జ్ఞాపకం-29 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

ఒక్క క్షణం బాధగా చూసి కళ్లు మూసుకున్నాడు రాజారాం. అతనికి హైదరాబాద్‌ హాస్పిటల్లో ఆపరేషన్‌ జరిగాక ఏం జరిగిందో గుర్తొస్తోంది. రాత్రీ, పగలు నొప్పుతో పక్క కుదిరేది కాదు. రాత్రంతా తనకి ఐదుసార్లు పాన్‌ పట్టాల్సి వచ్చేది. మోషన్‌ వచ్చినట్లే అన్పించి వచ్చేది కాదు. ఇటు తిరిగి పడుకుంటే అటు తిరిగి పడుకోవాని, అటు తిరిగి పడుకుంటే ఇటు తిరిగి పడుకోవాని అన్పించేది. శరీరంలో గ్రిప్‌ లేక తనంతటి తను తిరగలేక పోయేవాడు. వార్డ్‌ బాయ్‌ని పిలిస్తే విసుక్కునేవాడు. వినీలను పిలిస్తే నిద్ర నటిస్తూ […]

Read more