హలో ..డాక్టర్ !

పాత రోజుల్లో లేదా  పల్లెటూళ్లలో  ఇంటి దగ్గరే పెద్ద  వాళ్ళు కాన్పులు చేస్తున్నారు కదా ? ఆస్పత్రులలోనే  తప్పని సరిగా  చేయాలా? – స్వప్న , శ్రీకాకుళం .

హాస్పిటల్లోనే తప్పని సరిగా ప్రసవించాల్సిన క్లిష్టమైన కేసులు:

1.    18 ఏళ్ళ లోపు, 30 ఏళ్ళు పైబడిన స్త్రీలు మొదటిసారి గర్భవతులయినప్పుడు.
2.    145 సెం.మీ. కంటే తక్కువ ఎత్తు వున్న మొదటి గర్భవతి.
3.    తొమ్మిదవ నెల వచ్చాక బిడ్డ తల జనన మార్గంలోకి దిగని మొదటి గర్భవతులు.
4.    తొమ్మిదవ నెల వచ్చాక బిడ్డ తల క్రిందకు వుండకుండా అసహజమైన స్థానంలో వుండడం.
5.    ఇంతకుముందు కాన్పుల్లో సమస్యలు వచ్చినవారు
6.    ఇంతకుముందు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి బిడ్డని తీసినప్పుడు, లేక గర్భాశయంలో కణితుల్ని ఆపరేషన్‌ చేసి  తీసినప్పుడు.
7.    గర్భం తొలి నెలల్లో కాని నెలలు నిండుతున్నప్పుడు గాని రక్తస్రావమయితే
8.    కొన్ని వ్యాధులు – గుండె జబ్బు, మధుమేహం, క్షయ, థైరోటాక్సికోసిన్‌, తీవ్ర రక్తహీనత .

9.    జనన మార్గం సరిగ్గా లేనప్పుడు.
10.    కవలలు వున్నప్పుడు, ఉమ్మనీరు ఎక్కువగా వున్నప్పుడు – ఈ రెండూ కలిసి లేక వేర్వేరుగా వుండవచ్చు.
    ప్రమాదాలు – గర్భంతో వున్నప్పుడు, ప్రసవమయాక తీవ్ర రక్తహీనత, కవలల్లో రెండో బిడ్డ బయటకు రావడం  కష్టమవడం, నెలలు నిండకముందే పురుడు రావడం, రక్తపోటు ఎక్కువవడం, గుర్రపువాతం రావడం.
11.    రక్తపోటు ఎక్కువగా వున్నప్పుడు రాగల ప్రమాదాలు –
1)    బిడ్డ గర్భం లోపల పోవడం.
    2)    గుర్రపువాతం రావడం.
    3)    మాయ విడిపోయి రక్తస్రావం ఎక్కువగా అవడం.
    4)    తల్లి మెదడులో రక్తనాళాలు చిట్లి గాని, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి గాని అనేక ప్రమాదాలు ముంచుకు   రావడం.
12.    ఇంతకుముందు నెలలు నిండకముందే ప్రసవమవుతున్నవారు – నెలలు నిండని బిడ్డను ఇంట్లో ప్రసవమయాక   హాస్పటల్‌కు తరలించే కంటే హాస్పటల్లోనే ప్రసవమయితే బిడ్డ బ్రతికే అవకాశం ఎక్కువ.
13.    ఆర్‌.హెచ్‌. నెగటివ్‌ బ్లడ్‌ వున్నవారు
14.    జనన మార్గం ఇరుకుగా వున్నవారు.
15.     సర్విక్స్‌కి ఆపరేషన్‌, గర్భాశయం క్రిందకు జారినందుకు

హాస్పిటల్లోనే తప్పని సరిగా ప్రసవించాల్సిన క్లిష్టమైన కేసులు:

1.    18 ఏళ్ళ లోపు, 30 ఏళ్ళు పైబడిన స్త్రీలు మొదటిసారి గర్భవతులయినప్పుడు.
2.    145 సెం.మీ. కంటే తక్కువ ఎత్తు వున్న మొదటి గర్భవతి.
3.    తొమ్మిదవ నెల వచ్చాక బిడ్డ తల జనన మార్గంలోకి దిగని మొదటి గర్భవతులు.
4.    తొమ్మిదవ నెల వచ్చాక బిడ్డ తల క్రిందకు వుండకుండా అసహజమైన స్థానంలో వుండడం.
5.    ఇంతకుముందు కాన్పుల్లో సమస్యలు వచ్చినవారు
6.    ఇంతకుముందు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి బిడ్డని తీసినప్పుడు, లేక గర్భాశయంలో కణితుల్ని ఆపరేషన్‌ చేసి  తీసినప్పుడు.
7.    గర్భం తొలి నెలల్లో కాని నెలలు నిండుతున్నప్పుడు గాని రక్తస్రావమయితే. 

8.    కొన్ని వ్యాధులు – గుండె జబ్బు, మధుమేహం, క్షయ, థైరోటాక్సికోసిన్‌, తీవ్ర రక్తహీనత .

9.    జనన మార్గం సరిగ్గా లేనప్పుడు.
10.    కవలలు వున్నప్పుడు, ఉమ్మనీరు ఎక్కువగా వున్నప్పుడు – ఈ రెండూ కలిసి లేక వేర్వేరుగా వుండవచ్చు.
    ప్రమాదాలు – గర్భంతో వున్నప్పుడు, ప్రసవమయాక తీవ్ర రక్తహీనత, కవలల్లో రెండో బిడ్డ బయటకు రావడం         కష్టమవడం, నెలలు నిండకముందే పురుడు రావడం, రక్తపోటు ఎక్కువవడం, గుర్రపువాతంరావడం.
11.    రక్తపోటు ఎక్కువగా వున్నప్పుడు రాగల ప్రమాదాలు –
    1)    బిడ్డ గర్భం లోపల పోవడం.
    2)    గుర్రపువాతం రావడం.
    3)    మాయ విడిపోయి రక్తస్రావం ఎక్కువగా అవడం.
    4)    తల్లి మెదడులో రక్తనాళాలు చిట్లి గాని, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి గాని అనేక ప్రమాదాలు ముంచుకు  రావడం.
12.    ఇంతకుముందు నెలలు నిండకముందే ప్రసవమవుతున్నవారు – నెలలు నిండని ఆపరేషన్‌, ఫిస్టులా వున్నప్పుడు ఆపరేషన్‌ చేసివుంటే
రాగల ప్రమాదం – సర్విక్స్‌, యోని పైభాగం అకస్మాత్తుగా ప్రసవ సమయంలో చిట్లిపోవచ్చు.
    పొత్తి కడుపులో కణితులు వుంటే ప్రసవ సమయంలో బిడ్డ క్రిందకు దిగడంలో ఆటంకం కలగవచ్చు
16.    పెళ్ళయిన చాలా సంవత్సరాలకు గర్భం వచ్చినప్పుడు.
17.    బాగా లావుగా వున్నవారు.
18.    సామాజికంగా బాగా వెనుకబడినవారు.
19.    గర్భం సమయంలో తల్లి మొత్తం బరువు పెరుగుదల 5 కె.జి.ల కంటే తక్కువ వున్నప్పుడు.

గర్భిణి స్త్రీ సంరక్షణ అంతిమ లక్ష్యం : 

ఆరోగ్య పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించడానికి, వ్యాధి నిరోధక చర్యల గురించి తెలియ చెప్పటానికి గర్భిణి స్త్రీ సంరక్షణ మంచి సాధనం.  గర్భిణి స్త్రీ సంరక్షణ అంతిమ లక్ష్యం బిడ్డ సురక్షితంగా తల్లి గర్భంలో నుండి బయటపడడం.  ప్రసవ సమయంలో సరైన సహాయం లేకపోతే గర్భంతో వున్నప్పుడు చేసిన సంరక్షణ వృధా అవుతుంది.  గర్భవతుల సంరక్షణని చాలామంది వైద్యులు చెయ్యగలిగినప్పటికి నిపుణుల దగ్గరకు పంపవలసిన క్లిష్టమైన కేసులు కొన్ని వుంటాయి.  యీ కేసుల్ని గుర్తించి నిపుణుల దగ్గరకు పంపడంవల్ల ప్రసవ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.  గర్భిణి స్త్రీ సంరక్షణ పరిమితుల్ని కూడా తెలుసుకోవడం మంచిది.  కొన్ని ప్రమాదాల్ని ఎంత జాగ్రత్తగా, ఎంత సమర్ధవంతమైన పద్ధతిని అనుసరించినప్పటికి నివారించలేము.  కొన్ని కేసుల్లో ముందుగా హెచ్చరికలు లేకుండా ప్రమాదాలు ముంచుకొస్తాయి.  ఎక్కువ భాగం కేసుల్లో గర్భిణి స్త్రీ సంరక్షణ సజావుగా వుంటే గర్భం నిరపాయంగా పెరిగి సులభంగా ప్రసవం జరుగుతుంది.

 – డా. ఆలూరి విజయలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 
S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 
తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో