అబద్ధపు నవ్వు –(కవిత)- పాలేటి శ్రావణ్ కుమార్ ,
నవ్వును ధరించడం అలవాటు అవుతుంది
బాధ కళ్ళలోనే ఇనికిపోయినప్పుడు
కళ్ళలో నుండి అదే బాధ
మనసులో దాగిపోయినప్పుడు
మనసులో దాగిన బాధను,
మనసు గదుల్లో బంధించినప్పుడు
బంధింపబడిన బాధంతా బరువెక్కి,
బరువెక్కి మోయలేనంత భారమైనప్పుడు
భారమెక్కిన మనసు,
రాయిలా మారుతున్నప్పుడు
రాయిలా మారిన మనస్సు,
సమాజంతో స్పర్శను కోల్పోయినప్పుడు
ఎన్నో కలలతో, ఆశలతో నిండిన
లోకంలో చోటు లేదని తెలిసినప్పుడు
యంత్రాంగపు జీవితంలో
మనసు రోబోలా మారుతున్నప్పుడు
మనసులేనినాడే జీవితం
బాగవుతుందని తలిచినప్పుడు
ప్రకృతిని కూడా ఆనందించలేని,
స్పృశించలేని నయనాలు
ఒక అబద్ధపు నవ్వుని ధరిస్తుంది
ఒక అబద్ధపు నవ్వు,
ధరించడం అలవాటు అవుతుంది
అదే అన్ని సవాళ్ళకు చివరి
సమాధానం అని నిశ్చయించుకుంటుంది
బాధ అనే భావాన్ని పూర్తిగా కోల్పోతుంది
ఆనాడు మనిషి రాక్షసత్వాన్నో,
యోగితత్వాన్నో పొందుతాడు
ఇతరుల బాధలో నృత్యమైన చేస్తుంది,
లేదా లోకమంతటి బాధను ఆవిరి చేస్తుంది
చిట్టచివరన, మొట్టమొదటిగా
బాధ నవ్వుని ధరించేలా చేస్తుంది
బాధ నవ్వుని ధరించేలా చేస్తుంది
– పాలేటి శ్రావణ్ కుమార్ ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అబద్ధపు నవ్వు –(కవిత)- పాలేటి శ్రావణ్ కుమార్ , — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>