సంపాదకీయం

తరాల  అంతరం

seniorcitizen2 (1)

ఈ మాసంలో వృద్ధుల దినోత్సవం జరుపుకోబోతున్నాం అనుకోగానే నాకు ఒక పాట గుర్తొచ్చింది. 1975 తరువాత అనుకుంటాను తాత మనవడు సినిమా చూశాను . దాసరి నారాయణరావుగారు  దర్శకత్వం వహించిన సినిమా అది . సినిమా అంతర్నాటకంలో ఒక తండ్రి వృద్దుడైన తన తండ్రిని సజీవంగా పాతి పెట్టటానికి ఒక గొయ్యిని తవ్వుతుంటాడు.పసివాడైన అతని కొడుకు   , గొయ్యి  త్రవ్వుతున్న తండ్రి వద్దకు వచ్చి నాన్నా ! ఎందుకు ఈ గొయ్యి తవ్వుతున్నావు ? అని అడుగుతాడు..

ఆ పాట ఇలా సాగుతుంది ….

కొడుకు: అయ్యా అయ్యా ఎందుకు గొయ్య?

తండ్రి: నాకొక పీడర మీ తాతయ్య

చావగొట్టి పాతెయ్యటానికే ఈ గొయ్య   

వెంటనే ఆ పసివాడు ఆ గోతి ప్రక్కన మరో గోతిని   త్రవ్వుతుంటాడు . అప్పుడు వాడి తండ్రి…

బాబూ! బాబూ !

మరి నీకెందుకురా ఈ గొయ్య?

కొడుకు: నీ అయ్యకి చేసే ఈ మరియాద     

రేపు నీకు చెయ్యాలి గదయ్యా?

తాతకి వారసుడు మనవడేగా

ఎప్పటికైనా తాతామనవడు ఒకటేగా ఒకటేగా…

                    దాంతో తన తప్పు తెలుసుకున్న ఆ తండ్రి తన తండ్రిని కౌగిలించుకొని ఇంటికి తీసుకెళ్తాడు .

       వృద్ధుల పట్ల…. కన్న తల్లిదండ్రులు , తాతలు , అమ్మమ్మలు , నాయనమ్మల పట్ల ఇప్పటికీ చాలా చోట్ల ఇదే ధోరణి కొనసాగుతూనే ఉంది .

ఈ మధ్య వార్తల్లో కూడా ఎక్కువగా ఇలాంటి సంఘటనలే కన్పిస్తున్నాయి . తల్లిదండ్రుల పొలాలు , ఆస్తులు తమ చేతికి వచ్చాక వాళ్లని నిరుపయోగంగా భావించి ఇంట్లోంచి పంపేస్తున్నారు . ఇటువంటి సంఘటనలు మీడియా జనం దృష్టికి తీసుకొస్తున్నాయి . పట్టణాల్లో అయితే వృద్ధాశ్రమాలు ఉండటం వల్ల వీళ్లు  అక్కడికి తరలిపోతున్నారు .

           కొంత కాలం క్రితం ఒక వృద్ధురాలు నాతో మాట్లాడుతూ తమ కోడలు , మనవళ్ళ   విషయాలను నాతో చర్చించింది .

           కొడుకు ఆఫీసు పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటాడు . కోడలు గృహిణి అయినా తరచుగా ఏదో ఒక సాంఘిక కార్య క్రమాలకు వెళ్ళిపోతుంది .   ఇద్దరు మనవళ్లు ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్ళు . ఈ వృద్ధురాలికి చెవుడు , గట్టిగా అరచి చెబితేగాని విన్పించదు .

 ఆ ఇంట్లో పరిస్థితి  ఈ బామ్మగారికి నచ్చట్లేదు . పొద్దున్నే వెళ్ళే కొడుకు ఏ అర్ధరాత్రికో వస్తాడు .అప్పటికీ తల్లి మేల్కొని ఉంటే అమ్మా అన్నం తిన్నావా ? మందులు ఏమైనా కావాలా ? అని అడిగి తన గదిలోకి వెళ్ళిపోతాడు . ఇక పగలంతా కోడలు ఇంట్లోనే ఉన్నా కూడా తన పనిలో తాను ఉంటుంది . పుస్తకాలు చదువుకుంటుంది . టి .వి  చూస్తుంటుంది . స్నేహితులోస్తే మాట్లాడుతుంది . సమయానికి అత్తగారికి భోజనం పెడుతుంది . సమయానికి మందులు వేస్తుంది . తమకు కావల్సినవన్నీ  మంచం ప్రక్కనే అమర్చి తమ కార్యక్రమాలకు వెళ్తుంది . అత్తయ్యా ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది . ఆమెకేమో విన్పించదు . ఎప్పుడైనా ఇంటిలో విషయాలు ఆమెకు చెప్పాలనుకున్నప్పుడు  అత్తగారి దగ్గర కూర్చొని ఆ విషయాలు చెప్పాలనుకుంటుంది . ఇద్దరి మధ్య వినికిడి సమస్య . ఎలాగో కష్టపడి ఆమెకి అర్ధమయ్యేలా చెప్తుంది . ఈ పని అయిదు నిమిషాలలో పూర్తవుతుంది . ఆ తరవాత పిల్లలు తమ స్నేహితులతో ఇంటి కొస్తారు . కనీసం నాన్నమ్మ గదివైపు కూడా చూడరు . వాళ్ల గదుల్లో కెళ్ళి  పాటలు , డాన్సులు  సరదాగా గడుపుతుంటారు . ఎప్పుడైనా తను వెళ్లి పలకరించినా పట్టించుకోరు . ఇవన్ని నీకు తెలీదులే అని నోరు మూయిస్తారు . ఆ వృద్ధురాలికి తన కోడలు చేసే పరిచర్యలతో  సంతృప్తి లేదు . ఎప్పుడూ తన చుట్టూ మనుష్యులుండాలి . ఇంటి విషయాలన్నీ చెప్తూ ఉండాలి . మనవళ్ళ  మధ్య కూర్చొని కబుర్లు చెప్పాలి  . ఇలా తన రోజు గడవాలనుకుంటుంది .

 ఈ సంఘటన గమనిస్తే ఆ వృద్ధురాలే పరిస్థితుల్ని అర్ధం చేసుకుని తను వేరే వ్యాపకం పెట్టుకుంటే బాగుంటుందనిపిస్తుంది . తన వయసున్న వ్యక్తులతో సాన్నిహిత్యం , స్నేహం ఏర్పరుచుకుంటే తమ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది . ఆ వయసులో ఇతరులతో కలవటానికి సాధ్యం కానప్పుడు ఇంట్లోనే మంచి పుస్తకం చదువుకోవడమో  , టి .వి కార్యక్రమాలు చూడటమో , తను చేయగలిగిన పనులుంటే చేయటం లాంటివి చేస్తే తనకీ సమయం గడుస్తుంది . తన ఒంటరి తనాన్ని జయించినట్లవుతుంది . ఆమెతో గడపటం కోసం కొడుకు ఉద్యోగం వదల్లేడు, కోడలు తన పనుల్ని మానుకోలేదు , మనవళ్లు తమ చదువుల్ని మానుకోలేరు కదా ! వయసు వల్ల వచ్చిన పరిణితితో పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటే సమస్య కొంత వరకు తగ్గుతుంది .

                ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడి వృద్దులంతా ఒక కుటుంబంలా , సొంత బంధువుల్లా కలిసి మెలిసి జీవించటం నేను చూశాను . నేను అక్కడికి వెళ్ళే వరకూ  వాళ్లు ఎంత నిరాశతో , దిగులు ముఖాలతో ఉంటారనుకున్నారు . కానీ అక్కడ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది . ఆ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా  ఖరీదైనదిగా ఉంది . వాళ్ళను పలకరించినపుడు వాళ్ల అనుభవాల్ని విన్నప్పుడు , వాళ్ళ ఆలోచనా ధోరణికి ఆశ్చర్యం కలిగింది . వారంతా పిల్లలు , కొడుకులూ , కోడళ్ళూ , మనవళ్లు , మనవరాళ్లు ఉన్నవారే . చాలా మంది పిల్లలు అదే ఊర్లో ఉన్నవారే . మరి కొంత మంది విదేశాల్లో  స్థిర పడ్డవారు . వారిలో ఒక వృద్ధురాలు ఇలా చెప్పింది .

మా కొడుకు , కోడలు ఈ ఊర్లోనే ఉంటారు . కొడుకు వ్యాపార రంగంలోనూ , కోడలు సాప్ట్ వేర్ ఉద్యోగిగానూ ఉన్నారు. వాళ్ళిద్దరూ నాతో బాగానే ఉంటారు . పొద్దున్నే చెరొక దారిన వాళ్ల పనుల్లో వెళ్ళిపోతారు . సాయంత్రం వరకు నేనొక్కదాన్నే తాళాలు వేసుకొని ఉండాలి . ఎవరింటికైనా  వెళ్ళాలన్నా రోజూ వెళ్ళలేను కదా! ఆ ఒంటరితనం  భరించలేక నేనే ఈ ఆశ్రమానికి వచ్చాను . మేముండగా ఆశ్రమానికి ఎలా వెళ్తావని  కొడుకు , కోడలు ఒప్పుకోలేదు , చూసేవాళ్ళు ఏమనుకుంటారో ? అని ఈ వయసులో వదిలేశామని అలా అని ఉద్యోగాలు మానేసి ఇంట్లో ఉండలేక ముందు ఒప్పుకోలేదు .

పిల్లల్ని కన్నం కదా అని వాళ్ల భవిష్యత్తుకి గుది బండలా మారలేము కదా . అందుకే వాళ్లకు నచ్చజెప్పి ఇక్కడ ఉంటున్నాను . యిక్కడి ఖర్చు అంతా వాళ్ళే భరిస్తారు . అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటారు . నేను వెళ్లి చూసొస్తుంటాను . ఇక్కడ నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు . రోజంతా కబుర్లు చెప్పుకుంటాము . మాకు తగిన ఆటలు ఆడుకుంటాం. పాటలు పాడుకుంటాం . ఎవరికి అనారోగ్యంగా ఉన్నా ఒకరికి ఒకరం ఆదుకుంటాం , ఈ వయసులో ఇంతకంటే ఏం కావాలి ? అని ప్రశ్నించింది .

నిజమే కదా ! తరాల మధ్య ఉన్న అంతరాల్ని ఇలా అర్ధం చేసుకుంటే సమస్య పరిష్కార మౌతుందని పించింది . ఇదంతా నాణానికి ఒక వైపు , అయితే మరొకవైపు వృద్ధుల్ని మానసికంగా హింసిస్తూ వారి ఆస్తుల్ని చేజిక్కించుకుని ఇళ్ళల్లోనుంచి పంపేయటం చూస్తున్నాం .

పిల్లల భవిష్యత్తు , ఉద్యోగాల వల్ల తమ పెద్దల్ని పట్టించుకోవట్లేదనే  వాదనలు ఈ కాలంలో విన్పిస్తున్నా కూడా ఇది ఎన్నో తరాలుగా కొనసాగుతూనే ఉంది . విదేశాలకు వెళ్లకపోయినా , పెద్ద చదువులు చదవక పోయినా పల్లెటూళ్ళ లో కూడా ఉపయోగంలేని  తల్లి దండ్రుల్ని వీధుల్లో వదిలేస్తున్నారు .  దీన్ని బట్టి చూస్తే తల్లిదండ్రుల్ని చూసుకోవటానికి సమయం లేకపోవటం , పెద్ద ఉద్యోగాలు చేయటం , ఉద్యోగాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళటం మాత్రమే కారణం కాదని తెలుస్తుంది .

 చదువుకుని ఉద్యోగాలు సంపాదించటం …. పెళ్లిళ్లు అవటం  వరకూ పిల్లలు , తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు . వారి డబ్బు , అధికారం , శారీరిక బలం , వాళ పలుకుబడి అన్నీ పిల్లలకు అవసరమౌతాయి . పిల్లల చదువులు పూర్తి అయ్యి ఉద్యోగాలు సంపాదించుకొని వారికి ఒక వ్యవస్థ ఏర్పాటు అయ్యే సరికి తల్లిదండ్రులు మెల్లగా వృద్ధాప్యంలోకి అడుగుపెడతారు . అప్పటి వరకు వారికున్న శారీరక బలం నశించిపోతుంది . అనారోగ్యాలు చోటు చేసుకుంటాయి . ఉద్యోగాల నుంచి రిటైర్ అవుతారు . అప్పటి వరకు ఉన్న పలుకుబడి , పరపతి తగ్గిపోతుంది . లేదా వ్యాపార బాధ్యతల్ని పిల్లలకి అప్పగిస్తారు . పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి అప్పులపాలౌతుంటారు .

ఈ కారణాల వల్ల ….. ఏ పనీ లేకుండా ఇళ్ళల్లో ఉండటం వల్ల ….పక్క వారికీ , ఇంట్లో వారికీ కూడా తల్లిదండ్రులు అదనపు భారంగా కన్పిస్తున్నారు . తరచుగా హాస్పటల్ పాలవడంతో డబ్బు ఖర్చు పెట్టాల్సిరావటం , దగ్గరుండి సేవలు చేయటం వంటివి పిల్లలకు కష్టంగా అన్పిస్తుంది. కానీ పిల్లలు బాల్య దశలో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉంటే పిల్లల కోసం తల్లిదండ్రులు నిద్రాహారాలు మానుకొని డబ్బుకు వెనుకాడకుండా పిల్లల్ని కాపాడుకుంటారు .

ఇవన్నీ మర్చిపోయి పనికి రాని తల్లిదండ్రులని మానసికంగా , శారీరకంగా హింసిస్తూ నడిరోడ్డున వదిలేస్తున్నారు.మరి కొన్ని కుటుంబాల వారికి ఆర్ధిక స్తోమతు లేక కూడా నిస్సహాయంగా తమ కుటుంబ వృద్ధులని  వదిలేస్తున్నారు.

ప్రభుత్వం ఇప్పటి  వరకు వృద్ధ కళాకారులకు జీవన భృతి , రైల్వే టికెట్ లలో రాయితీలు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంకా చేయవలిసిన పనులు ఎన్నో ఉన్నాయి .

ప్రభుత్వం , స్వచ్చంద సంస్థలు ఉచిత వృద్దాశ్రమాల్ని  ఏర్పాటు చేసి భోజన , వస్త్ర , వైద్య సదుపాయాలను అందిస్తే కొంత పరిష్కారం కనిపిస్తుంది .

వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొన్ని చట్టాల్ని చేసి నిబంధనలను ఏర్పాటు చేసారు . వాటిలో 

*  జిల్లాకి ఒకటి చొప్పున కనీసం నూట యాభై మందికైనా సరిపడేలా వృద్దాశ్రమాల్ని  ఏర్పాటు చేయాలి 

*  ప్రభుత్వ సాయంతో నడిచే  ఆసుపత్రుల ప్రత్యేక 

* వారి భవిష్యత్తు , ఆస్తుల రక్షణ కోసం ఒక ప్రణాళిక రూపొందించాలి . 

* వృద్ధులను మానసికంగా , శారీరికంగా హింసించే వారికి ఐ .పి .సి  498 ఎ  క్రింద చర్యలు తీసుకునే వీలుంది .

 * స్వచ్చంద  సంస్థలకి ఎక్కువ వృద్దాశ్రమాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పించడం . 

* పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీవన భృతిలో  ఆదాయ పన్నుని రద్దు చేయటం .  

పై అంశాలను ప్రభుత్వం తప్పని సరిగా ఆమలు చేస్తే వృద్ధులకి కొంతైనా న్యాయం కలుగుతుంది . 

 ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు వృద్ధాప్యం లోకి అడుగు పెట్టవలిసిన వారే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్తులు మొత్తం పిల్లల పేర  రాసెయ్యటం , వంటి పనులు చెయ్యకుండా తమ కోసం కొంత దాచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది . చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉన్నదంతా ఊడ్చి తమ సంతానానికి పెట్టి చివరి దశలో పడరాని పాట్లు పడటం కంటే ముందు జాగ్రత్త పడటం మంచిది కదా !

– హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సంపాదకీయంPermalink

One Response to సంపాదకీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో