యుద్దాలు లేని నేల (కవిత)- జయసుధ కోసూరి Posted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025 ఎక్కడుంటుందంటారు.. ! తెగిపడని తలలు చూసే చూపుల్లోనా… బీడువారి నెర్రెలిచ్చిన భూమిలో ఇంకిన రైతు రక్తంలోనా.. ! దేశం కోసం కాపుకాస్తున్న జవాన్ల బూట్ల చప్పుళ్లలోనా.. !! ఎక్కడుందంటారు.. !! దారితప్పిన దగాకోరుల జీవితాల్లోనా.. గూడు చెదరి గుండె మండిన పేదల కడుపాకలిలోనా.. !! ఎక్కడుందంటారు.. !! అమ్మతనం అభాసుపాలైన అంగడి బొమ్మల మనోవేదనలోనా.. ఆ మసిబారిన మనసులకు ఓదార్పునివ్వలేని ఈ సమాజంలోనా.. !! ఎక్కడుంది.. యుద్ధం లేని నేల.. !! ఏ మనసున ఉంది.. ఓ మనిషీ… ప్రశ్నించుకో..?? -జయసుధ కోసూరి ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
యుద్దాలు లేని నేల (కవిత)- జయసుధ కోసూరి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>