , , , Permalink

One Response to చేరాగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో