నర్తన కేళి – 12

 ప్రపంచంలో ఎక్కడ నేర్చుకున్న ఇవి ప్రాధమికంగా తప్పక నేర్చుకోవాలి . వీటి తరవాత మిగిలినవి చెప్పండి . ఇలా ఒక నిర్దిష్ట మైన ప్రణాళిక ఏర్పడితే అందరికి చేరుతుంది . కూచిపూడి మరింత పదిలం అవుతుంది “ అంటున్న ‘నాట్యాచారిణి’ శ్రీమతి రమణి సిద్ధి తో ఈ నెల నర్తన కేళి ముఖాముఖి ……..  

*నమస్కారం రమణి సిద్ది గారు ?

నమస్కారం . రండి రండి , కూర్చోండి

*మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ?

మా నాన్న పేరు వెంకట నరసింహాచార్య ,మా అమ్మ పేరు సత్యవాణి . మేము ముగ్గురు అక్కా చెల్లెళ్లు, ఒక తమ్ముడు .

*మీకు నాట్యం నేర్చుకోవాలని ఎలా అనిపించింది ?

నేను నాట్యం నేర్చుకోవడం చాలా చిన్న వయసు  నుంచి మొదలు పెట్టాను . ఆ వయసు లో దాని గురించి అంతగా తెలియదు . మా నాన్నగారికి నాట్యం పైన ,లలిత కళల పైన ఆసక్తి అలా నా చిన్నప్పుదు నుండే నేర్చుకోవడం మొదలుపెట్టాను .

*ఎవరి వద్ద నాట్యం లో శిక్షణ ప్రారంభించారు ?

నా తొలి గురువు సంధ్య రాణి గారు . ఆమె వద్ద కొంత కాలం నేర్చుకున్నాక  వి. కృష్ణ కుమారి దగ్గర కూడా నేర్చుకున్నాను .

*మీ అకాడమిక్ చదువు గురించి ?

నేను ఇంటర్ వరకు నల్గొండ లోనే చదివాను .పడవ తరగతి  బాలికల హైస్కూల్ లోను , తరవాత ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసాను .

*మరి మద్రాస్ వెళ్లి మాష్టారు గారి వద్ద శిక్షణ పొందారు కదా , అప్పటి విషయాలు ?

అవునండి . నేను వెంపటి చిన సత్యం మాస్టారు గారి వద్ద నాలుగు సంవత్సరాలు శిష్యరికం చేసాను . నేను వెళ్లే సమయానికి మంజు భార్గవి చివరి క్లాసు అనుకుంటాను . కమలా రెడ్డక్క వాళ్లు ఉండేవారు . అక్కడే కూచిపుడిలోని మెళకువలు నేర్చుకున్నాను . మద్రాసు లో గంటలు గంటలు చూసి నేర్చుకోవడం ద్వారా చాలా తెలుసుకున్నాను .

*నాట్యంలో సర్టిఫికేట్ , డిప్లమో చేసారు కాదా మీరు ?

అవునమ్మా , కూచిపూడిలో బి .ఎ  చేసాను . ఎం .ఎ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి చేసాను . 2006 లో ఎం .ఫిల్ కూడా పూర్తి చేసాను .

*ఎం .ఫిల్ ఏ అంశం పై చేసారు?

జాన పదం లో వీర నాట్యం పై చేసాను .

*మీ నృత్యానికేతన్ పేరు ? ఎప్పుడు ప్రారంభించారు ?

“ గోదా మ్యూజికల్ అకాడమి “ 1996లో ప్రారంభించాము .

*మ్యూజికల్ అకాడమి అని పేరు పెట్టారు నాట్యం కాకుండా ఇంకా వేటిలో శిక్షణ ఇస్తున్నారు ?

నేను నాట్యం లో శిక్షణ ఇస్తాను . మా తమ్ముడు రాజేష్ కరాటి , చెస్ లో శిక్షణ ఇస్తాడు . మా మరదలు రాజ్య లక్ష్మి తను సంగీతం నేర్పిస్తుంది . ప్రస్తుతం ఈ మూడింటిలో మా మ్యూజికల్ అకాడమీలో శిక్షణ ఇస్తున్నాము  .

*మీ అందుకున్న పురస్కారాలు ?

సంగీత నాట్య అకాడమి , ఏలూరు వారి నుంచి ఉత్తమనాట్యాచారిణి , దూరదర్శన్ నుంచి బి ‘గ్రేడ్ ఆర్టిస్ట్ .

* మీ అకాడమీ ద్వారా చేసిన  నృత్య రూపకాలు   గురించి చెప్పండి ?

“ గోదా కళ్యాణం” చేసాము. ఆముక్తమాల్యద నుండి గ్రహించినది . కామేశ్వరరావు గారు రూపొందించారు . త్యాగ రాజ గాన సభలోను , శిల్పారామం , బెంగుళూరు లో పలు చోట్ల ప్రదర్శించాము .  ఇంకా రాధా మాధవీయం , అహల్య శాప విమోచనం, తెలుగు వైభవం విదేశాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాము .

*కూచిపూడి నాట్యం అంతర్జాతీయంగా వ్యాప్తి చెందిన , అందరికి చేరక పోవడానికి కారణం ఏమిటి ?

కూచిపూడి నాట్యం అందరూ చేస్తున్నారు . కాని చాలా వ్యత్యాసం ఉంటుంది . అది పోవాలి . అడవులు , ముద్రలు ,జతులు , పూర్వరంగం , పుష్పాంజలి , బ్రహ్మాంజలి  అన్నీ ఒక వరస క్రమంలో , ఒక ఆకృతిలో ఉండేలా చేయాలి . ప్రపంచంలో ఎక్కడ నేర్చుకున్న ఇవి ప్రాధమికంగా తప్పక నేర్చుకోవాలి . వీటి తరవాత మిగిలినవి చెప్పండి . ఇలా ఒక నిర్దిష్ట మైన ప్రణాళిక ఏర్పడితే అందరికి చేరుతుంది . కూచిపూడి మరింత పదిలం అవుతుంది .

*పిల్లలకి మీరిచ్చే శిక్షణ పద్ధతి ఎలా ఉంటుంది ?

ముందుగా  ప్రాధమికంగా అడవులు , ముద్రలు నేర్పిస్తాను . ఆ తరవాత పుష్పాంజలి , వినాయక కౌతం .అలా ఒక్కొక్కటి  చెప్పడం ప్రారంభిస్తాను .

*ఇప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించే వారికి మీరిచ్చే సలహా , సూచన ?

ఎంతో శ్రద్ధాగా  నేర్చుకునే ప్రయత్నం చేయండి . మరీ ముఖ్యంగా గురుపంపరంగా నేర్చుకున్నదే ఎక్కువ కాలం గుర్తుంటుంది . ఏదో ఒకటి ,రెండు ప్రదర్శనలకు  చేస్తే చాలు అని కాకుండా  మనస్ఫూర్తిగా అభ్యసించాలి .

 మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో