స్త్రీ యాత్రికులు

ధృవ ప్రాంతాల్లో ప్రయాణాలు చేసిన
కేట్‌ మార్సెడన్‌

క్రిస్టియన్‌ మిషనరీలు 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప సహాయ కార్యక్రమాలు చేశాయి. మత ప్రచారంతో పాటుగా చేసిన సాంఘిక సేవలు ఈనాటికీ గొప్పగా కొనియాడబడుతూనే ఉన్నాయి. అలాంటివాటిలో బ్రిటీషువారి సాంప్రదాయం చాలా గొప్పదిగా పేరు తెచ్చుకొంది. రవి అస్తమించని బ్రిటీషువారు చేసిన గొప్ప సంస్కరణల్లో వారి మిషనరీ కార్యకలాపాలే ఈనాటికీ నిలిచిపోయాయి. అలాంటి బ్రిటీషు పౌరులు ఒకరు హవాయ్‌ దీవుల్లో ఒకటైన మలకాయ్‌లో మత ప్రచారం కోసం వెళ్ళి, అక్కడ ఉన్న కుష్టు రోగులకి సేవచేయటానికి జీవితాన్ని అంకితం చేశాడు. ఆ గొప్ప వ్యక్తి గురించి ప్రపంచానికి తెలుసు. అతడే ఫాదర్‌ డేమియన్‌. దాదాపు అలాంటి ప్రయత్నాన్ని మరో బ్రిటీషు వనిత కూడా చేయటానికి తలపెట్టింది. ఆమే కేట్‌ మార్సెడన్‌.
   

సైబీరియాలోని టండ్రా మంచు ప్రాంతాల్లో ఉన్న ఒక కుష్టు రోగులకాలనీలో కొంతకాలం పనిచేస్తుంది మార్సెడన్‌. ఆ వ్యాధి అల్లోపతి మందులకి నయం కావటం కష్టం. దానికి ఏదైనా నాటు వైద్యం ఉంటుం దేమో అన్న సందేహం వస్తుంది ఆమెకి. ఆమె సందేహాల్ని మరికొందరు స్థానికులు బలపరుస్తారు. అప్పటివరకూ ఆ రోగులతో ఉండి, మత ప్రచారం చేస్తూ గడిపిన కేట్‌ మార్సెడన్‌ ఒక్కసారిగా పెద్ద ప్రయాణం మొదలుపెడుతుంది.  తన ఊహల్లో ఉన్న వనమూలికని వెదికి తీసుకు రావటం కోసం, సైబీరియా అంతా పదకొండు నెలలపాటు అన్వేషణ జరుపుతుంది. కుష్టురోగాన్ని తగ్గించే ఆ మూలిక కోసం స్లెడ్జి బండిమీద, గుర్రం మీద ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తిరగాల్సి వచ్చింది. ఫాదర్‌ డేమియన్‌ ఈమెకు ఆదర్శం. మత ప్రచారం కంటే మూలికాన్వేషణే గొప్పది అని తెలుసుకుని, తన దేశానికి గొప్పతనం తెచ్చే ఒక మంచిపనికోసం తాను ఎంత కష్టమైన పనైనా చేయటానికి సిద్ధపడుతుంది. బ్రిటీషు మిషనరీ వారు చేసిన యాత్రల్లో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన ఈ యాత్ర 3200 కిలోమీటర్ల దూరం కొనసాగింది.
   

ఈ యాత్రలో ఆమె మొదటగా చేరుకొన్న లెప్రసీ సెటిల్‌మెంట్‌ పేరు హాటిగ్‌నాభ్‌. అక్కడ మొత్తం కలిపి పన్నెండు మంది రోగులు మాత్రమే ఉంటారు. వాళ్ళకి ఒంటిమీద బట్టలు కూడా సరిగా ఉండవు. చిన్న గుడారాల్లో ముడుచుకుని ఉంటారు. కొన్నేమో చెదలు పట్టిన గుడిసెలు ఉంటాయి. అంతా భయంకరమైన వాసన. వారిలో ఒక రోగి దాదాపు మరణించినట్లే లెక్క. ఒకరికైతే కాలివేళ్ళు పూర్తిగా లేవు. మరొకరి చేతి పరిస్థితి వర్ణనాతీతం. ఆ చేత్తోనే క్రీస్తుని స్మరించటానికి శిలువ గుర్తు వేసుకునే దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు రాక తప్పదు. నిజంగా దేవుడే ఉంటే అలాంటివారికి విముక్తి ప్రసాదించవచ్చు కదా! అలాంటి చేతితో దేవుణ్ణి స్మరించవలసి వచ్చినందుకు దేవుడికే అవమానం కదా! దేవుడు ఎక్కడో వీళ్లకి అందనంత దూరంలో ఉన్నాడేమో అని ఆలోచించేది.
   

ఆమె వెళ్ళేసరికి ఆ పన్నెండుమంది నేలమీద కూర్చుని ఉంటారు. ఆమె తమకు సహాయం చేయటానికి వచ్చిందనీ, తమకోసం ఏదో తెచ్చారని అనుకొంటారు. వారి ఆశలు తెలుసుకున్న మార్సెడన్‌ తన వద్ద ఉన్న బట్టలు, డబ్బులో కొంతభాగం వారికి ఇస్తుంది.ఆమె ఇచ్చిన చిన్న బహుమతులకు వారందరూ సంతోషిస్తూ, చిరు నవ్వుతో ‘మా మీద దయచూపిన ఈమె మీద, ఓ దేవుడా! వరాల వర్షం కురిపించు’ అంటూ ఆకాశంవైపు చూస్తూ ఛాతీమీద శిలువ గుర్తు వేసుకుంటారు.
   

సైబీరియాలో సంవత్సరానికి ఎనిమిది, తొమ్మిది నెలలు మంచు ఉంటుంది. నరాలు జివ్వుమని లాగే ఆ మంచుగాలికి ఆ గుడిసెల్ని చాటుచేసుకుని అక్కడే జీవిస్తుంటారు ఆ రోగులు. అందరూ కలిసికట్టుగానే పడుకొంటారు. ‘మీకు చలి మరీ ఎక్కువైతే ఏం చేస్తారు?’ అని అడిగి నప్పుడు ‘అమ్మా మేము, ఆ పశువుల పాకల్లోకి వెళ్ళి పశువులకి ఆనుకొని పడుకొంటాము. ఎంతో వెచ్చగా ఉంటుంది అక్కడ’ అని చెప్పారు. మార్సెడన్‌ తిరిగి వెళ్ళేటప్పుడు ‘అమ్మా, మా కోసం మంచి ఆసుపత్రులు పెట్టించమని, మంచి ఆహారం ఇచ్చే ఏర్పాట్లు చేయమని చెప్పమ్మా. మా గురించి ప్రజలకి చెప్పండమ్మా’ అంటూ కోరుకునేవారు.
 మార్సెడన్‌ని చూసిన ప్రతి సెటిల్‌మెంటు వారూ తాను వారికి సహాయం చేయటం కోసం వచ్చింది అనుకొంటారే కానీ, వారి మీద ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించటానికి వచ్చిందని ఎవరూ అనుకోరు.
   

కొన్నిసార్లు రాత్రంతా ప్రయాణంచేసి, మామూలు బాటలకి చాలా దూరంగా ఉన్న లీపర్‌ సెటిల్‌మెంటుకి చేరుకొనేది. లీపర్‌ సెటిల్‌మెంట్లలో పగటి పూట కీటకాలు ఎక్కువ. అందువలన రాత్రిపూట వారి గుడారాల వద్ద ఉండడం పెద్ద కష్టంకాదు. అలాంటి ప్రదేశాల్లో చిన్న గవర్నమెంటు ఆసుపత్రి, కొన్ని గుడిసెలు మాత్రమే ఉంటాయి. వ్యాధిసోకిన ఒక రోగిని మార్సెడన్‌ వద్దకి తీసుకువస్తారు. క్రితంలో అతనికి వైద్య నిర్ధారణ చేసినవారు అతన్ని యాభై మైళ్ళ దూరంలో ఉండమని చెప్పి అతనికోసం ప్రత్యేకమైన తోలు గుడారం (ఖతిజీశి) ఇస్తారు. కాని అతని పరిస్థితి చూస్తే నడవలేకుండా ఉన్నాడు. వైద్యులమాట పాటించకపోతే ఆహారం ఇవ్వరు. అదీ సమస్య.
   

‘అంతదూరం అతన్ని ఎలా తీసుకెళతారు?’ అని అడుగుతుంది మార్సెడన్‌.
    ‘అంతకు ముందు ఇక్కడి రోగుల్ని అక్కడికి ఎలా తీసుకువెళ్ళారో అలాగ్ష్మే కొత్తగా ఈయనకోసం చేసేది ఏమీలేదు’ అంటారు.
    మార్సెడన్‌ అర్ధంకానట్టుగా ముఖం పెట్టేసరికి మరలా ఆ పక్కవారు అందుకుని, ‘అతన్ని ఎద్దు వీపుమీద కూర్చోబెట్టి పడిపోకుండా తాళ్ళతో గట్టిగా కట్టేస్తాం’ ఆ ఎద్దుకి పొడవాటి తాడుకట్టి ఒకడు నడిపించుకుంటూ ముందుకుపోతాడు. ఆ తాడు ఎంత పొడవైతే ఆ తీసుకెళ్ళేవాడికి అంత మంచిది. కాబట్టి పొడుగాటి తాడు ఉంటేనే వాడు వస్తాడు.
   

‘అయితే అలా తాడుకట్టిన ఎద్దుని ఎవరైనా తీసుకుపోవచ్చా?’
    ‘మేడమ్‌, ఆ రోగి తమ్ముడు తప్ప మరెవరూ ఆ తాడు పట్టుకోరు. ఆఖరికి స్త్రీరోగి అయినా అలాగే ఎద్దువీపుకి కట్టే తీసుకెళ్ళేవారు’.
    ముట్టుకుంటే రోగం వస్తుందని జడిసే ఆ ప్రజలకన్నా, అభం శుభం తెలియని ఆ జంతువులు నయం అనిపిస్తుంది మార్సెడన్‌కి.
    రోగిని ఎద్దుమీద కట్టివేసే అనాగరికమైన ఆ దృశ్యాన్ని ఊహించు కోలేకపోతుంది. తనకకళ్ళ ముందే అలా జరగటం చూడలేక, ఆ రోగికోసం మార్సెడన్‌ ఒక స్లెడ్జ్‌బండిని సొంతంగా తయారుచేయిస్తుంది. చక్రాలు లేని ఆ బండి మంచులో చాలా వేగంగా జారుకుంటూ పోగలదు. సహజంగా వాటిని కుక్కలు లాగుతాయి. కాని వాటికి వేరే ఖర్చు ఎందుకని, ఆ ఎద్దుచేతనే లాగించేందుకు వారిచేత ఒప్పించగలుగుతుంది. నిజానికి గుర్రాల కోసం ప్రయత్నిస్తుంది, కాని సమయానికి అవి దొరకవు. అందువలన ఆ బండిని లాగటానికి ఎద్దునే ఉపయోగిస్తారు.కొన్ని సెటిల్‌మెంట్స్‌లో అయితే చిన్న గుడారంలోనే ఇద్దరు రోగుల్ని ఉండమని బలవంతం పెట్టేవారు. వారికి మాటలు కలవకపోయినాసరే ఉండక తప్పేది కాదు. దాంట్లోనే అటు ఇటు మళ్ళి పడుకునేవారు.

ముస్లిం దేశాల్లో తిరిగిన ఐరోపా స్త్రీ
లేడీ మేరీవోర్ట్‌లీ మాంటేగ్‌

  18 వ శతాబ్దం మొదట్లో, భర్తతోడు లేకుండా స్త్రీలు యాత్రలు చేయటాన్ని పెద్ద తప్పుగా భావించేవాళ్ళు. అలాంటి రోజుల్లో ఒంటరిగా సాహసోపేతమైన యాత్రలు చేసి, కొత్త ఆలోచనలకి నాందిపలికిన బ్రిటీషు మహిళ మాంటేగ్‌.మొదటిసారి లండన్‌ నుండి కాన్‌స్టాంట్‌నోపుల్‌కి యాత్ర చేస్తుంది. అక్కడి స్థానికులతో కలిసిపోయి, వారిమాదిరిగా బట్టలు ధరిస్తుంది. తన పిల్లలకి స్థానికుల పద్ధతిలో వేసే సూదిమందు (వేక్సిన్‌) వేయిస్తుంది. ఇలాంటివి ఆనాటి సమాజానికి చాలా కొత్త. వాక్సిన్‌ వేయించుకోక పోవటం వలన వేలకొద్దీ ప్రజలు మరణిస్తుండేవారు.తన నలభై తొమ్మిదవ సం||లో భర్తకు విడాకులిచ్చి, తన ప్రియుడితో ఇటలీకి యాత్రచేస్తుంది అయితే చివరకు ఆ ప్రియుడు మోసగాడు అని తెలిసిపోతుంది. భర్తవద్దకి రావడానికి సిగ్గుపడి, ఐరోపా అంతా ఇరవై రెండు సంవత్సరాలు పాటు పర్యటన చేసి చివరికి, 1762 వ సం||లో తన భర్త మరణించిన తరువాత మాత్రమే ఇంటికి వస్తుంది. కానీ తానుకూడా కొద్ది నెలలకే మరణిస్తుంది.

క్లార్క్‌ – లెవిస్‌ అన్వేషకులకు దారిచూపిన
సకజావా

అమెరికాలోని మౌంటానా ప్రాంతాల్లో నివసించే ఇండియన్ల జాతికి చెందిన సాహస మహిళ సకజావా. వారి భాషలో సకజావా అంటే ‘పక్షి స్త్రీ’ అని అర్ధం.ఈమె అమెరికన్‌ చరిత్రలోకి రావటానికి కారణం 1804 వ సం||లో అమెరికన్‌ ప్రెసిడెంట్‌ థామస్‌ జఫర్‌సన్‌ తీసుకున్న ఒక వ్యాపార నిర్ణయం. అమెరికాకి అడ్డంగా ప్రవహించే మిస్సోరీ నది వెంబడే ప్రయాణం జరిపి,  నది ఒడ్డున ఉన్న ఇండియన్‌ ప్రజలతో వ్యాపారం చేయటానికి వీలుగా ఉందో లేదో తెలుసుకొమ్మని, తమ వ్యాపారంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న స్థానిక నాయకులని కలుసుకొని, వారితో ఒప్పందాలు కుదుర్చుకురమ్మని ఇద్దరు అన్వేషకుల్ని పంపుతారు. వారి పేర్లు క్లార్క్‌ – లెవిస్‌. ఆ నేపథ్యంలో వారు తమ బృందాలతో సెయింట్‌ లూయిస్‌ వద్ద బయలుదేరి, నదిమీద ప్రయాణాలు చేసుకొంటూ, ఆ దారిలో వివిధ భాషలు మాట్లాడే ఇండియన్లని కలుసుకొంటూ పోతుంటారు. వారితో వారి భాషలో మాట్లాడి వారిని వ్యాపారానికి ఒప్పించాలి. అందుకోసం క్లార్క్‌ బృందానికి స్థానికుల భాష తెలిసిన వ్యక్తి అవసరమవుతాడు.
   

ఆ పరిస్థితుల్లో క్లార్క్‌, లెవిస్‌ బృందానికి పరిచయమైన వ్యక్తులు టౌశాంట్‌ కార్బొనీ, అతని భార్య సకజావా. కార్బొనీ ఫ్రెంచి-కెనడా దేశాలకి చెందిన ఐరోపా జాతీయుడు. ఎంతో కాలంగా స్థానికుల వద్దకి చేరి, వారితో కలిసిపోయి వారి అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడు.   సకజావా అతనికి రెండవ భార్య. ఒకానొక పరిస్థితుల్లో యవ్వనంలో ఉన్న సకజావాని హదస్తా జాతివారు దొంగిలించుకుపోతారు. వారి నివాసం ఉత్తర డకోటా రాష్ట్రంలో ఉన్న మిస్సోరీ నదీ తీరం. అక్కడ పెరుగుతున్న సకజావాని 1804 వ సం||లో కార్బొనీ, రెండు గుర్రాలకీ ఒక షాంపేన్‌ బాటిల్‌కి కొనుక్కొని తన రెండవ భార్యగా చేసుకుంటాడు. అప్పటికి ఆమె వయసు పదిహేడు సంవ త్సరాలు మాత్రమే.
   

క్లార్క్‌-లెవిస్‌ బృందానికి గైడుగా, అనువాదకుడిగా కార్బొనీ దంప తులు ఉండటానికి ఒప్పుకొంటారు. అయితే వారితో ప్రయాణించినందుకు, దారిచూపినందుకు మొత్తం ఐదు వందల డాలర్లు ఇవ్వాలని షరతుపెట్టారు.క్లార్క్‌-లెవిస్‌ బృందంతో తమ ప్రయాణం నిశ్చయమైనప్పుడు సకజావా ఒక బిడ్డతల్లి. ఆ బాబుకి జీన్‌-బాప్టిస్టీ అనే ఫ్రెంచి పేరు పెట్టుకొంటారు.ఆ చిన్న బాబుకూడా తల్లితండ్రులతో పాటుగా 12,000 కి.మీ. దూరం అన్వేషణా యాత్రలో ప్రయాణం చేయాలి. బిడ్డతల్లిని తమతో పాటుగా తీసుకెళ్ళటం కష్టం. అయినా క్లార్క్‌-లెవిస్‌లకి ఇది బాగా సహాయం చేసింది. కొత్త ప్రదేశాల్లోకి వెళుతున్నప్పుడు, వారితో మాట్లాడేటప్పుడు ఒక స్త్రీ ఉన్నట్లయితే అది శాంతికి గుర్తు. యుద్ధానికి, తగాదాలకి వెళ్ళేవారు, ఎప్పుడూ స్త్రీలనీ, పిల్లల్నీ తమ వెంట తీసుకు వెళ్ళరు. స్థానికులతో వ్యాపార సంబంధాలు కుదుర్చుకోవటానికి వెళ్ళే ఆ అన్వేషణా బృందానికి వివిధ స్థానిక భాషలు మాట్లాడే ఈ బిడ్డతల్లి ఎంతో ఉపయోగపడింది. అందువలన ఎంత కష్టమైనా ఆమెను గైడుగా తీసుకెళ్ళటానికి ఇష్టపడతారు.
   

క్లార్కు – లెవిస్‌ బృందంతో ఆమె ఉండటంతో అక్కడ అంతా శాంతి వాతావరణం చోటుచేసుకుంటుంది. అడవుల్లో గుండా పోవాల్సి వచ్చినప్పుడు శాంతి పతాకాలు ఎగురవేస్తూ, స్నేహంకోసం వస్తున్నామని, చేతి వేళ్ళతో గుర్తులు చూపించేది. తన బిడ్డని ఒక పొడవాటి తొట్టెలో పెట్టి, వీపుమీదకి కట్టేసుకుని ప్రయాణం చేసేద్ష్మి యుద్ధం చేస్తున్న ఝాన్సీ లక్ష్మీబాయి తన దత్త పుత్రుణ్ణి వీపున కట్టు కొన్నట్లుగా. ప్రపంచ చరిత్రలో అత్యంత దూరాన్ని ప్రయాణించిన ఘనత జీన్‌ బాప్టిస్టుకు చెందుతుంది.ఒకసారి తన భర్త పొరపాటు కారణంగా ఒక పడవ తిరగబడుతుంది. వెంటనే సకజావా నదిలోకి దూకి ఆ బృందం వారు రాసుకున్న విలువైన డైరీలు నాశనం కాకుండా అన్నీ బయటకు తేగలిగింది. అడవుల్లో సరైన తిండి దొరక్కపోయినప్పుడు, తినటానికి ఉపయోగించే కొన్ని ప్రత్యేకమైన మొక్కల్ని, దుంపల్ని సంపాదించి పెట్టేది.
   

ఏ సమయానికి ఏది అవసరమో దాన్ని ముందుగానే ఊహించి, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడేది. అందువలన ఆ బృందానికి సకజావా అంటే ఎంతో గౌరవం ఏర్పడుతుంది. కానీ తన భర్త మాత్రం ఆమెని ఏమాత్రం మెచ్చుకునేవాడు కాదు. ఆమెను ఏవో సూటి పోటి మాటలతో బాధపెడుతూ ఉండేవాడు.వారి అన్వేషణా యాత్ర చివరికి చేరుకునే సమయంలో అంటే, 1805 వ సం|| ఆగస్టునాటికి, సకజావా చిన్నప్పుడు ఎక్కడ తప్పిపోయిందో అదే ప్రదేశానికి చేరుకోవటం తటస్థిస్తుంది. పైగా ఆమె సొంత అన్నయ్యని కూడా అక్కడ కలుసుకొంటుంది. ఇద్దరూ ఎంతో సంతోషపడతారు. తన అన్నయ్య కమావైత్‌ ఇప్పుడు స్థానికులకి నాయకుడిగా ఉంటాడు. అతని సహాయంతో టబ్బాబోన్‌ (తెల్లదొరలు) బృందం అంతా రాకీ పర్వతాల్ని హాయిగా దాటగలుగుతారు.
   

క్లార్క్‌-లెవిస్‌ల తిరుగు ప్రయాణంలో సకజావా వారితో పాటుగా యల్లోస్టోన్‌ నది వరకూ వెళుతుంది. ఆ తరువాత వారి బృందం అంతా 1806 వ సం|| జనవరిలో తాము మొదట బయలుదేరిన సెయింట్‌ లూయిస్‌ వద్దకి విజయవంతంగా చేరుకొంటారు. సకజావా సహాయానికి అందరూ ఆమెని అభినందిస్తారు. వారికి రావలసిన ఐదువందల డాలర్లు అందజేయబడతాయి. ఈ డబ్బంతా సకజావా భర్త తనే ఉంచుకుంటాడు. భార్యకి ఏమీ ఇవ్వకపోగా ఆమెను నానామాటలు అని, ఆమె మనసు గాయపడేలా మాట్లాడతాడు. కొన్ని నెలలు గడిచాక, భర్త పెట్టే బాధలు సహించలేని సకజావా తన కొడుకుని తీసుకుని సెయింట్‌ లూయిస్‌లో ఉంటున్న క్లార్క్‌ వద్దకి వెళ్ళి ఆ పిల్లవాడి సంరక్షణా భారాన్ని తీసుకొమ్మని అభ్యర్ధించి, అతన్ని ఒప్పించి, తరువాత అనారోగ్యం చేత మరణించిందని ఒక కథనం.మరో కథనం ప్రకారం ఆమె పిల్లవాడిని క్లార్క్‌ చేతికి అప్పగించి, తన అన్నయ్య కమావైత్‌ దగ్గరకి పోయి, అతనికి రాజకీయ సలహాదారుగా ఉండి, అక్కడే చివరి రోజులు గడిపిందని అంటారు.

ప్రయాణాలు చేసిన  స్త్రీవాది
ఫ్లోరా ట్రిస్టాన్‌

  స్త్రీవాదిగా, సంఘ సంస్కర్తగా, సోషలిస్టుగా పేరుతెచ్చుకొన్న ఫ్లోరా ట్రిస్టాన్‌ ఐరోపా దేశపు గొప్ప మహిళ. పంధొమ్మిదవ శతాబ్దపు మొదటి భాగంలో ఐరోపా దేశాల్లో ఆమెకి ఎంతోపేరుంది. ఈమె పుట్టింది దక్షిణ అమెరికాలోని పెరూ దేశం అయినా పెరిగింది ఫ్రాన్సులోనే.  పారిస్‌ నగరంలోని కర్మాగారాల పరిసరాల్లో తిరిగి పనివాళ్ళ హక్కులకోసం పోరాటం జరిపిన వీరవనిత. లండన్‌ నగరంలో కూడా స్త్రీల హక్కులకోసం పోరాడింది. ఇలాంటి అద్భుతమైన స్త్రీ, ఒక యాత్రా గ్రంథాన్ని రాయటంతో ఆమె కీర్తి కాంతి సాహితీలోకానికి కూడా పాకింది.
   

ఫ్లోరా ఇంటి పట్టున ఎప్పుడూ ఉండేదికాదు. మనిషి మంచి పొడగిరి, అందగత్తె. వాగ్ధాటితో అందర్నీ ఆకట్టుకునేది. ఫ్లోరా యాత్ర చేయటానికి ఒక బలమైన కారణం ఉంది. ఆమె భర్తపేరు ఛాజెల్‌. భార్యని బాధించటం అంటే మహా ఇష్టపడేవాడు. అది తట్టుకోలేని ఫ్లోరా, స్త్రీవాదిగా మారిపోయి, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. భర్తనుండి విడాకులు తీసుకోవటం చట్టపరమైన నేరంగా పరిగణించే ఆ రోజుల్లో,  భర్త దురాగతాల్ని కోర్టులో ఋజువు చేసి, విడాకులు తీసుకొంటుంది. ఆమె ఇద్దరు పిల్లల్ని తనతోనే ఉంచుకుంటుంది. ఒంటరిగా ఉండి ఆర్ధికపరమైన ఇబ్బందుల్ని ఎదు ర్కోవాలి కాబట్టి, తన వాటా ఆస్థికోసం పుట్టింటికి ప్రయాణమవుతుంది. పెరూలో ఉన్న తన ఆస్థిని అమ్మేసి పిల్లల్ని పెంచుకోవచ్చు అనుకుంటుంది ఫ్లోరా. పిల్లల్ని తెలిసినవారికి అప్పగించి, అమ్మ గారింటికి బయలు దేరుతుంది.
   

1833 వ సం||లో పారిస్‌ నుండి ఒక్కర్తే బయలుదేరిన ట్రిస్టాన్‌ వివిధ వాహనాల మీద ప్రయాణాలు చేసుకొంటూ (హిచ్‌్‌-హైకింగ్‌) అట్లాంటిక్‌ సముద్రాన్ని ఓడ మీదదాటి, పసిఫిక్‌ తీరంలో ఉన్న పెరూ దేశానికి చేరుకొంటుంది. సొంత ఇంటికి చాలాకాలం తర్వాత వెళ్తున్నందుకు ఎంతో సంతోషపడుతుంది. అందరూ ఘనంగా స్వాగతం పలుకుతారు. తన వాటా ఆస్థి అడిగేసరికి, ‘నీవు పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి ఉంటేనే అది జరుగుతుంది. దాన్ని అమ్మితే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కదా’. అంటారు అన్నదమ్ములు.
   

కొండంత ఆశతో వచ్చిన ఫ్లోరా ఒట్టి చేతులతో తిరిగి పారిస్‌ చేరు కొంటుంది. పెరూకి తాను చేసిన ప్రయాణ వివరాల్ని ఒక పత్రికవాళ్ళు అడగటంతో వాటిని గ్రంథరూపంలో రాస్తుంది.  దానిపేరు వఊనీలి ఆలిజీరివీజీరి దీబిశిరిళిదీరీ ళితీ బి ఆబిజీరిబినీవ. ఆనాటి పారిస్‌లో ఈమె రాసిన యాత్రా సాహి త్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రచన వలన కొంత ఆర్ధిక సహాయం కూడా దొరకటంతో అది కొంతకాలంపాటు ఇంటి పోషణకి పనికొస్తుంది.ఫ్లోరా కష్టజీవి కావటంతో ఏవో పనులు చేసికొని ఒంటరిగా ఉంటూనే తన ఇద్దరు బిడ్డల్ని సాకుతుంది. భర్త ఆస్థిలో వాటాకోసం మళ్ళీ కోర్టు చుట్టూ తిరగటం ప్రారంభిస్తుంది. పది సంవత్సరాలు పోరాడినా ఆమెకు న్యాయం జరగదు. విడాకులు ఇచ్చినా, తన ఆస్థిలో వాటాకోసం కోర్టుల వెంట తిరుగుతున్న తన భార్యని ఛాజెల్‌ తుపాకీతో ఎదుర్కొంటాడు. ఒక బుల్లెట్‌ ఫ్లోరా వీపులోగుండా దూసుకుపోతుంది. అయినాసరే ఫ్లోరా బతుకుతుంది. ఛాజెల్‌ దురాగతానికి కోర్టు స్పందించి, అతడికి పదిహేడు సం||లపాటు జైలుశిక్ష విధిస్తుంది.
   

అంతటి బాధల్లో కూడా ఫ్లోరా ఏదో పనిచేస్తూ పిల్లల్ని తనే పోషిస్తూ ఉండటంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. మరికొన్ని రోజులకే మంచానికి పరిమితం అవుతుంది. సరైన మందులు లేక, చుట్టపక్కాలు కూడా అందుబాటులో లేకపోవటంతో మృత్యువు చేతికి దొరికిపోతుంది. ఫ్లోరా మరణవార్త విన్న తనవాళ్ళు పెరూ నుండి వెంటనే వచ్చి పిల్లలను తీసుకుపోతారు.ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మరణించిన ఫ్లోరా ట్రిస్టాన్‌ని ఆనాడు ఎవరూ పట్టించుకోలేదు. ఆమె మరణానంతరం, నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమెని వార్తల్లోని వ్యక్తిగా మార్చగలిగిన ఘనత ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచి చిత్రకారుడికి లభిస్తుంది. అతడే పాల్‌ గాగిన్‌ (1865-1910). అప్పటి నుండి ఫ్లోరా ట్రిస్టాన్‌ మరింతగా ఆదరించబడి, గొప్ప మహిళల జాబితాలో చేరిపోతుంది.
   

ఫ్లోరా ట్రిస్టాన్‌ పాల్‌ గాగిన్‌కి సొంత అమ్మమ్మ. ‘నా చిన్నతనం అంతా పెరూలోనే గడిచిపోయింది. ప్రయాణాలు చేసే అలవాటు మా అమ్మమ్మ ద్వారానే వచ్చింది’ అని చెప్పుకొన్నాడు.1925 వ సం||లో ఫ్లోరా ట్రిస్టాన్‌ యాత్రా గ్రంథం మరొకసారి ముద్రించబడి ఐరోపా స్త్రీవాదులకి, సాహస వనితలకి స్ఫూర్తి నివ్వటంతో విజయాన్ని సాధించింది.

(ఇంకా వుంది)

 – ప్రొ.ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో