“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం”(సంపాదకీయం) -డా.అరసిశ్రీ
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అంటే, అన్ని ఇంద్రియాలలో కన్నులు ప్రధానమైనవి అని అర్థం.
ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుండి 7వ తేదీ వరకు అంధత్వ నివారణ వారోత్సవాలను నిర్వహిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. . మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు అంధత్వాన్ని నివారించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం.
అంధత్వం నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం 1976లో ప్రారంభం అయింది. 2017 నుండి, అన్ని రకాల దృష్టి లోపాలను గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.
ప్రస్తుత జీవన శైలి , పరిస్థితులు కరోనా ముందు , తర్వాత అనడం సర్వసాధారణం అవుతుంది.
కరోనా సమయంలో పాఠాశాలలకు సెలవు ఇవ్వడం , అంతర్జాలంలో తరగతులు నిర్వహించడం వలన చిన్నారులు చరవాణి వినియోగం పెరిగిపోయింది.
ప్రస్తుతం పాఠాశాలలు నిర్వహిస్తున్నా కూడా ఇళ్ళకు చేరిన తర్వాత విడియో గేమ్స్ , సాంఘిక మాధ్యమాలలో ఎక్కువ సమయం గడపడం జరుగుతుంది.
వంద మంది పిల్లల్లో ఏడుగురికి ఈ లోపం ఉంటోంది. పిల్లలకు చిన్నప్పుడే దృష్టి లోపాలు వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి.
సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు తగిలేలా ఉండకపోవడం, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు, ఫోన్ లు ఎక్కువగా ఉపయోగించడం దృష్టి లోపాలు వస్తుంటాయి. దృష్టి లోపం అంటే, కంటి చూపు సరిగా కనపడకపోవడం. సాధారణంగా దృష్టి లోపాలు 6 రకాలు.
*హ్రస్వదృష్టి : దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే చూడగలరు, దూరంగా ఉన్న వస్తువులు చూడలేరు.
*దూర దృష్టి: దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే చూడగలరు దగ్గరగా ఉన్న వాటిని చూడలేరు.
*చాత్వరము: దగ్గర మరియు దూరం ఉన్న వాటిని చూడలేరు.
*అసమ దృష్టి: వస్తువులు నిలువు గీతాలు అడ్డు గీతలు గా కనిపిస్తాయి.
*రేచికటి: రాత్రి సమయంలో వస్తువులు చూడలేరు.
*వర్ణ అంధత్వ: రంగులు గుర్తించలేరు
దృష్టి లోపాలు చాలా వరకు పోషకాహార లోపాల వల్లనే వస్తాయి. కనుక అన్ని విటమిన్లు, మినరల్స్ కలిగిన ఆహారాలను వారికి రోజూ ఇవ్వాలి. రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను ఇవ్వాలి. ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండేందుకు గాను విటమిన్ ఎ ను అందించాల్సి ఉంటుంది. విటమిన్ ఎ ఎక్కువగా యాపిల్స్, కోడిగుడ్లు, టమాటాలు, నట్స్ వంటి ఆహారాల్లో లభిస్తుంది. అలాగే పాలను కూడా తాగించవచ్చు.
*పిల్లలు రోజూ కొంత సేపు అయినా సరే వెలుతురు లేదా ఎండలో గడిపేలా చూడాలి. ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కువగా ఉపయోగించకుండా చూడాలి. తప్పనిసరిగా చరవాణి ఉపయోగిచాల్సి వస్తే మధ్య మధ్యలో విరామం ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. టీవీలను కూడా ఎక్కువగా చూడకపోవడమే ఉత్తమం. పిల్లలకి ఒక వస్తువుగానీ, అక్షరాలుగానీ చూపించి వాటిని గుర్తించమని, చదవమని చెప్పాలి.
సాధారణ కంటి జబ్బులు:
- కండ్లకలక (Conjunctivitis):కంటి కనురెప్పల లోపలి పొర మరియు కంటి ఉపరితలం వాపు.
- కంటి శుక్లం (Cataract):కంటి లెన్స్ మసకబారడం.
- గ్లాకోమా (Glaucoma):కంటి లోపల ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరాలకు నష్టం.
- కంటి పొరల వ్యాధి (Dry eye syndrome):కళ్ళు త్వరగా ఆరిపోవడం.
- రెటీనా డిటాచ్మెంట్ (Retinal Detachment):రెటీనా కంటి నుండి విడిపోవడం.
- మధుమేహం వల్ల కంటి జబ్బులు (Diabetic Retinopathy):మధుమేహం ఉన్నవారిలో కంటి రెటీనాకు వచ్చే నష్టం.
వయసు రీత్యా వచ్చే అంధత్వ సమస్యలు కన్నా పిల్లలలో అంధత్వ సమస్య ఎక్కువుగా ఉండటం గమనించవచ్చు. దీనికి ప్రధానా కారణాలు రెండు.అవి
1.ఆరోగ్య వంతమైన ఆహారం
2..ఆరోగ్యవంతమైన జీవన శైలి .రెండు లోపించడం.
మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. కానీ మన జీవన శైలి మీద కాస్త అవగాహన ఉండటం ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల ఏం చేస్తున్నారు అనే విషయాలపై గమనిస్తూ ఉండాలి. లేకపోతే పిల్లల కంటి చూపు పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
చివరగా ఒక మాట పిల్లలు పెద్దల్నే అనుసరిస్తారు, అనుకరిస్తారు.
కాబట్టి మనల్ని మనం కూడా ఒక్కోసారి తరిచి చూసుకోవాలి . అది ఈ విషయం అయినా ఏ విషయంలో నైనా కూడా, ఏమంటారు?
ఈ విషయాన్ని గురించి ఒక్క సారి ఆలోచిస్తారు కదూ.
– అరసి శ్రీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం”(సంపాదకీయం) -డా.అరసిశ్రీ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>