ఉగాది కవితా లత(కవిత)-ఆర్ . విజయశ్రీ
అనాదిగా వస్తున్నది
అన్యోన్యంగా గడిపే ఉగాది
తెలుగు వెలుగులకు శ్రీకారం
చుట్టేది ఈ సంవత్సరాది
వచ్చే ప్రతిసారీ తెచ్చేది సంతోషాల ప్రోది
చైత్ర శుద్ధ పాడ్యమి నాటి సంబరాల గాది
శిశిరానికి అంతం పలికి,
వసంతానికి వంత పాడే స్వాగతం
పచ్చిక బయళ్ళ పచ్చదనంతో
ప్రకృతి కాంత సుమనోహరం
కోకిలపాటకు సాకారం లేత చిగుళ్ళ ఆహారం
ఆబాల గోపాలానికి నులివెచ్చని పచ్చతోరణం
దేశ, విదేశాల్లో విరాజిల్లే తెలుగు జాతికి వరం
అంబర చుంబిత సంబరం,
ఈ సంవత్సరాది శుభారంభం
షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభం
విశ్వావసు నామ సంవత్సరం
తెలుగు క్యాలెండర్లో నూతన అధ్యాయం
ఉగాది ఉషోదయం..
ఆరుగాలశ్రమకు దక్కే ఫలితం
ఆత్మీయ కలయికల పండుగ నిండుదనం
కవి సమ్మేళనంలో గుబాళించే
హరిచందన పరిమళం
ఆరురుచుల ఉగాదిపచ్చడి
అమృతతుల్యం
తెలుగోడి తీపి కలలు
కావాలి సాకారం
తమ్ముళ్ల ప్రేమాభిమానం,
తెలుగు మహిళల మమకారంతో
ఆప్యాయతలు పెంచుకునే పలకరింపులు
పంచాంగ శ్రవణాలతో ఆదాయ ఫలాలు
ధర్మంగా,నింపాదిగా సంపాదించే సంపదలు
తృప్తినిచ్చే జీవితలకు ఆనంద మాలికలు
అంబరమంటే సంబరాలకు నేపథ్యం
తెలుగుతనం ఉట్టిపడే నాట్య విన్యాసాలు
వీనుల విందైన సంగీత సంధ్యా సరాగాలు
ఉగాది పండుగకు శ్రీకరం శుభాకాంక్షలపర్వం
దైవాశీస్సులతో కలగాలి అందరికీ శుభకరం
-ఆర్ విజయశ్రీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
ఉగాది కవితా లత(కవిత)-ఆర్ . విజయశ్రీ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>