-నాకు నేనే కొత్తగా!(కవిత)-సుజాత.పి.వి.ఎల్

sujatha

 

 

 

 

నేను కోరుకున్నది నిన్నేనని
నిన్ను చూశాకే తెలిసింది!

ఊహించని అద్భుతం

ఉన్నట్టుండి నాకై ఎదురొచ్చినట్టుంది!!

నీ రాక నన్ను పూర్తిగా మార్చేసింది

నిజ్జంగా…. నిజం

నిన్నటిదాకా నా మనసు మహా ఎడారే..!

ఆప్యాయతానురాగాలు ఎండమావులే!!

నీ చెలిమితో నీటి చెలమలు కనిపించినాయి.. మంచితనం మల్లెల పరిమళాలు వెదజల్లింది

నీ పలకరింపులో జలపాతాల హోరు వినిపించింది

అమావాస్యలో కూడా పున్నమి కాంతి కనిపించింది

నీ స్పర్శతో వీచే గాలి నన్ను స్పృశించగానే

నా శ్వాస మరింత అహ్లాదాన్నిస్తోంది

ఇంత వింత ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు..!!

నా మనసు అనుక్షణం నీతోనే మాట్లాడుతోంది

చూపు నీతో పెనవేసుకు పోయింది!!

ఇప్పుడు నాకే నేను కొత్తగా కనిపిస్తున్నాను..

నాకు నువ్వున్నావనే భావనే

నా హృదయం నిండా నిండుంది

నాలోని ప్రతి అణువు గర్వంలో ఉప్పొంగుతోంది.!

—సుజాత.పి.వి.ఎల్.

————–—————————————————

Posted in కవితలు | Leave a comment

మే నెల సంపాదకీయం – డా.అరసి శ్రీ

హమ్మయ్య అని అనుకున్నంత సమయం పట్టలేదు.  మామూలు పరిస్థితులకి వస్తున్నాం అని ఊపిరి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అన్ని తలకిందులు అయిపోయాయి. ముందుగానే పరిశోధకులు , మేధావులు … Continue reading

Posted in సంపాదకీయం | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

సమ్మెట ఉమాదేవి కొత్త కథా సంపుటాల పరామర్శ – MVS పద్మావతి

ఒక్కో పుస్తకం చదివినప్పుడు, రచయిత/రచయిత్రికి తగిన గుర్తింపు ఇంకా రాలేదనిపిస్తుంది.. అంత గొప్ప గొప్ప కథలనందించిన వారు మనలో ఒకరుగా తిరుగుతున్నారంటే సంభ్రమంగా అనిపిస్తుంది. “జమ్మిపూలు” పేరు … Continue reading

Posted in పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు | Leave a comment

నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

            సాఖియా ! ఈ తహ తహను తట్టుకోలేను క్షణమైనా ఇవ్వు విషమైన లేదా పొయ్యి మధువైనా ……… -దాగ్ … Continue reading

Posted in కవితలు | Leave a comment

గజల్-20 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

గజల్ ప్రేమికులకు నమస్కారం. సువిఖ్యాత గజల్ కవి జనాబ్ మహమ్మద్ ఫైజ్ వ్రాసిన ఓ అద్భుతమైన గజల్ ను అనువదించే ప్రయత్నం చేసాను. మన జీవనశైలికి అనుగుణంగా … Continue reading

Posted in కవితలు | Leave a comment

జనపదం జానపదం- 15- నాయికపోడు జీవన విధానం -భోజన్న

జీవితంలో ఆనందం ఎక్కువగా ఉండి భరించలేని వారు కొందరైతే జీవితంలో విషాధచ్ఛాయలు అలుముకుని కూటికి ఆరాటపడే వారు మరికొందరు సమాజంలో మనకు కనిపిస్తుంటారు. చదువుకు దూరముగా అభివృద్ధి … Continue reading

Posted in కాలమ్స్ | Leave a comment

భవిష్యత్తు(కవిత )-గిరి ప్రసాద్ చెలమల్లు

        అదో గుబురు తోట గుబురు గడ్డంతో గతంలోకి కలిసి చెప్పుకున్న ఊసుల లోకంలో మోగిన తంతులు పలవరించిన మేనులు ధమనులు సిరల్లో … Continue reading

Posted in కవితలు | Leave a comment

మనిషి ముందుకు… మనసు వెనక్కు(కవిత)-శ్రీ సాహితి

ఎప్పటిలాగే రైలు కిటికీ పక్కనే చూపుల రెపరెపలు. దృశ్యాల తుప్పర్లకు కళ్ళు వర్షంలో తడిసిన కుందేళ్లులా అందాలన్ని తిరుగుతుంటే, పుస్తకంలోని పేజీల్లా పరిసరాలను చదేవేస్తున్న ఆలోచనలు రైలు … Continue reading

Posted in కవితలు | Leave a comment

పున్నమికోసం….(కవిత )-డా||బాలాజీ దీక్షితులు పి.వి

ఆశ కలువ వాడి పోయి చాలా రోజులైంది మంచితనం మసివడి మానవత్వం తగలబడి న్యాయం -ధర్మం, దారిద్య్రం దాపురించి బ్రతుకు నమ్మకమే పోయి ఎందుకు పుట్టామా ఈ … Continue reading

Posted in కవితలు | Leave a comment

*ది రైటర్*(కథ )- కౌలూరి ప్రసాదరావు

చల్లని సాయంత్రం వేళ.చల్లగాలి మెల్లగా వీస్తూ హాయిగొలుపుతోంది. అప్పుడే తలంటుకుని వచ్చి ఈజీ ఛైర్ లో కూర్చుని వేడివేడి టీ తాగుతూ, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని … Continue reading

Posted in కథలు | Leave a comment