అంతరంగ అంతరం

ప్రపంచంలో మూడవ వంతు ఉన్నవారు

ప్రగతివైపు లోకాన్ని నడిపించేవారు

తలితండ్రుల ఆశల స్వప్నాలు

మున్ముందు తరాలకు వారసత్వ దివిటీలు

వెన్ను ముదరక ముందే మనసు చెదిరి

మీరు చేసే దుష్కార్యాలు

మానవ లోకాన్ని కృంగ దీస్తోందని ఎరుగరా?

అమ్మ అదిలిస్తే ఆగ్రహిస్తారు.

నాన్న మందలిస్తే తిరగబడతారు

ఉపాధ్యాయులు ఉద్బోధిస్తే ఉక్రోష పడతారు

ఎందుకిలా జరుగుతోంది?

ఎందుకీ వైరుధ్యం మన మధ్య ?

తరాల అంతరం కాదిది

అంతరంగాల అంతరం

విచక్షణా రాహిత్యపు

వైరస్ సోకిన మీ యవ్వనాన్ని

ప్రేమకు, ద్వేషానికి తేడ తెలియని మీ కౌమారాన్ని

ఉన్మాద ఉదంతాలుగా

మారుతోన్న మీ ఉద్రేకాల్ని

కఠిన శిక్షలు  కాటేస్తాయని

ఎలా నచ్చ చెప్పడం?

అమ్మ  నాన్నలుగా చెబితే తలలెగరేస్తారు

తాతలుగా చెప్పేందుకు వారి మాటలకు

తావే ఇవ్వరు

మాష్టార్లు మీకు బఫూన్లు

నరుకుతోన్నది మీకు నచ్చని మనిషిని అనుకుంటున్నారు కానీ

నశిస్తోంది మీ జీవితమన్న స్పృహ కోల్పోయారు

పత్రికలన్నీ మిమ్మల్ని మీ పేరులతో గాక

ప్రేమోన్మాదులని, ఈర్ష్యాళువులని పిలుస్తోంటే

రాక్షస జన్మలని

మా కన్న పేగుల్ని

శాపనార్ధాలు పెడుతోంటే

కలలుగా మిమ్మల్ని

కడుపున మోసిన కన్నతల్లులమై

కడుపుకోతతో  ఆక్రోశించాలా?

కరకుతనంతో చీదరించాలా?

వారసులని, వారదులని వేనవేల ఆశలను

విచ్చిన్నం చేస్తున్నారే

పిచ్చి తండ్రులారా!

అని కడుపున దాచుకునేంత

చిన్న తప్పులా మీరు చేస్తున్నవి?

వైపరీత్యపు విచ్చుకత్తులకు

ఉన్మత్తులై కుత్తుకలిచ్చేస్తోంటే

మా ప్రాణ దీపాలై ప్రదీప్తిన్చాల్సినవారు

పసి ప్రమిదలుగానే పగిలి పోతుంటే

ఏమి చెయ్యమంటారు?

పుత్రోత్సాహం కోసం ఎదురు చూసే

మావన్నీ శిధిల స్వప్నాలేనా?

నాన్నలతో బాటే

అమ్మలం కూడా

మా కాలాన్నీ కష్టాన్నీ కాసులకు అమ్ముకుంటోంది

కటకటాల వెనుక మిమ్మల్ని చూసే

ఈరోజు కోసమేనా?

ఆవేశం మీ వయసుకు సహజమే

అందుకు ఆయుధం అభివ్యక్తి కాదు

మనిషిని మనిషిగా బ్రతికించేదే

ప్రేమని తెలుసుకోవాలి

కత్తి పట్టుకుని కదిలేముందు

ఒక్క క్షణం అమ్మ చల్లని

ఒడిలో సేదతీరండి

నాన్న చేతి వెచ్చని స్పర్శని

నుదుటున తాకించుకోండి

ప్రేమంటే ప్రేయసి మాత్రమే కాదని

ప్రేమంటే పేగు బంధమని

ప్రేమంటే లోక బాంధవ్యమని

మీకు మీరే తెలుసు కుంటారు

చిన్ని నాన్నలూ !

కరకు తనంతో నరికేది

వలపు కానేరదు

మిమ్మల్నీ మీ వారినీ

మీరు నరికిన వారి కన్నవారినీ

క్షోభ పెట్టేది ప్రేమకాదు

అది మీ తరాన్ని

నిట్ట నిలువుగా

చీల్చేస్తోన్న అసహనం, నిర్వీర్యత…

-జగద్ధాత్రి

కవయిత్రి పరిచయం :

కవిత్వం కధలు, వ్యాసాలు రాయడం, అనువాదాలు చేయడం సాహిత్యమే జీవితంగా జీవించడం. నమ్ముకున్న ఒకే ఒక

అంశం “ప్రేమ” ఎప్పటికైనా సకల మానవ ప్రేమే అందరినీ కలిపేది అందుకు రచయిత బాధ్యత ఎంతో ఉందని నమ్మకం.


కవితలు, , , , , , , , , Permalink

5 Responses to అంతరంగ అంతరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో