మహిళలే మహామహులు

                 మా కార్యాలయానికి ఆఫీసర్ గా  బదిలీ మీదవచ్చారు గోపాల్రావుగారు..  చాలా  సాదా సీదా మనిషిలా  ఉన్నారు.సింపుల్  డ్రెస్, నవ్వు ముఖం , తమ ఇంటి సామానంతా ఒక్క ఆటోలో తెచ్చుకున్నారు  భార్యా భర్తలిద్దరూనూ..మిగతాదంతా బహుశా లారీలో ఒక వారం  పది రోజుల్లోవస్తుందేమో! నేనే  దగ్గరుండి ఆ కాస్తా సర్దించాను మా  ఆఫీసుపని వారితోనే!  దానికీ ఆయన కూలీ డబ్బు కూడా ముట్ట జెప్పారు. వింత మనిషిలా ఉన్నారు! ఆఫీసు  పని విషయంలో ఎ లా ఉంటాడో ఇంకా అవగాహన కాలేదు. వచ్చి వారమే  ! ఈ ఆఫీసర్లంతా  ఒక పట్టాన అర్ధం కారు. లోతు మనుషులు ! ఎందుకైనా మంచిదని  వీరితో మంచిగా ఉండనే  స్టాఫ్  అంతా ప్రయత్నిస్తారు .  వారిలో నేనూ నూ, అదీనీ అగ్ర స్థానం లోనే సుమండీ! .

ఆ రోజు సాయం కాలం మా బావమరది  తన కొత్త కారులోమా కార్యాలయానికివచ్చి “రాబావా! నా కొత్త కారుకు ,ఆలయానికి వెళ్ళిపూజ చేయించుకుని అలా అలా తిరిగొద్దాం ”  అంటూ  పిలిచాడు. నాకు తెల్సు ఏ పెద్ద పార్టీ  దగ్గరో  కొట్టేసిన దాంతో కొని ఉంటాడని, మేమంతా ఒకే చెట్టుకాయలం కదా! వాడో పెద్ద సివిలింజనీర్.

నేను నేరుగా మా కొత్త  ఆఫీసర్ ఛాంబర్ కెళ్ళి , వినయంగా నమస్కరించి , ”  సార్! మాబామ్మర్ది కొత్త కారు కొనుక్కున్నాడు సార్!  ఆలయాని కెళ్ళి పూజ చేయించను నన్నూ  రమ్మంటున్నాడు సార్! ఇప్పుడు శుభముహూర్తంట! కా స్త ఓ గంట పర్మిషన్  ఇస్తే , తిరిగి వచ్చేస్తాను సార్!” అన్నాను.

” చూడండి ! చంద్రశేఖర్  గారూ! నాకుఊరు కొత్త , మీ సాయం కావాలి. ఏమనుకో కండి , మాఇంటి వాళ్ళకు గోల్డ్ షాపులో చిన్న పని పడిందిట !….” మా ఆఫీసర్ మాటలు  పూర్తి కాకుండానే ” ఓ యస్సార్! దాందే ముందీ సార్ ! తప్పకుండానూ, అందునా మా బామ్మర్ది  కారూ ఉంది. మీరెప్పుడు వెళదా మంటే అప్పుడే వెళదాం , మీ పని కంటే ముఖ్యమైందే ముంది సార్  !” అంటూ కాస్తంత పెరుగు, అదే నండీ ‘ దధి ‘ , ‘ తైర్ ‘ కొట్టి ధైర్యంగా నిలబడ్డాను, పోజేసి.

” ముందు మా ఇంట్లో ఒక మాట  చెప్పి,…….”

” దాందే ముంది సార్ ! మీరు ఒక ఫోన్  చేయండి ! అలా మనం ఇంటి కెళ్ళి  మేడంగార్ని కార్లో ఎక్కించు కెళదాం ” అని పూర్తి  చేశాను.

” అది కాదయ్యా! ముందు …” కాస్తంత  సంశయిస్తున్న మా ఆఫీసర్ గారిని , వచ్చిన అవకాశం వదులుకునే  మనస్తత్వం లేని నేను   ……

” మీరుండండి  సార్ ! ఏదీ మేడం గారి ఫోన్ నెం. చెప్పండి ” అంటూ నా ఇంపోర్టెడ్ ఫోన్ బయటికి తీశాను. అది కొంత రహస్యం లెండి , ఒక కస్టమర్కు మంచి సహాయం చేయగా  అతగాడు తన కొడుకు ద్వారా తెప్పించి ఇచ్చిన  ఫారిన్  ఫోన్  అది . దాన్ని కొన్ని సమయాల్లో మాత్రమే బయటికి తీస్తాను.

” చంద్రశేఖర్ గారూ!మీరు మీ సీట్  కెళ్ళండి, నేను మా మిసెస్ తో మాట్లాడి మీకు చెప్తాను . ఆఫీస్ అవర్స్ అయ్యాక  వెళదాం . సరా!” అంటూ  ఫైల్స్ లో  తల దూర్చేశాడు..

ఇహ  తప్పని సరై  బయటి కొచ్చాను . సీట్లో కూర్చో కుండానే  ఆయన ఛాంబర్ ముందు తట్టాడ సాగాను. ఆఫీస్ టై మయ్యాక ఆయన  బయటికి వచ్చి ” రండి చంద్రశేఖర్ గారూ ! వెళదాం ” అంటూ వచ్చారు.

మహా  మొహ మాటస్తునిలా  ఉన్నాడు మా కొత్తాఫీససర్  గోపాల్రావుగారు  .ఈ  దెబ్బ  తో ఈయన్ని బుట్టలో వేసుకుని ఎంతో  కాలంగా వెనక్కు  పోతున్న ప్రొమోషన్ కొట్టేయాలని నా సంకల్పానికి బలంగా ఊపిరి పోసుకుంటూ ….  ,.

” పదండి సార్ ! ఇంకా ఆలస్య మెందుకూ ! మేడం గారు తయారుగా ఉండే ఉంటారుగా !!” అంటూ ఆయన్ని మరి మాట్లాడ  నివ్వకుండా , మా బామ్మర్ది చెవిలో ‘ కాస్తంత  సర్దుకోరా! పూజ మళ్ళా జరి పించు కుందాం లే ఆతర్వాత ‘ అని  గుసగుసలాడి,  ” రండి  సార్! ఇది మా బామ్మర్ది కొత్త కారు సార్! మీరూ , మేడం గారూ  ముందుగా ఎక్కడం  పార్వతీ  పరమేశ్వరులు   ఎక్కినట్లే సార్ ! ఏరా!” అంటూ మా బామ్మర్దిని  మోచేత్తో  పొడుస్తూ , మా  ఆఫీసర్  గారిని  చేయి పట్టుకుని కారెక్కించ  బోయాను.

ఆయన చేయి నాకు అంద కుండా పక్కకు తీసుకుని  ఒక ఆటో పిలిచి దాన్లో ఎక్కి , ” చంద్ర శేఖర్ గారూ!  మేము  ఆటోలో వస్తాం, మీరు మీ కొత్త కారు లోరండి”  అంటూ “బాబూ ! ఆటో పోనీ..” అంటూ అడ్రెస్ చెప్పారు.

మా బామ్మర్ది  నా వేపు గుర్రుగా చూస్తూ ,  ముఖానికి కాస్తంత నవ్వు మాస్క్ తొడు క్కుని,మా ఆఫీసర్ గారి వైపు చూసి, కారు తోల సాగాడు.

వాళ్ళింటి  కెళ్ళాక , ఆయన  లోపలి కెళ్ళి మేడం గారిని పిలిచుకు వచ్చి ఆటో ఎక్కారు.  నేను ఉండ బట్ట లేక ” మేడం కారెక్కండి” అన్నాను.

ఆవిడా ” ఎందుకుబాబూ! సారూ, నేనూ ఈ ఆటోలో వస్తాంగా ! మిమ్మల్ని ఫాలో అవుతాం.”  అన్నారు  చిఱు నవ్వుతో.

బాబోయ్  ఇద్దరి కిద్దరూ  ఘటికుల్లా ఉన్నారు.  నా తైర్లో పడేలా లేరు, నాకు  ప్రెమోషన్  వస్తుందో, ‘మోషన్ ‘ వస్తుందోని  ఆందోళనగా  మా బామ్మర్దిని , ” పోనీవోయ్” అన్నాను  కోపంగా,  అత్త మీది కోపం దుత్త మీద చూపినట్లు. ‘సాధారణంగా  ఈ ఆఫీసర్సంతా  మేడంస్ ద్వారా నే మాలాంటి వాళ్ళ బుట్టల్లో  పడతారు  , నేనూ ఉద్యోగంలో చేరిన కొత్తల్లో మహా మహ నీయునిలా పరమ నిజాయితీగా ఉండేవాడ్ని, మా ఆవిడ ద్వారా నన్ను తైర్  లో వేసేసి ఇలా చేశారు  కష్టమర్లు. అదంతా పాత కధ లెండి. ఇప్పుడీవిడేంటీ  డిఫరెంట్  గా ఉన్నట్లుంది . కొంప దీసి ఆటైప్ కాదు గదా! అలాగైతే నా వేడి వేడి ఆశ ఫౌంటెన్  క్రింది కెళ్ళి నట్లే ‘ అనుకుంటూ కదిలాను.

ఊర్లోకల్లా  పెద్ద గోల్డ్  షాపైన ‘ కృష్టయ్య సెట్టి అండ్ సన్స్ గోల్డ్  షాప్ ‘ వైపు కారుని  కసి కసిగా తోల సాగాడు మా వాడు. వాడూనూ  వాళ్ళావిడ  కోర్కె మేరకు కష్టమర్లు మొదట మొదట ఆషాపుకేగా తీసుకెళ్ళింది ,  అందుకే వాడికి తెల్సు ఎక్కడి కెళ్ళాలో.  వాడిప్లానంతా చెడ గొట్టానని వాడి కసి, నన్ను మసి చేలా మధ్య మధ్య చూస్తూ  షాపు ముందు కారాపాడు.

గోల్డ్ షాప్ రాగానే ముందుగా నేను లోపలికి పరుగు లాంటి నడక తో వెళ్ళి ‘ మా ఆఫీసర్ రాక గురించీ ,ఆయన తో మంచిగా ఉండాల్సిన  ఆవస్యకత గురించీ, ఫ్యూచర్ లో ఆయనతో వారికి పడే పని గురించీ గోరంతలు కొండంతలు చేసి  గబగబా గుక్కతిప్పుకోకుండా షాపు యాజమాన్యానికి వివరించి వచ్చాను.

ఆఫీసర్ గారిని, మేడం గారిని , తీసుకుని యస్కార్ట్ గా నడుస్తూ లోపల అడుగు పెట్టాం. యాజ మాన్యం  అంతా అలర్టై ఎదురు వచ్చారు.. ముందుగా అందరికీ కాఫీ  సర్వ్ చేశారు.

“రండిసార్ ! మా గోల్డ్ షాప్ చూద్దరు  గాని, మీవంటి వారు మా షాపులో అడుగు  పెట్టడమే  మా అదృష్టం. “అంటూ ఎంతో మర్యాదగా లోపలికి ఆహ్వానించారు . ముందు గా బంగారు హారాలు, నెక్లెస్సు లూ, ఉన్న షోకేసుల  వైపు దారి తీశారు. వాటి ధరల పట్టీలు చూసి, మామేడం గారు , సార్ గారి వైపు చూడ్డం, ఆయన ఏదో సంకేతం గా తల ఊచడం  నేను గమనించక పోలేదు.

సేల్స్ గాళ్స్  ” మేడం ఇది రీసెంట్ డిజైన్ , మూడు పేటల చైన్ , ఒక్కో పేటా ఒక్కో డిజైన్ , ఒక్కటి వేసు కుంటే చాలు మెడ నిండా ఉంటుంది , పెళ్ళిళ్ళలో, ఫంగ్షన్స్ లో అంతా మీ వైపే చూస్తారు, చాలా గ్రాండ్ గా  కనిపిస్తుంది. ఈ నక్లెస్ చూడండి  మేడం  పాతడి  జైన్ కు కొత్త మెరుపు లాగా మామిడి పిందెల మధ్యలో ఆకులూ , తీగలూ జోడించారు. అంతా  ఆశ్చర్యంగా చూస్తారు  మేడం! ఈ రవ్వల నెక్లెస్ చూడండీ ! కొత్తగా వచ్చిన మోడల్ ముందుగా మన షాపుకే వచ్చింది. మొదటి సేల్ మీకే మేడం! కొంత మార్జిన్ కూడా ఇస్తారు  మా ఓనర్ !  ఇలారండి ఈ గాజులు చూడండి మేడం, రెండు వేసు కుంటే చాలు, మా అమ్మమ్మ రోజుల్లో  ‘మిరియపు గాజు’ లని వచ్చేవి, అవి మళ్ళీ ఇదే రావటం! ఈ సెట్ చూడండి మేడం ! చెవి దిద్దులు, గాజులూ, నెక్లెస్ , రింగ్,  పల్లూకు  పిన్ ,అన్నీ మ్యాచింగ్ మేడం! సార్ మేడం గారి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వండి  చాలా రీసెంట్ డిజైన్ సార్! ఎంత యాభై లక్షలే సార్! ”       ఆరేటు మాట వినగానే మా మేడం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండి పోయారు. పాపం నడచి నడచి అలసి పోయారని నేను గబగబా కూల్  డ్రింక్స్ తెమ్మని ఆర్డ్ రేశాను.

సేల్స్ గాళ్స్ ‘ ఇది నచ్చినట్లుంది , మేడం ఇక్కడే  కూర్చుండి పోయారు.’ అనుకుని  అన్నీ బయ టకు తీసి వాటి నాణ్యతా , వాటికి పొదిగి న రాళ్ళ  పొందిక అంద చందాలు వివరించ సాగారు.

‘నిజానికి మా  మేడం చాలా అందంగా గులాబి రంగు లిల్లీ పువ్వులా  ఉంటారు, అందం  నాజూకూ ఆమె సొత్తే ! ఆమెకు ఈ సెట్ చాలా బావుంటుంది.  అసలు  బంగారమే ఈమె ముందు దిగ తుడుపు.’ అనుకోండి.  వెంటనే మా ఆవిడ గుర్తొచ్చింది . నల్ల రోటికి రంగేసి నట్లుంటుంది,  ఆమె  ఏచీర కట్టు కున్నా, ఏ నగలు పెట్టుకున్నా!  .

మేడం కూల్ డ్రింక్ త్రాగాక , ” అటు వెళదామయ్యా!” అంటూ మా ఆఫీసర్ గారు లేచారు . సేల్స్ గాళ్స్ అనుస రించారు.  ఒక్కో బంగారు నగా, వివరించడం పూర్తయ్యాక  వెండి సామానువైపు సాగారు. సేల్స్ బాయ్స్ కూడా వాటిని , వర్ణిస్తూ గాళ్స్ కేమీ తీసి పోకుండానూ.

” సార్ ఈ వెండి కుందులు చూడండి! ఈ వెండి పూజా పీఠం, పూజకు  పూర్తిగా అవసరమైన అన్ని వస్తువులూ  ఒకే సెట్ సార్! ధర కూడ పెద్ద ఎక్కువేం కాదు , మిగిలిన షాపులకంటే చాలాతక్కువ మీ కైతే ఇంకా  కమ్మీ సార్! ఎనభై వేలే!”

మా ఆఫీసర్ గారు గబ గబా ముందుకు సాగారు. మేడం తో పాటుగా మేమూ అనుసరించాం. మేడం అందరి కంటే ముందుకు సాగి అక్కడ వున్న చిన్న షోకేస్ ముందు  నిలబడ్డారు . ఆమె అక్కడి ఉన్న సేల్స్ గాళ్ వైపుచూసి ” ఆ చెవి దుద్దు వెండి  సీలలు చూపమ్మా!” అంది.

సేల్స్ గాళ్ చెవి దుద్దు వెండి  సీల లన్నీ తీసి ఉంచి , మేడం వైపు వింతగా చూడ సాగింది. మేడం తన చేతిలో ఉన్న చిన్న గుడ్డ పర్స్ లోంచీ  చెవి దుద్దు తీసి “చూడమ్మా! ఈ దుద్దుకు సరిపోయే సీల తీసివ్వు. అలాగే ఈ విరిగిపోయిన  సీల ఎక్స్ ఛేంజ్ వెల కట్టి , ఇహ ఎంతివ్వా లో  చెప్పు.” అంది చిరు నవ్వుతో.    సేల్స్ గాళ్  అలాగే చేసి, మేడం చేతి కిచ్చింది.

మేడం దాన్ని తీసుకుని పరీక్షించి , ” బిల్ ఇవ్వమ్మా! సార్ పే చేస్తారు . అన్నట్లు  ఇందాక మీ రిచ్చిన కాఫీ , కూల్ డ్రింక్ రేటు కూడా  బిల్ లో కలపడం  మరువకమ్మా! ” అంటూ దుద్దు తన పర్స్ లో వేసు కుని , అందమైన చిరునవ్వు  తో  భర్త వైపు చూసింది. ఆయనా అంతే చిరు నవ్వుతో  ,’పే కౌంటర్  ‘ వైపు  నడిచాడు , ఆబిల్ అందు కుని , వందా యాభై  రూ.పే చేసారు .  మేమంతా ఏమీ అర్ధం కాని ముఖా లతో వారి  వెంట నడిచాం. అప్పుడు  గమనించాను, మేడం చెపుల కున్న దుద్దుల్ని, అవి గిల్టువి ! అంటే దుద్దు వెండి ’ సీల’ పోతే మార్చుకుని అందాకా  గిల్టువి పెట్టు కున్నా రన్నమాట ! బాబోయ్ ! నా ఊహ కంద నంత ఎత్తుగా ఉన్నారు వీరు ! .

” ఇహ వెళదామా !” అంటూ మా వైపు చూస్తూ ,” వస్తామండీ! చాలా థాంక్స్ ! ” అంటూ షాపు కు చెప్పి బయటికి నడిచాడు . అయో మయం  జగన్నాధం  పరిస్థితిలో  నేను, మా  బామ్మర్ది  వైపు , పద మన్నట్లు చూడగా, మాబామ్మర్ది నావైపు  అదోలా హాస్యమా, పరిహాసమా , హాసమా!  పాపం!’ అన్నట్లో చూస్తూ కారు తీసాడు.

ఈ లోగా మా ఆఫీసర్  గోపాల్రావు గారు తన శ్రీమతి తో ఆటో రిక్షా ఎక్కి గోల్డ్ షాపు నుంచీ  వెళ్ళే పోయారు. ‘  హా హతవిధీ ! నా కోరిక  కొండెక్కి నట్లే ఇహ. ఇలాంటి మేడంస్ అందరు ఆఫీసర్లకూ నా లాంటి మేమేజర్లకూ  ఉంటే లోకంలో ఇహ అన్యాయార్జితాలు, లంచ గొండి తనాలూ  అక్రమార్జితాలూ  ఉండనే ఉండవేమో ! ఏమైనా మహిళలే మహామహులు ‘ అను కోకుండా ఉండ లేక పోయాను. ‘ఎలాంటి వారినెలాగైనా మార్చగల మహామహులు మహిళలే సుమా ! అంటున్నది నా మనస్సు. మా మేండం కి మనస్సు లోనే నమస్కరించక పోతే  నేను నేనూ…మహా మూర్ఖుడ్న ను కోవలసిందే!

– ఆదూరి హైమవతి

`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలుPermalink

3 Responses to మహిళలే మహామహులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో