స్త్రీ యాత్రికులు (4వ భాగం)

12 వేల మంది తోడుగా  యాత్రచేసిన ఎమిలీ ఈడెన్, ఫానీ ఈడెన్(4)

1831 వ సం.లో ఆనాటి గవర్నర్ జనరల్ విలియం  బెంటింగ్  ఉత్తర భారతదేశంలోని స్థానిక రాజులతో ఒక ఒడంబడిక

చేసుకున్నాడు. అది జరిగి ఏడు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది.పైగా విలియం బెంటింగ్ పంజాబ్ మహారాజా

రంజిత్  సింగ్ తో చేసుకున్న ఒడంబడికని మరింత దృఢతరం చేసుకోవాలనేది కూడా ఈ యాత్రలో భాగమే.ఉత్తర-

పశ్చిమ సరిహద్దుల్లో భారతదేశం మీదకి మరెవ్వరినీ , ముఖ్యంగా ఆనాటికి బలంగా  ఉన్న రష్యా వారిని ,

దండెత్తకుండా  కాపాడేది రంజిత్ సింగ్ మాత్రమే .కాబట్టి అతన్ని మరో సారి  కలవాల్సిన అవసరం ఉంది.అందువలన

అన్ని పనులూ ఒకే సారి జరిగి పోయేలా ఈ రాజకీయపరమైన యాత్రకి శ్రీకారం చుట్టారు ఆంగ్లేయులు. ఇలాంటి

విశ్వరూప ప్రదర్శన వలన బ్రిటిష్ వారి కొలువులో పనిచేయటానికి ఎక్కువమంది భారతీయుల్ని కూడా

ఆకర్షించవచ్చు అనుకున్నారు.అందుకే ఈ యాత్రను తలపెట్టారు.

ఈ మహాయాత్ర 1838 వ సం.లో మొదలైంది కలకత్తాలో.గవర్నరు జనరల్  జార్జి ,ఆయన చెల్లెళ్లిద్దరూ  ముందుగా

ఏనుగులని అధిరోహించారు.వారి వెనుక  వరసల్లో సైనికాధిపతులు ,మిలిటరీ వారు , పల్లకీలలో ప్రయాణం చేసే మరి

కొందరు అధికారులూ ,వారి వెనక ఆహార పదార్ధాలూ ,ఇతర సామాన్లు మోసేందుకు ఎద్దుల బళ్ళు,ఆ వెనక 8,000

మంది సిపాయిలు,వారి వెనక గుడారాలు మోసేవారు,అడవుల్లో చెట్లు కొట్టి దారి ఏర్పరిచే పనివాళ్ళూ, వీళ్ళందరూ

కాక మరో నాలుగు వేల మంది వివిధ రకాల పనివాళ్ళూ అందరూ కలిసి 12 వేల మంది పరివారం పాల్గొంటారు ఈ

యాత్రలో.వీరికి వెనక భిక్షగాళ్ళూ.చిల్లరగా తిరిగే వాళ్ళూ,చిన్న దొంగతనాలు చేసేందుకై అవకాశం కోసం  ఎదురు

చూసే వాళ్ళూ , ఈ మహా యాత్ర విడ్డూరాన్ని తిలకించవచ్చే  జనాలు ,అంతా ఏదో ప్రపంచ వింతని చూడటానికి వెళ్ళే

వారిలాగా బయలుదేరుతారు.

ఇంత గొప్ప ఆర్భాటంతో నడుస్తున్న ఈ యాత్ర రోజుకి కేవలం రెండు గంటలసేపు మాత్రమే ప్రయాణించేది.  అది కూడా

ఉదయం ఆరు గంటలనుంచి ఎనిమిది గంటలవరకు మాత్రమే.ఆ తరువాత ఎండని తట్టుకోలేక ఆపేసేవారు.గవర్నర్

జనరల్ మాత్రం తన సొంత పరివారంతో పరిసరాలకు దూరంగా ఉన్న రాజాస్థానాల వద్దకి ఆహ్వానం మీద ,వారి

వాహనాల్లో వెళ్లి పనులు చూసుకొని తిరిగి ఈ యాత్రలో  పాల్గొనేవాడు.

ఈ యాత్రలో వారి ఖర్చు నెలకి 70 వేల రూపాయలు.అంటే రోజుకి 2 ,300 రూపాయలు.రెండు గంటలు మాత్రమే

యాత్రలు చేస్తూ ఇంత ధనాన్ని ఖర్చు చేయడం,చూసే వారికి ఎంతో ఇబ్బందిగా వున్నా,బ్రిటీషు వారి గొప్పతనాన్ని

చూసి ప్రజల్ని భయపడేలా చేయటం వారి ఉద్దేశ్యం కాబట్టి ధనం విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవారు.ఆ డబ్బంతా

భారతీయులదే కాబట్టి చూస్తున్న ప్రజలకి ఎంతో బాధ కలిగేది.

వారి యాత్ర సుందర్ బన్  అడవులతో  నిండిన గంగానదీ ముఖద్వారం వద్ద మొదలై రాజ్

హల్,పాట్నా,దీనాపూర్,బలియా,గాజీపూర్, బెనారస్,అలహాబాద్,కాన్పూర్,బరైలీ,మీరట్,డిల్లీ,ముస్సోరీ మీదుగా

సిమ్లాకి చేరుతుంది. ఈ యాత్రామార్గం పొడవు సుమారు 3,200 కి.మీ.

వారి యాత్రామార్గంలో ఎదురయ్యే మహారాజుల ఆస్థానాలకి ఎమిలీ,ఫానీలు కూడా వెళుతుండే వారు.వారు

సమర్పించుకునే వివిధ రకాల బహుమతులు అందుకుంటూ ఎంతో సంతోషపడే వారు. అలా సాగిన ప్రయాణం

చివరికి సిమ్లాలోని మహారాజా రంజిత్ సింగ్ రాజాస్థానానికి చేరుకొంటుంది.

రంజిత్ సింగ్ ఆస్థానం గురించి అక్క చెల్లెళ్ళు ఇద్దరూ చాలా బాగా విశ్లేషిస్తారు.ఆయన సొంత గుర్రాలకి ఉన్న జీను

మెడ పట్టీలకి వజ్రాలు ,నగలు,రత్నాలు అలంకరించటం చూసిన ఎమిలీ ,ఫానీలు ఎంతో ఆశ్చర్య పోతారు.’ఆ

ఒంటికన్ను మహారాజు ఒక ముసలి ఎలుక మాదిరిగా వున్నా ,అతని చూపులు మాత్రం నన్ను చీల్చుకొని అవతలి

వైపుకి వెళుతున్నట్లుగా ఉన్నాయి’అంటూ ఆ ముసలి రసికుడి వాడి చూపుల శక్తి గురించి ఎమిలీ వర్ణించింది. 

జార్జి మాత్రం తాను మొదలు పెట్టిన  ఈ రాజకీయ మహాయాత్రని చాలా జాగ్రత్తగా నడిపించి , బ్రిటిష్ వారి భద్రతకు

 

ఎలాంటి ముప్పు రాని విధంగా ఒప్పందాలు ,సంధులు వగైరా అన్నీ రాజకీయపరంగా  విజయవంతమయ్యేలాగా

చూసుకొంటాడు.

ఈ యాత్ర 1840 చివరికల్లా పూర్తవుతుంది.అందరూ క్షేమంగా కలకత్తా చేరుకొంటారు.ఈ యాత్రలో ఎమిలీ తన స్కెచ్

లతో సహా డైరీ రాస్తుంది. దాని పేరు “Up The Country” అయితే ఫానీ మాత్రం రెండు డైరీలు రాస్తుంది.ఒకటి

“progress Through The Upper Province” రెండోది “To The Court Of Ranjit Singh”.

ఈ పుస్తకాల్లో ఎమిలీ ,ఫానీలు ఉత్తర భారత దేశాన్ని చాల నిశితంగా పరిశీలించారు.హృదయానికి హత్తుకు పోయే

ప్రకృతి వర్ణనలు చేశారు. స్వేచ్ఛా యుతమైన వారి ఆలోచనలు , భారతీయుల పట్ల  వారికి ఉన్న ప్రేమ మనకి

తెలుస్తాయి.

1842 వ సం. మార్చ్ లో  గవర్నర్  జనరల్ జార్జికి తన పదవీకాలం పూర్తి కావటంతో ముగ్గురూ ఇంగ్లండ్ వెళ్లి,

మరల తమ సొంత ఇంట్లోనే నివాసం వుంటారు. వారి  ఇంటిపేరు “Eden Lodge”.అదొక అందమైన ఇల్లు.అందరూ

వారి వారి దైనందిన కార్యక్రమాలు చూసుకుంటారే కానీ పెళ్లి విషయాన్ని ఎవరూ పట్టించుకోరు.బహుశా జార్జి తన

చెల్లెళ్ళని పెళ్ళికి బలవంతపెట్టి ఉండడు. పెద్ద చెల్లి ఎలాగూ చేసుకోనని ఎప్పుడో చెప్పింది.చిన్న చెల్లికి అనారోగ్యం

కాబట్టి ,ఆమె స్వేచ్ఛని గౌరవించి ఉంటాడు.వారిని వదిలి తాను ఒక్కడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక జార్జి కూడా

ఒంటరిగా వారితోనే ఉంటాడు.ఈ పరిస్థితుల్లో జార్జి తాను ఇండియా నుంచి వెళ్ళిన ఏడు సంవత్సరాలకి తన సొంత

ఇంట్లో మరణిస్తాడు.అన్నయ్యలేని దిగులుతో అనారోగ్యం మరింత ఎక్కువై , ఫానీ కూడా కొన్ని నెలల తర్వాత

మరణిస్తుంది.ఎమిలీ ఈడెన్  మాత్రం గుండె ధైర్యంతో తిరుగుతూ ,మరో 20 సం. జీవిస్తుంది అదే ఇంట్లో.

ఎమిలీ తాను రంజిత్ సింగ్ ఆస్థానానికి చేసిన యాత్రగురించి 1866 వ సం.లో రాస్తుంది.అదే “Up The Country”.

ఫానీ రాసిన మూడు జర్నల్స్ మాత్రం 1988 వ  సం.వరకూ ముద్రణకి నోచుకోలేదు. ఈ పని ఎమిలీ చేసి వుంటే

చాలా బాగుండేది.

అన్నయ్య,చెల్లెలు లేని తన జీవితం అంతా నిజమైన ఒంటరితనంతో గడపాల్సి వచ్చింది.72 సం.జీవించిన ఎమిలీ

ఈడెన్ చివరికి అదే ఇంట్లో కన్ను మూసింది.తాను అనుకొన్నట్టుగా ఒంటరిగా జీవించగలిగింది . అదే ఆమె చేసిన

గొప్ప పని. ఎమిలీ ఈడెన్ 1869 వ సం.లో మరణించాక ప్రభుత్వం వారు ఆ భవనంలో “రాయల్ జియోగ్రాఫికల్

సొసైటీ” స్థాపించి ఈడెన్ ల  కృషిని సమాజంలోకి తీసుకెళ్ళారు.

భారత దేశానికి గవర్నర్ జనరల్ లాంటి ఉన్నతపదవిలో పనిచేసిన జార్జి తన చెల్లెళ్ళ కోసం పెళ్లి మానుకోవటం ఎంతో

వింతగా అనిపిస్తుంది.భారత దేశంలో  వుండే ప్రేమాభిమానాలు వారికీ వున్నాయని తెలుసుకొని ఆశ్చర్య

పోతాం.తల్లిదండ్రులు  ముందుగా మరణించటం వలన బాధ్యత అంతా తన మీద వేసుకొని , త్యాగమయ జీవితం

గడిపిన జార్జి మన హృదయాల్లోకి చేరిపోతాడు.రాజ కుటుంబంలో పుట్టిన వారికి ఇలా జరగడం చాల అరుదు.

ఎమిలీ , ఫానీలు రాసిన యాత్రా సాహిత్యం  వారిని అటు ఇంగ్లండ్ లోనూ,ఇటు ఇండియాలోనూ చిరంజీవులని

చేసింది.ఎమిలీ ఒంటరిగా జీవించినా,బాధపడినా తాను రాసిన పుస్తకం వల్ల అటు చరిత్రలోకీ, ఇటు

సాహిత్యం,కళలలోకీ కూడా ప్రవేశించింది.ఏది ఏమైనా 12 వేలమంది సేవకులతో యాత్ర చేసినటువంటి ఘనత ,

అదృష్టం ప్రపంచ చరిత్రలో వారికి తప్ప మరెవ్వరికీ దొరకలేదు.ఆ అక్కా చెల్లెళ్ళ  ప్రయాణాలకి భారత దేశం పల్లకి

కావటం విశేషం.*

– డా. ఆదినారాయణ

(ఇంకా వుంది)

Uncategorized, , , , , , , , , Permalink

One Response to స్త్రీ యాత్రికులు (4వ భాగం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో