స్త్రీ యాత్రికులు

భారతనారీ వికాసానికి కృషి చేసిన
మేరీ కార్పెంటర్‌

బ్రిటీషువారి పరిపాలనలో మనదేశానికి ఎంతోమంది గొప్పవాళ్ళు వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి, స్పందించి, చాలా సంస్కరణలు చేశారు. అలాంటి వారిలో కలకత్తా నగర నిర్మాత జోబ్‌ ఛెర్నాక్‌, ఇంగ్లీషు విద్య ప్రవేశపెట్టిన టి.బి. మెకాలే, సతీ సహగమనాన్ని రద్దుచేసిన విలియం బెంటింగ్‌ లాంటివారు ముఖ్యులు. వీరందరి కృషివలన సమాజం ఎంతో ముందుకి ప్రయాణించింది. ఈ కృషిలో భాషావేత్తలు, సంఘసంస్కర్తలు, సాహితీవేత్తలు కూడా ఉన్నారు. అలాంటి గొప్పవారి పక్కన స్థానాన్ని సంపాదించిన స్త్రీమూర్తి మేరీ కార్పెంటర్‌.
    భారతదేశంలో స్త్రీలు ఎంతో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారనీ, విద్యా రంగంలో ముందుకి వెళ్ళలేకపోవటమే దానికి ముఖ్య కారణం అని తెలుసుకొని, స్త్రీల విద్యకోసం పాఠశాలలు స్థాపించింది మేరీ కార్పెంటర్‌. చిత్రకళ కోసం కూడా అధ్యయన కేంద్రాలు అవసరం అని మొదటగా సూచన చేసింది ఈమే.
1866-76 సంవత్సరాల్లో ఆమె భారతదేశానికి చేసిన ప్రయాణాల ఫలితంగా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టింది.
    మేరీ కార్పెంటర్‌ గ్రీకు, లాటిన్‌ భాషల్లో పండితురాలు. సైన్సు, గణిత శాస్త్రంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది. మేరీ నాన్నగారు ఒక మినిష్టరు. స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్‌గా కూడా పనిచేసాడు. ఆనాడు యూరప్‌లో జరుగుతున్న
బానిస వ్యాపారానికి ఆయన వ్యతిరేకి. వ్యక్తి స్వేచ్ఛను ఆటంకపరిచే ప్రభుత్వ విధానాల పట్ల అతడు స్పందించేవాడు. అలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతున్న తండ్రి అంటే మేరీకి ఎంతో ప్రేమ, గౌరవం కలిగేది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక భారతదేశ వైతాళికుడు అయిన రాజా రామ్మోహనరాయ్‌ని మేరీ తండ్రి బ్రిస్టల్‌ నగరానికి ఆహ్వానించాడు. ఆ సందర్భంగా మేరీకి రామ్మోహనరాయ్‌ వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన సంఘసేవ, పాండిత్యాన్ని గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. మేరీ జీవితంపై ఇలాంటి గొప్ప సంస్కర్తల ఆలోచనా విధానం ప్రభావాన్ని చూపింది.
    అనారోగ్యం వలన రాజా రామ్మోహన్‌రాయ్‌ బ్రిస్టల్‌ నగరంలోనే మరణించేసరికి, ఆ మహానుభావుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎప్పటికైనా గొప్పపనులు చేయాలన్న సంకల్పం మేరీకి ఏర్పడుతుంది.
    ఇంతలో కొన్ని రాజకీయ కారణాల వలన తండ్రి ఆత్మహత్య చేసుకొంటాడు. ఈ హఠాత్‌ సంఘటనతో మేరీ కార్పెంటర్‌ మానసికంగా దెబ్బతింటుంది. ఆమె పరిస్థితి మామూలు థకి చేరుకొన్నాక, తండ్రి చేస్తున్న సమాజ సేవని కొనసాగిస్తుంది. ‘ఒంటరిగా ఉంటేనే గాని ఆ ప్రయత్నాలు ఫలించవు’ అని తెలుసుకుని ఒంటరిగా ఉండేందుకు నిశ్చయించుకొంది. తల్లిదండ్రులు లేని తన జీవితానికి ఒక అర్ధం ఏర్పడాలంటే గొప్పపనులు చేయాలని సంకల్పించుకొని పేదవారికి చాలా సహాయాలు చేస్తుంది.
    రాజా రామ్మోహనరాయ్‌ పుట్టిన దేశం అయిన ఇండియా చూద్దామని ఎన్నాళ్ళనుండో అనుకొంటూ ఉంటుంది. ఆ కలని నిజం చేసుకోవడానికి 1866 వ సర||లో అంటే తన యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఇండియాకి బయలుదేరింది మేరీ కార్పెంటర్‌. అప్పుడే తనను ఉత్తేజపరిచిన ఆ గొప్ప సంఘసంస్కర్త జీవిత వివరాల్ని తెలిపే గ్రంథాన్ని కూడా ముద్రిస్తుంది.

  ‘ఇండియాలో స్త్రీ విద్య ప్రవేశపెట్టాలి’ అనే విషయం మీద, అనేక ముఖ్యనగరాల్లో తిరిగి ఉపన్యాసాలు ఇస్తుంది. విద్య గురించిన కరపత్రాలు పంచుతూ, పాఠశాలలు స్థాపించటానికి ఆర్ధిక సహాయం చేయవలసిందిగా ఎంతోమంది స్థానిక రాజుల్ని, ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తుంది. భారతీయ జైళ్ళ పరిస్థితులు మెరుగుపరచాలనీ, అభివృద్ధి సంస్కరణలు తేవాలని, ప్రభు త్వాధికారులకి సూచనలు ఇస్తుంది.
    ఇండియాలో ఆంగ్లో ఇండియన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాలకి వెళ్ళి ‘తూర్పు దేశాల్లో ఉండే మీ సోదరీమణుల గురించి ఆలోచించండి, వారి అభివృద్ధికి కృషి చేయండి’ అని ఉపన్యాసాలు ఇచ్చేది. ‘మనం ఎలాంటి పనులుచేస్తే భగవంతుడు సంతోషపడతాడో, అలాంటి శుభ కార్యాలు చేయండి’ అంటూ మంచిని పెంచటానికి సహాయపడేది. భారత స్త్రీని ఉన్నత థకి తీసుకుపోవాలన్నదే ఆమె ఆశయంగా మారిపోయింది.
    మంచి విద్య, ఆరోగ్యం, అవకాశాలు కల్పిస్తే భారతీయులు కూడా అన్ని రంగాల్లో ముందుంటారని, విజయాలు సాధించగలరని, వారి అభివృద్ధికి సహాయపడమని బ్రిటీషువారికి ఎన్నో విధాలుగా తెలియజేసేది. భారతదేశంలో ఎంత ఎక్కువ విద్యావ్యాప్తి జరిగితే అంత మంచిదని ఆమె విశ్వసించేది. తూర్పు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కాబట్టి, భారతీయులు ఎక్కువగా చదువుకోవాలని ఆమె అభిప్రాయం.
    విద్యాలయాల అభివృద్ధికోసం మేరీ కార్పెంటర్‌ తన డబ్బులో ఎక్కువ భాగం ఖర్చుపెట్టింది. దేశమంతా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వటం, డొనేషన్లు వసూలు చేయటం, సొంత అభిప్రాయాల్ని ప్రజలముందు బాహాటంగా చెప్పటం లాంటి కార్యక్రమాలు మొదటగా ప్రచారంలోకి తెచ్చింది ఈమే.
    ఇలాగా అనేక పురోభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకోసం ఇండియాలో నాలుగుసార్లు పర్యటిస్తుంది. ఈ యాత్రల అనుభవాలు అన్నీ గ్రంథ రూపంలోకి తీసుకువచ్చి, దాన్ని రాజా రామ్మోహన్‌ రాయ్‌ (1774-1843)కి అంకితం ఇస్తుంది. ఆ పుస్తకం పేరు వఐరిని ళీళిదీశినీరీ రిదీ |దీఖిరిబివ. మేరీ కార్పెంటర్‌కి భారతీయులంటే ఎంత ప్రేమో దీనివలన తెలిసిపోతుంది.
ఇలాంటి ఉత్తమ సేవల్ని, విద్యా వికాసాలని భారతీయులకి అందించిన మేరీ కార్పెంటర్‌ తన డెబ్భైయ్యవ సంవత్సరంలో లండన్‌లో కన్నుమూస్తుంది.
    భారతనారీ వికాసానికి మేరీ కార్పెంటర్‌ చేసిన కృషి సాటిలేనిది. అందుకే ఆమెను భారత స్త్రీలకు చదువు నేర్పిన ‘ఇంగ్లండు దేశపు సరస్వతి’

పారిపోయిన పనిపిల్ల
ఎలిజా పార్‌హామ్‌

ఎలిజా పార్‌హామ్‌ అమెరికా యాత్రికురాలు. న్యూయార్క్‌ నగరానికి దగ్గిర్లో ఉన్న గ్రామంలో ఆమె బాల్యం అంతా గడుపుతుంది. చిన్నతనంలోనే తల్లి తండ్రులు మరణించటం వలన సొంత పిన్ని దగ్గిరే పెరగాల్సివచ్చింది. ఆవిడేమో ఎలిజాని ఇంటిపనులకి ఉపయోగించుకొంటూ బడికి పంపకుండా చేస్తుంది. ఎలిజాకి 14 సంవత్సరాలు వచ్చినా ఆమెని ఒక బానిసలాగానే చూస్తుంది కానీ ఒక మనిషిలా గుర్తించదు. తన అక్క కూతురు కదా అనే విషయం పూర్తిగా మరిచిపోతుంది. ఎలిజాకి మాత్రం చదువుకోవాలి అనే కోరిక బలపడుతూనే ఉంటుంది. ఎండిపోయేనదికి దాహం ఎక్కువౌతున్నట్లుగా, వయసు పెరిగి పోయేకొద్దీ అందరిలాగా చదువుకోవాలి అనే ఆలోచన పెరుగుతూనే ఉండేది ఎలిజాకి.
    ఎలిజా పదిహేనో సంవత్సరంలోకి అడుగుపెట్టగానే, రెక్కలు వచ్చిన పక్షిమాదిరిగా, జైలునుంచి బయటపడ్డ నిరపరాధిలాగా ఇల్లినాయ్‌కి పారిపోతుంది.
    ఐదు రాష్ట్రాలు దాటుకుని, వేల మైళ్ళు ప్రయాణం చేసిన ఎలిజా పార్‌హామ్‌ ఇల్లినాయ్‌లో వివిధరకాల పనులు చేసుకుంటూ, బాక్స్‌కార్‌ బెర్తా మాదిరిగా, రాత్రిపూట పాఠశాలకి వెళ్ళి చదువుకుని, ఆరు సంవత్సరాలలో పెద్ద పండితురాలైపోతుంది.
తన అదృష్టం కొద్దీ థామస్‌ జఫర్‌సన్‌ అనే లాయరు, ఎలిజాను ప్రేమించి, పెళ్ళి చేసుకొంటాడు. ఈ లాయరు తీరిక సమయాల్లో యాత్రా సాహిత్యాన్ని కూడా రాస్తుంటాడు. అందువలన ఎలిజాను తన ‘సాహస న్యూయార్క్‌-ఇల్లినాయ్‌ ప్రయాణాన్ని’ గురించి రాయమని ప్రోత్సహించి, ఆమె అనుభవాల్ని గ్రంథస్తం చేయిస్తాడు. ఆ యాత్రా పుస్తకం అమెరికాలో సంచలనం సృష్టిస్తుంది.
    తనకి దారిలో ఎదురైన అనేక రకాల వ్యక్తులతో ఎలాగ ప్రయాణాలు చేసిందో, వారితో ఎంత జాగ్రత్తగా మెలగవలసి వచ్చిందో ఆ పుస్తకంలో తెలియ జేస్తుంది. ఆనాటి స్త్రీలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి ఎలిజా పార్‌హామ్‌ యాత్రలు. నిరుద్యోగ యువతులకు, సంచారాలు చేయవలసి వచ్చిన స్త్రీలకి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒంటరిగా ప్రయా ణాలు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొత్త విషయాలు చెప్పటంవలన పంధొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలో అమెరికన్‌ స్త్రీలు ఎక్కువగా ప్రయాణాలు చేయటం జరిగింది. ఆ విధంగా ఎలిజా రాసిన యాత్రా సాహిత్యం చాలా మందికి ఉపయోగపడింది.

న్యూజిలాండ్‌ అడవుల్లో
మేరీ అన్నీ బార్కర్‌

మేరీ అన్నీ బార్కర్‌ లండన్‌లో జీవిస్తున్నా  ఆమె మనసంతా న్యూజిలాండ్‌ అడవుల్లోనే తిరుగుతూ ఉండేది. ఎందుకంటే ఆమె భర్త న్యూజిలాండ్‌లో క్రీస్టుచర్చి అనే చోట గొర్రెల పెంపక కేంద్రాన్ని స్థాపించి, ఎక్కువ కాలం అక్కడే ఉండేవాడు. అందువలన మేరీ లండన్‌ మహా నగరంలో ఒంటరిగా ఉండలేక, భర్తవద్దకి వెళుతుంది.
    వారి గొర్రెల కేంద్రంలోని పరిసరాలన్నీ అడవులు, సరస్సులతో నిండి ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో మొలిచే పచ్చగడ్డికి లోటులేదు. జంతువులకి నిత్యం కడుపునిండుగా ఆహారం దొరికేది. అలాంటి పరిసరాల్లో తిరగాలని, గొర్రెలను తిప్పే కాపరులతో పాటుగా మేరీ కూడా బయలు దేరేది. పరిసరాల్లో ‘బుష్‌మెన్‌’ అనే స్థానికులు నివసిస్తూ ఉంటారు. వారి జీవన విధానాన్ని గురించి స్వయంగా తెలుసుకుందామని ఆరాటం ఎక్కువగా ఉండేది. అప్పుడప్పుడు కాపరులతో పాటుగా వెళ్ళి వేట కూడా చేద్దామనిపించేది.
ఒకసారి మేరీ గొర్రెల కాపరుల్ని, సహాయకుల్ని తీసుకొని గుర్రపు బగ్గీలో బయలుదేరి వేటకి వెళుతుంది. పెద్ద పొదల వద్దకు చేరుకొన్నాక అందరూ బండి దిగాల్సివచ్చింది. పరిసరాల్లోని చెట్ల మధ్యగా ఉన్న జంతువుల బాటల్లోకి వెళతారు. మేరీకి ఒళ్ళంతా గీసుకుపోయి రక్తం కారుతూ ఉంటే, ఆ చిన్న గాయాలు చూసుకొని నవ్వుతూ తిరిగేది.
    పరిసరాల్లో ఉంటున్న బుష్‌మెన్‌ ఒకొక్కరికి ఇరవై ఎకరాల స్థలం ఇస్తుంది ప్రభుత్వం. ఆ పొలాల్లో వారు గడ్డి పండించుకొని జీవిస్తుంటారు. దగ్గిరలో చెట్లలోగుండా ప్రవహించే ‘వైమాకిరిరి’ అనే నది, బోనులో పులిలా కనిపిస్తుంటుంది. చెట్ల నిండా పావురాయి పిట్టలు, కాకా పరకీట్స్‌ అనే తోక పొడుగు పిట్టలు ఉంటాయి. వాటి అరుపులతో అడవి అంతా పండుగ చేసుకొన్నట్లుగా ఉంటుంది. ఆకాశం అంతా బులుగు రంగు. అడవి బాతులు ఎగరని క్షణం ఉండదు. టపటపామని కొట్టుకునే వాటి రెక్కల శబ్దం, గుర్రపు డెక్కల శబ్దాన్ని గుర్తుకుతెచ్చేది. వారు ముందుకు వెళ్ళేకొద్దీ పశువులు మందలుగా కనిపిస్తూనే ఉంటాయి. స్థానికులు తమాహక్‌ అనే గొడ్డలితో, అడ్డొచ్చిన కొమ్మల్ని నరుక్కుంటూ ముందుకు వెళుతుంటారు. కొన్ని పెద్ద చెట్లకి ‘గంట్లు’ పెట్టేవారు. వచ్చేటప్పుడు దారి గుర్తులకోసం.
ఆవులు తిరిగిన గుర్తులున్న చోటుకి రాగానే అందరూ ఒక్కసారిగా పెద్దగా నవ్వుకొంటారు. ఎందుకంటే ఇప్పటివరకూ అడవి జంతువుల భయంతో కిక్కురుమనకుండా వస్తారు. ఇక్కడ పులులు ఉండవు అని, ఆవుల గిట్టల గుర్తులు చెప్పే సాక్ష్యంతో వారందరూ హాయిగా గాలి పీల్చు కొంటారు.
    మరికొంతదూరం వెళ్ళాక వివిధ రంగుల్లో ఉన్న పకక్షులు కొమ్మల ఊయల్లో ఊగుతూ, పాడుతూ ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తున్న మేరీ ప్రపంచాన్ని మరచిపోయేది. నీనామజుషెల్లీ మాదిరిగా ఈమె కూడా ప్రకృతిలో పరవశించిపోయే మనసుగలది.
    అలా వెళుతూ ఉండగానే ఆ రోజు చీకటవుతుంది. వెంటనే ఎండిన కట్టెలు తెచ్చి, మంట వేసుకొంటారు.
    ఆ రాత్రికి అడవిలోనే అందరూ గుడారాలు వేసుకుని కథలు చెప్పుకొంటూ, రాత్రంతా మేలుకొనే ఉంటారు.
తెల్లారగానే గ్రేట్‌బుష్‌ అనే ప్రదేశానికి వెళతారు. అక్కడ స్థానికులు అందరూ దగ్గరలో ప్రవహించే నదీ తీరంలో, బంగారం కోసం ఇసుకని గాలిస్తూ కనిపిస్తారు. ఇంటి గోడ మాదిరి నిలువుగా ఉండే చిన్న కొండల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళగా, దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. వారి తడిచిన బట్టలు, గాట్లు పడిన చేతుల్ని చూసిన ఆ ఇంటి కుక్క వీళ్ళమీదకి దూకుతుంది. ఇంటి యజమాని మేరీ బృందానికి మంచి మాంసం, కూరలు, వేడినీళ్ళు ఏర్పాటు చేస్తాడు. మేరీని చూసి, ‘నీవు అబ్బాయివి అనుకొన్నాను’ అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తాడు.
    వేటకోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా తిరుగుతారు. కుందేలు, జింక లాంటి చిన్న జంతువులు కనిపించగానే వాటిని ముద్దు పేర్లతో పిలిచి, వేటాడనీయకుండా అడ్డుపడేది లేదా పెద్దగా అరిచి వాటిని పారిపొమ్మని కేకలు వేసేది మేరీ. ఆ రోజు వారితో వచ్చిన బుష్‌మెన్‌లు జింకను చంపి, ఆ మాంసాన్ని తీసుకు వెళుతున్నప్పుడు మాత్రం ‘వారి ఆకలి తీరాలంటే వేట చేయక తప్పదు, మనం చేయటం తప్పుకదా’ అని వివరిస్తుంది జంతు ప్రేమగల మేరీ.
    తెల్లారగానే గ్రేట్‌బుష్‌ అనే ప్రదేశానికి వెళతారు. అక్కడ స్థానికులు అందరూ దగ్గరలో ప్రవహించే నదీ తీరంలో, బంగారం కోసం ఇసుకని గాలిస్తూ కనిపిస్తారు. ఇంటి గోడ మాదిరి నిలువుగా ఉండే చిన్న కొండల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళగా, దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. వారి తడిచిన బట్టలు, గాట్లు పడిన చేతుల్ని చూసిన ఆ ఇంటి కుక్క వీళ్ళమీదకి దూకుతుంది. ఇంటి యజమాని మేరీ బృందానికి మంచి మాంసం, కూరలు, వేడినీళ్ళు ఏర్పాటు చేస్తాడు. మేరీని చూసి, ‘నీవు అబ్బాయివి అనుకొన్నాను’ అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తాడు.
    వేటకోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా తిరుగుతారు. కుందేలు, జింక లాంటి చిన్న జంతువులు కనిపించగానే వాటిని ముద్దు పేర్లతో పిలిచి, వేటాడనీయకుండా అడ్డుపడేది లేదా పెద్దగా అరిచి వాటిని పారిపొమ్మని కేకలు వేసేది మేరీ. ఆ రోజు వారితో వచ్చిన బుష్‌మెన్‌లు జింకను చంపి, ఆ మాంసాన్ని తీసుకు వెళుతున్నప్పుడు మాత్రం ‘వారి ఆకలి తీరాలంటే వేట చేయక తప్పదు, మనం చేయటం తప్పుకదా’ అని వివరిస్తుంది జంతు ప్రేమగల మేరీ.

 – ప్రొ.ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో