ది సీక్రెట్ ( రహస్యం)

ది సీక్రెట్ ( రహస్యం)

రచయిత్రి- రోండా బర్న్

downloadరహస్యం మీకేమి కావాలంటే అదిస్తుంది.అసలు ఏమిటా రహస్యం? మనమందరంmala ఒకే శక్తి తో ఒకటే సిద్దాంతం తో పని చేస్తున్నాము. అదే ఆకర్షణ. ఆ రహస్యమే ఆకర్షణ సిద్దాంతం! మీ జీవితం లోకి వచ్చేదంతా , మీరు ఆకర్షిస్తేనే మీ జీవితం లోకి వస్తోంది.మీ మనసులో చెలరేగే ఆలోచనలన్నిటినీ మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు.

ఉదాహరణకు మీరు మీ ఆప్తులనెవరినో చూడాలని బలంగా అనుకుంటున్నారనుకోండి, వారు ఎక్కడో అక్కడ కనిపిస్తారు. అప్పుడు మీరు తలుచుకోగానే ప్రత్యక్షమయ్యారే అనుకుంటారు. అదీ మీ ఆకర్షణ శక్తి. అలాగే ఏదైనా మనం చెడు జరుగుతుందేమో అని పదే పదే అనుకుంటూవుంటే అది జరిగి తీరుతుంది.అదీ ఆకర్షణ శక్తినే. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో వుండాలి.అప్పుడే మన నుంచి పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి.  మనము ఎంత పాజిటివ్ ఆలోచనల తో వుంటే అంత మంచి జరుగుతుంది  ఆ రహస్యం మీలోనే వుంది.మీలో అంతర్గతంగా వున్నా ఆ శక్తిని మీరెంత ఎక్కువగా ఉపయోగిస్తే , అంత ఎక్కువ శక్తిని మీ వైపు ఆకర్షించుకుంటారు.ఇక దానిని అభ్యసించనక్కరలేని స్తానానికి చేరుకుంటారు.మీరే ఆ శక్తిగా మారుతారు.  .ఆ శక్తి ని ఎలా సంపాదించాలో ఉదాహరణల తో సహా ఈ పుస్తకం లో చెప్పారు రచయిత్రి రోండా బర్న్.

ఈ పుస్తకం లో ఆధునికకాలానికి చెందిన గురువుల జ్ఞానాన్ని చెప్పటం జరిగింది.ఈ జ్ఞా నాన్ని స్త్రీపురుషులందరూ ఉపయోగించుకొని ఆరోగ్యాన్నీ, సంపదనీ, ఆనందాన్నీ చేజిక్కించుకున్నారు.ఈ రహస్యం యొక్క జ్ఞానన్ని తమ జీవితాలకు అన్వయించుకొని తమ అద్భుతమైన కథల ద్వారా , వాళ్ళు వ్యాధులను రూపుమాపటం ఎలాగో ,అపరిమితమైన ధనాన్ని సంపాదించటం ఎలాగో ,అవరోధాలని అధిగమించటం ఎలాగో ,చాలా మందికి అసాధ్యమనే దాన్ని సాధించటం ఎలాగో మనకి తెలియజేస్తారు. 

రచయిత్రి రోండా బర్న్ మనందరిలాగే దేన్నో అన్వేషిస్తూ తన ప్రయాణన్ని ప్రారంభించింది.అలా ప్రయాణం చేస్తూ రచయితలనీ , ధర్మకర్తలనీ , గురువులనీ,చలన చిత్ర నిర్మాతలనీ, రూపశిల్పులనీ ,ప్రచురుణకర్తలనీ , అందరినీ కలగలుపుకుంటూ ఒక అదుభుతమైన బృందాన్ని తయారు చేసుకుంది.వీళ్ళందరి సాయంతోనూ ఈ రహస్యాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది.తనకున్న ముందు చూపుతో కొన్ని కోట్ల మందికి ఆనందాన్ని అందించింది.

తప్పక చదవవలసిన పుస్తకం ఇది.ఒకసారి చదివితే వదలము. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.కొన్ని సార్లు ఈ పుస్తకం అలా తెరిచి మధ్యలోనే చదివేస్తాను. విచిత్రం అక్కడ నా సమస్యకు నేను ఎలా స్పందించాలో రాసివుంటుంది. ఇది నాకు రెండుమూడు సార్లు అనుభవమైంది.

ఇది సినిమాగా కూడా వచ్చింది.

ఈ పుస్తకం విశాలాంద్ర లో దొరుకుతుంది.ధర 295 రూపాయలు.

– మాలా కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

6 Responses to ది సీక్రెట్ ( రహస్యం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో