ఎనిమిదో అడుగు –10

n-399-222x300హేమేంద్ర నిన్నటి నుండి కన్పించకపోతే ఊరెళ్లాడనుకున్నారు దనుంజయరావు, సులక్షణమ్మ…   ‘‘నాన్నా! హేమేంద్ర నీకీవిషయం చెప్పాడా?’’ అన్నాడు ప్రభాత్‌. ‘‘ ఏ విషయం ప్రభాత్‌ ? ’’ అడిగాడు దనుంజయరావు .

‘‘చేతన చెప్పింది.  హేమేంద్రని కాలేజిలో సస్పెండ్‌ చేశారట….’’ అంటూ జరిగింది మొత్తం చెప్పాడు ప్రభాత్‌… 

  సులక్షణమ్మ ఆశ్చర్యపోతూ బాధగా చూసి….

‘‘…చిన్నప్పుడు కూడా హేమేంద్రకి ఏ కాస్త నొప్పి కల్గించినా అనుకరణ ఏడుపుతో వాళ్లమ్మను చంపుకు తినేవాడు.  కావాలన్నది ఇచ్చేదాకా, బుజ్జగించి ముద్దాడే దాకా విసిగిస్తూనే వుండేవాడు. ఇప్పటిక్కూడా అలాగే వున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఏ పువ్వు పరిమళం ఆపువ్వుదే కాని ఇంకో వాసన రాదనిపిస్తోంది.  లేకుంటే అంత మంచి ప్రొపెషనల్‌ కోర్స్‌కి వచ్చి…. ప్రస్తుతం తనుండేది ప్రపంచానికి పనికొచ్చే ఎందరో మేధావుల్ని తయారు చేసే పవిత్రమైన విద్యాలయం అని తెలిసి, ఈ చిల్లర పనులేంటి? అంతా స్వయంకృతం…’’ అంది.

‘‘రౌతుకు మెళుకువలు తెలియకపోతే గుర్రం మీద నుండి కిందపడ్తాడు.  జీవితం కూడా అంతే ! హేమేంద్రకి కొన్ని మెళుకవలు తెలియవు.’’ ఆన్నాడు దనుంజయరావు. ‘‘ఎంత ముద్దుగా సమర్థిస్తున్నారండీ!’’ అంది.‘‘ఇది సమర్థింపు కాదు.  బాధ. జీవితంలో మనిషి దేన్నైనా కోల్పోవటానికి క్షణం పట్టదు.  తిరిగి దాన్ని పొందాలంటే ఒక్కోసారి దశాబ్దాలు సరిపోకపోవచ్చు….సరేలే! జీవితంలో వున్నన్ని కొత్త, కొత్త పాఠాలు మరెక్కడా వుండవంటారు  హేమేంద్రకి కూడా ఇదో పాఠం అనుకుందాం’’అన్నాడు దనుంజయరావు.‘‘పాఠాలను బుద్ధిగా విని, ఆకళింపు చేసుకోవటం కూడా ఓ అద్భుతమైన కళ. మరి ఆ కళ హేమేంద్రలో వుందంటారా?’’‘‘ఏమో చెప్పలేం సులక్షణా! జీవితంలో కోలుకోలేని దెబ్బలు తిన్నవారు కూడా ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసంతో తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించి చాలెంజింగ్‌గా తిరుగుతున్నారు. మంచి ఆలోచనలపై మనసు నిలిపితే ఏదీ అసాధ్యం కాదు.’’ అంటూ ఆ మాటల్ని అంతటితో ఆపేశాడు. 

           ***                         ***                                                   ***                                         ***               

శేఖరయ్య వాళ్ల పక్కింట్లో ఉన్న చిన్నపిల్లలు `దిక్కులు పిక్కటిల్లేలా, గోడలు ప్రతిధ్వనించేలా, ఇళ్ల పై కప్పులు ఎగిరి పడేలా పెద్దగా చదువుతూ, అర్థం కాకపోయినా సరే బలవంతంగా మెదడులోకి దూర్చుకుంటూ` పద్యాలను, ఎ,బి,సి.డి.లను ఎక్కాలను, ఫార్ములాలను చదువుతూ వుంటే విని….

  ‘ఉఫ్‌’ అంటూ లేచి ‘అసలు ఈ పిల్లలు పుస్తకాల్లో ఇచ్చిన వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారో లేదో ఆపైవాడికే తెలియాలి అనుకుంటూ భార్య దగ్గరకి వెళ్లి.. ‘‘హేమేంద్ర వచ్చి నాలుగు రోజులు అవుతోంది.  ఇంకా వరంగల్‌ వెళ్లలేదేం కరుణా?’’ అన్నాడు శేఖరయ్య.

‘‘మీరే అడగండి! నాతో చెబుతాడా? వచ్చినప్పటి నుండి నాతో మాట్లాడడమే లేదు.  అదిగో మన ఇంటి వెనక వేపచెట్టు పక్కన మట్టి తవ్వి గుంట చేస్తున్నాడు.  ఎందుకో? వెళ్లి చూడండి!’’ అంది కరుణమ్మ.

ఆమెకు కొడుకు విషయంలో చాలా బాధగా వుంది. హేమేంద్ర ఎంసెట్‌ లాంగ్‌టర్మ్‌ తీసుకుంటున్నప్పుడు కొద్దిరోజులు ఆమె వరంగల్‌ వెళ్లి కొడుకుతో పాటు ఓ రూంలో వున్నది.  కొడుకెలా వుండేవాడో  దగ్గరుండి చూసింది. దేవుని ముందు కళ్ల నీళ్లు పెట్టుకొని తన కొడుక్కి ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ రావాలని మొక్కుకొంది…. పరీక్షల సమయం దగ్గర పడ్తుంటే స్నేహితులు వచ్చి హేమేంద్రతో గ్రూప్‌ స్టడీ చేస్తూ ఒకరు టాపిక్‌ డిస్కస్‌ చేయడం, మరొకరు సినాస్పిస్‌ తయారు చేసుకోవడం చేస్తుంటే హేమేంద్ర ఇంకేదో చేసేవాడు….వాళ్లలో కొందరు వాళ్ల సీనియర్స్‌ని కలిసి వాళ్లు ప్రిపేరైన విధానం అడిగి తెలుసుకుంటూ పరీక్షల సిలబస్‌ కరెక్ట్‌గా తెలుసుకొని, ఏదైనా మిస్సయిన పాఠాలు  వుంటే వాటిని పూర్తి చేసుకొని,నోట్స్‌ అన్నీ కంప్లీట్‌ చేసుకొని, క్వశ్చన్‌ పేపర్‌ ఫార్మాట్‌  ఎలా వుంటుందో ముందుగానే తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్‌ అవుతుంటే హేమేంద్ర మాత్రం తన ఫ్రెండ్‌ని గిల్లి సినిమాకి వెళ్లేవాడు…

అదేం అంటే! పుస్తకాలు ముందేసుకొని అర్థ రాత్రులు దాటుతున్నా కదలకుండా కూర్చునేవాడు… ఫ్రెండ్స్‌ కన్పించగానే అదోలా ముఖం పెట్టి ‘‘ పుస్తకం తెరిస్తే అంతా తెలిసినట్లే వుంది. మూసేస్తే ఏమిా రానట్లేవుందిరా’’ అని చెప్పుకునేవాడు….

  అది విని వాళ్లలో ఒకతను హేమేంద్రను కూర్చోబెట్టి…. ‘‘చూడు హేం! మన మైండ్‌ అనేది కంప్యూటర్‌లోని హార్డ్‌ డిస్క్‌ లాంటిది. అందులో మనం ఎంత సమాచారాన్ని అయినా నిల్వ చేసుకోవచ్చు.   ఫలానా దాన్ని గుర్తుంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోకపోతే అది మన పరిశీలనకు అందదు.  గుర్తుండదు.  ప్రాక్టీస్‌ వల్లే ఏదైనా పర్‌ఫెక్ట్‌ అవుతుంది.  లక్ష్యం లేకుండా చదవవద్దు.  ‘ ఈ గంటలో నేనీ చాప్టర్‌ ఫినిష్‌ చేయాలి.ఈ అరగంటలో ఈ రివిజన్‌ పూర్తయిపోవాలి!’ అని మనసులో అనుకోవాలి.  సరేనా?’’ అంటూ హేమేంద్ర వెంటపడి మరీ ఎగ్జామ్‌ రాయించాడు.  

  అలా ఎంసెట్‌లో గట్టెక్కి బి.ఫార్మసిలో జాయినయ్యాడు.  ఇప్పుడేమో ఏ మాత్రం అవకాశం దొరికినా ఒక చేయి పట్టి పైకి లాగే ఫ్రెండ్స్‌ కన్నా ఇంకో చేయి పట్టి కిందకి లాగే ఫ్రెండ్సే ఎక్కువగా వున్నారు.  అని ఆమె ఆలోచనలో ఆమె వుండగా…

గబ, గబ కొడుకు దగ్గరకి వెళ్లాడు శేఖరయ్య, తండ్రిని పట్టించుకోకుండా తన పనిలో తనువున్నాడు హేమేంద్ర… ఆరోజు తనని కిందపడేసి డబ్బులు తీసుకున్నప్పటి నుండి ఆయనకి కొడుకంటే భయమే.ఏ మాట మాట్లాడితే ఎలా మిాదకొస్తాడో అని బెదురు…. అలా అని కన్న కొడుక్కి దూరంగా ‘‘ఇది నాది కాదు’’ అన్నట్లు వుండలేడు కదా! అలా వుండివుంటే గాయాలున్న పిల్లనగ్రోవిలా తన మనసు ఇంత మౌనమృదంగిణి అయివుండేదా? 

 

ఇక వుండబట్టలేక….‘‘ఎందుకురా హేమేంద్రా! ఆ గొయ్యి?’’ అన్నాడు శేఖరయ్య.

హేమేంద్ర తండ్రి వైపు చూడకుండానే…. ‘‘ నీ కోసం, నా కోసం కాదులే…! చెట్టు నాటటానికి ….’’ అన్నాడు. 

‘‘ఉన్న చెట్లే చాలనిపిస్తుంటే అక్కడ చెట్టెందుకు?’’ అన్నాడు శేఖరయ్య నీకేమైనా పిచ్చా అన్నట్లు చూస్తూ.,…

‘‘పెరిగాక నరుకు తాన్లే…!’’ అన్నాడు నిర్లక్ష్యంగా.

నరుకుతావా!!! చెట్టు కూడా జీవితం లాంటిదే… పెరిగేకొద్ది దాన్ని అతి జాగ్రత్తగా ఎక్కి, దిగుతూ, సుఖసంతోషాలనే పళ్లూ, ఫలాలను అనుభవించాలి.  మధ్యలోనే నరికెయ్యకూడదని వీడికెలా తెలియాలి?  కొందరు పూలను నలిపితే వీడు చెట్టునే నలిపేలా వున్నాడే!!.

‘‘పెంచుకునేది నరకటానికా హేమేంద్రా?’’ అన్నాడు అతికష్టంగా శేఖరయ్య. 

‘‘నరికే ఉద్దేశ్యం వుంటేనే పెంచుకోవాలి….’’ అంటూ కసిగా బలంగా నేలను గునపంతో తవ్వుతుంటే మట్టి ఎగిరి హేమేంద్ర కంట్లో పడిరది.

‘‘ అబ్బా….’’ అన్నాడు వెంటనే, 

  కొడుకు కంట్లో మట్టి పడగానే శేఖరయ్య ప్రాణం విలవిల్లాడిరది ఎక్కడున్నదో కరుణమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. కొడుకును అప్పుడే రెక్కలు మొలుస్తున్న కోడిపిల్లను దోసిట్లో పట్టుకున్నంత పదిలంగా పట్టుకొని 

  ‘‘నలపకు నాన్నా! కళ్ళు దెబ్బతింటాయి’’ అన్నారు ఇద్దరు ఒకేసారి. 

ఈ ప్రేమకేం తక్కువలేదు. దీనివల్ల ఏమొస్తుంది? నాకేమిస్తున్నారు వీళ్లు? ‘‘ఆపండి మీ గోల’’ అంటూ కోపంగా నెట్టడంతో వాళ్లు ఇద్దరు వెళ్లి చెరో పక్కనపడ్డారు. 

ఆమెకి మోచేయి పగిలింది.  ఆయనకి నుదురు చిట్లింది.

అదేంపట్టనట్టు ‘‘వీడికి కోపమొస్తే మనిషి కాడండి! అంతా మా నాన్న కోపం వచ్చింది వీడికి…. ఏంచేద్దాం….’’ అంది ఆమెకి మాత్రమే విన్పించేలా.

‘‘ఖర్మ….’’ అనుకున్నాడు. ఆయనకు మాత్రమే విన్పించేలా. ఆమె లోపలకెళ్లింది.

అప్పటికే నీళ్లతో కళ్లు కడుక్కొని, వెళ్లి వేపచెట్టు నీడలో వున్న మంచంపై కూర్చున్నాడు హేమేంద్ర.

‘‘ఇప్పుడెలా వుందిరా!’’ అన్నట్లు కొడుకు కళ్లవైపు చూసుకున్నాడు శేఖరయ్య. 

  కొడుకు కళ్లు ఏమవుతాయో అని ఆయన బెంగ.. హేమేంద్ర మామూలుగా వుండడం గమనించి… ‘‘కాలేజికి సెలవులు ఇచ్చారా?’’ అన్నాడు విషయానికి వస్తూ శేఖరయ్య,.

మోచేతుల్ని మోకాళ్లపై పెట్టుకొని కాస్త వంగి నేలవైపు చూస్తున్న హేమేంద్రకి తండ్రి మాటలు చిర్రెత్తుకొచ్చి…. ‘‘అలాంటిదేం లేదు. నేనే వెళ్లలేదు.’’ అన్నాడు.

 

(ఇంకా వుంది)

 – అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో