బెంగుళూరు నాగరత్నమ్మ

బెంగుళూరు నాగరత్నమ్మ  – జీవిత చరిత్ర

The Devadasi and the Saintసమాజం ఏర్పడిన నాటి నుంచి స్త్రీల జీవితాలు , సాహసాలు గుర్తింపుకి నోచుకోక నిర్లక్ష్యం చేయబడుతూనే ఉన్నాయి . మరికొంత కాలానికి అటు వంటి స్త్రీల ధైర్య సాహసాల్ని , విజ్ఞానాన్ని , చరిత్ర పుటల్లో కి ఎక్కనీయకుండా కాల గర్భంలోకి కలిపేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి . అటువంటి స్త్రీ మూర్తుల చరిత్రల్ని విహంగ చదువరులకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తో ముందుగా నైమిశ్ రాయ్ రచించగా , డా .జి.వి .రత్నాకర్ అనువదించిన ఝాన్సీ ఝాల్కారీ భాయి జీవితాన్ని ప్రచురించాము . అదే క్రమంలో సంగీత సాహిత్య నృత్య కళలలో సాటి లేని ప్రతిభని కనపరచి ఆనాటి ఉద్దండ పండితులతో పోటి పడ్డ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్రని అందిస్తున్నాం. దేవదాసి వ్యవస్థఅంతరించి పోతున్న దశలో నాగరత్నమ్మ తన జీవితాన్ని సంగీతానికి అంకితం చేసి ఆ దిశగా విజయం సాధించింది .
ముద్దు పళని రచించిన ” రాధికా సాంత్వనం ” కావ్యాన్నిముద్రించి 1910 మార్చి 30 న విడుదల చేసింది . ఒక వేశ్య రాసిన పుస్తకాన్ని ప్రచురించిందనే నెపంతో కందుకూరి వీరేశలింగం కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల్ని ఎదుర్కొంది నాగరత్నమ్మ . త్యాగరాజు కృతులతో పాటు , పాడు పడ్డ ఆయన సమాధికి కూడా జీవం పోసి తన ఆస్తిని కూడా అమ్ముకుని ఆలయాన్ని నిర్మించింది .సంగీత సాహిత్యాలకు అంకిత మైన ఆమె జీవిత చరిత్రని ప్రముఖ చరిత్ర కారుడు వి . శ్రీరాం ఆంగ్లం లో రాసారు . దానిని టి . పద్మిని ” బెంగుళూరు నాగరత్నమ్మ – జీవిత చరిత్ర” గా తెలుగులోకి అనువదించారు .

 –  విహంగ మహిళా సాహిత్య పత్రిక
బెంగుళూరు నాగరత్నమ్మ (1878-1952)
 
దేవదాసి గా పుట్టిన నాగరత్నమ్మ చిన్నతనంలోనే సంగీత సాహిత్య నృత్య కళలలో ఎంతో నైపుణ్యం సాధించింది. అయితే కాలక్రమేణా వచ్చిన సంస్కరణల వల్ల దేవదాసి వ్యవస్థని ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో తోటివారందర్నీ కూడగట్టి ధైర్యంగా ఎదుర్కొంది. ఓడిపోయినా జంకలేదు.
ఆనాడు సంగీతంలో రాగం, తానం, పల్లవి అనే అంశాన్ని స్త్రీలు పాడకూడదనే నిబంధన వుండేది. దాన్ని ధిక్కరించి పాడిన ఘనతకూడా ఆమెదే.
ముద్దుపళని ‘రాధికా సాంత్వనము’  నాగరత్నమ్మ చదివి చాలా ఇష్టపడింది. దానికి కొత్త ప్రతి తయారుచేసి తన ముందుమాటతో మళ్ళీ అచ్చు వేయించింది. వీరేశలింగం ఆ పుస్తకంలోని భాషనీ, శైలిని మెచ్చుకుంటూనే ”వేశ్య కాబట్టి సిగ్గూ శరం లేకుండా పచ్చిగా రాసింద” ని విమర్శించాడు. దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమె ” సిగ్గు అనేది ఆడవాళ్ళకి మాత్రమే వుండాల్సిన నీతా?” అని ప్రశ్నించింది. ”ఈ పుస్తకంలో వున్నంత శృంగార వర్ణన వీరేశలింగం రాసిన ‘రసికమనోరంజనం’ లోనూ ఉన్నదనీ, ఇంతకన్నా వర్ణనాత్మకంగా మగవాళ్ళు రాసిన  గ్రంథాలని మద్రాసు యూనివర్సిటీ లో పాఠ్య పుస్తకాలుగా వీరేశలింగమే సిఫారసు చేశాడని ఎదురుదెబ్బ తీసింది. వీరేశలింగం లాంటి దిగ్గజాన్ని ఎదుర్కోవడం, అందునా ఒక స్త్రీకి, ఆనాడు  సాధ్యం కాదు. అదీ నాగరత్నమ్మ ధీశక్తి!. దేవదాసి కావడం వల్ల కూడా ఆమె మరింత స్వేచ్ఛగా పోరాడగలిగింది.
బీదరికంలో ఎన్నో కష్టాలు పడినా, క్రమంగా తన కళాప్రదర్శనలతో సంపన్నురాలయింది. నగలు, బట్టలు అంటే చాలా ఇష్టం. అలాంటి నాగరత్నమ్మ తిరువయ్యారులో త్యాగరాజు సమాధి దిక్కూమొక్కు లేకుండా, ముళ్ళ తుప్పలూ, పామూపుట్రల మధ్య పడి వుంటే చూసి చలించిపోయింది. త్యాగరాజు పట్ల ఉన్న భక్తితో తన నగలు, సంపద సర్వస్వం అర్పించి ఆయన సమాధి మిద ఆలయం కట్టించింది. ఇవేళ  మనం చూస్తూన్న ఆలయశోభ  అంతా ఆ సంగీతకారిణి త్యాగఫలితమే.
అంతేకాదు, త్యాగరాజ ఆరాధనలో స్త్రీలు పాల్గొనే హక్కులేదని ఛాందసులు శాసించారు. నాగరత్నమ్మ యుక్తిగా స్త్రీలకి అందులో ప్రవేశం కలిగేలా చేసింది. అందుకనే ఇప్పుడు ఆరాధనోత్సవాల్లో పాల్గొంటున్న స్త్రీల సంఖ్య చాలా ఎక్కువయింది.
అడుగడుగునా సమాజంలో పురుషాధిక్యతకి అడ్డుకట్ట వేస్తూ ఆమె స్త్రీలని ముందుకు తీసుకు వెళ్ళింది. అచ్చమైన స్త్రీవాది ‘విద్యా సుందరి’ బెంగుళూరు నాగరత్నమ్మ.
ఇటువంటి మహత్తర వ్యక్తిని తెలుగు సమాజానికి పరిచయంచేసే అవకాశం ఇచ్చిన పుస్తకరచయిత వి. శ్రీరాం గారికీ, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు గీత గారికీ, అభినందించిన విఎకె రంగారావు గారికి కృతజ్ఞతలు.

– టి. పద్మిని

 స్త్రీవాదిగా బెంగుళూరు నాగరత్నమ్మ 

కర్ణాటక సంగీత చరిత్ర కారుడిగా పేరుగాంచిన వి.శ్రీరాం పర్యావరణ అంశాలూ, సంప్రదాయ సంపద గురించిన విషయాల వివరణలో కూడా ప్రసిద్ధి పొందాడు. ఆయన రాసిన ‘కర్ణాటక సమ్మర్‌’ లో పేరు పొందిన కర్ణాటక సంగీతకారుల జీవిత చరిత్రలు వున్నాయి. కేవలం మహనీయుల జీవిత విశేషాలే కాకుండా, వారి లోటుపాట్లని కూడా ఆపుస్తకంలో చెప్పడం విశేషం. బెంగుళూరు నాగరత్నమ్మాళ్‌ అనే అసాధారణ మహిళ జీవితాన్ని ఇప్పుడు అందించాడు. త్యాగరాజుతోపాటు ఈమె కూడా కలకాలం నిలిచిపోతుంది.
స్త్రీవాదం పాశ్చాత్యదేశాల్లో అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న దశలోనే నాగరత్నమ్మాళ్‌ ఒక స్త్రీవాదిగా ధైర్యంగా నిలబడింది. అప్పటికింకా భారతదేశంలో  స్త్రీవాదం పేరే కొత్త. ఆమె కులాన్ని చులకన చేసే రోజుల్లో ఆమె సాధించిన విజయాలు మరింత గొప్పవి. ఆమె బీదకుటుంబంలో పుట్టింది. కాని తన సమర్ధత,సంకల్పబలం వల్ల సాటి మేటి కళాకారుల్లో సైతం ఆమె సంగీత నృత్య కళాకారిణిగా నిలదొక్కుకుంది. ఏటా జరిగే త్యాగరాజ ఆరాధనలో, దాని నిర్వాహకులతో ఘర్షణ పడి మరీ, ఆడవారికి అక్కడ కచేరీ చేసే హక్కు ఎలా సంపాదించిందో శ్రీరామ్‌ వివరించాడు. అలాగే ‘రాధికా సాంత్వనము’ ప్రామాణిక ప్రతిని ప్రచురించి, పంపిణి చెయ్యడానికి ఆమెకి వున్న దృఢసంకల్పం గొప్పది. ఆ పుస్తకాన్ని మదరాసు ప్రభుత్వం నిషేధించింది. వేశ్యా వ్యతిరేక వుద్యమం వలన దేవదాసీలు బీదరికానికి లోనయ్యారు. ఈ వుద్యమం వల్ల సాదిర్‌, పదాలు జావళీలు కనుమరుగయ్యే అవకాశం వుందని హెచ్చరిస్తూ నాగరత్నమ్మ దానికి వ్యతిరేకంగా, తీవ్రంగా పోరాడింది. వీటన్నిటి గురించి కథలు కథలుగా శ్రీరామ్‌ వివరించాడు.
గొప్ప వాగ్గేయ కారుడు త్యాగరాజు సమాధి చుట్టూ మండపం కట్టించడంలో ఆమె పాత్ర మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. రెండు వేర్వేరు వర్గాలవారు ఆరాధన నిర్వహించడమే గాని మండపం గురించి ఏమీ పట్టించుకోలేదు. నాగరత్నమ్మ జోక్యం చేసుకుని, మండపం కోసం తన ఆస్తిని ధారపోసింది. దానివల్ల త్యాగరాజు సమాధి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  దాని బాగోగులు చూసేందుకు తన జీవిత చరమాంకంలో తిరువయ్యారు లోనే వుండి పోయింది.
ఆరాధన జరిపే రెండువర్గాలవారిని సమైక్యపరచడంలో నాగరత్నమ్మాళ్‌ ప్రముఖ పాత్రవహించింది. కాని శ్రీరాం చెప్పినట్టు ” ఆరాధనలో ఆమెకి పెద్దగా ప్రాముఖ్యతలేదు.” ఆమె మాత్రం త్యాగరాజ ఆలయంలో దాసిగా మిగిలిపోయింది. త్యాగరాజు సమాధికి ఎదురుగా చేతులు జోడించి కూర్చున్న భంగిమలో ఆమె విగ్రహం వుంది. ఇంతకంటే ఆమె కూడా ఏమి కోరుకుని వుండదు.
వీటి అన్నిటితో పాటు మరిన్ని విశేషాలు ఈ పుస్తకంలో శ్రీరాం వివరించాడు. వాటిని సేకరించడంలో ఆయన శ్రమ అధికం. ఏ చిన్న వివరాన్ని కూడా వదిలి పెట్టకుండా సమగ్రంగా చిత్రించాడు.
మద్రాసులోని తమిళనాడు ప్రభుత్వ పురావస్తు భాండాగారంలో విలువైన సమాచారం ఆయనకి  లభించింది. సమర్థవంతంగా అల్లిన ఈ కథనం కర్ణాటక సంగీత ప్రియులూ, త్యాగరాజ భక్తులు తప్పకుండా చదవవలసిందని నేను భావిస్తాను.
– కె.వి. రామనాధన్‌
                                                                      ” శృతి”
                                                                        ప్రధాన సంపాదకులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అనుమతించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి , గీతా రామస్వామి గారికి   కృతజ్ఞతలు . 
Gita Ramaswamy,
Plot No. 85, Balaji Nagar, Gudimalkapur,
Hyderabad 500 006
Ph 2352 1849 (O)/9441559721
Uncategorized, Permalink

2 Responses to బెంగుళూరు నాగరత్నమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో