పాత రోత

 లక్ష్మీ రాఘవ

లక్ష్మీ రాఘవ

అది 2001 వ సంవత్సరం…..

కొత్త మేనేజరు వస్తున్నాడని నీటుగా ముస్తాబు చేసుకుంది ఆ చిన్న టౌను లోని ఆఫీసు. ఎన్నడూ టైము కు రాని  గుమాస్తాలు కూడా టంచనుగా సీటులో వున్నారా రోజు. సూపరెండెంటు రంగారావు అందరినీ గమనించీ సంతృప్తి గా తలపంకించారు. అటెండరు రాము పూలహారాన్ని జాగ్రత్తగా ట్రే లో పెట్టాడు. సరిగ్గా అనుకున్న టైముకే మేనేజేర్ శంకరరావు ఆఫీసులో ప్రవేశించారు.

అందరూ సాదరంగా ఆహ్వానిస్తూ నించున్నారు. రంగారావు పూలమాల వేయబోతే

“ఎందుకండీ ఈ ఆర్భాటాలు?”  అని ఇష్టం లేనట్టూ అన్నా వేసుకోక తప్పలేదు. అందరినీ పరిచయం చేసారు రంగారావు గారు వారి వారి సీట్లదగ్గరకు వెళ్లి మరీ. అందరి పరిచయాలు అయ్యాక.  తన రూం లోకి వెడుతూ పక్కన వరెండా లోకి చూసారు. ఒక మూలగా టేబులు మీద ఎత్తుగా పరచివున్న ప్లాస్టిక్ షీటు ను చూసి “ఏమిటండీ ఇది” అని రంగారావు ని అడిగారు.

“టైపు మిషన్ సార్” అన్నారు రంగారావు.

“టైపు మిషన్ ఇంకా వాడు తున్నారా?” ఆశ్చర్యంగా అన్నారు శంకర్ రావు

“లేదు సార్, రెండేళ్లక్రితం మన టైపిస్టు రిటైర్ అయ్యారు…కంపూటర్ వచ్చాక దాన్ని ఉపయోగించడం లేదు సార్.”

“ రెండేళ్లనుండీ ఈ మిషన్ ఇలాగే వుంచారా?”

“ అవును సార్. ప్రతి యేడాదీ స్టాక్ చెకింగ్ లో చూపించాలి కదా”

“వాడని దాన్నిఎన్ని రోజులు చూపిస్త్తారు?”

“వాడగలిగే పరిస్థితి లో వున్నా వస్తువుని రిటనాఫ్ [written off] చెయ్యలేము కదా సార్”

“అమ్మేయ్యచ్చు కదా..’

“అమ్మడానికి మెయిన్ ఆఫీసు పర్మిషన్ కావాలి కదా సార్”

“మీరు ఇవ్వాళే మెయిన్ ఆఫీసుకి లెటర్ రాయండి. దీన్ని వాడటం లేనట్టూ అమ్మేయడానికి పర్మిషన్ కావాలని..” అంటూ తన రూం లోకి వెళ్ళాడు మేనేజేర్.

“ఓకే సార్ “ అంటూ స్టాకు చెకింగ్ రిజిస్టర్ లో టైపు రైటర్ ఐటం నంబరు కోసం చూడమని దానికి సంబందించిన క్లర్కుకు  ఆదేశాలిచ్చాడు సూపరెండెంటు రంగారావు.

ఆఫీసు టైము లోపలే లెటర్ డ్రాఫ్ట్ చేసి మేనేజేర్ సంతకం తీసుకుని లెటర్ dispatch  చేసాడు రంగారావు.

                  రెండు నెలలు గడిచినా మెయిన్ ఆఫీస్ నుండీ ఎటువంటి రిప్లయ్ రాలేదు. టైపు మిషన్ చూసినప్పుడల్లా శంకర రావు చికాకు పడుతూనే వున్నాడు,  మళ్ళీ రెండు రిమైండర్ లు వెళ్ళాక మెయిన్ ఆఫీస్ నుండి రిప్లయ్ వచ్చింది, టైపు మిషన్ కొనడానికి ఇచ్చిన పర్మిషన్ లెటర్ మరియు కొన్న రసీదు పంపమని…..

రంగారావూ , గుమాస్తాలు ఆఫీస్ లో వున్న ప్రతి పాత ఫైలు వారం రోజులు తిప్పి తిరగేసినా, ఒక్క స్టాక్ రిజిస్టర్ లో ఎంట్రి అయిన డేటు తప్ప పర్మిషన్ కాపీ దొరకలేదు. రంగారావుకీ ఏమి చెయ్యాలో తోచలేదు. చివరకి ఈ విషయం మేనేజేర్ దృష్టికి తీసుకు వెడితే  ఎందుకు రికార్డ్స్ సరిగ్గా మెయింటిన్ చేయరని  బాగా కోప పడ్డారు. టైపు మిషన్ దయ్యం లాగా చూస్తూ కనిపించింది.

‘ఇదెక్కడి తద్దినం రా బాబూ’ అనుకుంటూ వూసురూ అన్నాడు రంగారావు.

మరో ఆరు నెలలకి మెయిన్ ఆఫీస్ నుండి రిమైండరు వచ్చింది టైపు మిషన్ రసీదు కోసం! ఏమీ చెయ్యలేక వూరుకుంటే ఒక సంవత్సరం తరువాత మెయిన్ ఆఫీస్ నుండీ రిమైండర్ రావటం ఆగిపాయింది. టైపు మిషన్ ను చూసి అస్తమానం విసుక్కునే శంకరరావుకి ట్రాన్స్ఫర్ అయి వెళ్లి పోవాల్సి వచ్చింది.

    ***                               ***                           ***                           ***

                                మరో కొత్త మేనేజేర్ రావడం జరిగింది. మళ్ళీ టైపు మిషన్ ప్రస్త్తవన! రంగారావు  టైపు మిషన్ పై జరిగినవిషయాలు విన్నవించడం జరిగింది.

ఆ టైములో రిటైర్ అయిన టైపిస్టు ఏదో పనిమీద ఆఫీస్ కు రావడం యాదృచ్చికం. రంగారావు అతనితో టైపు మిషన్ ప్రస్థానం గురించి చెప్పాడు.

“మీరు అమ్మదలచుకుంటే నేనే తీసుకుంటాను సార్. మేనేజర్ గారితో చెప్పండి. నాకు కూడా కొంచెం రాబడి వుంటుంది.”

“ఒకసారి మేనేజర్ దగ్గరకు వెడదాం రా” అని అతన్ని మేనేజర్ రూం లోకి తీసుకుని వెళ్లాడు .

“సార్ , ఇతను మన పాత టైపిస్టు…” అంటూ అతని ప్రపోజల్ చెప్పాడు.

“మీరు కొనుక్కోనక్కరలేదు. ముందు మీరు ఆ టైపు మిషన్ తీసుకెళ్ళి పొండీ” అన్నాడు మేనేజర్.

“సార్……..” రంగారావు ఏదో చెప్పబోయేంతలో

“పరవాలేదండీ…నేను చూసుకుంటాను. మీరు స్టాక్ వెరిఫికేషన్ రిజిస్టర్ తీసుకు రండి” అన్నాడు.

గుమాస్తా స్టాక్ వెరిఫికేషన్ రిజిస్టర్ తీసుకుని వచ్చాడు. అందులో టైపు మిషన్ డామేజ్ అయినట్టూ, వాడకానికి పనికి రానట్టూ రాయండి అని ఆదేశించాడు. అలారాయగానే దాని  ‘రిటనాఫ్’[ written off] అని ఎదురుగా సంతకం చేసాడు మేనేజర్.

                 ఆ విధంగా టైపు మిషన్ కథ ముగిసింది. కంప్యూటర్ యుగం లో టైపు మిషన్ మెత్తగా తప్పుకుంది. ఆ టేబులు పై కొత్త కంప్యూటర్  అందంగా అలంకరించబడింది!!                                                                  

– లక్ష్మీరాఘవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలుPermalink

2 Responses to పాత రోత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో