ఎనిమిదో అడుగు – 25

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.                                     ‘‘ఒక […]

Read more

ఎనిమిదో అడుగు – 22

సిరిప్రియ వైపు చూశాడు హేమేంద్ర. .. ఆమె ఆవుపాలతో కడిగిన బంగారు ప్రతిమలా, వెన్నెల శిల్పంలా ముడుచుకొని కూర్చుని వుంది. ఆమె చేతిని మెల్లగా సృశిస్తూ…. ‘‘ ఈ ఊరు, ఈ వాతావరణం, ఈ మానవ సంబంధాలు నాకు నచ్చాయి. కానీ మన పెళ్ళి మిా ఊరిలో చేసి. ఇది మాత్రం ఈ ఊరిలో ఎందుకు చేస్తున్నట్లు…’’ అన్నాడు హేమేంద్ర. అతనికి ఆమెతో మాట్లాడే ఏకాంతం అప్పుడే దొరికింది. ఆమె కాస్త సిగ్గుపడ్తూ ‘‘మా తాతయ్య వంశంలో పుట్టిన ఆడపిల్లలకి ఎక్కడపెళ్లి జరిగినా ఈ […]

Read more

ఎనిమిదో అడుగు – 21

‘‘ ఓ.కె. స్నేహిత! రా! వెళ్దాం!’’ అంటూ లేచి స్నేహిత చేయిపట్టుకొని లేపింది చేతన. ఇద్దరు కలిసి చేతన కారు వైపు వెళ్లారు. కారును అవలీలగా నడుపుతోంది చేతన. ‘‘ ఈ కారును అన్నయ్య నాకు గిఫ్ట్‌గా కొనిచ్చారు. ఎందుకో తెలుసా! నేను డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ అయినందుకు….’’ అంది చేతన.స్నేహితకి చేతన చాలా కొత్తగా, నిండుగా, గంభీరంగా, గుంభనగా, కత్తి చివరన తళుక్కున మెరిసే మొనలా కన్పిస్తోంది. ఇంకో కోణంలో చూస్తే కష్టపడి అంచెలంచలుగా ఎదిగి కూడా ఒదిగివుండటంలో మంచి నేర్పరితనం ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతోంది. […]

Read more

ఎనిమిదో అడుగు – 20

ఆలోచిస్తున్నాడు, బహుశా ఏ తండ్రి అయినా తనలాగే ఆలోచిస్తాడేమో! ఎందుకంటే మనిషికి ధనం కూడబెట్టుకోవాలన్న కాంక్ష ఎక్కువైంది. దానితో ఇంటా, బయటా ఘర్షణలు మొదలవుతున్నాయి. హోదా, అధికారం సంపాయించాలని మనిషి మరొక మనిషిని ఉపయోగించుకుంటూ ఎలాంటి దోపిడీకైనా వెనుకాడటం లేదు. దీనివల్లనే మానవ సంబంధాలు కలుషితం అవుతున్నాయి. అందుకే జీవితం నిండా ఇంత సంక్లిష్టమైన అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి అనుభవం ఏ తండ్రికీ రాకూడదు. ‘‘ అంతగా ఆలోచిస్తున్నావు దేనికి నాన్నా! ఆ పొలమేమైనా కోట్ల విలువ చేస్తుందా? దాన్ని అమ్మితే సరిగ్గా […]

Read more

ఎనిమిదో అడుగు – కొత్త ధారావాహిక ప్రారంభం !

జీవితాన్ని ఏ కోణంలోంచి చూడాలి అన్నది ప్రశ్న. చూడాల్సిన కోణంలోంచి చూడాలి అన్నది జవాబు. కానీ పరుగే లక్ష్యమైనప్పుడు ఆ పరుగు ప్రశ్న వైపా! జవాబు వైపా అన్నది మీమాంస…. మనుషులు నిరంతరం తమను తాము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు రాటుదేలతాయి. కొన్ని జీవితాలు రాలిపోతాయి. అందుకే ముగింపు ప్రారంభమై, ప్రారంభం ముగింపు అయి భయపెడుతుంది.              సహనం కోల్పోతే సముద్రం కూడా అదుపు తప్పుతుంది కదా!  స్వేచ్ఛను కోరుకునే మనిషి తనను తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని అర్థం […]

Read more