భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

Naseer Ahammad

Naseer Ahammad

మహిళా చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించిన బేగం షరీఫా హవిూద్‌ అలీ జాతీయోద్యమంలో రాజకీయ-సాంఘిక సంస్కరణలు సమాంతరంగా సాగాయి. ఆనాటి రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయిన ఉద్యమకారులు సామాజిక సంస్కరణల పోరులో భాగస్వాములయ్యారు. ఈ విధంగా రాజకీయోద్యమంలో పరోక్షంగా పాల్గొంటూ సంస్కరణోద్యమంలో పత్యక్షంగా కార్యాచరణకు దిగిన యోధులలో బేగం షరీఫా హవిూద్‌ అలీ ఒకరు. ప్రగతిశీల భావాలను స్వాగతించే కుటుంబంలో ఆమె జన్మించారు. ఉర్దూ, గుజరాతీ, ఆంగ్లం, సింధి, మరాఠి, ఫ్రెంచ్‌ భాషలను నేర్చుకున్నారు. చిత్రకళ, సంగీతంలో మంచి పట్టు సంపాదించారు. ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారి హవిూద్‌ అలీని ఆమె వివాహం చేసుకున్నారు. భర్త హవిూద్‌ అలీ ప్రోత్సాహంలో ఆమె భాషాపరమైన సామర్ధ్యాన్ని మరింత పెంచుకుంటూ, సంగీతం, కళా సాంస్కృతిక కార్యక్రమాలలో పూర్తికాలాన్ని వ్యయం చేస్తూ ఆయా రంగాల అభివృద్దికి కృషి ఆరంభించారు.

1907లో కలకత్తా నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె భాగస్వాములయ్యారు. ఆనాటి నుండి జాతీయోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్వదేశీ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. మహిళల సంక్షేమం, హరిజనుల అభివృద్ధి తదితర కార్యక్రమాల విూద షరీఫా హవిూద్‌ అలీ దృష్టిసారించి అధిక సమయాన్ని ఆ రంగాలలో వ్యయం చేశారు. మహిళలలో చైతన్యం కోసం, తల్లీ-బిడ్డలు తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తల ప్రచారం కోసం పలు కార్యక్రమాలను చేపట్టారు. గ్రావిూణ మహిళల సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక సలహాలు- సూచనలిచ్చి సమస్యల పరిష్కారానికి తోడ్పడ్డారు. మహిళలు తమ శక్తిసామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు వీలుగా వారి బిడ్డల బాగోగులు చూడడానికి నర్సరీలను ఏర్పాటు చేశారు. అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్‌లో సభ్యత్వం స్వీకరించి ఆ కాన్ఫెరెన్స్‌ శాఖలను పలు ప్రాంతాలలో ఏర్పరచి మహిళలను సంఘటిత పర్చారు. మహిళల వివాహవయస్సుకు సంబంధించి ఉనికిలోకి వచ్చిన శారదా చట్టం ప్రకారంగా మహిళల వివాహ అర్హత వయస్సును పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌కు అనుకూలంగా మహిళల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ముస్లిం మహిళలకు తగిన భద్రత ఇచ్చేలాగు ఆమె ప్రత్యేక నిఖానామా తయారు చేశారు. ఆ నిఖానామా ఈనాటికి పలు ప్రాంతాలలో అమలులో ఉంది.

1933లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హజరైన ముగ్గురు మహిళా ప్రతినిధుల బృందంలో సభ్యురాలుగా మహిళల స్థితిగతుల గురించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు ఆమె ఇంగ్లాండ్‌ వెళ్ళారు. పురుషులతోపాటుగా స్త్రీలకు సమాన ఓటింగ్‌ హక్కుల కోసం ఆమె తన వాదనను బలంగా విన్పించారు. 1937లో శాంతి, స్వేఛ్చ ప్రధానాంశాలుగా జెకస్లోవేకియాలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. 1940లో అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్‌కు ఉపాధ్యకక్షురాలిగా, ఆ తరువాత అధ్యకక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అఖిల భారత మహిళల విద్యాసంఘం గవర్నింగ్‌ బాడీ చైర్మన్‌గా మహిళా విద్యాభివృద్దికోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిం చారు. ఆమె సమాజసేవకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితిలోని మహిళలకు సంబంధించిన విభాగంలో భారతదేశ ప్రతినిధిగా నియుక్తురాలయ్యారు. భారతీయ మహిళల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా మహిళల హక్కుల పరిరక్షణకు ఆమె ఎంతో కృషి చేశారు

ప్రజల భవిష్యత్తు ప్రజలే నిర్ణయించుకోవాలని కోరిన బేగం అక్బర్‌ జెహాన్‌ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న మహిళలు తొలిథలో భర్తల ప్రోత్సాహంతో రంగ ప్రవేశం చేసినా ఆ తరువాత ఉద్యమబాటలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి తమ వ్యక్తిత్వాలను, సంపూర్ణ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించి చరిత్ర సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. బేగం హసరత్‌ మోహాని, కుల్సుం సయాని, సాదత్‌ బానో కిచ్లూ, షంషున్నీసా అన్సారి ఈ కోవలోకి వస్తారు. ఆ కోవకు చెందిన కశ్మీరి మహిళ బేగం అక్బర్‌ జెహాన్‌. అక్బర్‌ జెహాన్‌ 1916లో కశ్మీర్‌లోని గుజ్జర్‌ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి గుజ్జర్‌ కమ్యూనిటీకి చెందిన ఆడపడుచు కాగా తండ్రి మైఖేల్‌ హ్యారి నిడోయ్‌ . తల్లి తండ్రులది ప్రేమ వివాహం. ఆమె తండ్రి మైఖేల్‌ హ్యారి నిడోయ్‌ క్రైస్తవ మతానికి చెందిన సంపన్న వ్యాపారి. ఆయన ఇస్లాం మతం స్వీకరించి తన పేరును షేక్‌ అహమ్మద్‌ హుస్సేన్‌గా మార్చుకున్నారు. షేక్‌ అహమ్మద్‌ హుస్సేన్‌ అక్బర్‌ జెహాన్‌ బేగం తల్లిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం వలన తల్లి సంబందీకులైన గుజ్జర్‌ కమ్యూనిటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేసి వారికి దూరమయ్యారు. ఆ వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆ దంపతులు ఎంతో ధైర్యంతో తమ జీవితాలను ఉజ్వలంగా మలచుకున్నారు. ఆ దంపతుల తొలి సంతానంగా అక్బర్‌ జెహాన్‌ బేగం జన్మించారు. అక్బర్‌ జెహాన్‌ బేగం మంచి కాన్వెంటు విద్యను గరిపారు. విద్యార్థిగా మంచి తెలివితేటలను ప్రదర్శించిన అక్బర్‌ జెహాన్‌ చక్కని సౌందర్యరాశిగా ప్రజల మనస్సులను దోచుకున్నారు. ఆమె అందంలో అగ్రగామి మాత్రమే కాకుండా ధైర్యసాహసాలలో కూడా అగ్రగణ్యురాలుగా ఖ్యాతిగాంచారు. చిన్నతనంతో తన తల్లికి సంబంధించిన గుజ్జర్‌ కమ్యూనిటీ ప్రజలు దూరం కావటం, తండ్రి పరదేశం నుండి వచ్చి కశ్మీరులో స్థిరపడిన వ్యక్తి కావటంతో ఆ కుటుంబం తొలిథలో పలు ఇక్కట్లను ఎదుర్కొంది.

తొలి సంతానంగా ఆ ఇక్కట్లును స్వయంగా అనుభవించిన అక్బర్‌ జెహాన్‌ బేగం ధైర్యశాలిగా స్వతంత్ర భావనలతో ఎదిగారు. చిన్నవయస్సులో కరామత్‌ షా అను ఓ మత గురువుతో ఆమె తల్లితండ్రులు వివాహం జరిపించారు. ఆ వివాహం ఎక్కువ కాలం నిలబడలేదు. చివరకు ఆక్బర్‌ జెహాన్‌ బేగం భర్తను నుండి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె 1932లో షేక్‌ ముహమ్మద్‌ ఇబ్రహీం కుమారుడు, షేర్‌-యే-కశ్మీర్‌గా ఖ్యాతిగాంచిన షేక్‌ ముహమ్మద్‌ అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు. ఆమె వివాహాన్ని ప్రముఖ కవి డాక్టర్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ తోడ్పాటుతో ముఫ్తీ జియాయుద్దీన్‌ నిర్వహించారు. విద్యాధికుడైన డాక్టర్‌ అబ్దుల్లా తొలి నుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయడానకి ఆసక్తి చూపారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలు విద్యావంతులైన తన మిత్రులతో కలసి రీడింగ్‌ రూం పార్టీ అను సంస్థ ఏర్పాటుకు దారి తీశాయి. ఈ సంస్థ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి వ్యవస్థాగతంగా శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో కశ్మీర్‌ ప్రజల సమస్యలను బయటి ప్రపంచానికి తెలియచేసేందుకు రీడింగ్‌ రూం పార్టీ సభ్యులు కృషిచేశారు. ఆ ప్రయత్నాలు ప్రజల మన్నన పొందాయి, కశ్మీరేతర ప్రజల అభినందనలు డాక్టర్‌ అబ్దుల్లాకు దక్కాయి. ఆ అనుభవంతో 1932లో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆయన ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలిటికల్‌ కాన్ఫెరెన్స్‌ ఏర్పాటు చేశారు.

ఆ పార్టీ పేరులో ముస్లిం అని పదం ఉన్నా, ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలిటికల్‌ కాన్ఫెరెన్స్‌ కమ్యూనల్‌ పార్టీ ఏమాత్రం కాదన్నారు. కశ్మీర్‌ ప్రజల ఉద్యమం మతఉద్యమం కాదని ఇది రాజకీయ ఉద్యమమని ఆయనఅన్నారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని డాక్టర్‌ అబ్దుల్లా ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు అబ్దుల్లా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచారు. మతంతో సంబంధం లేకుండా ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలిటికల్‌ కాన్ఫెరెన్స్‌లో అందరికి ప్రవేశం కల్పించారు, ఆ సందర్భంలో బేగం అక్బర్‌ జెహాన్‌ భర్త అబ్దుల్లాకు తోడుగా నిలిచారు. ఆ క్రమంలో మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్‌, పండిత నెహ్రూ, అలీ సోదరుల ప్రభావంతో 1938 ప్రాంతంలో అబ్దుల్లా తన ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలిటికల్‌ కాన్ఫెరెన్స్‌ ను ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ నేషనల్‌ పొలిటికల్‌ కాన్ఫెరెన్స్‌గా మార్చారు. ద్వితీయ ప్రపంచ సంగ్రామం సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ నేషనల్‌ పొలిటికల్‌ కాన్ఫెరెన్స్‌ కూడా క్విట్‌ ఇండియా తీర్మానానికి మద్దతు పలికింది. జాతీయ కాంగ్రెస్‌ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. జమ్మూ-కశ్మీర్‌లో క్విట్‌ ఇండియా నినాదం ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా డాక్టర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ ఇండియా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇండియా భూభాగంలోని నాల్గవ వంతు కలిగి ఉన్న సంస్థానాధీశులు స్వరాజ్యం విషయంలో విద్రోహులయ్యారు. సంస్థానాధీశులు వెళ్ళిపోవాలన్న డిమాండ్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే, అని ఆన్నారు.  1946 ప్రాంతంలో భారత దేశానికి బ్రిటీష్‌ ప్రభుత్వం పంపిన క్యాబినెట్‌ మిషన్‌ ఫెడరల్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ను ప్రతిపాదించింది.

ఇండియా నుండి బ్రిటీషర్లు వైదొలిగాక సంస్థానాధీశుల స్థానంలో ప్రజల ప్రభుత్వం ఏర్పడాలని డాక్టర్‌ అబ్దుల్లా ఆశించారు. ఈ మేరకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి ఆయన ఉపక్రమించగా ఆయనతోపాటుగా బేగం అక్బర్‌ జెహాన్‌ ఉద్యమించారు. ఈ ఉద్యమాన్ని ఆ దంపతులు కశ్మీర్‌ సంస్థానం వరకు పరిమితం చేయలేదు. ఆనాడు ఇండియాలోని సుమారు 600 సంస్థానాలలోని ప్రజలను ఈ విషయమై చైతన్యపర్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు డాక్టర్‌ అబ్దుల్లా క్యాబినెట్‌ మిషన్‌కు మహజరు కూడా సమర్పించారు. బ్రిటీషు ప్రభుత్వం అధికారంలో నుండి వైదొలిగాక ప్రభుత్వాధికారాన్ని ప్రజల పరం చేయాలని, సార్వభౌమత్వం ప్రజల చేతుల్లో ఉండాలని ఆ మహజరు కోరింది. ఆ నేపథ్యంలో క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమానికి డాక్టర్‌ అబ్దుల్లా శ్రీకారం చుట్టారు. ఉద్యమం ఉదృతంగా సాగింది. అరెస్టుల పరంపరలో భాగంగా 1946 మే మాసంలో బేగం అక్బర్‌ జెహాన్‌ భర్త అబ్దుల్లాను ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణల విూద తొమ్మిది సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఆ సమయంలో బేగం అక్బర్‌ జెహాన్‌ రంగంలోకి దిగారు. అంతవరకు పరోక్షంగా భర్త అబ్దుల్లాకు సహాయకారిగా ఉన్న ఆమె ప్రత్యక్షరాజకీయాలలోకి ప్రవేశించారు. ఆమె స్వయంగా గ్రామాలకు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలను కూడగట్టారు. బాధితులను ఆదుకున్నారు. ప్రజలలో భయాలను తొలగించి ఆశాజ్యోతులను వెలిగించారు. క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమానికి ప్రజల మద్దతు సాధించేందుకు ఆమె నడుం కట్టారు. జనసమూహాలను ప్రభావితం చేయగల విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ కారణంగా క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. కశ్మీర్‌ ఉద్యమం సందర్భంగా ప్రజలను సవిూకరించగల శక్తియుక్తులు, ఆమెలో నిబిఢీకృతమై ఉన్న శక్తి సామర్థ్యాలు బహిర్గత మయ్యాయి. డాక్టర్‌ అబ్దుల్లా జైలులో ఉన్న సమయంలో కశ్మీర్‌ వచ్చిన మహాత్మా గాంధీని ఆమె స్వయంగా కలుసుకుని చర్చించారు.

1947 జూన్‌లో లార్డు మౌంటుబాటన్‌ తన ప్రణాళికను వెల్లడించాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా భారతదేశం రెండుగా చీలిపోవటం ఖాయమయ్యింది. ఆ సమయంలో పండిత నెహ్రూ సలహా విూద డాక్టర్‌ అబ్దుల్లాను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయన విడుదల కాగానే కశ్మీరు సంస్థానం భవిష్యత్తును ప్రజలు నిర్ణయించాలి తప్ప సంస్థానాధీశులు నిర్ణయించటం సముచితం కాదని ప్రకటించారు. ఈ విషయంలో జాతీయ కాంగ్రెస్‌ నాయకులు ఆయనతో ఏకీభవించారు.ఇండియా విభజన సందర్భంగా పాకిస్తాన్‌ నాయకుల ప్రేరణతో కశ్మీరును ఇండియా నుండి దూరం చేయాలని ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. కశ్మీరులోని గిరిజన జాతులను రెచ్చగొట్టి జమ్మూ-కశ్మీరులోని కొన్ని ప్రాంతాల ఆక్రమణకు ప్రయత్నాలు సాగాయి. ఆ ప్రమాదకర పరిస్థితులలో డాక్టర్‌ అబ్దుల్లా, బేగం అక్బర్‌ జెహాన్‌ తమ నిర్ణయాల విూద స్థిరంగా నిలబడ్డారు. పాక్‌ ప్రేరిత ఆక్రమణదారులను తిప్పికొట్టేందుకు ప్రజలను కూడగట్టారు. ప్రజలను భయభ్రాంతున్ని చేయడానికి వ్యాపింపచేస్తున్న పుకార్లను ఖండిస్తూ  అబ్లుల్లాతో పాటుగా అమె కూడా వీధుల్లోకి వచ్చి ప్రజలకు నచ్చచెప్పి భీతాహులు కాకుండా పరిస్థితులను అదుపులోకి తీసుకరావటంలో అమె తొడ్పడ్డారు.  ఆ సందర్భంగా డాక్టర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ ఈనాడు పాకిస్తాన్‌ నుండి బయలుదేరిన ఆక్రమణదారులు శ్రీనగర్‌ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు. వాళ్ళు ఇస్లాం నినాదం చేస్తున్నారు. విూరు నావెంట ఉంటారో వారితో కలుస్తారో తేల్చుకోవాల్సింది 1947 జూన్‌లో లార్డు మౌంటుబాటన్‌ తన ప్రణాళికను వెల్లడించాడు.
ఆ ప్రణాళిక ప్రకారంగా భారతదేశం రెండుగా చీలిపోవటం ఖాయమయ్యింది. ఆ సమయంలో పండిత నెహ్రూ సలహా విూద డాక్టర్‌ అబ్దుల్లాను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయన విడుదల కాగానే కశ్మీరు సంస్థానం భవిష్యత్తును ప్రజలు నిర్ణయించాలి తప్ప సంస్థానాధీశులు నిర్ణయించటం సముచితం కాదని ప్రకటించారు. ఈ విషయంలో జాతీయ కాంగ్రెస్‌ నాయకులు ఆయనతో ఏకీభవించారు.ఇండియా విభజన సందర్భంగా పాకిస్తాన్‌ నాయకుల ప్రేరణతో కశ్మీరును ఇండియా నుండి దూరం చేయాలని ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. కశ్మీరులోని గిరిజన జాతులను రెచ్చగొట్టి జమ్మూ-కశ్మీరులోని కొన్ని ప్రాంతాల ఆక్రమణకు ప్రయత్నాలు సాగాయి. ఆ ప్రమాదకర పరిస్థితులలో డాక్టర్‌ అబ్దుల్లా, బేగం అక్బర్‌ జెహాన్‌ తమ నిర్ణయాల విూద స్థిరంగా నిలబడ్డారు. పాక్‌ ప్రేరిత ఆక్రమణదారులను తిప్పికొట్టేందుకు ప్రజలను కూడగట్టారు. ప్రజలను భయభ్రాంతున్ని చేయడానికి వ్యాపింపచేస్తున్న పుకార్లను ఖండిస్తూ ్త అబ్లుల్లాతో పాటుగా అమె కూడా వీధుల్లోకి వచ్చి ప్రజలకు నచ్చచెప్పి భీతాహులు కాకుండా పరిస్థితులను అదుపులోకి తీసుకరావటంలో అమె తొడ్పడ్డారు.  ఆ సందర్భంగా డాక్టర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ ఈనాడు పాకిస్తాన్‌ నుండి బయలుదేరిన ఆక్రమణదారులు శ్రీనగర్‌ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు. వాళ్ళు ఇస్లాం నినాదం చేస్తున్నారు. విూరు నావెంట ఉంటారో వారితో కలుస్తారో తేల్చుకోవాల్సింది ఖిరిబి, ఆబివీలి.108)బేగం అక్బర్‌ జెహాన్‌ చాలా సందర్భాలల్లో డాక్టర్‌ అబ్దుల్లాకు సహాయసహాకారాలు అందిస్తూ పరోక్షరాజకీయాలలో గడుపుతూ, సందర్భాన్ని బట్టి తన శక్తిసామర్ధ్యాలు ప్రజల కోసం ప్రదర్శించారు. అతి క్లిష్ట సమయాలలో భర్తకు తోడుగా నిలిచారు. ఆ పరిస్థితులకు అతీతంగా కశ్మీరు ప్రజల మనస్సుల విూద ఆమెకున్న రాజకీయ పట్టు 1971 నాటి ఎన్నికలలో వెల్లడైంది. ఆ సమయంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, బక్షీ గులాం ముహమ్మద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శ్రీనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి షవిూం అహమ్మద్‌ షవిూం రంగంలో నిలిచారు. ఆ ఎన్నికల సమయాన ఆమె భర్త డాక్టర్‌ అబ్దుల్లా కశ్మీరులో లేరు. ఆ ఎన్నికలో బేగం అక్బర్‌ జెహాన్‌ స్వతంత్ర అభ్యర్థి షవిూం అహమ్మద్‌కు మద్దతు పలికారు. ఆ సందర్భంలో ఆమె చాలా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె కృషివలన అంతగా పరిచయంలేని షవిూంను ప్రజలు గెలిపించి రాజకీయ వస్తాదుగా పేర్గాంచిన గులాం ముహమ్మద్‌ను పరాజితుడ్ని చేశారు. ఆ చరిత్రాత్మక పరిణామాలకు బేగం అక్బర్‌ జెహాన్‌ కేంద్రబిందువు కావటం ద్వారా ఆమె వ్యక్తిత్వం పట్ల ప్రజలలో ఉన్న అభిమానం, ఆమెకున్న పలుకుబడి వెల్లడయ్యాయి.1977లో జరిగిన ఎన్నికలలో ఆమె శ్రీనగర్‌ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేశారు.
ఆ ఎన్నికలో భారీ ఆధిక్యతతో ఆమె గెలుపొంది పార్లమెంటులో ప్రవేశించారు. కశ్మీరు ప్రజల నేతగా పార్లమెంటు సభ్యురాలుగా అక్బర్‌ జెహాన్‌ బహుముఖ పాత్ర నిర్వహించారు. మహిళల సమస్యల పట్ల ఆమె అధిక శ్రద్దచూపారు. మహిళలలో చైతన్యం కోసం, మానసిక వికాసం, అభివృద్ధికోసం గాను  అనేక సంస్థలను స్థాపించారు. పలు  సంస్థలలో భాగస్వాములయ్యారు. మహిళాభివృద్ధి ప్రధాన ఆశయంగా స్థాపించిన మర్కజ్‌-యే- బెహబూద్‌-యే-ఖవాతీన్‌  లో ఆమె కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మహిళలకు సేవలందించారు. ఈ సంస్థతో ఆమె అర్థ శతాబ్దంపాటు మంచి సంబంధాలు కలిగి ఉండి సామాజిక సేవా రంగంలో తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. ఆమెలోని మానవతా భావనలు, సేవా దృక్పధం గుర్తించిన కశ్మీరు ప్రజలు ఆమెను ‘ మదర్‌-యే-మెహర్బాన్‌ ‘  అని సంబోధిస్తూ, ఆమెపట్ల వారితోగల ప్రేమాభిమానాలను చాటుకున్నారు.  మదర్‌-యే-మెహర్బాన్‌  అంటే  ‘దయగల తల్లి ‘ అని అర్ధం. ఈ మేరకు అటు భర్తకు రాజకీయాలలో తోడ్పాటు అందచేస్తూ, ఇటు కశ్మీరు ప్రజలను ముఖ్యంగా కశ్మీరు మహిళల సంక్షేమం కోసం చివరి శ్వాసవరకు క్రియాశీలకంగా శ్రమించిన బేగం అక్బర్‌ జెహాన్‌ 2000 సంవత్సరంలో కన్నుమూశారు. 
@@ సమాప్తం @@

– సయ్యద్ నశీర్ అహమ్మద్  

@ఈ శీర్షికకి సమాచారాన్ని అందించి సహకరించినందుకు రచయిత శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్  గారికి ధన్యవాదాలు.@

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~–

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో