ఆధునిక రక్షకభటులు(కవితలు)-పాలేటి శ్రావణ్ కుమార్
చలాన్లు వేయడానికి ఒక పోలీసు కావాలి
చలాను వేస్తే చాలు
అతడిని మనము రక్షించినట్టే
అప్పుడప్పుడు నీడకి నిలబడి
కొన్ని ఫోటోలు తీస్తే చాలు
మీకు ఫిట్నెస్ దేహం లేకపోయినా చాలు
కానీ ఫోటోగ్రఫీ ఖచ్చితంగా వచ్చి తీరాలి
చలాన్లు వేయడానికి ఒక పోలీసు కావాలి
చలాను కూడా కోర్టులో కట్టించాల్సిన అవసరం లేదు
నీవు కొంచెం నొక్కి నాకు కొంచెం ఇస్తే చాలు
రక్షకభటుడిలా రక్షించాల్సిన అవసరం లేదు
రక్షించినట్టూ నటిస్తే చాలు
దీనికోసం నీకు నటన కూడా వచ్చి ఉండాలి
నటనకే అభిమానులు కలెక్షన్లు
నియమాలను గుర్తు చేస్తే చాలు
పాటింపజేయాల్సిన కష్టం మీకు లేనేలేదు
అధికారులు మీరే అధికారం మాత్రం మీది కాదు
కానీ జీతాలు, అడ్డదారిన జీవిత సుఖాలు అన్నీ లభిస్తాయి
అందరూ ఇలా ఉండకపోవచ్చు
కానీ ఎందరో ఇలా ఉంటున్నారు
డబ్బులున్న వానికోసమే మీ వ్యవస్థ ఉన్నది
లేనోడి దగ్గర లాగి లాగి వీరికి కూడపెట్టడమే మీ కర్తవ్యం
ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు
శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరము లేదు
పట్టించుకోకుండా వెళ్ళే ఆత్మవంచన కలిగి ఉంటే చాలు
ఈ ఉద్యోగం నీదే
పరుగెత్తి పరీక్షలు రాసి
నీడపట్టున నిలబడి చలాన్లు వేస్తే చాలు
నేటి రక్షకభటులా ప్రధాన కర్తవ్యం
-పాలేటి శ్రావణ్ కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
Comments
ఆధునిక రక్షకభటులు(కవితలు)-పాలేటి శ్రావణ్ కుమార్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>