కొత్త సంవత్సరం – గొప్ప శుభసూచకం

వనజ వనమాలి

వనజ వనమాలి

కాలం ఒడిలో .. అనుభవాల ఒరవడిలో .. ఒక సంవత్సరం కరిగిపోయింది.

కాలం అద్దంలాంటిది . అంధ యుగమైనా స్వర్ణ యుగమైనా .. అది మన

ప్రతిబింబం .. అన్నారు దేవరకొండ బాల గంగాధర తిలక్ .

అది నిజం కూడా .

కాలం కౌగిలిలో … మనమందరం బందీలం.

Mylavarapu-Gopi

Mylavarapu-Gopi

మనిషి స్వార్ధంతో చేసే వినాశకర చర్యల వల్ల అంతుచిక్కని వ్యాధులు , నివారణ చిక్కని రోగాలు , పర్యావరణ నాశనం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేకానేక విధాలుగా ఫలితాలని అనుభవిస్తూ కూడా మానవుడు సత్యాన్ని గుర్తించలేక మంచైనా చెడైనా కాలానికి ఆపాదించి రాబోయే కాలం మంచిగా ఉండాలని ఆశిస్తూ ముందుకు సాగుతూ ఉంటాం .

కాల ప్రవాహంలో.. మనమందరం మునకలు వేయాల్సిందే ! కాలానికి ఎదురీది నిలిచిన వారెవ్వరు ఉండరు..కాని కొత్తకి ఎప్పుదు స్వాగతం చెపుతూ పాతకి వందనం చెప్పేస్తాము .

అందుకే ..

నిన్న ఒక జ్ఞాపకం

నేడు ఒక కల

రేపు ఒక ఆశ ..గా..

క్షణమైనా..మనఃస్పూర్తిగా ..శ్వాసించి..

ఆశించి..భాసించి.. మానవుడు తోటి జీవుల పట్ల మానవత్వ పరిమళాలని వెదజల్లగల్గితే అంతా శాంతి మయమే !

అందుకే ఈ కవి “స్నేహాలు లేక ఏముంది జగతి
స్నేహాలలోనే దాగుంది ప్రగతి ” అంటారు నిజమే కదా !

220px-Manchu_Pallakiకాలానికి ప్రతీక సూర్య చంద్రులు . ఆరు ఋతువులు ఆమని పాటలు. వీటి మధ్య సకల కోటి ప్రాణులు ఆహ్లాదంగా ఆనందంగా గడచిపోవాలని కోరుకుంటారు హరివిల్లులోని రంగులన్నిటిని అనుభూతి కుంచెకి అద్ది జీవన చిత్రాన్ని శోభానమయంగా విలసిల్ల జేసుకోవాలని కలలు కంటారు . హేమంత తుషారాలు పుడమిని దుప్పటిగా కప్పేసే కాలం డైరీ లోని చివరి పేజీ అనుభవలా చిట్టాగా మడిచిపెట్టి ..రాబోయే కాలాన్ని సరి క్రొత్త ఆశలతో ,సరి క్రొత్త ఆకాంక్షలతో అన్నీ నెరవేర్చుకుని ఆనందం నింపుకోవాలని కోరుకుంటూ .. ఆనందంగా ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ వేడుకలు జరుపుకోవడం ని ..ఒక పాటలో మనం గమనించవచ్చు .

ఈ పాట. ” మంచు పల్లకి ” చిత్రంలో పాట. గీత రచయిత మైలవరపు గోపి. సంగీతం రాజన్-నాగేంద్ర , గాయనీ గాయకులు ఎస్ .పి . బాలసుబ్రహ్మణ్యం , ఎస్ .జానకి బృందం

నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
మంచి తెస్తావని మంచి చేస్తావని
వెల్కం వెల్కం న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
వచ్చే వచ్చే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ || 2||
మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులివ్వు …

చరణం : ప్రతి డైరీలోను ప్రతి పేజీలోను హాయిగా సాగిపో
గురుతుగా ఉండిపో
చల్లగా దీవించు మా కోరిక మన్నించు
ఈ ఏటి కన్నా పై ఏడు మిన్న
పోయింది చేదు రావాలి తీపి హ హ హ హ హ హ
హే హే.. హ్యాపీ న్యూ ఇయర్ ..
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం ||2||

నీ కోసమే మేమందరం నీ రాకకై ఈ సంబరం
కొత్త సవత్సరం గొప్ప శుభ సూచకం
నీ కోసమే మేమందరం నీ రాకకి ఈ సంబరం
కొత్త సవత్సరం గొప్ప శుభ సూచకం
న్యూ ఇయర్ ల ల లాల న్యూ ఇయర్ ల ల లాల

చరణం: 2 : దొరికింది మాకు సరికొత్త స్నేహం
నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో
వెన్నెలై సాగిరా గుండెలో ఉండిపో
స్నేహాలు లేక ఏముంది జగతి
స్నేహాలలోనే దాగుంది ప్రగతి

నీ కోసమే మేమందరం నీ రాకకి ఈ సంబరం
కొత్త సంత్సరం గొప్ప శుభ సూచకం
వెల్కం వెల్కం న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్
కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం …||2||

మానవ మేధస్సు , నిర్విరామ కృషి విశ్వమానవ శ్రేయస్సుకి ఊపిరిపోసి కాలాలు ఎన్నైనా , ఋతువులెన్నైనా, దినములేన్నైనా కాలం కన్నేర్ర్రజేయకుండా అందరికి మంచి చేయాలనే ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరు వారి వారి ముద్రలని .. సింధువులో ..బిందువుగా మిగిల్చి వెళ్లేందుకు.. కృషి చేసేందుకే..ఈ..కాలం.. మనకి.. రేపుని.. ఇచ్చిందని.. భావించాలని.. మనవి..చేస్తూ..

కాలం ఒడిలో కరిగిన క్షణాలు సరి క్రొత్త జీవితారోహాణానికి.. అనుభవపాఠాలు

మిత్రులారా! మీ..అందరికి.. హృదయపూర్వక.. నూతన సంవత్చర శుభాకాంక్షలు…. అందిస్తూ ..

ఈ నూతన సంవత్సర ఆరంభం మన భారతీయ కాలమానం కాకపోయినా విశ్వమంతటా మరో సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్న కాలం కాబట్టి విశ్వ మానవ శ్రేయస్సు కోరుకుంటూ గత కాలం మిగిల్చిన చేదు తీపి అనుభవాల నుండి మంచిని గ్రహించి ఇక ముందు కాలంలో కూడా మంచిని ఆకాంక్షిస్తూ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ .. ఈ పాట

ఈ పాట ఆడియో లింక్ ..

http://www.divshare.com/download/24967381-e0e

ఈ పాట వీడియో లింక్

మరొక నెలలో మరొక మంచి పాటతో కలుసుకుందాం .

– వనజ తాతినేని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నా గీతమాల ఆమనీ ...Permalink

One Response to కొత్త సంవత్సరం – గొప్ప శుభసూచకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో