సహ జీవనం 19 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

                        “కాసేపు కూర్చున్నాక స్నానాలు చెయ్యవచ్చులే, నువ్వు ఈ లోగా వంట మొదలు పెట్టు. మా బావకు ఆవ పెట్టిన సొరకాయ కూరంటే ఇష్టం. సొరకాయ వుందిగా అది వండెయ్యి” బావ వంక నవ్వుతూ చూశాడు ప్రకాశం.                         “వద్దురా ప్రకాశం. ఇప్పుడు అవన్నీ మానేశాను. ఏది పడితే అది తినే వయసు […]

Read more

నా కళ్లతో అమెరికా-42

                                                         ఎల్లోస్టోన్- చివరి భాగం ఎల్లోస్టోన్ యాత్రలో తిరిగి వెనక్కి వచ్చే రోజు వచ్చింది. మేం వెనక్కి వచ్చేటపుడు మేం వెళ్లేటపుడు వెళ్లిన దక్షిణపు దారిలో కాకుండా పశ్చిమపు దారిలో వెళ్లాలని అనుకున్నాం.  కానీ ఆ దారి నోరిస్ మీంచి వెళ్తుంది. ముందు రోజు నాటి […]

Read more

ఆమె ప్రియుడు

మేక్సిమ్ గోర్కీ కథ నా  పరిచయస్తుడొకాయన నాకీ కథ చెప్పారు. మాస్కో లో నేను విద్యార్ధి గా ఉన్నప్పుడు మా ఇంటి చుట్టు పక్కల్లో ఉండే ఆడవాళ్ళ ప్రవర్తన చాలా సందేహాస్పదంగా ఉండేది.మా పక్కింట్లో తెరెసా అనే పోలిష్ మహిళ ఉండేది. ఆమె ఇంగ్లీష్ వారికంటే కొంచెం చాయ తక్కువగా, చాలా పొడవుగా, బలిష్టమైన శరీరంతో, నల్లని ఒత్తైన కనుబొమ్మలతో, జిడ్డుగా,వికారంగా ఉన్న పెద్ద కోల ముఖాన్ని ఎవరో చిన్న చేతి గొడ్డలి తో చెక్కినట్లుండేది-వీర తాగుడు తో మత్తెక్కిన కళ్ళతో,మంద్ర స్వరంతో,కార్ డ్రైవర్ లాగా నడిచే నడకతో,అపారమైన […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌-5

వీళ్ళ విషయాలేమి పట్టనట్టు భానుమూర్తి, మురళి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ”ఈ చేపలు, మనంత ఎప్పుడవుతాయి అంకుల్‌?” ”అవుతాయి నాన్నా, అవుతాయి. ఈ మారు మనమొచ్చేసరికి మనంత అయిపోతాయి.” తన భావావేశాన్నుండి తప్పించుకోవడానికి అక్కడనుండి లేచి వెళ్ళి బఠానీలు తెచ్చి అందరికీ పంచింది కృష్ణ. ”మీరు ఏ మనసుతో పెట్టారో నాకు పుచ్చు బఠానీలు వచ్చాయి,” ముఖాన్ని వీలైనంత వికారంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు చైతన్య. ఈమారు అతని చూపుల్లో మామూలు చిలిపి తనమే గాని కృష్ణకు చూపిస్తున్న ప్రత్యేకత ఏమి లేకపోవడంతో తేలిగ్గానే తీసుకుంది […]

Read more

జోగిని

సన్నగా గొణిగింది.  ఆమె గొణుగుడూ ఆమెనీ అర్థమయీ అర్థం కానట్లు … చూస్తూ… కానీ ఆమె ఎవరో మాత్రం అర్థం అయినట్లుంది. అందుకేనేమో, మళ్ళీ తానే చనువుగా ” పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అంత తీవ్ర ఆలోచన చేస్తున్నారేమిటో…” అన్నాడతను. ఏమిటి అసలు ఇతను ఏమనుకొంటున్నాడు. ఆరేళ్ళ పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాడి దగ్గర వరకూ ఆడపిల్ల అంటే అందరికీ లోకువే.. చులకనే… అవకాశం ఎలా దొరుకుతుందా… ఎప్పుడు దొరుకుతుందా… అని ఎదురు చూస్తుంటారు. అందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

”సమాధి దగ్గర వుత్సవం జరపాలని సంకల్పించాను” అని రాసుకుంది నాగరత్నమ్మ. ”స్త్రీలకి ఈ వుత్సవాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడమే దీనికి కారణం. ‘సద్గురువు’ ఆజ్ఞతో 1927 లో పెరట్లో వుత్సవం మొదలుపెట్టాను. ‘అల్పారంభ క్షేమకః’ అని నానుడి, (నమ్రతతో చేసిన ప్రారంభం శుభాన్ని జయాన్ని ఇస్తుంది.) దేవదాసీల పాటలు (అప్పట్లో మద్రాసులో ప్రఖ్యాతి పొందినవి)పాడేవారు, కచేరీలు చేసేవారు. తంజావూరు పండితులూ, ఎందరో స్త్రీలు భక్తిశ్రద్ధలతో నాకు సాయం చేశారు. తంజావూరు రాజు బంధువు శ్రీ రాజారాం సాహెబ్‌ సాయం వల్ల ముందు వైపు వున్న […]

Read more

ఓయినం

”ఏమైనా ఒక ఆడిపోరి ఎన్క గిట్ల జరగొద్దన్నా” అన్నది అంజమ్మ. ”ఏం జేస్తం మా కిస్మత్తుల గిట్ల జరిగేదుంది జర్గింది మీద దేవుడున్నడు” అని గుడి దిక్కు తిరిగి దండం పెట్టి చంద్రయ్య దిక్కుచూస్తూ, ”ఓరి చెంద్రి జెర మనమందరం మల్లా ఒకసారి పంచాయతీకి కూకోవాలెరా” అని అంటుంటే, ”అన్ని ఫైసలాలు అయిపాయె యింకెందుకు” అన్నాడు ఆశ్చర్యంగా. ”ఏంలే జెర మాట్లాడేదుంది కూకున్నప్పుడు సెప్తగా” అంటుంటే చంద్రయ్య అర్థంకానట్టు చూశాడు కాని సత్తయ్య మాట తీసిపుచ్చలేక ”సరే” అంటూ తలాడించాడు. ”ఇంక జరిగే ఫైసలా […]

Read more

దీపం ఆరకముందే చక్కదిద్దుకో…

మొబైల్ ఫోన్ మళ్ళీ మళ్ళీ మోగుతోంది.  ఆ చప్పుడికి మెలకువ వచ్చిన సులేఖ అబ్బ అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ మూసుకుపోతున్న కళ్ళని విప్పార్చే ప్రయత్నం చేస్తోంది.  ఆమె కళ్ళు విడివడడంలేదు.  కళ్ళు బరువుగా మూసుకుపోతున్నాయి.  రాత్రి ఒంటి గంట వరకూ కంప్యూటర్ లో పనిచేసుకుంటూ ఉంది.  నిద్ర  మధ్యలో లేచిన అత్తగారు రేపు ఆదివారమే కదా!   పడుకోమ్మా సులేఖా అంటూ కేకేసేవరకు సమయమే చూసుకోలేదు.   పూనాలో ఈ మధ్యే ఉద్యోగంలో చేరిన ఆమె కొడుకు సుబోధ్  వీకెండ్ అని నిన్న ఉదయం వచ్చాడు. […]

Read more

నా కళ్లతో అమెరికా- 37 ఎల్లోస్టోన్

జూలై నెల మొదటి వారపు ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకేండ్ సెలవులు లో ఎటైనా వెళ్లొద్దామని అనుకున్నాం. ఇప్పటికే ఒక సారి చూసిన ప్రదేశాల్ని రెండో సారి మరో సీజన్ లో చూడడం లో భాగంగా యూసోమిటీ, గ్రాండ్ కెన్యన్ లకు మళ్ళీ వెళ్లొచ్చాం. ఈ సారి ఇంత వరకూ చూడని ప్రదేశమైతే బావుణ్ణని అనుకోగానే మా వరు “ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్” అంది. “ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్” వ్యోమింగ్ రాష్ట్రం లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేషనల్ పార్క్ లలో ఒకటి. […]

Read more

లాస్ట్ మెసేజ్

                             ప్రముఖ X చానల్ అధిపతి దశరథ్ దుర్మరణం. నగర పొలిమేరల్లో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ అదుపు తప్పి డివైడర్ ని డీ కొట్టి పల్టీలు  కొట్టిన కారు. డ్రైవ్ చేస్తున్న దశరధ్ అక్కడికక్కడే దుర్మరణం. ఎక్స్ క్లూజివ్ Y వార్తలు చూస్తూ ఉలికిపడి పోన్ అందుకుంది ధాన్యమాలి   అప్పుడే ఆమె  పోన్ మ్రోగడం మొదలయ్యింది. లిఫ్ట్ చేసింది, అవతలి వైపు నుండి చానల్ సిబ్బంది .. “సారీ మేడమ్. సర్ కారుకి యాక్సిడెంట్.   ఆయన నో మోర్ ” […]

Read more
1 2