కొంచెం ఇష్టం… కొంచెం కష్టం…

కొంచెం ఇష్టం  కొంచెం కష్టం

రచయిత్రి ; పొత్తూరి విజయలక్ష్మి

మాలా కుమార్

మాలా కుమార్

పొత్తూరి విజయలక్ష్మి. . . ఈ పేరు గుర్తు రాగానే పెదవులపైకి అనుకోకుండానే చిరునవ్వు వచ్చేస్తుంది. ఆపైన ఆవిడ రచనలు గుర్తుకొచ్చి ఆ నవ్వు ఆపుకోవటం కష్టమైపోతుంది . ఆ కథలో పూర్తిగా లీనమైపోతాము. అందులోని పాత్రలు మనతో మాట్లాడుతున్నట్లుగానే వుంటుంది. అంత సహజం గా వ్రాస్తారు . కొన్ని సీరియస్ రచనలు కూడా చేసారు కాని ,నాబోటి అభిమానులకు ఆవిడ హాస్య రచనలే గుర్తుకొస్తాయి! ఆవిడ 20 నవలలు, 200 కథలు రాసారు.3 సినిమాలుగా , 3 టి.వి సీరియల్స్ గా , రేడియో ప్రసంగాలు, రేడియో నాటికలుగా ప్రసారమయ్యాయి. ఆవిడ వ్రాసిన నవల “ప్రేమలేఖ ” ప్రఖ్యాత డైరెక్టర్ జంధ్యాల గారు “శ్రీవారికి ప్రేమలేఖ” పేరు తో సినిమాగా తీసారు. అది సూపర్ హిట్ 🙂 ఆ నవల చదువుతున్నా, ఆ సినిమా చూస్తున్నా కడువుబ్బిపోవాల్సిందే..!  అసలు విజయలక్ష్మిగారి కి సీరియస్ గా వుండటము వచ్చా అని నాకెప్పుడూ ఓ పెద్ద అనుమానం .

unnamed

‘కొంచం ఇష్టం, కొంచం కష్టం ‘ అనే ఈ కాలం ఆంధ్రభూమి డైలీ పేపర్లో వచ్చింది. విజయలక్ష్మిగారి రచనల్లో వుండే లక్షణాలన్నీ  ఈ కాలం లో కూడా వున్నాయి.మనకు ప్రతి రోజూ ఎదురయ్యే సంఘటనల మీద చాలా వ్యంగ్యంగా , హాస్యంగా బాణాలను వేసారు. కొన్ని చోట్ల పాపం ఏడ్చుకుంటూ , కొన్ని చోట్ల సరదాపడిపోతూ , కొండకచో హాశ్చర్యపోతూ హాస్యాన్నీ గంపలకొద్దీ గుమ్మరించేసారు .                                                                                                                             తిమింగిలం  ఎప్పుడైనా మీ పార్టీలకు వచ్చిందా ? అయ్యో రామా ఎలా వస్తుంది అని విసుక్కుంటున్నారా ? లేదండీ బాబూ వచ్చింది. సుధిర్ అనే వో అబ్బాయి వున్నాడు . వాడింటికి వచ్చింది. మీరు నమ్మకపోతే నేనేమీ చేయలేను, “పార్టీ కి వచ్చిన తిమింగలం ” చదవమని చెప్పటం తప్ప.

“భక్తురాలా ! అదివరకు చక్కగా శుక్రవారం పరమాన్నం ,బొబ్బట్లు వగైరా పిండి వంటలు నైవేద్యం పెట్టేదానివి. నీ మొగుడికి మధుమేహం వచ్చాక ఎప్పుడు చూసినా పులిహోరా , గారెలేనా ? నీకేమైనా బుద్దివుందిటే ” అని అమ్మవారు కోప్పడితే ఏ గంగలో దూకాలి ? అని దేవుడు ప్రత్యక్షం కాకుండా వుంటేనే వాళ్ళకూ సుఖం , మనకూ సుఖం అనుకుంటారావిడ ‘ దేవుడే దిగి వస్తే. . . ‘ లో.

పొత్తూరి విజయ లక్ష్మి

పొత్తూరి విజయ లక్ష్మి

” ఇప్పటికి పన్నెండేకాని. . ఇంకొంతమంది రావాలట కదా ! మరప్పుడు మనం పద్నాలుగో ఎక్కమో,పదిహేనో, పదహారో ఎక్కమో గుర్తుచేసుకోవాలి .

 అదో గొడవుందికదా! మరిచేపోయాను . అన్నాడాయన దీనంగా ” స్చప్ ఈ ఎక్కాలు గుర్తుతెచ్చుకునే దీన పరిస్తితి ఏమిటో పాపం !

“దేభ్యం సెల్ ఫోన్ తీసుకెళుతున్నావా ? ధేభ్యం చీర కట్టుకో నాకు బాగుంటుంది .” ఈ ధేభ్యం గోలేమిటి అనుకుంటున్నారా ? తెలుసుకోవాలని వుందా ? ఐతే చదవాల్సిందే “దేభ్యం”.

కంప్యూటర్ కరుస్తుందా ? కరవదు కాని పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తుంది.’నువ్వీ ప్రోగ్రాం నుండి బయటకి వెళ్ళిపోదామనుకుంటున్నావా ?’ అంటుంది. అవును అంటే ‘ఇంకోసారి ఆలోచించుకో ‘ అంటుంది.ఆలోచించుకున్నా అన్నా కదలదు .ఏమి చేయాలో తోచదు . పిల్లల దగ్గరి కి పరుగెత్తి వాళ్ళ తో చివాట్లు తినాల్సిందే అంటారు రచయిత్రి. పాపం ఆవిడకూ నాలాంటి కష్టమే 🙂 

ఊతపదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . చిత్ర విచిత్రం గా వుంటుంది వూతపదాల వాళ్ళతో మాట్లాడుతుంటే . ఆ విచిత్రాలన్నీ ‘పదం కాని పదం ‘ లో చెప్పుకోవలసిందే 🙂 

“ఆవిడకు పెళ్ళి కాలేదట . నలుగురు పిల్లలట.”

” ఆవిడ కొడుకు పిల్లట.కొడుక్కి పెళ్ళైందట. ఆ తల్లికి కూడా పెళ్ళైందిట. ఆవిడకు ఇద్దరు పిల్లలట. ఇద్దరికీ తండ్రి వొకడేట ” ఏమిటిది అనుకుంటున్నారా ? అంతేనండి బాబూ అంతే ‘ ఎవరి గోల వాళ్ళదే ‘

ఏమిటీ ఈ ముక్క ముక్కలు అని విసుక్కుంటున్నారా ? అలా కాదు కాని ‘కొంచం ఇష్టం . కొంచం కష్టం ‘ పుస్తకం కొని చదివేసుకోండి. బాగుంటుంది. నేను చెపుతున్నాను కదా ఒకసారి ఆ పుస్తకం చేతిలోకి తీసుకుంటే పూర్తి అయ్యేదాక వదలరు. అంతెందుకు మా స్నేహితురాలి మాటల్లో ,

“పొద్దున్నే లేచి మనము

పొత్తంగా చదవదగిన

కాలంబిదియే

పొత్తూరి కష్టసుఖములు

మొత్తంగా మార్చు మనను

విజయము వైపున్..” 

ఇంకెందుకు ఆలస్యం. ఈ రోజే ఏ పుస్తకాల షాప్ లోనైనా దొరుకుతుంది , కాబట్టి పదండి . 120 రూపాయలతో కొనేసుకోని చదవటం మొదలు పెట్టండి.

– మాలా కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

2 Responses to కొంచెం ఇష్టం… కొంచెం కష్టం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో