బోయ్‌ ఫ్రెండ్‌

”అసలు వస్తుందో రాదో!” అని గబగబ నవ్వుతూ వెళ్ళిపోయే కృష్ణకాంతి వంక అలా చూస్తూ వుండిపోయాడు భానుమూర్తి. ఆ రోజు అలా అతి సామాన్యంగా అరున పరిచయం ఇంత గాఢంగా అల్లుకుంటుందనీ, కష్టాలలోనూ, సుఖాలలోనూ ఒకరి కొకరు తోడు అవుతారని అతనుగాని ఆమెగాని అనుకోలేదు. ”అదేమిటి భానూ! ఇల్లు వచ్చేసింది.” అని కృష్ణ గుర్తు చేసేవరకు అతను తన స్మృతుల నుండి బయట పడలేకపోయాడు. స్నేహితురాల్ని వాకిట వరకు దింపి వెనక్కు తిరిగి వెళ్ళబోతున్న భానుతో అంది కృష్ణ- ”లోపలికిరా నిన్న ఎందుకో అమ్మ […]

Read more

దీపం ఆరకముందే చక్కదిద్దుకో…

మొబైల్ ఫోన్ మళ్ళీ మళ్ళీ మోగుతోంది.  ఆ చప్పుడికి మెలకువ వచ్చిన సులేఖ అబ్బ అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ మూసుకుపోతున్న కళ్ళని విప్పార్చే ప్రయత్నం చేస్తోంది.  ఆమె కళ్ళు విడివడడంలేదు.  కళ్ళు బరువుగా మూసుకుపోతున్నాయి.  రాత్రి ఒంటి గంట వరకూ కంప్యూటర్ లో పనిచేసుకుంటూ ఉంది.  నిద్ర  మధ్యలో లేచిన అత్తగారు రేపు ఆదివారమే కదా!   పడుకోమ్మా సులేఖా అంటూ కేకేసేవరకు సమయమే చూసుకోలేదు.   పూనాలో ఈ మధ్యే ఉద్యోగంలో చేరిన ఆమె కొడుకు సుబోధ్  వీకెండ్ అని నిన్న ఉదయం వచ్చాడు. […]

Read more

చెదరని రంగులు…

ఎదను కాలుస్తున్నా… ఉబికే ఆవిరులలోహాలాహలం … వెల్లివిరిసే ఇంద్రధనసు రంగులు ఎన్నో… ఏ చిత్ర కారుని కుంచెకు అందని చిత్రాలై… కనువిందు చేస్తూ… ఏ నాట్య కారుని భాషకు స్పురించని భంగిమలలో.. భావాలను వ్యక్తం చేస్తున్నాయి… ఆకాశమంత చెలిమిని .. అరచేతుల్లో పోస్తూ.. వ్యతల హృదయానికి సాంత్వన నిస్తున్నాయి… తేడాలు తెలియనియని స్న్హేహం ఎప్పుడూ.. ‘నేనున్నానంటూ..అడుగేస్తుంది… నీవెక్కడున్నా…’ అని తెలియజెపుతున్నాయి..!! – సుజాత తిమ్మన ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Read more

అద్దంలో….

మనల్ని మనం చూసుకోలేని తనం మనది.. అయినా…నేనున్నా..మీ కోసం అంటూ.. అద్దం మనకి మనల్ని చూపిస్తుంది…అచ్చంగా… నిజం…స్నేహం కూడా .. స్వచ్చమైన చెలిమి అద్దమై మనలోని మనల్ని చూపిస్తుంది… చిన్న రాయి తగిలితే…పగిలే అద్దంలా… అపార్ధాల భేదాలు స్నేహాన్ని  విచ్చిన్నం చేస్తాయి… అద్దంలో ప్రతిబింబంలా.. ఒకరిలో..ఒకరిగా మెలిగే చెలిమే.. కలకాలం తరగని కలిమిగా మిగులుతుంది…!! – సుజాత తిమ్మన ““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““`

Read more

మాటలంటే……. మాటలా ?

ఆయుధం కన్నా పదునైనది అగ్ని గోళం మంత మెరుపైనది హిమం కన్నా చల్లనిది సుమం కన్నా పరిమళమైనది— మాట  నిశబ్దపు మేడల గోడల్ని శబ్దం అనే అస్త్రం తో పడగోట్టేడి — మాట నిండు మనస్సును నిలువునా కాల్చేది పండంటి బతుకుని చితిలా పేల్చేది—మాట  అంతరాల దొంతరల్ని మార్చేది వింత మలుపు జనంలో కూర్చెది— మాట నిరాశ నిస్పృహల నీడలో ఆశల మేడలు నిర్మించేది ఒక — మాట ప్రభువుల జాతకాలను భాష్యం చెప్పేది రాజ్యాలలో రబసను పుట్టించేది — మాట ఒక క్షణం […]

Read more