ప్రముఖ రచయిత్రి యలమర్తి అనురాధకు ఉగాది పురస్కారం
అల్లాపూర్ డివిజన్ గాయత్రీ నగర్ కు చెందిన ప్రముఖ రచయిత్రి యలమర్తి అనురాధకు విశేష గౌరవం దక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా యలమర్తి అనూరాధ తాను సాహితీ రంగానికి చేసిన విశేష సేవలకు గాను ఉగాది పురస్కారం అందుకున్నారు. ఇదే వేదికన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై అప్పటికప్పుడు ఆమె చెప్పిన కవిత పలువురుని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరేళ్ల విరామం తర్వాత ఉగాది పురస్కారం సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రకళ, శిల్పకళ, నాటక, జానపద కళలు, అవధానం, మిమిక్రీ, హరికథ, జర్నలిజం, వైద్య సేవలు, సామాజిక, సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గుర్తింపుగా ఈ పురస్కారాలను ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది. ఉగాది పురస్కారం ఈ సం// 116 మందిని ఎంపిక చేయగా అందులో అనురాధకు చోటు దక్కింది. విజయవాడలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కళాకారులను శాలు వాళ్లతో సత్కరించి పదివేల రూపాయలు నగదు, పురస్కారంతోపాటు తెలుగు తల్లి జ్ఞాపికను చంద్రబాబు అందించారు. విశ్వా వసు నామ ఉగాది పురస్కారానికి యలమర్తి ఎంపిక కావడం ఎంతో ఆనందదాయకమని తన 50 ఏళ్ల సాహిత్య పరిశ్రమకు ఫలితం ఫలం, ఫలితం దక్కిందని అను అనూరాధ పేర్కొన్నారు.
cccyeprel nela sanchik kosam click cheyandi.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
ప్రముఖ రచయిత్రి యలమర్తి అనురాధకు ఉగాది పురస్కారం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>