Category Archives: కవితలు

-నాకు నేనే కొత్తగా!(కవిత)-సుజాత.పి.వి.ఎల్

sujatha

 

 

 

 

నేను కోరుకున్నది నిన్నేనని
నిన్ను చూశాకే తెలిసింది!

ఊహించని అద్భుతం

ఉన్నట్టుండి నాకై ఎదురొచ్చినట్టుంది!!

నీ రాక నన్ను పూర్తిగా మార్చేసింది

నిజ్జంగా…. నిజం

నిన్నటిదాకా నా మనసు మహా ఎడారే..!

ఆప్యాయతానురాగాలు ఎండమావులే!!

నీ చెలిమితో నీటి చెలమలు కనిపించినాయి.. మంచితనం మల్లెల పరిమళాలు వెదజల్లింది

నీ పలకరింపులో జలపాతాల హోరు వినిపించింది

అమావాస్యలో కూడా పున్నమి కాంతి కనిపించింది

నీ స్పర్శతో వీచే గాలి నన్ను స్పృశించగానే

నా శ్వాస మరింత అహ్లాదాన్నిస్తోంది

ఇంత వింత ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు..!!

నా మనసు అనుక్షణం నీతోనే మాట్లాడుతోంది

చూపు నీతో పెనవేసుకు పోయింది!!

ఇప్పుడు నాకే నేను కొత్తగా కనిపిస్తున్నాను..

నాకు నువ్వున్నావనే భావనే

నా హృదయం నిండా నిండుంది

నాలోని ప్రతి అణువు గర్వంలో ఉప్పొంగుతోంది.!

—సుజాత.పి.వి.ఎల్.

————–—————————————————

Posted in కవితలు | Leave a comment

నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

            సాఖియా ! ఈ తహ తహను తట్టుకోలేను క్షణమైనా ఇవ్వు విషమైన లేదా పొయ్యి మధువైనా ……… -దాగ్ … Continue reading

Posted in కవితలు | Leave a comment

గజల్-20 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

గజల్ ప్రేమికులకు నమస్కారం. సువిఖ్యాత గజల్ కవి జనాబ్ మహమ్మద్ ఫైజ్ వ్రాసిన ఓ అద్భుతమైన గజల్ ను అనువదించే ప్రయత్నం చేసాను. మన జీవనశైలికి అనుగుణంగా … Continue reading

Posted in కవితలు | Leave a comment

భవిష్యత్తు(కవిత )-గిరి ప్రసాద్ చెలమల్లు

        అదో గుబురు తోట గుబురు గడ్డంతో గతంలోకి కలిసి చెప్పుకున్న ఊసుల లోకంలో మోగిన తంతులు పలవరించిన మేనులు ధమనులు సిరల్లో … Continue reading

Posted in కవితలు | Leave a comment

మనిషి ముందుకు… మనసు వెనక్కు(కవిత)-శ్రీ సాహితి

ఎప్పటిలాగే రైలు కిటికీ పక్కనే చూపుల రెపరెపలు. దృశ్యాల తుప్పర్లకు కళ్ళు వర్షంలో తడిసిన కుందేళ్లులా అందాలన్ని తిరుగుతుంటే, పుస్తకంలోని పేజీల్లా పరిసరాలను చదేవేస్తున్న ఆలోచనలు రైలు … Continue reading

Posted in కవితలు | Leave a comment

పున్నమికోసం….(కవిత )-డా||బాలాజీ దీక్షితులు పి.వి

ఆశ కలువ వాడి పోయి చాలా రోజులైంది మంచితనం మసివడి మానవత్వం తగలబడి న్యాయం -ధర్మం, దారిద్య్రం దాపురించి బ్రతుకు నమ్మకమే పోయి ఎందుకు పుట్టామా ఈ … Continue reading

Posted in కవితలు | Leave a comment

నీలాకాశంలో నక్షత్రం(కవిత )-చంద్రకళ

        పురిటి నొప్పులెన్నో భరించి… నూతన సృష్టికి నాంది పలికే నెలత…! నలుగురూ మెచ్చినా, మెచ్చకపోయినా… నగుబాటు పాలైనా… నచ్చిన దారిలో పయనిస్తూ… … Continue reading

Posted in కవితలు | Leave a comment

విలువ లేని గాయం(కవిత )-జయసుధ కోసూరి.

        ఉబికొస్తున్న ఆవేశం.. ముక్కు పుటాలను అదరగొడుతున్నా.. పౌరుషంతో గుండెలు ఎగసిపడుతున్నా.. అణచుకోవాలని చూసే “ఆడతనాలం”.!! మనిషికి తప్ప మనసుకి విలువివ్వని ఆచారాల … Continue reading

Posted in కవితలు | Leave a comment

రాజకీయ మణి పూసలు (కవిత)-డా.వూటుకూరి.

        కప్పల తక్కెడ ఎక్కేసి బలహీనులను తొక్కేసి నాయకుడిగ ఎదిగినాడు అసమానతలు రాజేసి అధినేత దేవుడనుచు అధికారం ప్రాణమనుచు భజన చేయు నాయకుడు … Continue reading

Posted in కవితలు | Leave a comment

నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

ఆ పూబోడి సోయగాన్ని చూస్తుంటే ఎంత విచిత్రం ? ప్రాభాత సమీర స్పర్శకే సుమా ! ఆ సుమగాత్రి అయ్యింది కలుషితం -ఈషా నాలో నేనే ఉంటున్నాను … Continue reading

Posted in కవితలు | Leave a comment