కాత్యాయనీ విద్మహేకి అభినందనలు !

 సాహిత్య అకాడెమీ పురస్కారానికి ఎంపిక అయిన విద్యావేత్త, రచయిత్రి ,

ఆచార్య ‘కాత్యాయనీ విద్మహే’ కి

  ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక , సాహితీ అభిమానుల అభినందనలు !

sdm011png

kondepudi

డబుల్ ధమాకా! 🙂
ఒక చేత మనవరాలు…మరో చేత పురస్కారం! అభినందనలు !
                చిత్రం: కొండెపూడి నిర్మల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

                                             నా భావన

         Picture 245 కాత్యాయిని విద్మహేగారు రచించిన “సాహిత్యాకాశంలో సగం “అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందిన సందర్భంగా విహంగ వీక్షకులతో నాలుగు మాటలు పంచుకోవాలనుకుంటున్నాను .కాత్యాయిని విద్మహే గారి సాహిత్య కృషిని గూర్చి రాసే స్థాయి నాకు లేకపోయినప్పటికీ సాహసిస్తున్నాను.                                

          మొదటగా మా ప్రరవే సంస్థ అధ్యక్షురాలైన కాత్యాయిని విద్మహే గారికి అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ పుస్తకంలోని వ్యాస సంకలనాలలో కధా,కవిత్యం లాంటి ప్రక్రియలలో స్త్రీలు చేసిన కృషిని ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈ కృషి ఒక ఉద్యమంగా కొనసాగాలని ఆశించటం కాత్యయినిగారి ఔన్నత్యానికి నిదర్శనం. స్త్రీల అస్థిత్వ చైతన్యం గురించి ఒక క్రమంలో దశల వారిగా విశ్లేషించటం ద్వారా ఆనాటి నుండి ఈనాటి వరకూ రాజకీయ,ఆర్ధిక,సామజిక, సాంస్కతిక రంగాలలో జరిగిన పరిణామాలలో సాహిత్యరంగంలో రచయిత్రుల పాత్రను గురించి సవివరంగా తెలుసుకొని అర్ధంచేసుకునే సదవకాశాన్ని కలిగించారు.ఈ పుస్తకం ద్యారా స్త్రీల సాహిత్యాన్ని ప్రత్యేకంగా గుర్తించవలసిన అవసరాన్ని తెలియజేశారు .
            కాత్యాయిని విద్మహేగారు చెప్పిన్నట్టుగా  ఆకాశంలో సగమయిన స్త్రీలు సాహిత్యకాశంలో కూడా సగాన్ని ఆక్రమించుకునే భవిషత్తు కోసం సమిష్టి కార్యాచరణకు సన్నద్ధమవ్వాల్సిన అవుసరం ఎంతైనా ఉన్నది . కాత్యాయిని విద్మహేగారు ఇటువంటి మరిన్ని  విశ్లేషనాత్మక గ్రంధాలను వెలుగులోకి తీసుకు వస్తారని ఆశిస్తూ  మరొకసారి అభినందనలను తెల్పుతున్నాను. 

  – కవిని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

విమర్శాకాశంలో సగానికి దారులు పరిచిన  కాత్యాయనీ విద్మహే!

siva lakshmi

siva lakshmi

“ సాహిత్యాకాశంలో సగం

స్త్రీలకవిత్వం-కథ-అస్థిత్వ చైతన్యం “

అనే విలువైన గ్రంధాన్ని రచించిన కాత్యాయనీ విద్మహే గారు 2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సాహిత్య ఆకాడమీ అవార్డుని గెల్చుకున్నారు.

స్త్రీల సాహిత్య అధ్యయన పద్ధతి- పరిణామం,

స్త్రీల కవిత్వం,

స్త్రీల కథ

అనే మూడు విభాగాల్లో స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి స్త్రీల రచనల క్రమ వికాసాన్ని సమగ్రంగా పరిశీలించి విశ్లేషించారు.ప్రాచీన కాలంలోని స్త్రీలు తమ రచనల్ని  పురుషాధిక్య సమాజ ప్రభావం వల్ల ఆత్మ న్యూనతతో భద్రపరచుకోలేకపోయారు. ఆ స్త్రీల రచనలు ఇప్పుడు లభ్యం కానందువల్ల పూర్తిగా సేకరించ లేకపోయారు కాత్యాయని.

పురుషులు వెలువరించిన సాహిత్య చరిత్రలలో స్త్రీల సాహిత్యానికి ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. 1950 కి ముందు 500 పైగా రచయిత్రులున్నా వారికి తెలుగు సాహిత్య చరిత్రలో చోటే దొరకలేదంటారు కాత్యాయని. ఆ ఆవేదన నుంచి మొదలైన ఆమె అధ్యయనం,నిశిత పరిశీలనాశక్తితో చేస్తున్న నిరంతర విశ్లేషణలు ఆమె విమర్శనా దృష్టిని పదునెక్కించాయి. సాహిత్య విద్యార్ధిగా ఉన్నప్పటినుంచి స్త్రీ సమస్యలపట్ల ఆర్ధ్రతతో నిబద్ధతగా నిజాయితీగా స్పందించారనడానికి  ఈ 30 ఏళ్ళ ఎడతెగని కృషే తిరుగులేని నిదర్శనం!  

భక్తి,సంస్కరణ, ఉధ్యమాల్లో స్త్రీలు ఆయా కాలాల చైతన్య పరిధిలోనే రచనలు చేసినప్పటికీ ,వాళ్ళు చేసిన రచనలకు   సాహిత్య చరిత్రలో సరైన చోటు లభించలేదు. 11,12 వ శతాబ్దాల్లో కులీనుల,రాచకుటుంబీకుల భార్యలు,అక్క చెల్లెళ్ళు తమ ఇంట్లోని తండ్రులు,అన్నదమ్ములు,భర్తల ప్రోత్సాహంతో విద్యావంతులై రచనలు చేశారు. ఆ కాలంలోనే “మొల్ల”-సరళమైన తెలుగు భాషలో “సంగ్రహ రామాయణం” రాసి,కులం తక్కువ స్త్రీగా, సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తరిగొండ వెంగమాంబ తన రచనల్లో శిరోముండనాన్ని వ్యతిరేకించారు. స్త్రీలు గడప దాటకూడదనే ఆంక్షలున్నకాలంలో “ఆంధ్ర మహిళా గాన సభ”ని నడిపిన “నాళం సుశీలమ్మ” కృషిని కొనియాడారు. నేడు సాహిత్య విద్యార్ధులకు పాఠ్య పుస్తకంగా ఉన్న “చందోహంసి” ని పాఠశాల కెళ్ళి విద్యనేర్వని “బుర్రా కమలాదేవి” గారు రాశారంటే ఆ రోజుల్లోనే స్త్రీలలో ఎంత మేధావులున్నారో నని ఆశ్చర్యపోతాం! 

ఈస్త్రీలందరూ ఏ రకమైన ఉద్యమాలతో సంబంధంలేనివాళ్ళు.తమ జీవితంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే  తాము చూసిందీ,అనుభవించిందీ గుర్తు తెచ్చుకుని రాశారు. కానీ ఆ రాసిన వాటిలో రాజకీయాలు తప్పకుండా ఉంటాయి. ఆ కాలంలో స్త్రీలు అబలలు, బలహీనులు, కమ్యూనిటి ఆస్తులుగా మాత్రమే ఉండేవారు. తమకు తాముగా, తామంతట తాముగా ఆలోచించుకోలేని, బ్రతకలేని, అస్తిత్వ రహితులు.  కానీ మొల్ల, తరిగొండ వెంగమాంబ, నాళం సుశీలమ్మ, బుర్రా కమలాదేవి – వీరందరూ నిజజీవిత ఆచరణలోనూ,రచనల్లోనూ  మహిళాభ్యుదయం కోసం సమాజాన్ని ధిక్కరించే మొదటి అడుగులు వేసి చరిత్రలో  తమ అస్థిత్వాన్ని నిలుపుకున్న విధానాన్ని కాత్యాయని వర్ణించారు.మూఢాచారాల, మూర్ఖపు లోకంలోమొదటి అడుగులు ఎంతో కష్టభూయిష్టమైనవి కదా ?

అలాగే మౌఖిక సాహిత్య సంప్రదాయంలో రచనలు చేసిన తెలంగాణా వీరవనిత “మాడల సాలమ్మ” కృషిని వివరించారు. 1975-85 మధ్య కాలంలో అట్టడుగు వర్గాల స్త్రీల వెతలను తెలియజెప్పిన “ఎల్లి”,”నీలి”,”అడవి పుత్రిక” వంటి నవలలను పరిశీలించారు.  

కొడవటిగంటి కుటుంబరావు గారన్నట్లు స్వాతంత్ర్యo కోసం జరిగిన జాతీయోద్యమపోరాటం  ప్రజలకు కలిగించిన చైతన్య దీప్తి చాలా తక్కువ! ఆ రవ్వంత వెలుగులోనే స్త్రీ విద్య,వితంతు వివాహాలు,ఓటు హక్కు మొదలైన సమస్యలమీద స్త్రీలు తమ రచనల ద్వారా మహిళాలోకపు అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన విధానాన్ని కాత్యాయని వెలుగు లోకి తెచ్చారు. ఒకానొకప్పటి సంప్రదాయంలోని అనేకానేక దురాచారాలు,మూఢాచారాలు పోగా పోగా,వదిలేయగా,వదిలేయగా అప్పటికంటే కాస్త మెరుగైన సంప్రదాయం వస్తుంది. గడచిన కాలాలనుంచి నడుస్తున్న కాలానికనుగుణంగా ఉన్నదాన్ని ఈ కాలంలోకి దిగుమతి చేసుకుంటాం.అది ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఆలోచనల్లోనూ,ఆచరణలోనూ మానవ విలువల్ని మాత్రమే మిగుల్చుకుంటూ పాతకాలం కంటే మరికొంత నిగ్గుతేలుతుంది.వాటి గురించి ఆలోచిస్తూ బాల్యం నుంచే వివిధ వార పత్రికలలో సీరియల్ గా వచ్చిన నవలల్ని చదువుతున్న క్రమంలో రంగనాయకమ్మగారి రచనలతో ప్రభావితమయ్యానంటారు కాత్యాయని.అందువలన ఆమెకు శాస్త్రీయ  విశ్లేషణా ధోరణి అలవడిందని చెప్పటం అతిశయోక్తి కాదేమో! రంగనాయకమ్మగారి  రచనలమీద మనందరికీ మార్గదర్శకమనదగిన మూడు వ్యాసాలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.

సమాజాన్ని అప్పుడున్న దుర్భర పరిస్థితుల్లోనుంచి కాస్తంత ముందుకి జరిపి, మెరుపులతో నిండిన మేఘాల్లా  ప్రతి మలుపు లోనూ ధైర్యంగా నిలబడి, స్త్రీ జాతిని జాగృతపరిచిన స్త్రీ లెవ్వరినీ కాత్యాయని గారు విస్మరించలేదు. అభివృద్ధి నమూనాల రాజకీయ కుట్రలనూ,విప్లవోద్యమ కథలనూ లోతుగా అధ్యయనం చేసి విలువైన సూత్రీకరణలు చేశారు. మార్క్సిస్ట్ ఆర్ధిక రాజకీయ దృక్పధం ఆధారంగా ప్రాచీన-ఆధునిక రచనలన్నిటినీ  పరిశీలించి ఆ యా రచనలమీద తన అంచనాలను ప్రతిపాదించారు.

 “స్త్రీ-పురుషులిరువురూ రాజ్యం,కులం,మతం అనే  త్రిముఖ దోపిడీకి గురయితే, స్త్రీ ప్రత్యేకించి పురుషాధిక్యత అనే నాల్గవ భారాన్ని కూడా మోస్తోంది. పురుషాధిక్యతను అన్ని కోణాలనుంచి విశ్లేషించి దాన్ని చేదించి బయటపెట్టడం ద్వారా స్త్రీల విముక్తి మార్గం సుగమం అవుతుందని చెప్పేదే స్త్రీవాద సాహిత్యం అవుతుందని చెవ్ప్పవచ్చు” అని అంటారు డాక్టర్ నళిని. కాత్యాయని స్త్రీవాద సాహిత్యాన్ని  ఒకే మూసలో చూడకుండా ఆ మార్గానికి దారులు వేశారంటారామె తన ముందుమాటలో.

“స్త్రీని లింగభేదం,లైంగికత్వం మొదలైన అంశాల ఆధారంగా స్త్రీగానే చూసి స్త్రీ సమస్యలు పరిష్కరించే మార్గాల  గురించి వెతకడం స్త్రీవాద దృక్పధంలో ఒక భాగమయితే,స్త్రీని మనిషిగా చూడడం అనే దృక్పధం నుండి సమాజాన్ని చూడటం,సమాజ చైతన్యంలో మార్పులకు దోహదపడటం మరొక భాగమవుతుంది.ఈ క్రమంలో మనిషిగా స్త్రీలోను,ఆ స్త్రీ భాగమయిన సమాజంలోనూ కూడా చలనం సాధ్యమౌతుంది”- అని అంటారు ముదునూరి భారతి గారు వారి ముందుమాటలో. ఈ సాహిత్య ప్రపంచంలో స్త్రీలు తమ సమస్యలను చైతన్యవంతంగా కథలు,నవలల రూపంలో ప్రతిఫలించే క్రమం, దానిలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసి సిద్ధాంతీకరించడం కాత్యాయనీ విద్మహే చేసిన ఒక గొప్ప ప్రయోగమని కూడా అన్నారామె .

“మనలో మనం” రచయిత్రుల ఉమ్మడి వేదిక స్త్రీలసాహిత్యంపై ఈ విమర్శ వ్యాసాల సంకలనం తీసుకొని రావడానికి తక్షణ ప్రేరణ. “మనలో మనం” వల్ల ఏర్పడ్డ కొత్త పరిచయాలు,స్నేహాలు,బలపడిన పాత స్నేహాలు,కలబోసుకున్న సాహిత్యసామాజిక అభిప్రాయాలు,ఆలోచనల ఐక్యత నుండి పొందిన ఉత్తేజం అన్నీ మన గురించి మనం వ్రాసుకున్న వ్యాసాలను పుస్తకంగా వేసెయ్యాలన్న ఉత్సాహశక్తినిచ్చాయి” – అని అంటారు  కాత్యాయని తన “మనలోమాట”లో. ఈ అవార్డు తెలుగు మహిళా రచయితలందరికీ వర్తిస్తుందని అనడం ఆమె సౌజన్యాన్నీ,సౌశీల్యాన్నీ తెలియజేస్తుంది.నిజానికి ఇది ఆమె కఠోర పరిశ్రమ శీలత  ఫలితం!

అనేక చరిత్రల చౌరస్తాలలో చిక్కుకుపోయిన స్త్రీలందరినీ మహిళాలోకానికి కొత్తగా ఆలోచనలు రేకెత్తిస్తూ పరిచయం చేశారు కాత్యాయని. అంతేకాదు.మనుషులు ఒక్కరొక్కరుగా వదులొదులుగా ఉండేకంటే “మంది” గా ఉండడంలో శక్తి ఉందని తెలుసుకుంటున్న మహిళలందర్నీ “మనలోమనం” గా ఒకచోట చేర్చి మొట్టమొదటి అడుగులు వేసిన మల్లీశ్వరి మిత్రులతో పాటు కాత్యాయని కూడా క్రియాశీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు మనలోమనం “ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక” గా రూపుదిద్దుకుంది.మా వేదిక కార్యదర్శి కాత్యాయని గారే! ఆమె నాయకత్వంలో ఇప్పుడు మేమందరం మా మా  ఇళ్ళల్లో ఒంటరిగా ఉన్నంత మాత్రాన, జీవితంలో. ఒంటరిగా లేమని తెలుసుకుంటున్నాం. స్త్రీలందరం సమాజ జీవితంలో గొప్ప సాంఘిక, సన్నిహిత సంబంధాలేర్పరచుకుంటున్నాం.ఎప్పటికంటే బలమైన స్నేహ బంధాల్ని పెంపొందించు కుంటున్నాం.చిన్నప్పటి స్నేహాలే కాక, ఇప్పుడు కొంత వయసూ అనుభవమూ ఏర్పడినాక బలపడుతున్న ఈ స్నేహాల్లో మరింత దృఢ దీక్షతో కార్యాచరణ ఉండేలా రూపొందించుకుంటున్నాం.కాత్యాయని చెప్పినట్లు “హృదయాలే ఆలోచనలే ఒకటైనవాళ్ళం- ప్రజాస్వామిక ఆకాంక్షల పరిపూర్తికే” ఒక ఉద్యమంలా పనిచేస్తాం.

కానీ సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల మెదళ్ళన్నీ ఉపయోగం లోకి రావాలంటే ముందు మహిళల్ని మనుషులుగా గుర్తించాలి.అందుకు అవరోధంగా ఉన్న అడ్డంకులనన్నిటినీ మహిళా ఉద్యమాలు ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోవాలి.సమాజం లోనూ సాహిత్యం లోనూ సగాన్ని సొంతం  చేసుకోవాలి! అప్పటివరకూ ఈ ఉద్యమాలు కొనసాగవలసిందే! లేకపోతే  “స్త్రీని మనిషిగా చూడకపోతే,ప్రకృతి మీద జ్ఞానం కన్నా,సమాజం మీద జ్ఞానం కన్నా స్త్రీలో ఉండే మానవ చైతన్యం సమాజానికి అందకుండా పోయి సమాజం నష్టపోతుంది” అన్న భారతిగారి మాటలు నిజమవుతాయి.

మా ప్ర ర వే వాళ్ళందరం ఈ అవార్డు గురించి తెలిసినప్పటినుంచిఎవరికివాళ్ళం మాకే వచ్చినట్లు  తెగ మురిసిపోతున్నాం. “మనలో మనం” మిత్రులందరం మా ఇంట్లో కలిసినప్పుడు ఈ పుస్తకానికి ముందుమాటలు ఎవరితో రాయించాలి అన్న చర్చ వచ్చింది.ఇప్పుడున్న మహిళా మేధావుల్లో శాస్త్రీయ పద్ధతిలో రచనలు చేసేవారిలో ముదునూరి భారతి గారు అగ్రగణ్యులనీ,అలాగే స్త్రీ వాదానికి సంబంధించి ఒక రిఫరెన్స్  పుస్తకం లాంటి గ్రంధాన్ని రాసిన డాక్టర్ నళిని గురించి కూడా చెప్పాను.ఆశ్చర్యంగా ఈ పుస్తకంలో వాళ్ళిద్దరి ముందుమాటలే ఉన్నాయి.ఇక నాకైతే కబురు వినగానే శరీరమంతటా పులకలు పరుగులెత్తినాయి. ఏది సాధించాలన్నా జ్ఞానాన్ని సంపాదించడమొక్కటే దారి.అప్పుడప్పుడూ కాస్త చదువుకుని ఏడిస్తేచాలా గొప్పవాళ్ళకుతట్టనివిషయాలుకూడాచాలాఅల్పులుచెప్పవచ్చనిఅర్ధమైంది!

                                                                                                                               – శివలక్ష్మి

ప్రరవే కార్యవర్గ  సభ్యురాలు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నిజంగా గర్వించ దగ్గ విషయం … అభినందనలు

– హేమవెంకట్రావ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

mercy margarett

mercy margaret

కాత్యాయని గారికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వచ్చినందుకు నా అభినందనలు.సాహిత్యంపట్ల వారి కృషి, నిరంతర సాహిత్యావలోకనం , స్వేచ్చగా తన భావలను వెలిబుచ్చే నైపుణ్యం ఇప్పటి మా తరం నేర్చుకోవలసి ఉంది. ఎటువంటి వైరుధ్యాలనైన ఎదురుకొంటూ వారు రాసే విమర్షణా వ్యాసాలు, తన భావలను ప్రకటించే విషయంలో వారి దృఢచిత్తం అభినందించదగినంది. ముఖ్యంగా మార్గదర్శకం కూడా..

– మెర్సీ మార్గరెట్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శుభాకాంక్షలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో