“అమరమైనాక..”(కవిత )- సుజాత తిమ్మన

ప్రమిద …నూనె ఉంటేనే….. వత్తి వెలిగి ..దీపమై వెలుగిస్తుంది. యోధుడయినా… దేవుడయినా…… అతివ ఆలంబన లేనిది.. తాను నిమిత్త మాత్రుడనని…తెలుపగలిగే..చరితే…… మూర్చిల్లిన శ్రీ కృష్ణుని రక్షించుకొన… నరకాసురుని వధించిన సత్యభామ కథ… ఆది ..అంతం..”ఆమె” అని తెలిసినా…. అణగారని అహంకార రాక్షసులు కోకొల్లలు.. జీవాన్ని తోడేస్తూ…ఛరించే శవాలుగా మార్చేస్తూ.. అమ్మ కూడా “ఆమె ” అన్న బావాన్ని తొక్కేస్తూ… ఆదిశక్తి అంశను అశువుల వలయంలో బందిస్తున్నారు..వారు.. పుణ్య ఫలాలనిచ్చే పురాణాలకాలంనుంచి… సరస్వతి…లక్ష్మి…పార్వతి…పేర్లు ఏవయినా… దేవి..అమ్మవారు ..సౌభాగ్యప్రదాయిని “ఆమె..” ప్రతి నోములోను..గౌరమ్మగా పూజలందుకుంటూ… హిందూసాంప్రదాయంలోనిలిచిన… పసుపు […]

Read more

జోగిని

సన్నగా గొణిగింది.  ఆమె గొణుగుడూ ఆమెనీ అర్థమయీ అర్థం కానట్లు … చూస్తూ… కానీ ఆమె ఎవరో మాత్రం అర్థం అయినట్లుంది. అందుకేనేమో, మళ్ళీ తానే చనువుగా ” పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అంత తీవ్ర ఆలోచన చేస్తున్నారేమిటో…” అన్నాడతను. ఏమిటి అసలు ఇతను ఏమనుకొంటున్నాడు. ఆరేళ్ళ పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాడి దగ్గర వరకూ ఆడపిల్ల అంటే అందరికీ లోకువే.. చులకనే… అవకాశం ఎలా దొరుకుతుందా… ఎప్పుడు దొరుకుతుందా… అని ఎదురు చూస్తుంటారు. అందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

               1920 డిసెంబరులో ఆరంభమైన  సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు. ప్రజలు ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే బలమైన బ్రిటీషు ప్రభుత్వాన్ని మన దేశం  నుండి తొలిగించగలమని మౌలానా దంపతులు ప్రబోధించారు. స్వదేశీయతను ప్రోత్సహించటం తోపాటు విదేశీ వస్తువులను బహిష్కరణ తదితర అంశాల విూద ఆమె పటిష్టమైన ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ అలీఘర్‌ ఖిలాఫత్‌ […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

జాతీయోద్యమకారులచే ‘ అమ్మ’ గా పిలిపించుకున్న ఆబాది బానో బేగం (1852-1924)    జాతీయోద్యమంలో పురుషులతోపాటు మహిళలు కూడా అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించారు. బ్రిటీషు ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగిన  మహిళలు  ఉద్యమకారులలో ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండా, నిర్భయంగా ముందుకు సాగమని ప్రోత్సహించారు. ఆనాటి తొలితరం మహిళలలో శ్రీమతి ఆబాది బానో బేగం అగ్రగణ్యురాలు. ఆమె ఎంతో ఉత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించటం వలన ఆమె నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమకారులు  ఎంతో ప్రేమతో బీబీ అమ్మ అని ఆమెను పిలుచుకున్నారు.                     ఆబాది […]

Read more

సంపాదకీయం

      ఏ దేశ చరిత్ర చూసినా  ఏమున్నది గర్వ కారణం అన్నట్టు డిల్లీ  సంఘటన తరువాత ఒక దాని వెంట మరొకటి జరిగిన పరిణామాలు , మళ్ళీ  మళ్ళీ జరిగినట్టుగా   వచ్చిన రేప్ వార్తలు యావత్ ప్రపంచాన్నే కుదిపేసాయి. యువతుల్ని అత్యాచారం చేయడం,గ్యాంగ్ రేప్ లు చేయడం ఈ రోజు కొత్తేమీ   కాదు. సెప్టెంబర్ 29 2006 లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామం లో జరిగిన దారుణ ఊచ కోత , గ్యాంగ్ రేప్ ల  సంఘటన ఇంకా గుర్తుండే  ఉంటుంది. అసలు అది మరిచి పోయే సంఘటన కాదు. […]

Read more

సహన శీలి – సాయికిరణ్ కొండేపూడి కవిత

దేశం దేశం నా దేశం, ఎక్కడ నీ సందేశం ? ఆర్పేవా ఈ అగ్ని రణం? చేసేవా నా కలలు నిజం……………… గౌతమ బుద్ధుని జన్మ స్థలం రక్త యజ్ఞమే ప్రతీ దినం… న్యాయ-ధర్మాల నిలయం రాజ కనిమొళి  యడ్యారు గాలుల అవినీతికి సాక్షిగా మిగిలిన వైనం …… కసబ్ కర్కశానికి  బలై, రాజకీయ యువ నేతల, నవనేతల,వృద్ధ నేతల,  మహా నేతల రంగుల జెండాల గారడిలో రోగాల పాలైనావా …. ప్రశాంతమైన రాష్ట్రాలు ముక్కలు, చెక్కలు, తొక్కలై  విడిపోతే, అన్నదమ్ముల  ఆనంద మైత్రి […]

Read more

అభిలాష అక్షర అక్షయ పాత్ర- ‘పుష్పక’ యాత్ర!

‘అభిలాష అక్షర అక్షయ పాత్ర’ కవితా సంకలనం చదువుదామని ముందు మాటలు వ్రాసిన ప్రముఖుల ఛాయాచిత్రాలను చూస్తూ ఒక్కొక్క పేజీ త్రిప్పుతుంటే నా కనిపించింది. ఈ కవయిత్రి సామాన్యు రాలిగా కనబడే మాన్యురాలని. ‘‘సాధించే సత్తా నీలో ఉంది చూసుకో’’ అందులో నన్నాకర్షించిన నిప్పులాంటి నిజాల వరుసలు… నిజంగా ముత్యాల పదాలు. ‘‘నిప్పుతోటి ఆటటాడి ధైర్యం తెచ్చుకో… ఉప్పెన పై చెలరేగే నైజం నేర్చుకో..’’ ‘‘విధాత ఎవ్వడు రా నీ రాత నువ్వే రాసుకుంటే `    ఏ బ్రహ్మ నీగీత మార్చునురా నీచేయి  నీ […]

Read more