సాగర సమీరం

-పెరుగు సుజనా రామం

ఏడేళ్ళ నిరీక్షణ తర్వాత నివాసానికి దగ్గరగా ఉన్న గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు బదిలీ కావటం మనసుకెంతో సంతోషం కల్గిస్తోంది.

కొత్త స్కూలు ,కొత్త పిల్లలు కొత్త ఆనందంతో మనస్సు ఉన్నా ఏడేళ్ళగా నా వెంట తిరుగుతున్న సుందరమయిన రంగుల సీతాకోక చిలుకల్లాంటి పిల్లల్ని వదిలేసి రావటం మనసుకు బాధగానే ఉంది. ఐడున్నర ఎకరాల విశాలమయిన ఆవరణలో క్రమబద్ధంగా పెంచిన వృక్షచ్చాయతో కనువిందు చేస్తున్న పాఠశాలను చూడగానే నేనేనాడో కోల్పోయిన నా బాల్యం నా కళ్ళ ముందు ప్రత్యక్షం అయిన అనుభూతి కలిగింది.

ప్రదానోపాధ్యుల్ని కలిసి జాయినింగ్ రిపోర్ట్ రాసిచ్చాను. విరామ సమయంలో స్టాఫ్ అందర్నీ పిలిచి ఒక్కోరిని పేరు పేరునా పరిచయం చేసారు.

అందరిలోనూ నన్ను అత్యంతం గా ఆకట్టుకుంది సమీరా టీచర్.మేమిద్దరం పాతికేళ్ళ క్రితం ఒకే పాఠ శాల లో చదువుకున్నాము.నా కన్నా రెండేళ్ళ సీనియర్.ఎప్పుడూ పాఠ శాల లో టాపర్.ఉపాధ్యులందరికి ఇష్టమయిన విద్యార్థిని.

ఆ సమీరను పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడిలా చూడటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.సమీర కూడా నన్ను గుర్తు పట్టింది.ఇద్దరం కలిసి గతంలోని మధుర స్మృతులను కలబోసుకున్నాము.

నా కలల సామ్రాజ్యం నా ఇద్దరమ్మాయిలు ,సాహిత్యం,పుస్తకాలు,నా సాధనాలు తెలుసుకుని సమీర ఎంతగానో మురిసి పోయింది.

తన గురించి అడిగితే కన్నులను విప్పరించిందే తప్ప సమాధానం మాత్రం చెప్పలేదు.దాంతో నేనూ బలవంతంగా తెలుసుకోవాలని ప్రయత్నించలేదు.

ఈ స్కూల్లో పిల్లలు త్వరగానే అలవాటయ్యారు ఏళ్ల నాటి సమీర స్నేహం మళ్ళీ చిగురులు దాల్చింది.అయితే మునుపటిలా కాకుండా ఎప్పుడూ గంభీరంగా ఉండే సమీర కళ్ళలో ఏదో తెలీని బాధ ప్రస్ఫుటంగా కనిపించేది.

ఏమయిందని ఎప్పటికప్పుడు అడుగుదామని నోటి చివరి వరకూ వచ్చిన మాటని మధ్యలోనే అదిమి పెట్టేసే దాన్ని.ఎందుకంటే ఆమె స్మృతుల్ని కదిపి మరింత బాధ కలిగించిన దాన్ని అవుతానేమోనని.పిల్లల అనురాగంతో రోజులు హాయిగా ,ఆనందంగానే గడిచిపోతున్నాయి.

ఎప్పటిలాగే ఆరోజు స్కూలుకెల్లాను.

నా కన్నా ముందే వచ్చిన సమీర ముఖంలో దు:ఖం ప్రవహిస్తోంది.

తనలో ఎప్పటి నుండో గూడు కట్టుకున్న విషాదమంతా కరిగి కన్నీరుగా ప్రవహిస్తోంది.తన ఏడ్పంతా కరిగిపోయాక అడిగాను. ఏమయింది సమీరా?

నాకున్న ఏకే ఒక్క స్నేహితురాలివి .నీక్కాక నా గోడు ఇంకెవరికి చెప్పుకుంటాను?పాతికేళ్ళ నా వైవాహిక జీవితం నాకు మిగిల్చిన కస్తాలు,కన్నీళ్లు అన్నిటిని గురించి చెబుతా విను అంటూ ప్రారంభించింది.

ఇంటర్మీడియట్ కాగానే రాఘవతో సమీర వివాహం జరిగింది. అప్పుడే కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన రాఘవలోని విశాల హృదయాన్ని ,ఆదర్శ భావాల్ని చూసి ముచ్చట పాడనీ వారెవరు?సమీర ఆనందం ఆకాశాన్నంటింది.

అయితే ఆ ఆనందం మున్నాళ్ళ ముచ్చట అయింది. కొత్తదనం తగ్గగానే అత్తగారి అసలు రూపం బయటపడింది.సంమీర కోటి ఆశలు ,ఊహలు శూన్యమయిపోయాయి.ప్రతి క్షణమూ పోరాటమే ,అత్తగారి పెత్తనం,అసూయ సమీర, రాఘవల దాంపత్య జీవనానికి అడ్డుగోడగా నిలిచింది. అత్తగారి అనుమతిలేందే మొగుడితో మాట్లాడడం కూడా కుదిరేది కాదు.అత్త ఆరళ్ళతో అణగారి పోతున్న సమీరకు భర్త ఆదరణ కూడా కరువడంతో ఆమె మానసిక క్షోభ ను పట్టించుకునే వాళ్ళు లేకపోయారు. తల్లంటే రాఘవకు ఉన్న అతిప్రేమ సమీర మీద జాలిని కూడా లేకుండా డామినేట్ చేసింది.దాంతో భార్యను పట్టించుకునేవాడుకాడు.

అత్తగారింట్లో సమీర జీవితం చీకటి సమాధిలో కూరుకుపోయింది.పదేళ్ళ వైవాహిక జీవితంలో ఇద్దరూ ఆనందంగా గడియలు కొన్ని మాత్రమే.కొత్తలో భార్యను అపురూపంగా దగ్గరకు తీసుకుని మురిసిపోయిన రాఘవ అమ్మకు భయపడి భార్య దగ్గరకు కూడా జంకుతున్నాడు.

ఆకాశమంత ఆవేదనని గుండెలో దాచుకుని కన్న వారిక్కుడా మనసులోని బాధని తెలియకుండా నిండుకుండలా జీవితాన్ని వెళ్ల దీస్తోంది సమీర. అత్తగారింటికి వచ్చే సమయంలో తండ్రి సమీరను దగ్గరకు తీసుకుని అమ్మా సమీరా కొడుకు ఇంటిపేరు నిలిపితే కూతురు పుట్టింటికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతుంది.అది గుర్తుంచుకుని మసులుకో అని చెప్పిన మాటలు ఇంకా చెవిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి.

మనసుని పాషాణం చేసుకుని చదువు మీద దృష్టి కేంద్రీకరించి డిగ్రీ,ఆపై బి.ఇడి పూర్తి చేసింది.అదృష్టం కొద్దీ బి.ఇడి పూర్తి కాగానే స్కూలు అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చేసింది.అత్త కష్ట పెట్టినా ,భర్త నిరాదరణ చూపినా ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో కొత్త జీవితం ప్రారంభించింది. భర్త, అత్త ఏదో ఒకరోజు మారక పోతారారా? ఆశ నమ్మకంతో గడుపోతోంది సమీర.

అయితే ఇప్పుడు కొత్తగా అత్త గారి సాధింపులు కొత్త పుంతలు తొక్కాయి.పెళ్ళయి ఇన్నేళ్ళయినా ఇంకా పిల్లలు లేరు. నాకొడుక్కి రెండో పెళ్లి చేస్తానంటూ ,తన కూతురి కూతుర్నిచ్చి చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి . స్త్రీ కి భర్తే జీవితమంతుంది భారతీయ సంప్రదాయం .దానికోసమే ఇప్పటి వరకూ ఇన్ని కష్టాల్ని ,ఇంత వేదనని భరించింది.దానికే విఘాతం కలుగుతుంటే సహించ లేకపోయింది.వ్యతిరేకించింది,పోరాటం చేసింది.

తన నలుగురు ఆడపడుచులు అత్తగారికి ఊతంగా నిలిచారు.అయితే భర్త మాత్రం రెండో పెళ్లి వద్దంటూ నచ్చ చెప్పా ప్రయత్నించాడు.పెళ్లి చేసుకోక పోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఓ రోజు ఇంట్లోంచి పారిపోయింది. ఎక్కడికి వెళ్లిందో కాని నెల గడిచినా ఇంటికి రాలేదు.తల్లి వేల్లిపోవతంతో రాఘవకి సమీర మీద ఉన్న జాలి కూడా కరిగి పోయింది.

ఇద్దరి మధ్యా శున్యమే మిగిలింది. పదేళ్ళగా తమ మధ్య ఏ అనుబంధం పెరిగిందని ఆలోచించింది సమీర చివరికో రోజు రాఘవని రెండో పెళ్లి చేసుకోమని చెప్పేసింది. ఆడపడుచులు కూడా తమ్ముడ్ని పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు.ఈ విషయం ఎలా తేసిందో కాని ఒకరోజు ఉన్నట్లుంది ఇంట్లోకి అడుగు పెట్టింది అత్తగారు.తల్లిని చూసి రాఘవ కన్నీరు మున్నీరయ్యాడు. ఇంకెప్పుడూ నీ మాట కాదన్నంటూ వాగ్దానం చేశాడు. ఇది చూసి సమీర మరింత స్థాబ్ధతలోకి వెళ్ళిపోయింది.బాధలకు స్పందించటమే మానేసింది.

మొత్తానికి తన భర్త రాఘవకి ఆడపడుచు కూతురు రాణితో దగ్గరుండి వివాహం జరిపించింది. జరిగింది తెలుసుకున్న సమీర తల్లిదండ్రులు కూతుర్ని కోప్పడ్డారు. మా ప్రమేయమే లేకుండా నీ నిర్ణయం నువ్వే తీసుకున్నావు కాబట్టి కష్టమయినా సుఖమయినా నువ్వే భరించమన్నారు.

పదిహేన్నాళ్ళుగా తన కళ్ళ ముందే మరో స్త్రీతో కాపురం చేస్తున్న భర్తని చూస్తూ సమీర నిస్సహాయంగా ఒంటరిగా ఉండిపోయింది. రాఘవ మీద ప్రేమ కరిగి పోయింది.పోరుపెట్టి మరీ కొడుక్కి రెండో పెళ్లి చేసిన అత్తగారు కాలగర్భంలో కలిసిపోయింది.కానీ తన భర్తకు రాని ద్వారా కూడా సంతానం కలుగలేదు. తల్లి మరణంతో సమీరకు దగ్గర కావాలని రాఘవ ఎంత ప్రయత్నించినా సమీర మాత్రం అతణ్ణి ఆదరించలేక పోయింది.

గతంలోంచి స్మృతిలోకి వచ్చింది సమీర .

ఇదీ సుజీ నా కథ !ఉద్యోగ ధర్మమా అని బ్రతుకంతా సరిపడే జీతమయితే ఉంది కానీ , సుఖంగా జీవించేందుకు జీవితమే లేదు.అంటున్న సమీరని చూసి నన్ను నేనూ నియంత్రించుకోవటమే కష్టమయింది.

ఈ సమాజంలో భార్యాభర్తల బందానికున్న విలువలు మారిన కాలంతో పాటు ,మరుగున పడుతున్నందుకు బాధపడాలా , రాఘవ లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి సమీర దూరంగా ఉంచి శిక్షించిందని ఆనందించనా? సమీరా !జీవితమంటే కేవలం పెళ్లి ఒక్కటే కాదు.నీ మనస్సుని,శరీరాన్ని,సమస్త ప్రపంచాన్ని నీ విద్యార్థుల కోసమే నిలుపుకున్నావు.

అంటూ నా సాగర సమీరాన్ని దగ్గరకు తీసుకున్నాను.

సముద్రాన్ని సుడి గుండాలని సమంగా తనలో దాచుకున్న సమీర పెదవులపై చిరునవ్వు ఎప్పటిలాగే స్వచ్చమయిన కుసుమంలా విచ్చుకుంది.*

కథలుPermalink

One Response to సాగర సమీరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో