గౌతమీ గంగ

కాశీచయనుల-వేంకట-మహాలక్ష్మి-150x150రూపాయలు దీస్తే ధనం బాగా అర్జిస్తాడు. అదే విధంగా ఆడపిల్లకు కుంకుమభరిణ తీస్తే ఐదవతనం కలదీ, పూలు తీస్తే అలంకార ప్రియురాలు, బంగారు నగలు తీస్తే ఐశ్వర్యవంతురాలు అవుతుందని నమ్మేవారు. పండ్లు తీస్తే సంతాన వంతురాలు అవుతారని నమ్ముతారు. సీత కుంకుమ బంగారం తీసింది మంచిదే మరి పళ్లు తీయలేదే పిల్లలు కలుగుతారా? అందరి మదిలోనూ ఇదో సందేహం అయింది. వీరికి హారతి ఇచ్చి పీటల మీద నుంచి లేవతీసాక రత్నాన్ని, సత్యాన్ని పునస్సంధానం పీటల మీద కూర్చోబెట్టారు.
    ఔపోసన మంత్రాలూ, హోమాలూ అయ్యే సరికి ఒంటిగంట దాటింది. వైదిక మతాచారాలు సర్వులు దేశంలో పాటిస్తున్న ఆ రోజుల్లో పెళ్లిలో ఐదు రోజులూ అగ్నిదేవుని ఉపాసిస్తూ హోమాలు నిర్వర్తించేవారు. ఐదవ రోజున ఆ అగ్నిహోత్రునికి తాత్కాలికంగా ఉద్వాసన చెప్పేవారు. వరుడు విద్యాభ్యాసానికీ వధువు కన్నవారింటికీ తరలిపోయేవారు. వారిద్దరూ పండుగ పర్వాలలోనూ శుభకార్యాలప్పుడూ మాత్రమే ఒకర్ని ఒకరు తిరిగి చూచుకునేవారు. ఇప్పుడు ఔపోసన అనే అగ్ని పునరుద్ధరణ, అర్చన జరిగాక పునస్సంధానం (తిరిగి కలయిక) చేకూరేది ఆ వధూవరులకు అందుకే ఈ శుభకార్యాన్ని ఔపోసనం, పునస్సంధానం అని వ్యవహరించేవారు. దంపతులిద్దరూ కొన్ని ప్రాయశ్చిత్త విధుల్ని జరుపుకొని  అగ్ని సమారాధనకు తిరిగి అధికారులవుతారు. ఆనాటి నుంచి పురుషుడు విరక్తుడై సన్యసించి అగ్నుల్ని తన ఆత్మ యందు ఆరోపణం చేసుకునే వరకూ అనుదినం అగ్ని సమారాధన చేయవలసిందే. భార్య పళ్లెంతో అగ్నిహోత్రం తెచ్చి ఇచ్చి అతడి ప్రక్కన కూర్చొని అతడితో పాటు అగ్ని కార్యంలో పాల్గొంటుంది. వివిధ ఔషధులతోనూ, ఆవు నెయ్యి, సువర్ణం, రజతం, ముత్య ప్రవాళాలతోనూ జరిగే ఈ హోమధూమం పవిత్రమయినదీ, ఆరోగ్యకరమైనదీ అని నమ్మేవారు. భార్యను ప్రక్కన వుంచుకొని మాత్రమే అగ్నిని ఉపాసించాలి. ఆమె పరలోకగతురాలయితే అగ్ని ఆమెతోనే తరలిపోతుంది. అంచేత వయోబేధాన్ని, ఇతర సాంసారిక ఇబ్బందుల్ని సరకు చేయక తిరిగి దార పరిగ్రహం చేసేవారు నాటి గృహస్థులు. శ్రీరాముడంతటి వాడు సీతా పరిత్యాగానంతరం మరో స్త్రీకి ఆస్థానం ఇవ్వడానికి అంగీకరించక, ఆమె జీవించివుందన్న నమ్మకంతో హిరణ్మయమైన సీతా ప్రతికృతిని ప్రక్కనుంచుకొని అశ్వమేథయాగాన్ని నిర్వర్తించాడు. ఉదయం అగ్ని హోత్రాలు, కొన్ని వైదిక విధులు నిర్వర్తించాక భోజనాలు జరిగాయి.
    సాయంత్రం మళ్ళీ దంపతుల్ని పీటల మీద కూర్చోబెట్టి ఆమె సత్సంతానవంతురాలు కావాలని మంత్రాలు చదివారు. ఈ కార్యక్రమంలో కూడా పెళ్ళిలోవలనే వరునకు ఇచ్చే బట్టలు ఆడ పెళ్ళివారూ, పెళ్ళి కుమార్తెకు ఇచ్చే బట్టలు మగ పెళ్ళివారూ కొంటారు. ఆ రోజుల్లో పెళ్ళికి నగలూ, కార్యానికి పట్టు చీర అని సామేత. పదిఏళ్ల లోపు వయస్సు పిల్లకు పెళ్ళి చేసే వారు కనుక ఆమె కట్టేవీ.

     అత్తవారింటకూడా మూడు నిద్దర్లు జరిగాక కొడుకును పంపి కోడల్ని, రత్నాన్ని ఇంటికి తెచ్చుకొన్నారు సుబ్బారావు గారు, ఫిబ్రవరి నెల అది. ఏప్రిల్‌ నెలలో సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఏదో విధంగా పరీక్ష వ్రాయగలిగితే రత్నానికి ప్రథమ శ్రేణి ఖాయం. చేతిలో 3వ ఫారం చదివిన సర్టిఫికెట్‌ వుంటే పిల్లకు ఎంతో ఆసరాగా వుంటుందని సుబ్బారావు దంపతులు కొండంత ఆశతో వున్నారు. ఓ రోజు వురమని పిడుగులా కుటుంబం గారి నుంచి ఉత్తరం వచ్చింది. ఎల్లుండి మంచిరోజని తమ కోడల్ని తీసుకొని వచ్చి దిగబెట్టమనీ, దంపతులిద్దరూ చాలా తర్జన భర్జనలు పడ్డారు. వారి వరుస మొదటి నుంచి ఇలాగే వుంది. ఇక తాము చేయగలిగింది ఏముంది. వారి పిల్లను వారికి అప్పగించి ఓ దండం పెట్టడమే అని వారు నిర్థారణకు వచ్చారు. కూతుర్ని తీసుకొని సారె చీరెలతో వచ్చిన సుబ్బారావు గారిని వియ్యాల వారెవరూ మర్యాద చేయలేరు. ఓ అరగంట కూర్చొని తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ బ్రాహ్మడు.
    ఆ సరికి సత్తెమ్మ గారి అప్పగారు సూరమ్మ గారు సాలికి(ఏడాదికి) 10 రూపాయల మనోవర్తితో చెల్లెలు ఇంటికి వచ్చారు. అత్తా, మామలూ ముగ్గురు ముసలమ్మలూ, భర్తా తనూ ఇంత మందికి రత్నమే వంట చేయాలి. వచ్చిన మరునాడు రత్నం ముడిగా చుట్టుకున్న వాల్జడ విప్పించి ముచ్చటముడి వేయించి 8 గజాల నేత చీర, 40 నెంబరుది కచ్చా పోసి కట్టించారు అత్తింటి ఆడవారు. సూరమ్మ గారు ఇదిగో పిల్లా ఇవాల్టికి చెరువుకు దారి చూపిస్తా రా అని మూడు పెద్ద సైజు బిందెలు రత్నం చేతికిచ్చి ఆమె వెంట తను బయలుదేరింది. ఆ రోజుల్లో పల్లెటూళ్లలో మంచినీటి వసతి వుండేది కాదు. ఇళ్లలో సంపన్నులకు కానీ నూతులు వుండేవి కాదు. ఉన్నా ఆ నీరు ఉప్పునీరు త్రాగడానికి పనికి రాదు. రత్నం అత్తారింట్లో అసలు నూయే లేదు. కావలసిన నీరంతా ఊరి చెరువు నుంచి మోసి తేవలసిందే. రత్నం చెఱువులో స్నానం చేసి భర్తవీ, తనవీ క్రితం రోజు ధరించిన బట్టలు ఉతుక్కుని ఓ నీళ్ళ బిందె భుజాన పెట్టుకొని పెరటి గుమ్మాన ఇంటికి వచ్చింది. ఆ తరువాత మరో రెండు సార్లు వెళ్ళి మిగతా బిందెలు తెచ్చింది. ఇంటిలోని వారంతా చెరువుకు వెళ్లి స్నానం చేసి వస్తారు. సత్యానికి  మరి భార్య కాపరానికి వచ్చింది కదా. అతడి హోదా పెరిగింది. భార్య అతడి స్నానానికి నీరు తెచ్చి పెరట్లో పెట్టాలి. పదేళ్ల పిల్ల ఇంతలేసి బిందెలు ఒక్కతే తేగలదా. తాము చేతులు ఊపుకుంటూ రావాలా? అని వారికి తట్టేది కాదు. ఇంటి కోడల్ని ఎంతగా పని పాటల్లో నలిపితే అంత అణకువగా వుంటుందని వాళ్ల ఉద్దేశ్యం. అందులో పట్నం పిల్ల చదువు వెలగబెట్టింది. చదువురాని ఈ పల్లెటూరు మొద్దుని లెఖ్ఖ చేస్తుందా? అసలు పిల్ల చూడబోతే గజ్జలగుర్రంలా పన్నెండేళ్ల పిల్లలా వుంది. ఆ ఈ పాట పని చేయలేదా? ఏమిటీ ఇది రత్నం అత్తవారికి ఆమె పట్ల గల అభిప్రాయం.
    వంటకాలు ఏం చేయాలో చెప్పి ఆడవాళ్లు నలుగురు పొరుగిళ్ళకు పెత్తనాలకు పోయేవారు. ఇంట్లో తల్లి వాకిట చేరినప్పుడు ఆ నాలుగు రోజులూ వంట చేయడం రత్నానికి అలవాటే. అయితే వీరి రుచులకూ, తమ రుచులకూ తేడా వుంది. తల్లిదండ్రులు ఆ నాలుగు రోజులూ తేలికగా అయ్యే వంటకాలేవో చేయించుకొనేవారు. వీరికేం ముఖమాటం. పెరట్లో పుష్కలంగా కొబ్బరి చెట్లు వుండటం వలన ఏ వంటకం చేసినా తప్పనిసరిగా కొబ్బరి తురిమి వేయాలి. ప్రతిపూట కొబ్బరి పచ్చడి వుండి తీరాలి. ఒకపూట వండిన పదార్థాలు మరోపూట తినడం ఆచారం కాదు. అంచేత ఏపూటకు సరిపడా ఆ పూటే వండాలి. నాలుగు కొబ్బరికాయలు కొట్టి పచ్చడి చేయాలి. ఆ కొబ్బరికాయలు ముక్కలు చేయడంలో ఆమె చేతివేళ్లు పచ్చడి అయ్యేవి. ఉప్పు కారం తగిలినప్పుడల్లా మంట, పౌరోహిత్యాల్లో ఓ ఇంటివారు ఒకోరకం బియ్యం ఇస్తారు. వీటిని పొత్తర్లు అంటారు. ఇవన్నీ కలిపి కండువాలో మూట కట్టి ఇంటికి తెచ్చేవారు కుటుంబం గారు. పొయ్యిమీద ఎసరు పెట్టి ఈ బియ్యం పోస్తే ఒకో గింజ చిమిడిపోయేది. ఒకో గింజ వుడికేది. మరొకటి పలుకు వుండేది. రెండు పూటలు రత్నం చివాట్లు తిన్నాక సూరమ్మ గారు పాపం చిన్న పిల్ల దానికి                     ఈ తంటాలన్నీ ఏం తెలుస్తాయర్రా మనం కాస్త పదును చూసి చెప్తే ఏం పోతుంది అంది సత్తెమ్మ గారూ, మంగమ్మ గారూ దానికి భయభక్తులు లేకుండా చేస్తున్నావని ఆమెను మందలించారు. అందరూ పొరుగిళ్లకు వెళ్లిన కాస్సేపటికే సూరమ్మ గారు తిరిగి వచ్చి ఆమెకు అన్నం వార్చే పదును చెప్పి తిరిగి పెత్తనాలు కొనసాగించేది. అన్నం సరిగా కుదరని రోజున కుటుంబం గారు ఆ అన్నాన్ని విస్తరి కేసి బాదుతూ ఊహూ!            ఉండ్రాళ్లు జిల్లేడు కాయలూ అని మూలుగుకొనేవారు. అంతేకాని ఇంటిలోని పెద్ద వాళ్లతో మీరు వంట చేయండి అని చెప్పే ధైర్యం ఆ మగ మహారాజుకు వుండేది కాదు నాలుగు కొబ్బరికాయలు కొట్టి, ముక్కలు చేసి ఆ ముక్కలు రోటిలో వేసి రుబ్బి పాలు తీసి ఆ పాలతో చేసే పరమాన్నం ఇంట్లో అందరికి చాలా ఇష్టం.
    తెల్లవారు ఝామున లేచిన దగ్గర నుంచీ ఈ చాకిరీలతో ఒళ్లు పులిసిపోయిన రత్నం మధ్యాహ్న భోజనం చేసి వంటింటి గడపమీద తలపెట్టుకొని పడుకునేది రత్నం. పెందరాళే భోజనం చేసిన సత్యానికి మధ్యాహ్నం వేళ ఆకలి అయ్యేది. భార్య వద్దకు వచ్చి పిల్లానోటిలోకి ఏమన్నా పెట్టవే అనేవాడు. రత్నం లేచి ఓ కొబ్బరికాయ కొట్టి ఓ తవ్వెడు అటుకులూ, బెల్లం ముక్క కలిపి రోటిలో దంపి, కొబ్బరి చేర్చి వుండలు చేసి పెట్టేది. పుట్టింట చల్దన్నాలు తినే ఆడపిల్లల్ని అత్తవారింటికి రాగానే మడి పనికిరాదని ఆ అలవాటు మాన్పించేవారు. నాటి రోజుల్లో కాఫీ, టిఫెన్ల మాటే తెలియదు చాలా మందికి. ఆ చిన్నపిల్లలు ఆకలితో అందరి భోజనాలు ముగిసే వరకూ మధ్యాహ్నం 1 గంట అయ్యే వరకూ ఖాళీ కడుపుతో వుండవలసి వచ్చేది. 12 గంటలకు ఎడమూటలూ, పెడమూటలూ వేసుకొని మామగారు ఇంటికి వస్తారు. అప్పుడు ఆదర బాదరా స్నానం కానిచ్చి, దేవతార్చన అయ్యిందనిపించి ఆయన భోజనం పూర్తి అయ్యేవరకూ అపరాహ్ణం తిరిగి పోతుంది. ఆయన భోజనం అయ్యాక అత్తగారికీ, ముసలమ్మలు ముగ్గురికీ వడ్డించాలి. వారు ఊరి ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేసే సరికి గంటపైగా పడుతుంది. వాళ్లకి ఏం అవసరం వస్తుందోనని వంటింటి గుమ్మంలో నుంచొని వుండాలి రత్నం వారి భోజనాలు పూర్తయ్యే సరికి రత్నానికి నీరసం క్రమ్ముతుంది. నీవూ భోజనానికి కూర్చో అమ్మా అంటే ఇంటి కోడలు లోకువ కట్టేస్తుందని వాళ్ల భయం. ఆ మూడు  రaాముల వేళకి రత్నానికి ఒకర్తికి అన్నం సహించేది కాదు. పుట్టింట్లో తల్లీ తనూ కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవారు. రత్నం తనకు ఇష్టమైన పదార్థం తల్లి విస్తట్లోంచి తీసుకొని తినేది రేపు మీ అత్తారింటికి వెళ్ళాక ఇలా చేస్తే అందరూ తప్పు పడతారే అమ్మా అనేది తల్లి నవ్వుతూ. ఒక్కో రోజు సత్యం భార్య భోజనం చేసే వేళకు అటుగా వచ్చి గడపపై కూర్చొని భార్యతో కబుర్లు చెప్పేవాడు. ఈ కూర చాలా బాగా చేసావు అనో              ఈ పచ్చడి ఇలా కాకుండా మరో విధంగా కూడా చెయ్యవచ్చు తెలుసా అనో భర్త ఆప్యాయంగా చెప్తుంటే రత్నం ప్రొద్దుట నుంచి పడిన శ్రమంతా మరచిపోయేది. సత్యం కూడా ఇంట్లో ఒక్క పిల్లాడే పెరిగాడు. ఒద్దికగా వుంటూ తన పట్ల ఆప్యాయత కలిగి వున్న ఈ బాలికపట్ల అతడిలో ప్రేమాదరాలు కలిగేవి. ఆమెకు సహాయపడాలని అతడికి వుండేది. కాని పెద్ద వాళ్లు ఏమంటారో అని ముఖమాటం. ఈ దృశ్యం ముసలమ్మల కంటకానీ పడిరదా ఒరేయ్‌ ఆడంగివాడా వంటింట్లో నీకేం పనిరా. అలా వీధిలోకి వెళ్లిరా అనేవారు భార్యని సమాదరించడం వారి దృష్టిలో ఆడంగితనం. ఊరి మీద బలాదూర్లు తిరగడం ప్రయోజకత్వం.
    ప్రొద్దువాటారకుండానే రత్నం సంజగుమ్మాలు ఊడ్చి, నీరు చిలకరించి, ముగ్గు కర్ర వేసేది. దీపం బుడ్లలో చమురు పోసేది. శుభ్రంగా తల దువ్వుకొని పెరట్లో పూసిన పూలు కోసి తెచ్చుకొని దండ కట్టి తలలో పెట్టుకొనేది. ముఖం తోముకొని కాటుక బొట్టు పెట్టుకొని రాత్రి వంటకు మడి కట్టుకునేది.                       ఈ అలంకరణ తంతంతా ముసలమ్మలకు కంట్రకంగానే వుండేది. ఇంటి పెద్ద కూతురైన రత్నానికి చిన్నప్పటి      నుంచీ పనిపాటలు అలవాటే.  అయితే తల్లి బరువు పనులు ఆమెను చేయనీయకుండా తేలికపాటి పనులు చేయిస్తూ, పాటలు, పద్యాలూ చెప్తూ తన వెంట తిప్పుకొనేది. తల్లిలో ఆమెకు స్నేహితురాలు కనపడేది. గృహకృత్యాలు చేయడం క్రీడా వినోదంగా వుండేది. ఇక్కడ మరో ఆడతోడు లేదు. పలకరించేవారే కరువు అన్నట్లుగా వుంది.
    రత్నానికి శుభ్రత ఎక్కువ. ఎక్కువ వాసన వచ్చే సబ్బులు ఆమెకు కిట్టవు. బియ్యము, పెసలూ కలిపి నాలుగు ఖచ్చూరాలు వేసి తిరగలిలో విసిరి ఓ డబ్బాలో పోసుకునేది. రోజూ ఆ సున్ని పిండితోనే              ఒళ్ళు రుద్దుకునేది. సత్యానిది గజస్నానం. నాలుగు చెంబులు నీరు ద్రిమ్మరించుకుంటే అతడి స్నానం అయిపోతుంది. అతడు స్నానం చేసే వేళకు రత్నం అటుగా వెళ్లి సున్నిపిండి పళ్లెం అక్కడ పెట్టి అతడికి వీపు తోముకోవడంలో సహాయపడేది. సత్యానికి ఇది మహాభోగంగా వుండేది. ఈ దృశ్యం ముసలమ్మల కంటపడిరదా మందలించేవారు అయినా రత్నం లెక్క చేసేది కాదు. కోమటింట ఓ అణా (రూపాయలో 16వ వంతు) సన్‌లైట్‌ బట్టల సబ్బు కొనేది ఆమె. చెరువుకు నీటికి వెళ్లినపుడు భర్తవీ, తనవీ బట్టలు ఆ సబ్బుతో తెల్లగా      ఉతికేది. భర్త స్నానం ముగించి వచ్చేసరికి ఆ బట్టలు తీసి సిద్ధంగా పెట్టేది. ఇప్పుడెందుకే ఈ బట్టలూ. ఏలూరు వెళ్లినప్పుడు కట్టుకొంటానులే అనేవాడు భర్త. చక్కగా శుభ్రంగా వుండటంలో వుండే హాయి ఈయనకు ఎందుకు తెలియదు అనుకునేది రత్నం. భర్తపట్ల ఆమె మనస్సు అనురాగపూర్ణం. అతడికి సపర్యలు చేస్తూ శుభ్రంగా వుంచుకోవాలని ఆమె ఆత్రపడేది. చెరువు గట్టున వున్న బట్టలుతుకు రాతిపై బాది శుభ్రంగా            ఉతికి, ఎండలో ఆరేసి చాకింటి బట్టల్లా తయారు చేసేది. ఆ రోజుల్లో చెరువు గట్టునా, నూతి గట్టునా నలు చదురపు రాళ్లు వేసి వుంచేవారు. నేటి చాకిరేవుల్లో వుండే లాంటి అటువంటి రాళ్లపై బాది ప్రజలు తమ బట్టలు ఉతుక్కునేవారు. అవే బట్టలుతుకు రాళ్లు.
    వీరమ్మ గారు ఎప్పుడైనా చేయి తిరగని పనిలో వున్న కోడలికి కాస్త తోడుపడబోతే దాన్ని లోకువ ఇచ్చి భయభక్తులు లేని దానిగా తయారు చేయవద్దని తల్లీ, అత్తగారూ మందలించే వారు. ఇలా నెత్తికెక్కించుకుంటే ఆఖరి రోజుల్లో నీకు గంజి కూడా పొయ్యదు అని హెచ్చరించేవారు. పండుగ పబ్బాలకు కూతుర్ని అల్లుణ్ణి పంపమని సుబ్బారావు గారు ఉత్తరం వ్రాస్తే తాము కోడల్ని వదిలి వుండలేమని, ఆ పండుగేదో తమ ఇంట్లోనే చేసుకుంటామని కుటుంబం గారు జవాబు వ్రాసేవారు. అమాయకుడైన సుబ్బారావుగారు అది నమ్మేవారు.  పిల్ల అక్కడ ఎలా వుందో ఒకసారి వెళ్ళి చూసిరండి అని సుబ్బమ్మ గారు పోరేది. సంవత్సరాది పండుగకు కూతుర్ని అల్లుణ్ణి పంపమని కోరుదామనీ, వాళ్లు పంపితే కూతుర్ని ముందుగా తీసుకొని వెడదామని సుబ్బారావుగారు బయలుదేరి వచ్చారు. సుబ్బారావుగారు గడపలోకి కాలు పెట్టే సరికి చెఱువు నుండి నీళ్ల బిందెతో వస్తూంది కూతురు. తండ్రిని చూడగానే సంతోషం, దుఃఖం ఒక్కసారిగా పొంగి వచ్చాయి ఆమె కొంత సేపటికి సంభాళించుకొని తండ్రికి సపర్యలు చేసింది. ఇంటిలోని వాళ్ళు ఎవరూ ఆయన్ని పలకరించలేదు. కొంతసేపటికి ఊళ్లోకి వెళ్లిన సత్యం వచ్చాడు. మామగార్ని చూసి సంబరంగా పలకరించి, దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాడు. అల్లుడితో తన అభిప్రాయం చెప్పారు సుబ్బారావు గారు దానిదేముంది అమ్మాయిని మీతో తీసుకొని వెళ్లండి. పండుగ నాటికి నేను వస్తాను అన్నాడు సత్యం. సత్తెమ్మ గారు వచ్చి సంవత్సరాదికి మన ఊళ్ళో అమ్మవారి జాతర. జాతర ముందు ఊరి వాళ్ళు ప్రయాణం చేయకూడదని వీడికి తెలియలేదు. మరోసారి వస్తారు లేవయ్యా! అంది సుబ్బారావు గారితో వచ్చిన పని వాకిట్లోనే అయ్యింది. భోజనాల వేళ కుంటుతూ నడుస్తూన్న కూతుర్ని చూసి అదేమిటే అమ్మా! అన్నారు తండ్రి చెరువు నుండి వస్తూ జారి పడ్డాను నాన్న అని కళ్లు తుడుచుకుంది కూతురు. ఏమిటో దీనికంతా తొందరే అంతవడిగా నడవకే అంటే వినదు అంది మంగమ్మ గారు. ఇంట్లో నడి వయస్సు ఆడవాళ్ళు నలుగురు వుండి చిన్న పిల్ల చేత తడి బట్టలతో వీధిలోంచి నీరు తెప్పిస్తున్నారంటే వీళ్ళు ఎంత మర్యాదస్తులో తెలుస్తూనే వుంది. తాము ఈ బిడ్డని ఎంత అపురూపంగా చూసుకున్నారు. సుబ్బారావు గారి మనసంతా బరువెక్కి పోయింది. పనులు తెమల్చుకొని రత్నం వచ్చింది. సుబ్బారావు గారికి ఇంటి ముందు వున్న వసారాలో మంచం వాల్చి ప్రక్క వేసింది. తండ్రి పక్కలో కూర్చొని ఇంటి వారందరి యోగక్షేమాలు పేరు పేరున అడిగింది. ఇక్కడ నాకు బాగానే వుంది నాన్న. ఆయన ఎంతమంచి వారనుకున్నావు. అని తండ్రికి ధైర్యం చెప్పింది. శ్రావణమాసం నోములకు వచ్చి నెలరోజులూ వుంటానని అమ్మకు చెప్పు అంది. నోము ఖర్చులు తప్పుతాయి కదా అని అప్పుడు ఆమెను తప్పకుండా పంపుతారు అత్తారు. ఉదయాన్నే లేచి ఇంటికి ప్రయాణమై వెళ్ళారు సుబ్బారావుగారు.
    మగవారి భోజనాలయ్యాక అత్తగారికి మామగారి విస్తర్లో అన్నం, ముసలమ్మకు విస్తరి పరచి కొబ్బరి రొట్టె ఫలహారం, అందులోకి కొబ్బరి పచ్చడీ, వంకాయ పులుసు పచ్చడీ వడ్డించి వారికి ఏం కావాలో గమనిస్తూ వంటింటి గడపలో నుంచోవాలి రత్నం. నువ్వు కూడా భోజనానికి కూచో అని వాళ్లు అనరు రత్నానికీ భయం. ఊరు, వాడా ముచ్చట్లన్ని చెప్పుకుంటూ వాళ్ళు భోజనాలు ముగించేసరికి జాము సేపు అవుతుంది. వితంతువులు తిన్న విస్తరి సువాసినులు ఎత్తరాదు కనుక ముసలమ్మలు ముగ్గురు విస్తరి మాత్రం బయటపడేసి చేతులు కడుక్కొంటారు. కోడలు అత్తగారి విస్తరి ఎత్తి బయట పడవేసి స్థలం శుద్ధి చేసి భోజనానికి కూర్చోవాలి.
    ఆ మధ్యాహ్నం పనులన్నీ పూర్తయి కాస్త తీరిక చిక్కేసరికి రత్నం మనస్సు పుట్టింట పైకి పోయింది. పాపం అమ్మ ఒక్కతే ఇంటి చాకిరీ అంతా ఒక్కతే చేసుకోవాలి వదిన అంత మంచిది కదా అమ్మకి ఎందుకు కొంచెం కూడా సహాయం చేయదో ఆ బాలికకు ఎంతకూ అర్థం కాలేదు.     

( ఇంకా ఉంది )

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

(ఇంకా వుంది)

– See more at: http://vihanga.com/?p=11538#sthash.415NRgUq.dpuf

162
గౌతమీగంగ, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో