అమ్మ మనసు

                 

ఆదూరి.హైమవతి

ఆదూరి.హైమవతి

నిర్మల ఇంటినంతా అందంగా ఒక ఎగ్జిబిషన్ హాల్ లాగా అలంకరించింది.పూలమాలలూ , బెలూన్స్ ,రంగు రంగుల లైట్స్ వెలుగుతూ ఆరుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. టైం ఆరైంది.ఇంతలో ఇంటిముందు వరుసగా కార్లు ఆగటం అతిధులంతా పూలబొకేలతో లోనికి రావటం మొదలైంది.

                  అంతా వచ్చి తాముతెచ్చిన బొకేలను అక్కడ అలంకరించి ఉంచిన ఫోటోముందు ఉంచసాగారు.కొత్తగా ఆ ఫంక్షన్ కి వచ్చిన విజయకు అంతా అయో మయంగాఉంది.ఆమె తన కజిన్ తో ” రాజీ! బర్త్ డే ఫంక్షనని నన్ను తెచ్చావు? ఎవరి బర్త్ డే? ఆఫోటో ఎవ రిది? దానిముందు పూలబొకేలన్నీ ఉంచుతున్నారెందుకూ?అసలీ ఎగ్జిబిషనేంటి? ఈగోల్డ్ మెడల్సూ, సర్టిఫికేట్లూ, కప్పులూ ఎవరివి?ఈవీల్ ఛైర్ నెందుకు అలంకరించారు ?ఎవరికైనా డొనేట్ చేస్తున్నారా? ” అని తన సందే హాలన్నింటినీ ఒకేమారు ప్రశ్నలరూపంలో బయటపెట్టింది. ‘హూష్ ‘ అందిరాజీ, మాట్లాడ వద్దన్న ట్లుగా..
                  అక్కడే అలంకరించి ఉన్న’కేక్ ‘మధ్య క్యాండిల్స్ వెలిగిస్తూన్న నిర్మల ఆమాటలు వింది. ” నీసందేహాలన్నీ నేను తీరుస్తాను.ముందు అంతా మానీరజ్ కు హేపీ బర్త్ డే చెప్పండి” అంటూ క్లాప్స్ ఇవ్వసాగింది. అంతా ‘ హేపీ బర్త్ డే టూ యూ , డియర్ నీరజ్ హేపీ బర్త్ డే టూ యూ ” అంటూ క్లాప్స్ ఇస్తూ పాడ సాగారు. ఆతర్వా త అందరికీ కేక్ ముక్కలూ ,స్వీట్స్, డ్రింక్స్ సర్వ్ చేసి వచ్చి విజయపక్కనే కూర్చుంది నిర్మల.

**              **                 **               **                       **                 **            **    
నిర్మల కళ్ళవెంట ధారాపాతంగా గంగాప్రవాహంలా నీరుకారసాగింది.ఆమె తుడుచుకునేప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు.” మీరిలా ఇక్కడ కూర్చుని ఏడవటం ఏమీబాగాలేదు.దయచేసి వెళ్ళిపొండి.ఎవరైనాచూస్తే నేనేదన్నా అన్నాననుకుంటారు.” విసుగ్గా అన్నాడు ఆనందరావు అనే ఆ పాఠశాల ప్రిన్సిపల్. అది ఆనగరంలో పేరున్న పెద్ద పాఠశాల . ఫీజులు గుంజుకోడంలోనూ ,పిల్లలను భయపెట్టిచదివించడంలోనూ , రిజల్సు సాధించడం లోనూ దేశం లోనే అగ్రస్థానంలో ఉన్న విద్యా సంస్థ. అదే ‘ వాగ్విలాసినీ విద్యాలయం.’ పిల్లల తల్లిదండ్రులు తమపిల్లలకు ఏడాది నిండగానే ఆస్కూల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ వేస్తారు. ముందే డోనేషన్ భారీగా కట్టి సీట్ రిజర్వ్ చేసే సుకుంటారు. అంతగొప్ప పేరున్న పాఠశాల లో నిర్మల కొడుకు ‘నీరజ్ ‘ ప్రస్తుతం ఐదోక్లాస్ చదువుతున్నాడు.
                  ఇప్పటివరకూ ఆస్కూల్ లోచదువుతోపాటుగా మిగిలిన అన్ని అంశాలతోపాటు పరుగుపందెంలో ఫస్ట్ ప్రైజ్ లన్నీ ఎప్పుడూ వాడికే ! ఒక పెద్ద సంచీపట్టుకెళ్ళి వాడికి వచ్చిన బహుమతులన్నీ ఇంటికి తెచ్చేది నీరజ. అలాంటిది ఎందుకో ఉన్నట్లుండి నిర్మలకొడుకు నీరజ్ కు కాళ్ళు పట్టుకుపోయాయి.ముందు ఏదోలే అనుకు న్నారు నిర్మల దంపతులు.కానీ రాను రానూ వాడు సరిగా నిల్చోలేక పోతున్నాడు.అడుగు తీసి అడుగేయ లేకపోతున్నాడు. టాయ్ లెట్ కెళ్ళాలన్నా, స్నానం చేయాలన్నా ఎవరిసాయమైనా అవసరమయ్యేది. అదంతా చూస్తున్న నిర్మల ‘అమ్మ మనస్సు ‘ గిలగిలా కొట్టుకోసాగింది.నీరజ్ తర్వాత వారికి పిల్లలుకలగలేదు. వాడి మీదే ఆదంపతులు తమప్రాణాలన్నీపెట్టుకుని జీవిస్తున్నారు.
నిర్మల భర్త నరసింహం ఒక కెమిస్టీ ప్రొఫెసర్! నిర్మల నరసింహం మేనకోడలు . మేనరికం చేసుకోడం అతడికి ఇష్టం లేకపోయినా బామ్మ గట్టిపట్టు పట్టడంతో కాదనలేక చేసుకున్నాడు.నిర్మల ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఒక ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గాపనిచేస్తున్నది.వారిద్దరికీ ముద్దులబిడ్డనీరజ్.పసితనంనుండేఅమిత మేధా శక్తి ప్రస్పుటంకాగా ఐదేళ్లకే భగవద్గీత కంఠోపాఠం చేసేశాడు.యోగ,కరాటే ల్లోమంచిప్రావీణ్యమూ సంపాదించాడు. తమప్రాణాలన్నీ వాడిమీదే పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు నరసింహం , నిర్మల. అలాంటి నీరజ్ కు ఇలా కాళ్ళు పట్టుకుపోడం వారిమనస్సుల్లో పెద్ద బండరాయి దిగినట్లై బాధపడసాగారు.
                  అనేక మంది వైద్యులను సంప్రదించి అనేక పరీక్షలు చేయించారు. వైద్యులు ఏవేవోమందులు మార్చిమార్చి ఇస్తూనే వున్నారు.చదువు వృధాకాకూడదని నిర్మల కొడుకును వీల్ ఛైర్లో పాఠశాలకు తీసుకెళు తున్నది. ఐదోతరగతి నుండీ వాడిక్లాసు మేడమీద.నిర్మల పాఠశాల ప్రిన్సిపల్ ను కల్సి తన బాధ చెప్పుకుంది. “మావాడు మెట్లెక్కలేడు, ఆక్లాసు క్రింద జరిపించే ఏర్పాటుచేస్తారా సార్! మావాడుతెలివైన విద్యార్ధని మీకూ తెల్సునుకదా! వాడి చదువు,పాడైపోకూడదని మా కోరిక. ” ఎంతో వినయంగా అడిగిందినిర్మల పాఠశాల ప్రిన్ సిపాల్ గారిని.
“అదెలా వీలవుతుంది? మీవాడి ఒక్కడికోసం మేమెలా క్లాస్ మార్చగలం? ఒక్కడికోసం అందర్నీ డిస్ట్రబ్ చేయలేను. మీరడిగింది వీలుకాదు.” ఖచ్చితంగా చెప్పేశాడు ప్రిన్సిపల్. నిరాశతో నిర్మల కళ్ళవెంట నీరు కార సాగింది .’తన కొడుకు భవిష్యత్తు ఏంకానూ?’. అనేదే ఆమెబాధ..
నిర్మలకొడుకుకోసం మరోసారి ప్రిన్సిపల్ గారిని వేడుకుంది.ఆయనా అంతే ఖరాఖండీగా కుదరదని చెప్పే శాడు.అందుకే నిర్మల ఆయన గదిలో కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
                 నిర్మల ఒక నిర్ణయానికి వచ్చింది.ఆతల్లి మనస్సు గట్టిచేసుకుని పదేళ్ళ ఆపిల్లాడ్ని రోజూ ఎత్తుకుని 20 మేడ మెట్లు ఎక్కి క్లాస్ లో దింపేది.వీల్ ఛైర్ పైకి మోసుకెళ్ళి ఉంచుకుని ,తరగతి గది బయట పెట్టుకుని క్లాస్ బయటే కూర్చుని వాడి అవసరాలేమైనా ఉంటాయేమోని కిటికీలోంచీ వాడ్ని గమనిస్తూ ఉండేది. ఉపాధ్యాయులు ఆమెను వెళ్ళిపొమ్మని అనేక మార్లు కోప్పడ్డం కూడా జరిగేది . ప్రిన్సిపల్ సైతం ఆమెనలా ఉండకూడదని హెచ్చ రించారు.ఐనా ఆమె తన కుమారుని కోసం అందరి ఛీత్కారాలూ భరిస్తూ ఉండేది. అందర్నీ బ్రతిమాలేది, బామాలేది. నిర్మల తాను చేస్తున్నలెక్చరర్ ఉద్యోగం సైతం మానేసింది తన బిడ్డకోసం. వాడ్ని తరగతిలోని మిగిలిన వారు హేళనచేసే వారు . ” ఒరే ఈమారుకూడా మన నీరజ్ కే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటావా?”అనినవ్వేవారు. “కాళ్ళులేకపోయినా వీడికి ఫస్ట్ ర్యాంక్ మాత్రం వస్తున్నదిరా?” ” ఏం చేస్తాడుపాపం ఆటలెటూ లేవాయె చదువైనా చదవనీ.” ” వీడిపీడ మనకు వదలిపోయింది ,ఆటల్లో అన్నీ ప్రైజులూ వీడికేనాయె!,ఇప్పుడు వీడి పోటీలేకుండా చేసిన ఆ దేవునికి ధాక్స్ చెప్పుకోవాలిరా!” నీరజ్ వినేట్లే వాడిక్లాస్ మేట్స్ మాట్లాడుకోడం నిర్మల కూడా వినింది . తనకే ఇంత బాధగాఉంటే ఇహ తన బిడ్ద ఎంత బాధ పడుతున్నడో అనుకుని ఆమె’ అమ్మ మనస్సు’ బాధతో నిండి పోయింది. నిర్మల ఉపాధ్యాయులకు విషయాలన్నీ వివరంగా చెప్పినా వారు అంతగా పట్టించుకోలేదు. కాళ్ళు నడిచేందుకు సహకరించక పోయినా నీరజ్ మాత్రం చదువులో ఏమాత్రం ఏమారలేదు. అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్స్ అన్నీ వాడికే దక్కేవి. తల్లి దండ్రుల వేదన, తన కోసం అమ్మపడే బాధ చూసి నీరజ్ ఒకరోజు తల్లితో

     ” అమ్మా! నన్ను ఎంతకాలం మోస్తావు?నేనేం పసికూననుకాదుకదా! నన్ను వేరే బళ్ళో చేర్పించ రాదూ!” అన్నాడు .

ఆమె నవ్వి ” నీరజ్! అక్కడా ఇలాంటి వారేగా ఉండేది.దిగులుపడకు,నీవు ఇవేమీ పట్టించుకోకు. నీకోసం ఏమైనా చేస్తాను . నిన్ను చదువుకు మాత్రం దూరం కానివ్వను ” అంది.

నీరజ్ మనస్సు బాధతో మూలి గింది.ఆపసి వాడు తల్లి తనకోసం పడే పాట్లకు ఆవేదన చెందసాగాడు.తల్లి తనకోసం ఎంత శ్రమ పడు తున్నదో అర్ధం చేసుకున్న నీరజ్ చదువు పట్ల ఇంకా ఎక్కువ శ్రధ్ధ పెట్టసాగాడు.
అనే మంది వైద్యులు ఏడాదిపాటు వైద్యం చేసి, వాడివళ్ళంతా ఇంజక్షన్స్ తోనూ, వాడిపొట్టంతా మందు లతోనూ నిండిపోయి ,సొమ్ము లక్షల కొద్దీ ఖర్చయినా ,నిపుణులైన వైద్యులను సంప్రదించినా,వారు ఎన్నో విధాల ప్రయత్నించినా , ఎంత గొప్ప వైద్యం అందించినా ,ఏమీ మార్పులేదు. నీరజ్ కాళ్ళలో చలనం కొంచెం కూడా రాకపోగా రానురానూ తొడలవరకూ స్పర్శపోయింది . ఒక ఏడాదిగడిచిపోయింది.
ఒకరోజున నీరజ్ నాన్ననరసింహం ఒక జర్నల్ చదువుతుండగా ఆయన కన్ను ఒక ఆర్టికల్ పై పడింది. దానిసారాంశం ‘ఇలాంటి నరాల సంబంధ జబ్బుకు అమెరికాలో మంచి వైద్యం లభిస్తుందని!. అది చదివాక నిర్మలకు చెప్పాడాయన.అంతేనిర్మల భర్తను తొందరచేసి తమకున్న ఆస్తులన్నీ ఐన కాడికి అమ్మేసుకుని ఆసొమ్ముతీసుకుని అమెరికా ప్రయాణమయ్యారు . పిల్లవాడికి నయం చేసుకోడమే వారిలక్ష్యం.
అమెరికా లోని చికాగో చేరిన నిర్మల నరసింహం తమకు పరిచయస్తు లెవ్వరూలేకపోడంతో ముందు వసతి సౌకర్యం చూసుకుని ఆతర్వాత ఇంటర్ నెట్ ద్వారా విచారించుకుని ,సమాచారం సేకరించుకుని వెళ్ళిచికాగో లోని ఒక వైద్య శాలలో నీరజ్ ని నిపుణులవద్ద చూపారు. వారు పాత రిపోర్టులన్నీ పరిశీలించి కేస్ హిస్టరీ స్టడీచేసి తమ బృందం నిపుణులందరితో సంప్రదించి ,’ తప్పక ప్రయత్నిస్తామనీ, ఐతే ఖచ్చితంగా ఈవ్యాధిని తగ్గిస్తామని చెప్పలేమనీ ‘ అన్నారు. నరాలకు శక్తిని అందించే వ్యవస్త రోజురోజుకూ బలహీన మవుతున్నదనీ ఇలాంటి వ్యాధి కొన్నిలక్షల మందిలో ఒకరికి వస్తుందనీ దీనికి సరైన వైద్యం ఇంకాకనుగొనలేదని,‘తమశాయ శక్తులా ప్రయత్నిస్తామనీ ,ఎన్నాళ్ళుపడుతుందో చెప్పలేం,అనీఅన్నారు. నిర్మల నరసింహాలకు తమది మేన రికం ఐనందున ఇలా తమ బిడ్డ కు ఈజబ్బు వచ్చిందేమోనే అనుమానం వచ్చి అడిగారు.దానికి వారు’ ఇది మేనరికం వల్ల వస్తుందనికూడా ఖచ్చితంగా చెప్పలేము కానీ ముందుతరాల వారికి ఉంటే’ నైట్ బ్లైండ్ నెస్ ‘ లాగా జంప్ చేసి తర్వాత కొన్ని తరాల వారిలో ఎవరికైనా రావచ్చనికూడాచెప్పారు.నరసింహం ఫోన్ లో తమ వారిని సంప్రదించగా నరసింహం ముత్తాత కాళ్ళు చచ్చుపడిపోయి తీసుకుని తీసుకుని మంచంలోనే మలమూత్ర విసర్జనలన్నీ చేస్తూ మరణించినట్లు తెలిసింది.ఆరోజుల్లో వైద్య సదుపాయమూ అంతంతమాత్రమే కదా!
ఏది ఏమైనాకానీ అని మనస్సు లో స్థిర నిర్ణయ తీసుకున్న ఆదంపతులు నీరజ్ చదువు ఆగిపోకుండా పాఠ శాల లో వేయాలని నిర్ణయించారు.వారు నివసిస్తున్న’ బఫెలో గ్రోవ్ ‘ కమ్యూనిటీలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి సమాచారం సేకరించారు. వారు నీరజ్ ను చూసి “మేడం! మీరు ఒక్కనెల ఆగితే వేసవి శలవులు వస్తాయి. ఆ తర్వాత జాయిన్ చేయవచ్చుకదా!” అన్నారు.” మాబాబు చదువు ఆగిపోకూడదని మేము తొం దర పడు తున్నాము.” అన్న నిర్మల మాటలకు ఆపాఠశాల ప్రిన్సిపల్ “మేడం ఎందుకంటే ఈలోగా మేము మీ బాబు తరగతిలోకి వీల్ ఛేర్లో వచ్చేందుకు వీలుగా ఒక ర్యాంప్ కట్టించి , టాయిలెట్ అతడికి తగినట్లుగా మార్పించు తాము.దానికోసం వేసవితర్వత చేర్పించమనికోరుతున్నాం.” అనిచెప్పగానే నిర్మల కళ్ళు జలపాతాలయ్యాయి. ఆ ప్రిన్సిపల్ ” అమ్మా! మీ బాబుకు తప్పక అడ్మిషన్ ఇస్తాము . క్రిందగదిలోనే అతనికి క్లాస్ ఏర్పాటుచేస్తాము. దిగులు చెందకండి “అని భుజం తట్టి ధైర్యం చెప్పారు.నిర్మల మనస్సు కృతఙ్ఞతతో నిండి పోయింది. తన స్వదేశం లోని స్వస్థలంలోని పాఠశాల ప్రిన్సిపల్ మాటలు గుర్తువచ్చాయి. ఆవేసవిలో నీరజ్ కు వైద్యం తోపాటుగా ఇంట్లోనే చదువూ సాగింది . అంతఖర్చు భరించాలంటే వారు అన్నీ అమ్ముకుని తెచ్చుకున్నసొమ్ము ఏ మూలకూ చాలదని వారికి అర్ధమైంది.నరసింహం వెంటనే ప్రయత్నించి ఒక కళాశాలలో ప్రొఫెసర్ ఉద్యోగం సులువుగానే సంపాదించాడు.అతడికిప్పుడు కుటుంబ సభ్యుల కందరికీ ఉచిత వైద్య సదుపాయం అందుకునే అర్హత అవకాశం ఏర్పడ్డాయి. వేసవి శలవులు కాగానే పాఠశాల వారు చెప్పిన మార్పులు నీరజ్ ఒక్కడికోసమే చేయించి , అడ్మిషన్ఇచ్చారు. వాడితరగతి క్రిందనే ఏర్పరచారు.నిర్మల మనస్సు వారిపట్ల కృతఙ్ఞతతో నిండిపోయింది.తనంతట తానే బ్యాటరీ సాయంతో డ్రైవ్ చేసుకుపోగలిగిన వీల్ ఛైర్ నీరజ్ కు ఏర్పరచారు.నిర్మలకూడా అదేపాఠశాలలో ఉద్యోగం సంపాదించింది. క్రమేపీ నీరజ్ చదువు పాఠశాలనుండీ కళాశాలకు మారింది.నీరజ్ చేతుల నరాలు సైతం పని చేయ ని స్థితి దాపురించింది. వైద్య దారి దారి వైద్యానిది కాగా రోగం దారి రోగానిదైపోయింది.నిర్మల , నరసింహం శ్రమ కు కొంచెమైనా ఫలితం లేకపోయింది.చదువులో ప్రధముడైన నీరజ్ డిగ్రీలో గోల్డ్ మెడల్ అందుకున్నరోజే ఆ జబ్బు మెదడుకు వ్యాపించి కోమాలోకి వెళ్ళిపోయాడు.కొన్ని నెలలపాటు నిర్మల అందరు దేవుళ్ళనూ ప్రార్ధించీ, వైద్యులను అర్ధించీ కృంగిపోయింది, చిక్కి శల్యమైపోయింది. 

 కానీ ఒక రాత్రి శ్వాస తీసుకోడం కష్టమై ఎమర్జెన్సీలో మూడురోజులు ప్రాణంతో పోరాడి ,వారిని శోక సాగరంలో ముంచి తుదిశ్వాస విడిచాడు .

” అమ్మా! మీరు మీబిడ్డను మీరు పని చేసే స్కూల్ పిల్లలందరిలో చూసుకోండి.వారందరికీ విద్య బోధించి  మీవాడిలా వారినీ గోల్డ్ మెడల్సు అందుకునేలా తీర్చిదిద్దండి .అదే మీ జీవిత ధ్యేయం చేసుకోండి. ” అని ఓదార్చాడు  డాక్టర్ .

**              **                 **               **                       **                 **            **    

“అదమ్మా నాకొడుకు నీరజ్ కధ.

వాడి శరీరంలోఆరోగ్యంగా ఉన్నభాగాలన్నింటినీ వైద్యుల సహకారంతో  అవసరమైనవారికి దానం చేశాం. ఇప్పుడునాకు ఒక్క నీరజ్ కాదు అనేకమంది నీరజ్ లున్నారు.వారందరూ వేరే ప్రాంతాల్లో ఎక్కడ వున్నా నా నీరజ్ ను వారిలో ఊహించుకుంటూ నా నీరజ్ ఈలోకంలో  ఉన్నట్లు సంతోషిస్తున్నానమ్మా!

నేను వాడి బర్త్ డే ఇలా గత పదేళ్ళుగా జరుపుకుంటూ వాడి ఙ్ఞాపకాలను మరువక ఇలా ప్రతిఏడాదీ గుర్తుచేసుకుంటూ ఉంటాను.ఇవన్నీ వాడికి వచ్చిన బహుమతులు, సర్టిఫికేట్స్,వాడు తిరిగిన వీల్ ఛైర్!వాడిప్పుడు బ్రతికి రోగ విముక్తుడై ఉంటే పెళ్ళి చేసు కుని భార్యాబిడ్డలతో మాఇల్లు కళకళలాడు తుండేది.కనీసం వాడి బర్త్ డే రోజైనా మాఇల్లు ఇలా మీ అందరి రాకతో కళకళలాడాలని నాఆశ.ప్రతి ఏడాదీ తప్పక వస్తారుగా?! ” అంటూ చిరునవ్వుతో నిర్మలైతే చెప్పిందికానీ ఆ హాలంతా వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దాలతో నిండిపోడం ఆమె గమనించనేలేదు. ఆ అమ్మ మనస్సులో నీరజ్ అక్కడి పిల్లలందరిలో కనిపిస్తుండగా ఆమె నయనాలు అశృపూరితాలయ్యాయి.

– ఆదూరి.హైమవతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

కథలుPermalink

3 Responses to అమ్మ మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో