పెళ్ళొక సామాజిక ఒడంబడిక -అత్తలూరి విజయలక్ష్మి తో ముఖాముఖి

తెలుగు రంగస్థల సాహిత్యంలో ‘రేడియో నాటకాల రచయిత్రి’ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు అత్తలూరి విజయలక్ష్మి! జీవిత ప్రయాణంలో మార్పుల్నీ, సరికొత్త కోణాలనీ, దృక్పథాలనీ సునిశితంగా ఆమె రచనల్లో వ్యక్తీకరిస్తారు. నాటకం, కథ, నవల…ఇలా ఏ సాహిత్య ప్రక్రియలోనైనా కొత్తదనం కోసం ఆకాక్షించే విజయలక్ష్మి గారు ‘మూస రచనల్లోంచి బయటపడితేనే ప్రస్తుత తెలుగు సాహిత్యం బాగుపడుతుంద’ని అంటారు. రంగస్థల సాహిత్య వ్యాప్తికి అహరహం కృషి చేస్తున్న అత్తలూరి విజయలక్ష్మిగారితో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘విహంగ’ తో పంచుకున్న సాహిత్య కబురులు… రచనా వ్యాసంగం […]

Read more

చట్టం సరే …… మరి పిల్లలో !

            అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మహిళలు పోరాడి సాధించిన హక్కుల చట్టాల గురించి ఒక్కసారి కలబోసుకుందాం. ఈ చట్టాలల్లో ప్రధానమైనది గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం.గృహహింస అన్న పదంలో అంతర్లీనంగా‘కుటుంబంలో మహిళల హక్కుల సాధన’ దాగి ఉన్నదన్న విషయాన్ని బాగా లోతుగా పరిశీలిస్తేనే పరిగణనలోకి తీసుకోగలుగుతాము.మానవ హక్కులన్నీ మగవారికే అన్న స్ధితి నుండి మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే స్ధితి దాకా మహిళల హక్కుల సాధన ప్రస్థానం సాగింది.ప్రపంచ వ్యాప్తంగా మహిళలు గృహహింసా వ్యతిరేక ఉద్యమాలను […]

Read more

తేనె లొలుకు పలుకులు….

(అమ్మ మాటలు సూక్తులే) ముద్ధబంతంటి ముగ్దవే ముచ్చటైన నెలవంకవే మొండితనం ఎక్కువే ఎదురు తిరగడం మక్కువే జలతారు వోణీల రాణివే అందాల మరుమల్లెవే అమ్మ మాటలు సూక్తులే అయినా చెవొగ్గి వినవలె అహంకారాలు పెంచి మంచి చెడులు మరిచి మనుగడ సాగించరాదు వాదించడం, వేధించడం నిలకడ లేని వాలకం ముక్కు మీదే కోపం కాకూడదు కన్నె అభిమతం ఇలాగైతే ఎలా వేగడం నీ మంచికే చెప్పడం విద్యల్లో భాసిల్లు శాంతి  సహనాల విలసిల్లు భూదేవంతటి ఓర్పువై మెచ్చిన కోడలివై                     భర్తకి అనురాగవల్లివై జీవనం సాగించాలే తల్లీ మగవాడితో సమానత్వం అంటూ  పోరాట మెందుకో? స్త్రీ  సృష్టికి మూలం […]

Read more