భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

విభజన బాధితులను ఆదుకున్న ఆపద్బాంధవి

అనిస్‌ బేగం కిద్వాయ్‌

Naseer Ahammad

Naseer Ahammad

పరాయి పాలకులను ప్రాలదోలేందుకు కుటుంబాలకు కుటుంబాలు పాటుపడిన వైనం స్వాతంత్య్రోద్యమం పట్ల భారతీయులలో నిబిఢీకృతమైఉన్న నిష్టకు-నిబద్ధతకు రుజువు. ఆ కుటుంబాలలో  నెహ్రూ కుటుంబం, తయ్యాబ్జీ కుటుంబం, ఫైజీ కుటుంబం, కిచ్లూ కుటుంబం, కిద్వాయ్‌ కుటుంబం లాంటి కొన్ని కుటుంబాలను  ప్రధానంగా పేర్కొనవచ్చు. ఆ కుటుంబాలు అద్వితీయ త్యాగాలతో స్వాతంత్య్రోద్యమం చరిత్రలో తమదంటూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అటువంటి చరిత్ర కలిగిన కిద్వాయ్‌ కుటుంబ సభ్యురాలు అనిస్‌ బేగం కిద్వాయ్‌.

ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకిలోని షేక్‌ విలాయత్‌ అలీ ఇంట అనిస్‌ బేగం 1906లో  జన్మించారు. తండ్రి విలాయత్‌ అలీ న్యాయవాది. ఆయన బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేకి. ఆంగ్లేయులకు అండగా నిలచిన అలీఘర్‌ మేధావులతో సరిపడని వ్యక్తి. హిందూ- ముస్లింల ఐక్యతను ఆకాంక్షించే  సమరయోధులు. భారత జాతీయ కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ ల మధ్య సయోధ్యను కోరుకున్న ప్రముఖులు. 

చిన్నతనం నుండి బేగం అనిస్‌ తండ్రితోపాటుగా రాజకీయ, సాహిత్య సభలు, సమావేశాలకు హజరవుతూ తండ్రి నుండి బ్రిటీష్‌ వ్యతిరేకతను సంతరించుకున్నారు. ఆయన మౌలానా ముహమ్మద్‌ అలీ సంపాదకత్వంలోని కామ్రెడ్‌, రాజా గులాం హుస్సేన్‌ సంపాదకత్వంలోని న్యూ ఎరా పత్రికలలో ప్రత్యేక వ్యాసాలు రాశారు. తండ్రి నుండి రాజకీయ, సాహిత్య పరిజ్ఞానాన్ని, దేశభక్తి భావనలను ఆమె చిన్నతనంలోనే  పుణికి పుచ్చుకున్నారు.

ఆ కుటుంబం రాజకీయంగా ఎలా ఉన్నా విద్యావిషయంలో మాత్రం సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ మార్గదర్వకత్వంలో మగ పిల్లలందరికి ఆంగ్ల చదువులు చెప్పించి, ఆడపిల్లలను మాత్రం దూరంగా ఉంచింది. అనిస్‌ బేగం సోదరులకు విద్యగరిపేందుకు ట్యూటర్లను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆమె కూడా సోదరులతో కలసి కూర్చోని ఉర్దూ, ఇంగ్లీషు భాషలను నేర్చుకున్నారు తప్ప  ప్రత్యేకంగా ఆమె చదువుకోలేదు. ఆమె 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి ఇనాయత్‌ అలీ కన్నుమూశారు. ఆ కారణంగా ఆమెకు చదువుకునే అవకాశాలు  లేకుండా పోయాయి. 

ఆమె తమ సన్నిహిత బంధువు షఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌ను వివాహం చేసుకున్నారు. షఫీ అహమ్మద్‌ ప్రముఖ జాతీయోద్యమకారుడు రఫి అహమ్మద్‌ కిద్వాయ్‌ తమ్ముడు. అన్నతోపాటుగా షఫీ అహమ్మద్‌ కూడా బ్రిటీషు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారు.  సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రఫి అహమ్మద్‌ కిద్వాయ్‌తో కలసి ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో  చురుకుగా పాల్గొన్నారు. ఆయన ముస్లింలీగ్‌ రాజకీయాలకు వ్యతిరేకి. హిందూ- ముస్లింల  ఐక్యతకోసం నిరంతరం కృషి చేసిన ప్రముఖులు. 

చిన్ననాటనే తండ్రి నుండి జాతీయ భావాలను సంతరించుకున్న అనిస్‌ బేగంకు బ్రిటీషు వ్యతిరేక భావాలు గల భర్త లభించటం, అటు పుట్టింటివారు, ఇటు అత్తింటివారు వారు కూడా జాతీయోద్యమకారులు కావటంతో ఎంతో ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహంతో ఉద్యమకార్యక్రమాలలో ఆమె మరింతగా నిమగ్నమయ్యారు. బావ, భర్త ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమాలలో అగ్రగాములుగా నిలచి పోరుబాట సాగటంతో అనిస్‌ బేగంకు పోలీసుల బెడద తప్పలేదు. కుటుంబంలోని ఆర్జనాపరులు ఉన్నత ఉద్యోగాలను వదలుకుని ఉద్యమబాట పట్టడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా అనిస్‌ బేగంను చుట్టుముట్టాయి. ఆనాడు రాజకీయంగా దృఢమైన అభిప్రాయాలు గల అనిస్‌ను అటు పోలీసులుగాని ఇటు ఆర్థిక ఇబ్బందులుగాని ఏవిూ చేయలేకపోయాయి. ఆమె చివరికంటా స్వరాజ్యం సాధించేందుకు ముందుకు సాగారు. ఆ కుటుంబం ఆకాంక్షించిన స్వరాజ్యం సిద్ధించింది. ఆశించని విధంగా భారత దేశ విభజన జరిగింది. ఆ సందర్భంగా కిద్వాయ్‌ కుటుంబం వ్యాకులతకు లోనైంది. ఆ బాధ నుండి తేరుకునేలోపుగా అనిస్‌ విూద పెను ఉప్పెన విరుచుక పడింది. ఆమె భర్త షఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఆది నుండి హిందూ-ముస్లింల ఐక్యతను కోరుకుంటూ మతోన్మాదాన్ని అన్ని విధాల ఎదుర్కొన్న షఫీ అహమ్మద్‌ను మతోన్మాద జ్వాలలు బలితీసుకున్నాయి. ఆ సమయంలో ఆయన ముస్సోరి మున్సిపల్‌ బోర్డులో కార్యనిర్వాహక ఆధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలోని హిందూ-ముస్లింల మధ్యన సామరస్యం కోసం నిరంతరం తపనపడ్డారు. ఆ దిశగా మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో ఎంతో కృషి సల్పారు.  అటు వంటి హిందూ-ముస్లిం ఐక్యతాభిలాషిని విభజన నేపధ్యంలో వెల్లువెత్తిన మతోన్మాదం  పొట్టనపెట్టుకుంది.

ఆ సంఘటనతో అనిస్‌ బేగం చలించిపోయారు. ఏ మతోన్మాద రాక్షసి నుండి ప్రజలను కాపాడాలని ఆ దంపతులు నిరంతరం పనిచేశారో ఆ ఉన్మాదానికి ఆమె భర్త బలయ్యారు. ఆ పరిస్థితి ఆమెలో సరికొత్త ఆలోచనలకు కారణమైంది. ఈ మతోన్మాద భూతం ఎంతమందిని బలితీసుకుంటుదోనని ఆమె తపించిపోయారు. ఆ విధంగా  సన్నిహితులను కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఆమెను నిలువనివ్వలేదు.  ఆ సమయంలో  ఢిల్లీలో ఉన్న మహాత్మా గాంధీ వద్దకు వెళ్ళారు.

ఆనాడు దేశమంతా విభజన వాతావరణంతో ప్రజ్వరిల్లుతుంది. కుటుంబాలకు కుటుంబాలు అటు,ఇటు వెడుతున్నాయి. అమాయకులు రాక్షస ఉన్మాదానికి బలవుతున్నారు. ఈ పరిస్థితుల చేదు అనుభవాలను ప్రధానంగా  మహిళలు, పిల్లలు వృద్ధులు ఎదుర్కొంటునా1్నరు. ఉన్మాదుల రక్తదాహానికి, భయానక చేష్టలకు మహిళలు బలవుతున్నారు. కూడు,గూడు లేక అల్లాడిపోతున్నారు. ఆ పరిణామాల నేపధ్యంలో అనిస్‌ బేగం ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా శరణార్థులుగా మారిన హిందూ-శిక్కు భాధిత మహిళలలకు, పిల్లలకు రక్షణ కల్పించి ఆశ్రయమిచ్చి ఆదుకునేందుకు కృషిచేయాల్సిందిగా మహాత్మాగాంధీ ఆదేశించారు. ఆయన ఆదేశాలను శిరోధార్యంగా భావించి సుభద్రా జోషి, మృదులా శారాబాయిలతో కలసి అనిస్‌ బేగం రంగంలోకి దిగారు. 

విభజన సృష్టించిన సంక్షోభం వలన విలవిల్లాడుతున్న వేలాది మహిళలను భారత దేశంలో తొలి మహిళా మంత్రిగా  చరిత్ర సృష్టించిన 

 మాసుమా బేగం

జాతీయోద్యమంలో భాగస్వాములవటంతో పాటు స్వతంత్ర భారత ప్రభుత్వంలో కూడా బాధ్యతలు నిర్వహించగల అవకాశాలు దక్కించుకొన్న స్వాతంత్య్రసమరయోధులు కొద్దిమంది మాత్రమే. ఆ అరుదైన అవకాశంతో పాటుగా పదవులు పొందిన పదిమందిలో ప్రథమంగా నిలచి చరిత్ర సృష్టించుకున్న భాగ్యాన్ని దక్కించుకున్న వారు అతికొద్దిమంది. ఆ ఆతికొద్దిమంది అదృష్టవంతుల్లో ఒకరు మాసుమా బేగం.

ఆంధ్రప్రదేశ్‌ తొలి మంత్రి వర్గంలో తొలి మహిళా మంత్రి, తొలి ముస్లిం మంత్రి, మొత్తం భారత దేశంలోనే మంత్రిపదవిని నిర్వహించిన తొలి ముస్లిం మహిళ మాసుమా బేగం 1902లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లో జన్మించారు. తల్లి పేరు  తయ్యిబా బేగం. తల్లి మంచి విద్యావంతురాలు. అమె భారత దేశంలోనే తొలి ముస్లిం పట్టభద్రురాలు. తండ్రి పేరు ఖదీవ్‌ జంగ్‌. తాత సయ్యద్‌ హుస్సేన్‌ బిల్‌గ్రామి.

ఆచార, సంప్రదాయ కుటుంబంలో పుట్టిన మాసుమా బేగం, ఆమె చెళ్ళెల్లు హైదరాబాద్‌ లోని మహబూబియా బాలికల పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆమె తండ్రి  వైద్యశాఖలో ఉప డైరక్టరుగా పనిచేశారు. ఆమె సోదరుడు అలీ యావర్‌ జంగ్‌ హైదరాబాదులో విద్యామంత్రిగా వుండి, తరువాత ఈజిప్టు, యగోస్లోవియాలలో భారత రాయబారి పదవి నిర్వహించారు. ఆమె వంశంలోని అకిల్‌ జంగ్‌ పి.డబ్యూ.డి మంత్రి గానూ, ఆమె దగ్గరి బంధువు మోహ్దీన్‌ యార్‌జంగ్‌  మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె సన్నిహిత బంధువులంతా ఉన్నత విద్యావంతులుగాని ఉన్నత పదవులు నిర్వహించినవారు గాని కావటంతో పరిపాలనా దక్షత ఆమెకు ఉగ్గుపాలతో పెట్టినట్లయ్యింది.  

1922లో  ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదివిన సవిూప బంధువు హుసైన్‌ అలీ ఖాన్‌ను మాసుమా బేగం వివాహం చేసుకున్నారు. ఆతరువాతి కాలంలో ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం అధిపతిగా పనిచేశారు. ఆయన డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు లాంటి ప్రముఖులకు గురువుగా గణనకెక్కారు. అంతటి విద్వత్తు, స్వతంత్ర, ఉదార భావాలు గల వ్యక్తి భర్తగా లభించటంతో చిన్నతనం నుండి సమాజ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిన మాసుమా బేగం ఆ బాటలో ఇనుమడించిన ఉత్సాహంతో సాగగలిగారు. 

తల్లితండ్రులు విద్వావంతులు కావటం, భర్తకూడా మంచి పండితుడు కావటంతో మాసుమా బేగం విద్యావ్యాప్తి పట్ల దృష్టిసారించారు. మహిళల్లో చైతన్యాన్ని చదువు ద్వారా సాధించవచ్చని, సమస్యల పరిష్కారానికి విద్య ఇతోధికంగా తొడ్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజసేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా లభించిన అనుభవం మేరకు అన్ని సామాజిక రుగ్మతలకు నిరక్షరాస్యత ప్రధాన కారణమని భావించిన ఆమె ఆ రంగాన్ని ఎంచుకున్నారు.

1921లో విద్యావ్యాప్తి ప్రధాన లక్ష్యంగా గల అంజుమన్‌కు అధ్యకక్ష్యులు గా ఆమె ఎన్నికయ్యారు. భర్త అనుమతి, ప్రోత్సాహంతో  విద్యావ్యాప్తి కోసం మాత్రమే కాకుండా  సంఘసేవా కార్యక్రమాలలో, సామాజిక రుగ్మతల నివారణకు చురుకుగా పాల్గొన్నారు. పలు విద్యా, సాంఘికసేవా సంస్థల ఏర్పాటుకు కృషిచేయటమేకాకుండా ఆయా సంస్థలలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. ప్రధానంగా మహిళా సంఘాల కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. 

1927లో  అభిల భారత మహిళా సంస్థకు హైదరాబాద్‌లో శాఖను ఏర్పాటు చేశారు. ఆ శాఖకు ప్రధాన కార్యదర్శిగానూ, అధ్యకక్షురాలిగాను ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఆ సందర్భంగా మహిళలచే అఖిల భారత మహిళా సంస్థ శాఖలను ప్రారంభింపచేసి ఆ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ మేరకు ఆమె నిర్వహించిన సేవలకు గుర్తింపుగా ఆమెకు అఖిల భారత మహిళా సంస్థ ఉపాద్యక్ష పదవి లభించింది. ఆ హోదాలో ఆమె పలు ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించారు. 
సంఘ సేవాకార్యక్రమాల నిర్వహణలో అవిశ్రాంతగా శ్రమిస్తూ కూడా ఆమె ఆనాటి రాజకీయల విూద దృష్టిసారించారు. జాతీయ సేవాభావాలు గల ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపారు. జాతీయోద్యమంలో భాగంగా ఉనికిలోకి వచ్చిన పలు సంస్థల్లో కార్యక్రమాలలో ఆమె సభ్యురాలిగా  పాల్గొన్నారు. ఈ మేరకు అటు సమాజ సేవా కార్యక్రమాల ద్వారా, ఇటు  రాజకీయ కార్యక్రమాల వైెపు మొగ్గు చూపిన కారణంగా అటు ప్రజల ఇటు రాజకీయ ప్రముఖుల మన్నన పొందారు. 
ఆ కారణంగా స్వతంత్ర భారతదేశం అవతరించాక 1952 లో తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాసుమా బేగంను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు.  ఆమె  షాలిబండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగారు. ప్రముఖ కవి, కమ్యూనిస్టు పార్టీనాయకుడు, కార్మికనేత మగ్దూం మోహిద్దీన్‌ ఆమె ప్రత్యర్ధి.  ఆయన  పీపుల్స్‌ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఏడు వందల 74 ఓట్ల ఆధిక్యతతో మాసుమా బేగం విజయం సాధించారు.
ఆ తరువాత 1957లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆమె పోటీ చేసి గెలిచారు.ఈ సారి ఫత్తర్‌ఘట్టీ అసెంబ్లీ నుండి  ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు అక్తర్‌ హుస్సేన్‌ ను 513 ఓట్ల ఆధిక్యతతో పరాజితుల్ని చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా ఆమె నిర్వహించిన ప్రచారం తీరు కూడా ప్రజలను బాగా ఆకట్టుకుంది. ప్రచారంలో ప్రత్యర్థుల కంటే  ఆమె ముందుండటం విశేషం.  ప్రతిరోజు వేకువ ఝామున ప్రచారానికి బయలు దేరి  ప్రత్యర్థులు ప్రచారానికి జనంలోకి వచ్చేలోగా ఆమె తన ప్రచారాన్ని ముగించటం విశేషం,  ముస్లిం మహిళ అయిఉండి కూడా ప్రచార కార్యక్రమంలో ప్రత్యర్థుల కంటే ముందుడడం ఆమె రాజకీయదక్షతకు నిదర్శనం. 
ఈ విజయాల ద్వారా ఆమెకు ఎనలేని కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిన పదవులు లభించాయి. ఆ తరువాత ప్రముఖ కాంగ్రెస్‌ నేత దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం, ముస్లిం ఎండోమెంట్స్‌ శాఖా మంత్రి పదవి ఆమెకు లభించింది.ఈ పదవిలో 1960 నుండి 1962 వరకు కొనసాగి, ఆంధ్రప్రదేశ్‌ తొలి మంత్రి వర్గంలో తొలి మహిళా మంత్రిగా, తొలి ముస్లిం మంత్రిగా, మొత్తం భారత దేశంలోనే మంత్రిపదవిని నిర్వహించిన తొలి ముస్లిం మహిళగా మాసుమా బేగం చరిత్ర సృష్టించారు.
1962లో ఫతర్త్‌ఘట్టీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా  స్వతంత్ర అభ్యర్థి సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ విూద పోటీచేసి ఆమె పరాజితులయ్యారు. అప్పటి నుండి ఆమె సమాజసేవాకార్యక్రమాలకు పరిమితమయ్యారు. ప్రభుత్వ పరంగా వివిధ మహిళా, శిశు సంక్షేమ సంస్థలు, విద్యావాప్తి సంఘాలలో పలు బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని అంజుమన్‌-యే-ఖవాతీన్‌, లేడీ హైదరీ క్లబ్‌ ప్రధాన సభ్యురాలుగా, రెడ్‌క్రాస్‌ సంస్థ కార్యనిర్వాహక సమితి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.  
మంచి వక్త, కార్యదకక్షురాలుగా ఖ్యాతిగాంచిన మాసుమా బేగం అఖిల భారత మహిళా సంస్థ నేతగా 1957లో కొలంబో, అఖిల భారత మహిళా సంస్థ ప్రతినిధి మండలి డిప్యూటీ నాయకురాలిగా 1959లో రష్యా, ఐక్యరాజ్యసమితి సమావేశాలకు జెనివా వెళ్ళి వచ్చారు. ఆ తరువాత యుగస్లోవియా, ఇండోనేషియాలలో పర్యటించారు. ఈ మేరకు అటు రాజకీయ రంగాన, ఇటు సేవారంగాన మాత్రమే కాకుండా సాహిత్య రంగాన కూడా అగ్రగామి అన్పించుకున్న మాసుమా బేగం 1990లో కన్నుమూశారు.

( ఇంకా ఉంది )  

– సయ్యద్ నశీర్ అహమ్మద్  

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~–

133 

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో