నర్తన కేళి – 18

ఏ కళ అయినా భగవంతుడిని ఆరాధించడమే .సంగీతం అయితే గాత్రంతో మాత్రమే భగవంతుణ్ణి ఆరాధిస్తాము , అదే నాట్యం అయితే సమాహార కళ కాబట్టి అన్నీ రకాలుగా ఆ దేవుణ్ణి కోవలడానికి అవకాశం ఉంటుంది . “నాట్య వతంస” కళ్యాణ మాధవి తో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి ……..

*మీకు నాట్యం పై ఆసక్తి కలగడానికి కారణం ?

నా చిన్న వయ్యస్సులో అంటే నాకు మూడు సంవత్సరాల వయసుండగా , మా మావయ్య పెళ్లిలో వాయిద్యానికి అనుగుణంగా డాన్స్ చేసానంట . అది చూసి మా అమ్మ , నాన్నలు నాకు నాట్యం నేర్పించాలి అని అనుకున్నారంట .

*తొలి గురువు ?

పసుమర్తి శ్రీనివాస శర్మ గారు .

*మీ తొలి ప్రదర్శన ?

రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రం లో జరిగింది .మా నృత్య కళాశాల వార్షి కోత్సవం లో చేసాను . అప్పుడు వినాయక కీర్తన చేసాను .

*మీ తల్లిదండ్రులు గురించి చెప్పండి ?

నాన్న పేరు యర్రమిల్లి వెంకట రాం మోహన్ ప్రసాద్ . అమ్మ పేరు లక్ష్మి . గృహిణి .

* మీ స్వస్థలం ఎక్కడ ?

రాజమండ్రి దగ్గరలోని బొమ్మూరు .

*మొత్తం ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు ?

ఇప్పటివరకు చాలా ప్రదర్శనలు ఇచ్చాను .

*ఇన్ని ప్రదర్శనలలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే మరిచిపోలేనివి కొన్ని మా విహంగ చదువరుల కోసం చెప్పండి ?

తరిగొండ వెంకమాంబ నృత్య రూపకం,ఒరిస్సా లో పూరి జగన్నాధం స్వామీ , తిరుపతి బ్రహ్మోత్సవాల్లోను చేసాను .

* మీరు ఎంత వరకు చదువుకున్నారు ?

నేను డిగ్రీ బి .కాం , బొమ్మూరు లోని రంభా నారాయణమ్మ కాలేజిలో డిగ్రీ చదివాను .

*కూచిపూడిలో సర్టిఫికేట్ ఎవరి వద్ద చేసారు ?

మా గురువుగారు పసుమర్తి శ్రీనివాస శర్మ గారి వద్ద సర్టిఫికేట్ , డిప్లోమో చేసాను .

* కూచిపూడి లో ఏం .ఏ చేసారు కదా ?

అవునండి , పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం , కూచిపూడి ప్రాంగణం లో ఏం . ఏ చేసాను . ఆ తరవాత డిప్లమో ఇన్ యక్షగాన లో స్పెషలైజేషన్ చేసాను .

*మరి పి.హెచ్. డి చేసే ఆలోచన ఏమైనా ఉందా ?

ఉండండి . కాని సమయం పడుతుంది . కూచిపూడి లోని ఏక పాత్ర కేళి లపై చేయాలని ఉంది.

*మీరు ఎన్ని సంవత్సరాలుగా గురువుగా శిక్షణ ఇస్తున్నారు ?

ఏడు సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నాను .

*మీరు అందుకున్న పురస్కారాలు ?

కాకినాడలో “నాట్య వతంస “ భోగి రోజున ఇచ్చారు . కళా పురస్కారం విశాఖపట్నంలో ఇచ్చారు . ఇంకా తెలుగు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చింది .

*ఇప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించే వారికి మీరిచ్చే సలహా , సూచన ?

ఏ కళ అయిన భగవంతుడిని ఆరాధించడమే .సంగీతం అయితే గాత్రంతో మాత్రమే భగవంతుణ్ణి ఆరాధిస్తాము , అదే నాట్యం అయితే సమాహార కళ కాబట్టి అన్నీ రకాలుగా ఆ దేవుణ్ణి కోవలడానికి అవకాశం ఉంటుంది . ఏదో నేర్చుకున్నాము రెండు మూడు ప్రదర్శనలు చేసాము అని కాకుండా మనస్ఫూర్తిగా నేర్చుకోవాలి . అలాగే నాట్యం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది .

*మీ భవిష్యత్ ప్రణాళిక ?

మా శిష్యుల చేత నృత్య రూపకాలు చేయించే ఆలోచనలో ఉన్నాను .

మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

2 Responses to నర్తన కేళి – 18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో