గోసంగుల వివాహ పద్ధతులు(వ్యాసం ) – గంధం విజయ లక్ష్మి

గోసంగుల వివాహ విధానం ` పరిచయం : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక భారతదేశంలో దళితులను ఎస్‌.సి, ఎస్‌.టి లుగా గుర్తించి, వారికి రాజ్యాంగంలో ప్రత్యేక మినహాయింపులు, ప్రోత్సాహకాలు యివ్వడం జరిగింది. గోసంగి కులాన్ని షెడ్యూలు కులంలో ఉపకులంగా ఇరవైఐదు సంఖ్యగా చేర్చినారు. వీరు దక్షిణ భారతదేశమంతా వ్యాపించి ఉన్నారు. గోసంగి కులంవారి పెళ్ళిళ్ళు చాలా విచిత్రంగా జరుగుతాయి. వీరు ఇటు ఆర్య సంప్రదాయం పాటింపక, అటు ద్రవిడ సంప్రదాయాన్ని గ్రహింపక ఒక విచిత్రమైన, విభిన్నమైన వివాహ వ్యవస్థను కలిగి ఉన్నారు. బాల్య వివాహాలు : […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more

తేనె సోక నోరు తియ్యనగు రీతి…

“తేనె  సోక నోరు తియ్యనగు రీతి  పచ్చదనం చూడ కళ్ళలో వెలుగు దివ్యకాంతి    త్యాగరాజ కీర్తన చెవుల కింపైన  రీతి  సంపెంగను చూడ నాసిక పొందే మధురానుభూతి ”  మన మాతృ భాష అయిన తెలుగును ప్రేమిస్తే ఇంత మధురంగా ఉంటుంది అని అంటే వొప్పుకొని వారు లేరు ఆ రోజుల్లో.ఒప్పుకొనే వారే కరువయ్యారు ఈరోజుల్లో.మన్ను తో తెలుగు భాష ను పోల్చితే కవులను, రచయితలను రైతులతో పోల్చవచ్చు.ఆ రైతు పంటలు పండిస్తాడు, ఈ రైతు కధలు, కవితలు పండిస్తాడు.ఒకరు భుక్తి, మరొకరు యుక్తి ని […]

Read more

స్త్రీ యాత్రికులు

నిరంతర బాటసారి-అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌  తూర్పు దేశాల్లోని విజ్ఞానం, మతం, మార్మిక శక్తులు, సాంప్ర దాయాల పట్ల పశ్చిమ దేశాలవారికి ఎప్పుడూ ఆశ్చర్యం, ఆనందం కలుగు తూనే ఉంటాయి. ఇండియా, చైనా, జపాన్‌, టిబెట్‌, బర్మా దేశాల్లోని ప్రాచీనమైన నాగరికతల పట్ల ఆసక్తితో అక్కడి విజ్ఞానాన్ని ఆస్వాదించేందుకై సాహసయాత్రలు చేసిన ఘనత అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌కి దక్కుతుంది. నిషేధించబడిన లాసా నగరానికి మొదటగా చేరుకొన్న యురోపియన్‌ యాత్రికురాలుగా డేవిడ్‌నీల్‌ చరిత్రలో నిలిచిపోయింది.     ఎక్కువ దూరం కఠినమైన ప్రయాణాలు చేసి, ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి, తన జీవితకాలంలోనే […]

Read more