గాజు పగుళ్ళ చప్పుడు….?(కవిత)-పంపోతు నాగేశ్వరరావు
ఖాళీ సీసా తీసి
ప్రతిదినం గాలి తీసేసి
మూలాన పగులగొట్టేసోణ్ణి
పగిలిన సీసాల ముక్కలు
కూర్చడమే నా పని
నిశ్శబ్దంగా ఉండే గదిలో….
రాత్రి అయ్యిందంటే చాలు సీసాలో
మత్తుగా ఊగి ఊగి పగలని బొమ్మ వొల్లో
హ్ము….. ఊరేగింపుగా
సీసా పల్లకినెక్కిస్తాడు
మూగదయిన జింకపిల్ల
రాత్రి పూట మత్తు పంజాకి
వొళ్ళంతా
దెబ్బలు తింటూ ఉంటే
సీసాతాగిన సింహం అనుకూలవతి జింకెనెన్ని
పంజాలతో
గాట్లెసి మనసు ఖండ ఖండాలు చేస్తుందో…..
భాధగా ఉన్న ఆమె దేహంపై మత్తుకారం పూయోద్దు
సీసా ముక్కలైంది
ఇక అతుక్కొదేమో…….
మత్తు సింహం పగిలిన పెంకుల్తొ మనసు పేర్చాలో
…..
మత్తు వీడింది
సీసా మాత్రం అతుక్కోలేదు……
పగిలింది….. ఇంకా శబ్దం వస్తుంది
మత్తెక్కిన చేయి దెబ్బకి
శరీరంపై దీర్ఘకాలిక అచ్చెశాడు మత్తుమాంత్రికుడు
మత్తు స్పర్శ తప్ప శరీర స్పర్శ తెలీదు
గాజు పగుళ్ళ చప్పుడు చేస్తోంది
దేహాన్ని రెండుగా చీలించడం కాక పూర్ణించడ మెరగని రాతి స్పర్శ
అందుకే ఇప్పుడు
ఖాళీ సీసా….. మనిషి లేని సీసా
ఒంటరి సీసా…….
ఇప్పుడు
మత్తువీడినా ఖాళీ సీసా పూడ్చగలదా..!
రాతిబారిన గుండెలో కాసిని పూలు పూయించగలడా ..?
జింక పిల్ల కన్నీరుతో సీసా నింపి తాగేవొడికి
జీవితాన్ని మత్తు స్పర్శ నుంచి కాక
నిజస్పర్శను స్పృశించగలడా…
పలిగిన గుండెలో ఇప్పుటికైనా కాస్త పేమ పసరు పొయ్యి
గాజు సీసాలు పగలకొట్టడం కాదు
అతికించడం నేర్చుకో………?
వీలైతే పగిలిన పెంకుల్ని బంధాల గమ్ముతో అతికించి
మార్పు అనే నీరోసి నమ్మకమనే గులాబీ పువ్వు పూయించు
ఇక గాజుపగుళ్ళ చప్పుళ్ళు ఉండవు
ఇక మనసు పగుళ్ళ చప్పుడు ఉండవు
మత్తు వీడండి ఇంటి ఆలినో ఏలండి ఇకనైనా!
(మద్యానికి బానిసైన వారిగురించి)
-పంపోతు నాగేశ్వరరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
గాజు పగుళ్ళ చప్పుడు….?(కవిత)-పంపోతు నాగేశ్వరరావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>